త్రైమాసికానికోసారి అడిగితే ఎలా? | trs mp b. vinod kumar question to central government behavior | Sakshi
Sakshi News home page

త్రైమాసికానికోసారి అడిగితే ఎలా?

Published Fri, Dec 9 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

trs mp b. vinod kumar question to central government behavior

కేంద్రం తీరును ప్రశ్నించిన వినోద్‌  
సాక్షి, న్యూఢిల్లీ: త్రైమాసికానికోసారి కేంద్ర నిధులపై వినియోగ ప్రతాలు అడిగితే ఎలా అంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. గురువారం లోక్‌సభలో అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రానికి విడుదలయ్యే నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ త్రైమాసికానికోకసారి వినియోగ పత్రాలు అడుగుతోంది.

మాది కొత్త రాష్ట్రం. కొన్ని సమస్యలున్నాయి. అందువల్ల వార్షిక ప్రాతి పదికన వినియోగ పత్రాలు తీసుకునే పద్ధతిని ప్రవేశపెట్టాలి.అలాగే తెలంగాణ ప్రభుత్వం నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిని కోరాం. రాష్ట్రంలో జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ’ అని వినోద్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement