Aziz
-
నేపాల్ లో సమావేశమైన సుష్మా, అజీజ్
పొఖారా : నేపాల్ లో జరుగుతున్న సార్క్ సమావేశాలకు హాజరైన భారత విదేశ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం పాకిస్తాన్ విదేశ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో ఈ ఏడాది నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్రమోదీకి పాక్ ప్రభుత్వం ఆహ్వానించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పంపిన ఆహ్వాన ప్రతిని సర్తాజ్ అజీజ్ సుష్మా స్వరాజ్‌కు అందచేశారు. అలాగే ఈ నెల 31న అమెరికాలో ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యే అవకాశముందని సర్తాజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు సహా ద్వైపాక్షిక అంశాలపై సుష్మాస్వరాజ్ సర్తాజ్ అజీజ్ చర్చలు జరిపారు. ముఖ్యంగా పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తును వేగవంతం చేయాలని భారత్ గట్టిగా సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త విచారణ బృందం ఈ నెల 27న భారత్ రానుంది. 28 ఉదయం పఠాన్ కోట్కు వెళ్లి వివరాలు సేకరించనుంది. ఈ ఏడాది జనవరి 2న పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగి ఏడుగురు భారత భద్రతాసిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పాకిస్తాన్, భారత దేశాల నాయకుల మధ్య జరిగిన మొదటి అధికారిక సమావేశం ఇది. గతేడాది డిసెంబర్ తర్వాత ఇస్లామాబాద్, న్యూ ఢిల్లీ మధ్య సమగ్ర ద్వైపాక్షిక సంబంధాలపై జనవరిలో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు పఠాన్ కోట్ దాడుల కారణంగా వాయిదా పడ్డాయి. -
‘కాగితం’తో భగ్నమైన కుట్ర!
2004లో గణేష్ టెంపుల్ పేల్చివేతకు కుట్ర అమెరికా, ఇజ్రాయెలీల హత్యకూ పథకంవాహన దొంగను పట్టిన టాస్క్‌ఫోర్స్ అతడి వద్ద లభించిన ఫోన్ నెంబర్ల స్లిప్ కూపీతో భగ్నమైన లష్కరే తొయిబా పన్నాగం అజీజ్‌ను సోమవారం అరెస్టు చేసిన సీఐడీ సిటీబ్యూరో: సౌదీ నుంచి డిపోర్టేషన్‌పై తీసుకొచ్చిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్‌ను రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు 2004 నాటి గణేష్ ఆలయం పేల్చివేత కుట్రలో సోమవారం సాంకేతికంగా అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం అజీజ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కో రుతూ పిటిషన్ దాఖలు చేశారు. పన్నెండేళ్ల క్రితం నాటి ఈ భారీ కుట్ర వెలుగులోకి రావడంలోనూ ఆసక్తికర కో ణం ఉంది. ఓ వాహన దొంగ వద్ద లభించిన చిన్న కాగి తం ముక్క ఆధారంగా సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేపట్టి భారీ విధ్వంసానికి జరిగిన కుట్రను భగ్నం చేశారు. సీజర్లో దొరికిన స్లిప్... నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి వచ్చి పహాడీషరీఫ్ హఫీజ్‌బాబానగర్‌లో మెకానిక్‌గా స్థిరపడిన సయ్యద్ అబ్దుల్ ఖదీర్‌కు పలు వాహనచోరీలతో ప్రమేయం ఉందని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఓ వేగు సమాచారం ఇచ్చాడు. వెంటనే టాస్క్‌ఫోర్స్ అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వాహన చోరీలు చేస్తున్నట్టు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసే ముందు చోరీ వాహనాలను రికవరీ చేయడంతో పాటు అతడి జేబుల్లో ఉన్న కాగితాలను సైతం తీసి పరిశీలించారు. వాటిలో ఉన్న ఓ చిన్న స్లిప్‌లోని వివరాలు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాయి. లీడ్ ఇచ్చిన ఫోన్ నెంబర్లు... ఆ స్లిప్‌లో కాశ్మీర్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన ఫోన్ నెంబర్లు ఉండటంతో ఖదీర్‌ను లోతుగా విచారించగా... ఇతని స్నేహితుడైన ఒమర్ ఫారూఖ్ షరీఫ్ (స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల), లంగర్‌హౌస్‌లో నివసిస్తున్న గిడ్డా అజీజ్‌ల పేర్లు చెప్పడంతో పాటు వారిద్దరూ బండ్లగూడ గౌస్‌నగర్‌లోని ఓ ఇంట్లో డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపెట్టాడు. వెంటనే టాస్క్‌ఫోర్స్ బృందాలు గౌస్‌నగర్‌లోని డెన్‌పై దాడి చేయగా... అక్కడ ఫారూఖ్ చిక్కగా... అజీజ్ తప్పించుకున్నాడు. అప్పటికే అజీజ్ 2001లో కుట్ర, ఆయుధ చట్టం కింద నమోదైన కేసులో అరెస్టై ఉండటం, ఇప్పుడు పారిపోవడంతో పోలీసులు ఇది కచ్చితంగా ‘పెద్ద విషయం’ అని నిర్థారించుకున్నారు. దీంతో ఖదీర్, ఫారూఖ్‌లను కలిపి విచారించడంతో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. లష్కరేతొయిబా ప్రేరణతో... సిటీలో తమ ఘర్షణలు సృష్టించాలని పథకం వేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా.. గణేష్ నిమజ్జనం రోజు సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయం పేల్చివేతకు కుట్ర పన్నిందని బటయపడింది. దీని కోసం నగరానికి చెందిన సానుభూతిపరులతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల్లో శిక్షణ పొంది వచ్చిన వారినీ ప్రేరేపించింది. ఇందులో భాగంగా నగరానికి చెందిన కొందరితో పాటు గులాం యజ్దానీ(ఢిల్లీ ఎన్కౌంటర్లో హతమయ్యాడు) సహా 12 మందిని రంగంలోకి దింపి పేలుడు పదార్థాలు అందించింది. నిమజ్జనం రోజు ఈ గ్యాంగ్‌కు చెందిన కొందరు ఇతర మతస్తులుగా వేషం వేసుకుని గణేష్ ఆలయంలోకిప్రవేశించి బాంబు పెట్టాలని పథకం వేశారు. గులాం యజ్దానీ ఆ దేశాల మేరకు ఈ పనితో పాటు సిటీలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ టూరిస్టుల్నీ చంపాలని భావించారు. అం దుకు అవసరమైన పేలుడు పదార్థాలు, వాహనాలనూ సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో వరుసదాడులు చేసిన పోలీసులు 2004 ఆగస్టు 28న ఎనిమిది మందిని అరెస్టు చేసి ఆయుధాలు, పేలు డు పదార్థాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అత్యంత వివాదాస్పదం... ఈ అరెస్టుల సమయంలో టాస్క్‌ఫోర్స్ అత్యంత వివాదాస్పదమైంది. అమాయకుల్ని కేసుల్లో ఇరికించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఐడీ అధికారులు విచారణ జరిపి ఆ ఆరోపణలు నిరాధారమైనవని తేల్చారు. ఆపై కేసు కూడా దర్యాప్తు నిమిత్తం వారికే బదిలీ అయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టోలిచౌకి వాసి మహ్మద్ జావేద్ 2008 ఆగస్టులోనూ హల్చల్ చేశాడు. కండిషనల్ బెయిల్‌పై ఉన్న జావేద్ అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లడానికి వీలు లేదు. అయినా దుబాయ్ సందర్శించడానికి వీసా పొందిన ఇతగాడు 2008 ఆగస్టు 16 శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానం ఎక్కాలని ప్రయత్నించాడు. అయితే ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో చిక్కడంతో వారు సీఐడీకి అప్పగించారు. అలా వెళ్లడానికి కారణాలను విచారించిన అధికారులు జావేద్‌ను విడిచిపెట్టారు. నాటి నుంచి పరారీలో ఉన్న గిడ్డా అజీజ్‌ను సీఐడీ సోమవారం అధికారికంగా అరెస్టు చేసింది. -
అన్నీ నాకు తెలియాలి!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నగర పాలక సంస్థ మేయర్ అజీజ్ మోనార్క్‌గా భ్రమపడుతున్నారు. సంస్థలో అన్ని విషయాలు తనకు తెలియాలంటూ అధికారులను, సిబ్బందిని ఆదేశిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినా వారి వెంట వెళ్లకూడదని బహిరంగంగానే ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు కూడా తన కనుసన్నల్లోనే ఉండాలని భావించి ఆ మేరకు వారికీ చెప్పినట్లు తెలిసింది. వార్డుల్లో సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యేలు చేస్తున్న పర్యటనలను బహిష్కరించాలని మేయర్ అధికారులను హెచ్చరినట్లు తెలుస్తోంది. తాను మేయర్‌ను, తనకు తెలియకుండా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కార్పొరేషన్‌లోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని వేధిస్తున్నట్లు తెలిసింది. గతంలో పని చేసిన ఏ మేయరు ప్రవర్తించని విధంగా ఈయన ప్రవర్తించడాన్ని చూసిన ఉద్యోగులు అసహనానికి గురవుతున్నారు. వైఎస్సార్సీపీ నుంచి మేయరుగా ఎన్నికైన అబ్దుల్ అజీజ్ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అజీజ్‌ను మేయరును చేసేందుకు అహరహం పాటుపడిన ఎమ్మెల్యేలపై ఆయన విషం కక్కుతున్నాడు. కార్పొరేషన్లో ఏ ఫైల్ అయినా తన వద్దకు రాకుండా, ముందుకు వెళ్లడానికి వీలులేదని ఆయన అధికారులకు జారీ చేశారు. మేయర్ తీరుతో అధికారులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కొంత మంది సెలవుపై వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఉన్నత స్థాయి అధికారులను కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రోటోకోల్ ప్రకారం మేయరు కన్నా ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మేయరు అటువంటి ప్రోటోకాల్‌ను పాటించరాదని అధికారులను ఆదేశించడంపై ఈ పరిణామాలకు తామెక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని అధికారులు మనోవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర దిన వేడుకల్లో కూడా మేయరు ఇదే విధంగా వ్యవహరించారు. ఇది అప్పట్లో వివాదమయింది. మేయరు తీరు కారణంగా జాయింట్ కలెక్టరు రేఖారాణితో చీవాట్లు తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొందరు కార్పొరేషన్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వర్గీయులతోనూ సఖ్యత లేదు ఇకపోతే మేయర్ టీడీపీ వర్గీయులతో కూడా సఖ్యతగా ఉండటం లేదని తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రారంభించాలని భావించారు. అయితే మేయరు దుడుకు స్వభావం వల్ల, ఆ పార్టీ నాయకులు కార్యక్రమాన్ని నగర పరిధిని దాటి నిర్వహించారు. మేయరు ప్రమేయం లేకుండా నిర్వహించారు. అయినా మేయరులో మార్పు రావడం లేదని అధికారులు అంటున్నారు. మేయరు తీరు చూస్తుంటే ఆయన మోనార్క్‌గా భావిస్తున్నారని, ఆయన తన స్థాయి, పరిధిని తెలుసుకుని మసలుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అధికారులు, కార్పొరేటర్లు సూచిస్తున్నారు.