నీళ్ల దోపిడీతోనే వెనుకబాటు: వినోద్ | B.Vinod kumar fired on congress leaders | Sakshi
Sakshi News home page

నీళ్ల దోపిడీతోనే వెనుకబాటు: వినోద్

Published Tue, Sep 13 2016 2:56 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

నీళ్ల దోపిడీతోనే వెనుకబాటు: వినోద్

నీళ్ల దోపిడీతోనే వెనుకబాటు: వినోద్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వెనుకబాటు తనానికి నీళ్ల దోపిడీనే ప్రధాన కారణమని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పుట్టిననాడు ఏం చెప్పిందో.. అధికారంలోకి వచ్చాక అదే చేస్తోందన్నారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలసి సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ రాజకీయ ఉనికి ప్రమాదంలో పడడంతో కాంగ్రెస్ సభలు పెట్టి ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటోందన్నారు. అయితే ప్రజలు చైతన్యవంతులని.. వాస్తవాలు ఏంటో, అవాస్తవాలు ఏంటో వారికి తెలుసన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పరిహారం కోసం కొట్లాడాలని హితవు పలికారు. రాజ్య కాంక్ష తప్పితే కాంగ్రెస్‌కు ప్రజా కాంక్ష లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement