Audio sucess meet
-
చిన్న సినిమాల విడుదల కష్టం
నందు, తేజస్విని ప్రకాశ్ జంటగా రూపొందిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్ భాసాని నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. సాకేత్ స్వరపరచిన పాటలకి మంచి స్పందన రావటంతో హైదరాబాద్‌లో ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథి నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో చిన్న చిత్రాలను విడుదల చేయటం చాలా కష్టం. బిక్స్గారు ఈ చిత్రం కోసం ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు. ఈ సినిమా మంచి విజయం సాధించి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘బిక్స్గారు నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం. తొలి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న దర్శకునిలా తెరకెక్కించారు. నా మొదటి సినిమా ‘కన్నుల్లో నీ రూపమే’ ఆడియో సక్సెస్ మీట్ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సాకేత్. ‘‘మా సినిమా విడుదలకు సహాయం చేస్తున్న ఇప్పిలి రామమోహన్‌రావు, ఎస్. శ్రీకాంత్రెడ్డిగార్లకు ధన్యవాదాలు. మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు బిక్స్. చిత్ర నిర్మాత భాస్కర్ భాసాని, హరిహర చలనచిత్ర నిర్మాత ఇప్పిలి రామమోహన్ రావు పాల్గొన్నారు. -
చిరంజీవితో అర నిమిషమైనా నటించాలని ఉంది
‘‘నా అభిమాన హీరో చిరంజీవి. ఆయన గొప్ప నటుడు.. చాన్స్ వస్తే చిరంజీవిగారితో అర నిమిషమైనా నటిస్తే నా జన్మ ధన్యమైనట్లే’’ అని హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ అన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బిజీగా ఉన్న అనుపమ శనివారం విజయవాడలో జరిగిన ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రం ఆడియో సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. పలు విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘తేజ్ ఐలవ్ యూ’ మంచి లవ్‌స్టోరీ. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. నేను నటించిన ‘అ..ఆ’ చిత్ర విజయోత్సవం గుంటూరులో జరిగింది. అప్పుడే విజయవాడ గురించి, ఇక్కడ ఉన్న కనకదుర్గమ్మ ఆలయం గురించి తెలుసుకున్నాను. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉంది. నా అభిమాన నటి నిత్యామీనన్. సావిత్రిగారు గొప్ప నటి. ఆమె గురించి ఇటీవలే ‘మహానటి’ సినిమా చూసి తెలుసుకున్నాను. ప్రస్తుతం ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు బాగానే ఉన్నాయి. నా వరకూ బాగానే ఉంది. మంచి అవకాశాలు వస్తున్నాయి. రామ్ సరసన ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో నటిస్తున్నాను. నటిగా మంచి గుర్తింపు పొందాలనేది నా ఆకాంక్ష. ముందు తెలుగు మాట్లాడటం రాక ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం తెలుగు స్పష్టంగా మాట్లాడగలగడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
పల్లెటూరి అమ్మాయి.. దేశం గర్వపడేస్థాయి!
రచన స్మిత్ ప్రధాన పాత్రలో ఆర్కే ఫిలింస్ పతాకంపై రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘మహిళా కబడ్డి’. రీసెంట్గా విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ మూడు పాటలకు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఆడియో సక్సెస్‌మీట్‌లో నిర్మాత ముత్యాల రాందాస్ మాట్లాడుతూ –‘‘రామకృష్ణగౌడ్గారు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో చాలాకాలం తర్వాత నేను దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రమిది. మహిళలు ఎందులో తక్కువకాదనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఒక పల్లెటూరి అమ్మాయి దేశం గర్వపడేస్థాయి కబడ్డీ ఛాంపియన్‌గా ఎలా ఎదిగింది అన్నదే కథాంశం. మధుప్రియ, మంగ్లీ, గీతామాధురి పాడిన పాటలకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. మరో రెండు పాటలను మధుప్రియ, గీతా మాధురితో పాడించి త్వరలోనే విడుదల చేస్తాం. ఈ సినిమాతో రాజ్‌కిరణ్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి బ్రేక్ వస్తుంది. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది’’ అన్నారు రామకృష్ణగౌడ్ . ఈ సినిమాకు కెమెరా: రాజు. -
సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో సక్సెస్ మీట్
-
‘మయా మహల్’ ఆడియో సక్సెస్‌మీట్
-
‘జోరు’ ఆడియో సక్సెస్ మీట్