Avoiding
-
సెల్‌ఫోన్ వినియోగం తగ్గించండిలా...
ఇటీవల సెల్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సెల్‌ఫోన్ కారణంగా మెదడుపై, శరీరభాగాలపై చెడు ప్రభావం ఉంటుందన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో ఇది నిత్యం చర్చల్లో ఉండే ఒక (డిబేటబుల్) అంశం. ఇక సెల్‌ఫోన్ కారణంగా మన దేహంపై పడే దుష్ప్రభావాలపై ఇంకా చాలా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ దుష్ప్రభావాలు ఎక్కువ అన్న విషయం స్పష్టంగా ఇంకా తేలకపోయినా... దీనినుంచి రేడియేషన్ వెలువడుతుందన్నది నిర్వివాదాంశం. ఇక రేడియేషన్‌తో మనకు ప్రమాదమే అన్న విషయం కూడా తెలిసిందే. అందుకే సెల్‌ఫోన్ వాడటం తప్పనిసరిగా చేటు చేస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరమని వైద్యనిపుణులు, పరిశోధకులు/అధ్యయనవేత్తలు చెబుతుంటారు. ఆ జాగ్రత్తలివి... మీ మొబైల్‌ఫోన్ మీ శరీరానికి వీలైనంత దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. సెల్‌ఫోన్‌ను షర్ట్ జేబులో గుండె దగ్గర, మన ప్రైవేట్ పార్ట్స్‌కు దగ్గరగా ఉండేలా ప్యాంట్ పాకెట్స్‌లో ఉంచడం అంత మంచిది కాదు. పౌచ్‌లో ఉంచడమే మంచిది. వీలైతే బ్రీఫ్‌కేసులు, హ్యాండ్‌బ్యాగులలో ఉంచడం ఇంకా బెటర్. సాధ్యమైనంత వరకు సెల్‌ఫోన్‌ను ఉపయోగించకుండానే పనులు జరిగేలా చూసుకోండి. మీటింగులు, కాన్ఫరెన్స్‌హాల్స్, దేవాలయాలు, ఆసుపత్రుల్లో తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయండి. పన్నెండేళ్ల లోపు పిల్లలను దీని నుంచి తప్పనిసరిగా దూరంగా ఉంచండి. అదనపు ఫీచర్లు ఉన్న సెల్ఫోన్లను పిల్లలు విపరీతంగా ఉపయోగిస్తుంటారు. పిల్లలకు గేమ్స్ ఆడటానికి కూడా సెల్‌ఫోన్ ఇవ్వకండి. ఎక్కువసేపు సంభాషణను కొనసాగించాల్సి వస్తే.. తప్పనిసరిగా ల్యాండ్లైన్నే ఉపయోగించాలి. ఇక సెల్ఫోన్లోనే ఎక్కువ సేపు కాల్ చేయాల్సి వస్తే తరచు ఫోన్‌ని కుడి చెవికి, ఎడమ చెవికి ఇలా మారుస్తుండాలి. సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నపుడు మాట్లాడడం ప్రమాదకరం. సెల్‌ఫోన్స్‌తో పోలిస్తే హెడ్ సెట్స్ నుంచి రేడియేషన్ వెలువడటం తక్కువ. అందుకే ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే హెడ్‌ఫోన్స్ కూడా వాడటం మంచిదే. వినేటప్పుడు కంటే మాట్లాడేటప్పుడు మన ఫోన్ ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తున్నట్టు గుర్తించారు. కాబట్టి ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడడం కొంత మేలు. దేహంలోని మృదువైన కండరాలపై రేడియేషన్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హృదయానికి ఎదురుగానో, ఒళ్ళో పెట్టుకునో మాట్లాడడం వద్దు. ఏంటెన్నా క్యాప్స్, కీపాడ్ కవర్స్ వంటివి కనెక్షన్ నాణ్యతను తగ్గిస్తాయి. ఇది ఫోన్‌ను మరింత శక్తిమంతంగా పని చేసేందుకు ప్రేరేపిస్తుంది. తద్వారా రేడియేషన్ మరింత ఎక్కువగా విడుదలవుతుంది. సెల్‌ఫోన్‌ను ఉపయోగించండిలా... సెల్‌ఫోన్‌ను అత్యవసర వినియోగానికి మాత్రమే పరిమితం చేయండి. మాట్లాడటం కంటే వాట్సాప్, మెసేజెస్ రూపంలోనే వీలైనంతవరకు ఎక్కువ సమాచారం పంపండి. సెల్‌ఫోన్ నెంబరును బాగా సన్నిహితులకు మాత్రమే ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా అనవసరమైన కాల్స్‌ను చాలావరకు తగ్గించుకోవచ్చు. పొద్దున్న లేవడానికి అలారంతో మొదలుపెట్టి రిమైండర్లు, ఆటలు, పాటలు, కాలిక్యులేటర్... ఇలా ప్రతిదానికీ సెల్‌ఫోన్ మీదే అతిగా ఆధారపడిపోవడం అడిక్షన్‌కు దారితీస్తుంది. కాబట్టి ఫోన్‌ను కేవలం సంభాషణలకు మాత్రమే పరిమితం చేయండి. ఎక్కువగా ఫోన్ వాడే అవసరం ఉన్నవాళ్ళు ఇంట్లో ల్యాండ్‌లైన్ కనెక్షన్ తీసుకోవడం మేలు. కనీసం ఇంట్లో ఉన్నపుడైనా సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించవచ్చు. డ్రైవింగ్ చేస్తూ ఇయర్‌ఫోన్స్‌తోగాని మరే రకంగానూ సెల్‌ఫోన్ మాట్లాడకూడదని వ్యక్తిగతంగా దృఢమైన నిర్ణయం తీసుకోండి. అది ప్రాణానికి ప్రమాదం. అది చట్టరీత్యా నేరం కూడా. కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడటం అన్నది మీ సెల్‌ఫోన్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. ఈ సూచనలు పాటించడం అన్నది మీ ఆరోగ్యమూ ఇటు మెడికల్గానూ, అటు సామాజికంగానూ చాలాకాలం బాగుండేలా చేస్తుంది. -
పన్ను భారీగా ఎగవేస్తున్నారు...!
సాక్షి, విజయనగరం : గంట్యాడ మండలానికి చెందిన పి.సరవ అనే వ్యక్తి పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో రూ.15 వేల విలువ చేసే ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేశారు. కాని సదరు వ్యాపారి బిల్లు ఇవ్వలేదు. అడిగితో ఓ చీటీపై రాసిచ్చేశాడు. అలాగే విజయనగరం పట్టణంలోని ఉడాకాలనీకి చెందిన పి.గోపి అనే వ్యక్తి తన వ్యక్తి విజయనగరంలోని ఓ హార్డ్‌వేర్ దుకాణంలో రూ. 15 వేలతో గెడలు, బోల్టులు, తదితర సామగ్రి కొనుగోలు చేశారు. సదరు వ్యాపారి కూడా బిల్లు ఇవ్వలేదు. బిల్లు ఇవ్వండని గోపి అడగ్గా.. బిల్లు కావాలంటే అదనంగా సొమ్ము చెల్లించాలని వ్యాపారి చెప్పడంతో చేసేది లేక కొనుగోలుదారుడు మిన్నుకుండిపోయాడు. ఇది ఈ ఇద్దరికి ఎదురైన పరిస్థితే కాదు. అనేక మంది వినియోగదారులకు నిత్యం ఎదురువుతున్న పరిస్థితి. ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి వస్తుందని నెపంతో వ్యాపారులు పన్ను ఎగవేయడం కోసం విక్రయించిన వస్తువులకు బిల్లులు ఇవ్వడం లేదు . ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. రూ.1200 కోట్ల వ్యాపారం.. జిల్లాలో వ్యాపారం ఎక్కువుగానే జరుగుతోంది. సాధారణ రోజుల్లో కంటే పండగ రోజుల్లో వ్యాపారం జోరందుకుంటుంది. సాధారణ రోజుల్లో నెలకు రూ.1200 కోట్ల వరకు వ్యాపారం జరగ్గా, పండగ రోజుల్లో రూ.2 వేల నుంచి రూ.2,500 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా దుస్తుల వ్యాపారం ఎక్కువగా జరుగుతుంటుంది. పక్కనే ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు కూడా విజయనగరం వచ్చి దుస్తులు కొనుగోలు చేస్తుంటారు. దీంతో వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రంలో ఉన్న బాలాజీ మార్కెట్లో 320 వస్త్ర దుకాణాలు ఒకే చోట ఉన్నాయి. ఇవికాకుండా పట్టణంలో మరో 50 నుంచి 60 వరకు వస్త్ర దుకాణాలున్నాయి. వీటిల్లో రోజుకి రూ.4 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. పండగ రోజుల్లో రూ.6 నుంచి రూ.7 కోట్ల వ్యాపారం జరుగుతుంది. బంగారం షాపులు 250 .. జిల్లాలో బంగారం షాపులు 250 వరకు ఉన్నాయి. ఈ దుకాణాల్లో రోజుకు సగటున సుమారు రూ.4 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. పండగ రోజుల్లో వ్యాపారం రూ.5 కోట్లకు చేరుకుంటుంది. ఎలక్ట్రికల్, పెయింట్స్, సిమెంట్ దుకాణాలు 2500 జిల్లాలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, పెయింట్స్, హర్డ్‌వేర్, సిమెంట్ దుకాణాలు 2500 నుంచి 3 వేల వరకు ఉన్నాయి. ఆయా దుకాణాల్లో సగటున రోజుకి రూ.10 నుంచి 15 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. వ్యాపారులు విక్రయించిన వస్తువులకు బిల్లులు ఇవ్వడం లేదు. నిబంధనల ప్రకారం కొనుగోలు రూ.100 దాటితే బిల్లు ఇవ్వాలి. విక్రయించిన వస్తువులు రూ.10 వేలు, రూ.15 వేలు దాటినా బిల్లులు ఇవ్వడం లేదు. బంగారం దుకాణాల్లో అయితే రూ.80 వేలు, లక్ష రూపాయలు దాటినా బిల్లులు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. బిల్లులు ఇచ్చినట్లైతే సదరు వ్యాపారి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. -
చంద్రబాబు సీమను పట్టించుకోవడం లేదు
కదిరి: ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమను విస్మరిస్తున్నారని వైఎస్సార్సీపీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా ధ్వజమెత్తారు. చంద్రబాబును రాయలసీమ నుంచే ప్రతిసారి అసెంబ్లీకి పంపిస్తున్నారని, కానీ ఆయన రాయలసీమ ప్రజలకు ఏం చేశాడని ప్రశ్నించారు. 24 గంటలూ సీఎం కేవలం రెండు జిల్లాలపై దృష్టి పెడుతూ రాయలసీమను పట్టించుకోవడం లేదన్నారు. భవిష్యత్తులో రాయలసీమ ఉద్యమం వస్తే అందుకు కారణం చంద్రబాబే అని చాంద్ బాషా వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కదిరిలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించాయి. అంబేద్కర్ సర్కిల్, ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. మోదీకి ప్రత్యేక హోదాపై వినతిపత్రం ఇస్తామన్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా... సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తో పది నిమిషాలు ముచ్చటించడం ఎంత వరకు సబబు అని చాంద్‌బాషా ప్రశ్నించారు. లోకేశ్‌తో గడిపిన సమయం ప్రతిపక్ష నేతకు కేటాయించి ఉంటే ప్రత్యేక హోదాపై ప్రజల వాణి వినిపించే వారిమని అన్నారు. -
మంత్రి హరీష్‌రావు పర్యటనకు తరలిరావాలి
పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్న రాజవర్దన్‌రెడ్డి మహబూబాబాద్ : రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి హరీష్‌రావు తొలిసారిగా గురువారం మానుకోటకు వస్తున్నారని, ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ మానుకోట మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంత్రి చేస్తారని తెలిపారు. మంత్రి హరీష్‌రావుతోపాటు గిరిజన, ప ర్యాటక శాఖ మంత్రి చందూలాల్, పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు వస్తున్నారని చెప్పారు. మైసమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తాం : ఎమ్మెల్యే అనంతారంలోని అనంతాద్రి దేవాలయం పక్కన ఉన్న మైసమ్మ చెరువును 4.98 కోట్ల వ్యయంతో పర్యాటక కేంద్రంగా, మి నీట్యాంక్ బండ్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తెలిపారు. ఆ చెరువును మంత్రి సందర్శించడంతోపాటు ఆ చెరువు విషయాన్ని మంత్రికి వివరించినట్లు వెల్లడించారు. నాయకులు మార్నేని వెంకన్న, భీరవెల్లి భరత్‌కుమార్ రెడ్డి, పాల్వాయి రాంమ్మోహన్‌రెడ్డి, డోలి లింగుబాబు, కన్న, జెర్రిపోతుల వెంకన్న, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మాచర్ల ఉప్పలయ్య, పొనుగోటి రామకృష్ణారావు, తూము వెంకన్న, గోగుల మల్లయ్య పాల్గొన్నారు. మంత్రి పర్యటన మ్యాప్ రూట్ వివరాలు.. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నెల్లికుదురు నుంచి 200 బైక్‌లతో ర్యాలీగా మానుకోటకు చేరుకుంటారు. ఏరియా ఆస్పత్రికి వెళ్లి అక్కడి నుంచి అనంతాద్రి దేవాలయం, మైసమ్మ చెరువు సందర్శిస్తారు. సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన, మానుకోటలో పలు అభివృద్ది పనులు, రెడ్యాల లో ప్రభుత్వ హాస్టల్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. యశోదా గార్డెన్లో పీసీసీ కార్యదర్శి రాజవర్దన్రెడ్డితోపాటు పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరే సభలో పాల్గొని తిరిగి వెళతారు. -
మానుకోటలో పేలిన తూటా
నకిలీ నక్సలైట్ల హల్చల్ దాడిని ప్రతిఘటించి, పోలీసులకు పట్టించినగొర్రెల కాపరులు బెదిరింపు కాల్స్‌తో ఆందోళన చెందుతున్న వ్యాపారులకు ఉపశమనం చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు మహబూబాబాద్/మహబూబాబాద్‌టౌన్ : మానుకోట పట్టణంలో గురువారం రాత్రి నకిలీ నక్సలైట్ల తుపాకీ కాల్పులు కలకలం సృష్టించారుు. అమాయకులైన గొర్రెల కాపరులపై తమ ప్రతాపం చూపించబోగా.. చివరికి వారు ప్రతిఘటించడంతో పోలీసులకు చిక్కారు. కాల్పుల ఘటన సమాచారం దావానలంలా పట్టణంలో వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గొర్రెల కాపరుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లి, దామర్లగిద్ద మండలం మద్దర్లబీడు గ్రామానికి చెందిన 20 మంది యాదవులు సుమారు 2 వేల గొర్రెలను మేపుతూ గురువారం రాత్రి మానుకోట శివారు నర్సంపేట రోడ్డులోని ఏటిగడ్డతండ శివారు క్రషర్ మిల్లు సమీపానికి చేరుకున్నారు. అక్కడే వంట చేసుకున్నారు. వారున్న సమీప ప్రాంతంలో వారికి ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర సామగ్రి కనిపించారుు. కొన్ని గంటల తర్వాత గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు గొర్రెల మందకు వచ్చి ఆ జీవాల యజమాని ఎవరు ? ఎక్కడ నుంచి వచ్చారని బెదిరించారు. దీంతో ఆ గొర్రెల కాపరులు వచ్చినవారు దొంగలు అనుకుని ఒకరిపై చేయి జేసుకున్నారు. దీంతో దుండగుల్లో ఒకడు వెనక్కి వెళ్లి మరో నలుగురిని మంద దగ్గరికి తీసుకొచ్చాడు. వారంతా కలిసి ఆ గొర్రెల కాపరులపై దాడికి పాల్పడ్డారు. అకారణంగా చితకబాదడంతో గొర్రెల కాపరులంతా అనవసరంగా కొడుతున్నారంటూ ఎదురు తిరిగి వారిపై చేయిజేసుకున్నారు. పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ ఆరుగురు సభ్యుల్లోని ఇద్దరు తమ వద్ద ఉన్న తపంచాలతో నేలపై కాల్పులు జరపగా ఒక తపంచాకు సంబంధించిన తూటా పేలగా మరో తపంచా తూటా పేలలేదు. అదే సమయంలో ఎస్సై ప్రసాదరావుకు సమాచారమివ్వడంతో ఆయన ట్రాఫిక్ ఎస్సై మధూకర్‌కు చెప్పారు. దీంతో ఆయన ఏఆర్ కానిస్టేబుల్ సంపత్, హోంగార్డు సంపత్తో కలిసి అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ఆరుగురిలో నలుగురు పారిపోగా ఇద్దరిని మాత్రం గొర్రెల కాపరులు పట్టుకోగలిగారు. వారి దగ్గరే రెండు తపంచాలు లభించాయి. అదే సమయంలో సాలార్‌తండా వద్ద నాకాబందీ నిర్వహిస్తున్న సీఐ నందిరామ్‌నాయక్ పారిపోతున్న మరొకరిని పట్టుకున్నారు. అతడి వద్ద తపంచా, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు వారిని విచారించగా వారు నకిలీ నక్సలైట్లుగా తేలింది. గతంలో జిల్లాలో కార్యకలాపాలు నిర్వహించి కనుమరుగైపోరుున సీపీయూఎస్ఐ పేరిట వారు కొన్ని నెలలుగా దందాలకు పాల్పడతున్నారని వెల్లడైంది. సంఘటన స్థలాన్ని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, మానుకోట డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. గొర్రెల కాపరులు, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నకిలీ నక్సలైట్ల చర్యలతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా గత కొద్ది రోజులుగా నక్సలైట్ల పేరుతో వస్తున్న బెదిరింపు కాల్స్‌తో భయపడుతున్న వ్యాపారులకు మాత్రం ఉపశమనం లభించినట్లయింది.