b. Vinodkumar
-
త్రైమాసికానికోసారి అడిగితే ఎలా?
కేంద్రం తీరును ప్రశ్నించిన వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: త్రైమాసికానికోసారి కేంద్ర నిధులపై వినియోగ ప్రతాలు అడిగితే ఎలా అంటూ టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కేంద్రాన్ని ప్రశ్నించారు. గురువారం లోక్‌సభలో అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రానికి విడుదలయ్యే నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ త్రైమాసికానికోకసారి వినియోగ పత్రాలు అడుగుతోంది. మాది కొత్త రాష్ట్రం. కొన్ని సమస్యలున్నాయి. అందువల్ల వార్షిక ప్రాతి పదికన వినియోగ పత్రాలు తీసుకునే పద్ధతిని ప్రవేశపెట్టాలి.అలాగే తెలంగాణ ప్రభుత్వం నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిని కోరాం. రాష్ట్రంలో జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ’ అని వినోద్ పేర్కొన్నారు. -
నీళ్ల దోపిడీతోనే వెనుకబాటు: వినోద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వెనుకబాటు తనానికి నీళ్ల దోపిడీనే ప్రధాన కారణమని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిననాడు ఏం చెప్పిందో.. అధికారంలోకి వచ్చాక అదే చేస్తోందన్నారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలసి సోమవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ రాజకీయ ఉనికి ప్రమాదంలో పడడంతో కాంగ్రెస్ సభలు పెట్టి ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటోందన్నారు. అయితే ప్రజలు చైతన్యవంతులని.. వాస్తవాలు ఏంటో, అవాస్తవాలు ఏంటో వారికి తెలుసన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పరిహారం కోసం కొట్లాడాలని హితవు పలికారు. రాజ్య కాంక్ష తప్పితే కాంగ్రెస్‌కు ప్రజా కాంక్ష లేదన్నారు.