attack on police station
-
ఆగని మణిపూర్ హింసాకాండ
ఇంఫాల్/కోల్‌కతా: కుకీ, మెయిటీ జాతుల మధ్య ముదిరిన వివాదం మణిపూర్‌లో హింసాకాండను ఆగనివ్వట్లేదు. తాజాగా శుక్రవారం మొదలైన ఘర్షణలు శనివారం సైతం ఎక్కువయ్యాయి. ఆందోళనకారుల దాడులు, సైన్యం, పోలీసుల భాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్ల ప్రయోగంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. ఇంఫాల్ పట్టణంలో శుక్రవారం రాత్రి మొదలైన ఘర్షణల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. బీజేపీ నేతల ఇళ్లను తగలబెట్టేందుకు అల్లరిమూక ప్రయత్నించడం, దానిని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో మొదలైన ఘర్షణల్లో ఈ ఇద్దరు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా పట్టణంలో, ఛురాచాంద్పూర్ జిల్లాలోని కాంగ్వాయ్లలో జరిగిన వేర్వేరు ఘటనల్లో తుపాకీ కాల్పులూ జరిగాయి. పోలీస్‌స్టేషన్‌పై 400 మంది దాడి ఇంపాల్ పశ్చిమ ప్రాంతంలోని ఇరింగ్బామ్ పోలీస్‌స్టేషన్‌లోని ఆయుధాగారంపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లేందుకు అల్లరిమూక విఫలయత్నం చేసింది. శుక్రవారం అర్థరాత్రి వేళ దాదాపు 400 మంది ఆందోళనకారులు గుంపుగా దాడిచేసి ఆయుధాగారాన్ని కొల్లగొట్టే ప్రయత్నంచేయగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఆందోళన కారులు గుమికూడకుండా ఉండేందుకు హెచ్చరికగా సైన్యం, అస్సాం రైఫిల్స్ బలగాలు, మణిపూర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు సంయుక్తంగా ఇంఫాల్ పట్టణంలో అర్థరాత్రిదాకా కవాతు నిర్వహించాయి. 1,000 మంది మూకుమ్మడిగా.. ఇంఫాల్‌లోని ప్యాలెస్ కాంపౌండ్‌లో భవంతులకు నిప్పుపెట్టేందుకు దాదాపు 1,000 మంది ఆందోళనకారులు ప్రయత్నించారు. వారిని చెదరగొ ట్టేందుకు ఆర్ఏఎఫ్ బలగాలు భాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి. మరో చోట ఎమ్మెల్యే బిశ్వజీత్ ఇంటిని తగలబెట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించిగా ఆర్ఏఎఫ్ బలగాలు వారిని చెదరగొట్టాయి. సింజెమాయ్ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వీరిని సైనికులు అడ్డుకున్నారు. ఇంఫాల్‌లోని పోరంపేట్లో రాష్ట్ర బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శారదా దేవి ఇంటిని తగలబెట్టేందుకు యువత ప్రయత్నించగా భద్రతా బలగాలు చెదరగొట్టాయి. అంతకుముందు శుక్రవారం అంతా ఇంఫాల్ నడిబొడ్డున రహదారులను దిగ్బంధిస్తూ ఆస్తులను తగలబెడుతూ అల్లరిమూక హింసాకాండను కొన సాగించింది. గురువారం రాత్రి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రంజన్ సింగ్ ఇంటిపై దాడి చేసి నిప్పుపెట్టిన విషయం విదితమే. ఆ సమయా నికి ఆయన ఇంట్లో లేరు. పదవీవిరమణ చేసిన దళి త ఐఏఎస్ అధికారికి చెందిన గిడ్డంగినీ ఆందోళన కారులు భస్మంచేశారు. వాంగ్‌ఖేయ్, పోరోమ్పట్, థంగపట్లలోనూ రోడ్లకు అడ్డంగా దుంగలు, టైర్లు కాల్చి రాకపోకలను స్తంభింపజేశారు. నెలరోజుల్లో వందకుపైగా మరణాలు నెలరోజుల క్రితం కుకీ, మెయిటీ జాతుల మధ్య మొదలైన వైరంలో 100 మందికిపైగా మరణించారు. తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తిని నివారించేందుకు 11 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. మెయిటీ వర్గానికి షెడ్యూల్ తెగ హోదా కట్టబెట్టాలన్న సిఫార్సుపై కుకీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గిరిజనుల సంఘీభావ ర్యాలీ పేరిట కుకీలు మొదలుపెట్టిన యాత్ర హింసాత్మకంగా మారి నెలరోజులైనా మణిపూర్‌లో రావణకాష్టం ఆగట్లేదు. రాష్ట్ర జనాభాల్లో దాదాపు 53 శాతమున్న మెయిటీలు ఎక్కువగా ఇంఫాల్ లోయ ప్రాంతాల్లో నివసిస్తారు. గిరిజనులైన నాగాలు, కుకీల జనాభా రాష్ట్ర జనాభాలో దాదాపు 40 శాతం. వీరు ఎక్కువగా కొండ ప్రాంత జిల్లాల్లో ఉంటారు. -
అమాయకులపై కేసులు పెట్టం
రాపూరు (నెల్లూరు): రాపూరు పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడి కేసుకు సంబంధించి అమాయకులపై కేసులు పెట్టమని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృçష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నిర్దోషులపై కేసులు పెట్టమని, ఎవరూ భయపడొద్దన్నారు. దాడి కేసులో 35 మందిని గుర్తించామని, విచారణలో ఇద్దరు లేరని తెలిసి వారి పేర్లు తొలగించినట్లు చెప్పారు. ఇంకా 33 మంది ఉన్నారని, వారిలో ఇప్పటికే 22 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హజరుపరిచామన్నారు. మిగిలిన 11 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. దాడికేసులో ఉన్న వారిపేర్లు శాంతి కమిటీకి ఇచ్చామన్నారు. ఇప్పటివరకు రాపూరులో 144 సెక్షన్ పెట్టలేదన్నారు. దళితవాడకు వందలమంది పోలీసులు వెళ్లలేదన్నారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల్లో కొందరు అసత్య పోస్టింగ్‌లు పెడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. రాపూరు పోలీస్‌స్టేçషన్లో మరో ఎస్సైని నియమిస్తామని, అలాగే ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. అంతకుముందు ఆయన ఎస్సై లక్ష్మణ్‌ను, కానిస్టేబుల్‌ను పరామర్శించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాంబాబు, సిబ్బంది ఉన్నారు. జేసీ విచారణ దాడి కేసుకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం విచారణ చేపట్టారు. ఆమె తొలుత రాపూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ప్రత్యక్షసాక్షులతో మాట్లాడారు. దాడి ఎందుకు జరిగింది?, దాడికి ముందు జరిగిన పరిణామాలు, తొలుత ఎవరు ఎవరిపై దాడి చేశారు?, తదితర విషయాలను పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సై లక్ష్మణ్, కానిస్టేబుల్‌ను విచారించారు. స్టేషన్ బయటకు జేసీ వస్తున్న సమయంలో స్థానికులు రాపూరు ఎస్సైకి మద్దతుగా నినాదాలు చేసి మద్దతు ప్రకటించారు. అనంతరం జేసీ ఎస్సీకాలనీకి చేరుకుని అక్కడి దళిత మహిళలతో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. నివేదికను ఆయనకు అందిస్తామని చెప్పారు. జేసీ వెంట ఆర్డీఓ హరిత, డీఎస్పీ రాంబాబు, తహసీల్దార్ రమణయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఉన్నారు. -
రాపూరులో టెన్షన్..టెన్షన్
రాపూరు(ప్రకాశం): రాపూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగి మూడురోజులు అవుతున్నా పోలీస్ పికెట్ శుక్రవారం కూడా కొనసాగింది. దాడి చేసిన వారిని ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంత మందిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాడికి సంబంధించిన వారందరనీ అరెస్ట్ చేసే వరకు పోలీస్ పికెట్ కొనసాగుతుందని తెలుస్తోంది. దళిత వాడలో ఇప్పటికి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దళితవాడలో సాయుధ బలగాలతోపాటు మహిళా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. అలాగే రాపూరు ముఖ్యకూడళ్లలో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత మంది పోలీసులను చూడని స్థానిక ప్రజలు ఇప్పడు పట్టణంలో తిరుగుతుండటం చూస్తుండటంతో భయాం దోళనకు గురవుతున్నారు. గూడూరు డీఎస్పీ రాంబా బు రాపూరులోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. దాడికి సంబంధం లేని వారిని విడిచిపెట్టాలి పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన సంఘటనలో దాడికి సంబంధంలేని వారిని వెంటనే విడిచిపె ట్టాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, గూడూరు, వెంకటగిరి నియోజవర్గ కార్యదర్శులు కుమార్, చెంగయ్య కోరారు. ఈ మేరకు రాపూరు పో లీసులకు శుక్రవారం వినతి పత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ దాడికి సంబంధంలేని వెంటనే విడుదల చేసి దాడికి పాల్పడినవారిని శిక్షించాలని కోరారు. -
రాపూరు పోలీస్ స్టేషన్‌పై దాడి
రాపూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్‌పై బుధవారం రాత్రి దాడి జరిగింది. దళితవాడకు చెందిన కొందరు పోలీస్‌స్టేషన్ గేట్లు ధ్వంసం చేసి, లోపలికి జొరబడ్డారు. పోలీసులపై విచక్షణారహితంగా మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రాపూరు దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ తదితరులు అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్‌కు డబ్బులు బాకీ ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో జోసెఫ్ రాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పిచ్చయ్యతోపాటు ఇద్దరు మహిళలను విచారించేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే మద్యం సేవించిన పిచ్చయ్యను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా, వారి బంధువులు దాదాపు 150 మంది పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దాదాపు 40 మంది స్టేషన్లోకి ప్రవేశించారు. అక్కడ కనిపించిన పోలీసులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. విధినిర్వహణలో ఉన్న ఎస్ఐ లక్ష్మణ్‌ను బయటకు లాగి కొట్టారు. అడ్డువచ్చి న ముగ్గురు కానిస్టేబుళ్లపై సైతం దాడులకు తెగబడ్డారు. ఇతర సిబ్బంది గాయపడ్డ ఎస్ఐని, కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్టేషన్‌పై దళితవాడకు చెందిన వ్యక్తులు దాడిచేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మమ్మల్ని అమానుషంగా కొట్టారు పోలీసులు తమను విచారణ కోసం పిలిపించి మహిళలు అని కూడా చూడకుండా అమానుషంగా కొట్టి గాయపరిచారని, కులం పేరుతో దూషించారని దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ ఆరోపించారు. తమతోపాటు పెంచలయ్య అనే యువకుడిని కూడా పోలీసులు కొట్టారని చెప్పారు. ఎస్ఐ తలకు బలమైన గాయం: డీఎస్పీ దళితవాడ వాసుల దాడిలో గాయపడ్డ రాపూరు ఎస్ఐ, కానిస్లేబుళ్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించామని డీఎస్సీ రాంబాబు చెప్పారు. ఎస్ఐ తలకు బలమైన గాయం అయిందని అన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కీలకంగా మారిన సీసీ కెమెరాల ఫుటేజీ
-
ఆ 45 నిమిషాల్లో ఏం జరిగింది?
కీలకంగా మారిన సీసీ కెమెరాల ఫుటేజీ మారేడుపల్లి: సంచలనం సృష్టించిన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన కేసును పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడిలో బన్నప్ప కుటుంబ సభ్యులతో ఎవరెవరు పాల్గొన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల పుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోమవారం రాత్రి 9.15 నిమిషాలకు ప్రారంభమైన గొడవ... 10 గంటల వరకు జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు మారేడుపల్లి పోలీసులతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. బన్నప్పను సోమవారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్ నుంచి పంపించిన తర్వాత కుటుంబ సభ్యులు ఆటోలో అతడిని రాత్రి 8.30కి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసులు తీవ్ర అస్వస్థతకు గురైన బన్నప్పకు ఓ కానిస్టేబుల్‌ను తోడు ఇచ్చి అదే ఆటోలో ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలో బన్నప్ప మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మృతదేహాన్ని ఆటోలో తిరిగి మారేడుపల్లి స్టేషన్‌కు తీసుకొస్తూ మహాత్మాగాంధీనగర్ బస్తీవాసులకు బన్నప్ప మృతిపై సమాచారం ఇచ్చారు. 9.15కి బన్నప్ప మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న బంధువులు విధి నిర్వహణలో ఉన్న ఎస్సై రవికుమార్, మధులతో వాగ్వాదానికి దిగారు.స్టేషన్‌కు సమీపంలోనే మహాత్మాగాంధీనగర్ ఉండటంతో బస్తీలోని వారు భారీ ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. 9.30కి గొడవ పెద్దదైంది. బన్నప్ప మృతికి పోలీసులే కారణమని పోలీస్‌స్టేషన్‌లో 9.35కి పోలీసులపై దాడి చేశారు. అకస్మాత్‌గా జరుగుతున్న పరిణామాలతో నెవ్వెరపోయిన పోలీసులు ఏమీ చేయలేకపోయారు. సెట్లో కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇస్తుండగా ఆందోళనకారులు సెట్‌ను ధ్వంసం చేశారు. చిన్నగా మొదలైన గొడవ 9.45కి మరింత పెద్దదైంది. రోడ్లపై ఎక్కువగా మంది చేరుకొని ఆ మార్గంలో వెళ్లే వాహనాలపై దాడికి పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కంప్యూటర్లు, ఫైళ్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. 9.47కు నిమిషాలకు పోలీస్‌స్టేషన్ దారిగుండా వస్తున్న రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. 9.52కి పెట్రోలింగ్‌లో వస్తున్న పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వారు. 9 గంటల 47 నిమిషాలకు పోలీస్‌స్టేషన్ వద్దనున్న ఎస్.ఐ మధు వాహనంతోపాటు మరో రెండు వాహనాలను స్టేషన్ ముందు నిప్పంటించారు.