రిజర్వేషన్ల పెంపు చరిత్రాత్మకం
ఎంపీలు సీతారాం నాయక్, బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: గిరిజన రిజర్వేషన్ల పెంపు చరిత్రాత్మక మని టీఆర్‌ఎస్ ఎంపీలు పేర్కొ న్నారు. ఆదివారం అసెంబ్లీకి వచ్చిన ఎంపీలు సీతారాం నాయక్, బాల్క సుమన్‌లు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, రిజర్వేషన్ల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. వాల్మీకి బోయ, కాయితి లంబాడీలను గిరిజ నుల రిజర్వేషన్ జాబితాలో చేర్చడాన్ని ఆహ్వానిస్తున్నామని సీతారాం నాయక్ పేర్కొన్నారు.
బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ అడ్డుపడిందని, అయితే బిల్లుపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో సభలో లేకుండా ఆ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుందని అన్నారు. రాష్ట్ర శాసన సభ ఆమోదించిన ఈ బిల్లును కేంద్రం ఆమోదించేలా ఎంపీలంతా కలసి కృషి చేస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారమే ఈ బిల్లును తెచ్చారని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంబేడ్కర్ సిద్ధాంతానికి తూట్లు పొడుస్తోందని విమర్శిం చారు. కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తోందని ఆరోపిం చారు. బీజేపీ తన తీరు మార్చుకోకపోతే 90 శాతం వర్గాలు తగిన గుణ పాఠం చెబుతాయని హెచ్చరించారు.