atm money withdrawal
-
నగదు డ్రా చేయడం రాని అమాయకులే టార్గెట్...ఏకంగా 14 ఏటీఎం కార్డులు....
గుత్తి: అమాయకులను మోసం చేసి వారి బ్యాంక్ ఖాతాల్లోని నగదును ఏటీఎంల ద్వారా అపహరిస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను గుత్తి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శ్యామరావు వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన విజయకుమార్ నాయక్, తనకల్లు మండలం ఏనుగుండుతండా గ్రామానికి చెందిన శ్రీకాంత్ నాయక్ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరలేపారు. ఏటీఎంల వద్ద మకాం వేసి నగదు తీయడం రాని అమాయకులకు సాయం చేస్తున్నట్లుగా నటిస్తూ పిన్ నంబర్ తెలుసుకున్న తర్వాత డూప్లికేట్ ఏటీఎం కార్డు ఇచ్చి ఒరిజనల్ కార్డు దాచేస్తారు. అనంతరం ఆ కార్డులోని నగదును అపహరిస్తారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గుత్తిలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద అమాయకుడిని మోసం చేసి కాజేసిన ఏటీఎం కార్డుతో డబ్బు డ్రా చేస్తుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో ఇదే తరహాలో పలువురిని మోసం చేసినట్లు వెలుగు చూసింది. నిందితుల నుంచి రూ.75వేల నగదు, 14 ఏటీఎం కార్డులు, మూడు సెల్ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. (చదవండి: ప్రియుడే కాలయముడు) -
ఏటీఎంలో కాలిన రూ.500 నోటు
చిల్పూరు : యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో కాలిన రూ.500 నోటు బయటకు వచ్చిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. చిల్పూరు మండలంలోని పల్లగుట్టకు చెందిన బెల్లి అమరేందర్ యాదవ్ అనే రైతు వ్యవసాయ పనిముట్టు కొనుగోలు కోసం శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్‌కు వచ్చాడు. డబ్బుల కోసం వివిధ ఏటీఎంలు తిరగగా ఎందులోనూ డబ్బులు రాలేదు. ఇక చివరిగా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో ప్రయత్నించి, 10 వేల రూపాయలు డ్రా చేసుకోగలిగాడు. అనంతరం వాటిని లెక్కిస్తుండగా అందులో ఒక రూ .500 నోటు కాలింది వచ్చిందని అమరేందర్ చెప్పాడు. దానిపై పెన్నుతో రాసిన రాతలు కూడా ఉన్నాయని తెలిపాడు. వెంటనే ఈ విషయం గురించి బ్యాంక్ అధికారులను సంప్రదించగా.. ఎవరూ కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కాలిన నోటును బ్యాంక్ అధికారులు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. -
ఏటీఎంలో డబ్బు డ్రా చేసి.. దొరికేశాడు!
-
ఏటీఎంలో డబ్బు డ్రా చేసి.. దొరికేశాడు!
గోవాకు చెందిన పెర్ఫ్యూమ్ స్పెషలిస్టు మోనికా ఘర్డే హత్యకేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె డెబిట్ కార్డు దొంగిలించిన నిందితుడు.. దాంతో బెంగళూరులో డబ్బులు డ్రా చేయడంతో దొరికిపోయాడు. మోనికా ఇంతకుముందు ఉండే అపార్టుమెంటు ప్రాంగణంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. మోనికాను హత్య చేసినట్లు అతడు అంగీకరించాడని పోలీసులు అంటున్నారు. అతడు ఆమెను ఎందుకు చంపాడన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఈ హత్యకేసులో ఇంకెవరూ లేరని.. అతడొక్కడే ఈ ఘాతుకానికి పాల్పడాడని ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతానికి బెంగళూరులోనే ఉన్న రాజ్‌కుమార్‌ను గోవా పోలీసుల కస్టడీకి ఇచ్చిన తర్వాత అతడిని గోవాకు తరలిస్తారు. హత్యకు కారణం ఏంటో తెలుసుకోడానికి అతడిని విచారిస్తామని పోలీసులు తెలిపారు. అలాగే బాధితురాలిపై అత్యాచారం జరిగిందో లేదో తెలుసుకోడానికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా సోమవారం వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు. మోనికా ఒక ఫొటోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకుని 2011లో గోవాకు వెళ్లిపోయింది. అయితే గత ఏడాది నుంచి ఆమె తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.