Azim
-
'మద్యం తాగొద్దన్నందుకు' కాదు.. కావాలనే ఇలా చేశారు!
సాక్షి, మెదక్: ఇంటి సమీపాన మద్యం తాగడం సరికాదని ఓ వ్యక్తి, ముగ్గురితో అన్నందుకు గాను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మండలంలోని బొల్లారం మున్సిపల్ పరిధిలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది. సీఐ నయీముద్దీన్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి వాసి అజీమ్(35) బొల్లారంలోని గాంధీ నగర్లో నివాసముంటూ ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బయటకు వచ్చి వాకింగ్ చేస్తున్నాడు. ఇంటికి సమీపంలో ముగ్గురు మద్యం తాగడాన్ని గమనించాడు. రాత్రి సమయంలో ఇక్కడ మద్యం తాగడం సరైంది కాదని లక్ష్మణ్, విశాల్, మన్నూ కుమార్‌తో అజీమ్ దురుసుగా చెప్పాడు. దీంతో ఆగ్రహించిన వారు అతడిపై ఉమ్మడిగా దాడికి తెగబడ్డారు. పక్కనే ఉన్న బండరాయితో తలపై మోదగా అక్కడికక్కడే అతను ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని సమీపంలోకి వ్యక్తులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. అజీమ్‌ను కావాలనే హత్య చేసి ఉంటారని, గతంలో సైతం గొడవలు జరిగాయని పలువురు అంటున్నారు. Follow the Sakshi TV channel on WhatsApp: -
కారు బోల్తా.. ఇద్దరు మృతి
అనంతపురం టౌన్: ఇండికా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన అనంతపురం నగర శివారులోని రుద్రంపేట బైపాస్ రోడ్డుపై 'సాక్షి' ఆఫీస్ ఎదురుగా జరిగింది. పెనుగొండలోని బాబా దర్గాను దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ అజీమ్(35) అక్కడిక్కడే మృతిచెందగా.. బాబావలీ (38) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారందరూ తాడిపత్రికి చెందినవారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు పీయూసీ విద్యార్థుల దుర్మరణం
ప్రాణాలు తీసిన వేగం బైక్‌పై పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ప్రమాదం శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మాన్వి, న్యూస్‌లైన్ : ద్వితీయ పీయూసీ పరీక్ష రాసేందుకు మాన్వికి వెళుతున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతులను తాలూకాలోని హిరేకొట్నేకల్కు చెందిన అజీం(18), యాపలపర్వికి చెందిన యల్లప్ప(18)గా గుర్తించారు. వీరు ఇక్కడకు సమీపంలోని నసలాపుర క్రాస్ వద్ద రాష్ట్ర రహదారిలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతుండగా, మలుపులో వంతెన వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. పోత్నాళలోని మహర్షి వాల్మీకి పీయూ కాలేజీలో చదువుతున్న వీరికి మాన్విలోని బాలికల ప్రభుత్వ పీయూ కాలేజీని పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పరీక్ష ప్రారంభమయ్యేలోపు కేంద్రానికి చేరుకోవాలనే ఆత్రుతలో వేగంగా బైక్‌పై వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సీఐ హరీష్, ఎస్ఐ దీపక్ బూసరెడ్డి తమ సిబ్బంది తో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మహర్షి కాలేజీ పాలక మండలి, విద్యార్థుల స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.