ఏటీఎంలో కాలిన రూ.500 నోటు | Burn Rs. 500 note in ATM | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో కాలిన రూ.500 నోటు

Published Sat, Jul 14 2018 2:28 PM | Last Updated on Sat, Jul 14 2018 6:32 PM

Burn Rs. 500 note in ATM - Sakshi

ఏటీఎంలో వచ్చిన కాలిన నోటు  

చిల్పూరు : యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో కాలిన రూ.500 నోటు బయటకు వచ్చిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. చిల్పూరు మండలంలోని పల్లగుట్టకు చెందిన బెల్లి అమరేందర్‌ యాదవ్‌ అనే రైతు వ్యవసాయ పనిముట్టు కొనుగోలు కోసం శుక్రవారం స్టేషన్‌ ఘన్‌పూర్‌కు వచ్చాడు.

డబ్బుల కోసం వివిధ ఏటీఎంలు తిరగగా ఎందులోనూ డబ్బులు రాలేదు. ఇక చివరిగా యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో ప్రయత్నించి, 10 వేల రూపాయలు డ్రా చేసుకోగలిగాడు. అనంతరం వాటిని లెక్కిస్తుండగా అందులో ఒక రూ .500 నోటు కాలింది వచ్చిందని అమరేందర్‌ చెప్పాడు. దానిపై పెన్నుతో రాసిన రాతలు కూడా ఉన్నాయని తెలిపాడు. వెంటనే ఈ విషయం గురించి బ్యాంక్‌ అధికారులను సంప్రదించగా..  ఎవరూ కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కాలిన నోటును బ్యాంక్‌ అధికారులు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement