BA
-
54 ఏళ్ల వయసులో మాజీ ఎమ్మెల్యే బీఏ పరీక్షలు!
చదువుకు వయసు ఒక ఆటంకం కాదంటారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ పరిధిలోగల బిత్రీ చైన్పూర్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా అలియాస్ పప్పు భరతౌల్ ఈ మాట నిజమని నిరూపిస్తున్నారు. గత ఏడాది మాజీ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ మిశ్రా ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు బీఏ పరీక్షలకు హాజరవుతున్నారు. బీఏ మొదటి సంవత్సరం హిందీ సబ్జెక్టు పరీక్షను రాశారు. తాను ఇంటర్మీడియట్ పాసయ్యానని, గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక ఎల్ఎల్బీ చేయాలనుకుంటున్నానని ఆయన మీడియాకు తెలిపారు. తాను లా కోర్సు పూర్తి చేశాక పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం చేస్తానని రాజేష్ కుమార్ మిశ్రా తెలిపారు. తన జీవితంలో రాజకీయాలకు, చదువులకు, వయసుకు సంబంధం లేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను న్యాయవాది కావాలనుకునేవాడినని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యానని, గ్రాడ్యుయేషన్ కూడా పాసవుతానని అన్నారు. ప్రతి సమస్యకు చదువుతోనే పరిష్కారం లభ్యమవుతుందని, విద్యతోనే పేదరికాన్ని తరిమికొట్టవచ్చని అన్నారు. -
ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి
పరీక్షల్లో మంచి మార్కులు రావాలని విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు. పాస్ అయితే చాలురా బాబు అని కొందరనుకుంటే.. ఇక టాపర్స్ బ్యాచ్ ఏమో వందకు 99 మార్కులు తెచ్చుకోవాలని రోజుకీ గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. అయితే ఎంత చదివినా, ఎంత రాసినా మహా అయితే 99, లేదా వంద మార్కులు సాధించవచ్చు. అంతకుమించి అయితే రావు కదా. కానీ బిహార్‌కు చెందిన ఓ డిగ్రీ విద్యార్థికి 100కు 151 మార్కులు వచ్చాయి. హా అదేంటి అని ఆశ్యర్చపోతున్నారా.. నిజమేనండి.. ముందుగా తన మార్కులను చూసుకున్న విద్యార్థి కూడా మీలాగే బిత్తరపోయాడు. చివరికి అసలు తెలిసి ఖంగుతిన్నాడు. అసలేం జరిగిందంటే.. దర్బంగా జిల్లాకు చెందిన లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం (బీఏ ఆనర్స్) చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో 100కు 151 మార్కులు వచ్చాయి. రిజల్ట్స్‌ను చూసి షాక్ అయినట్లు విద్యార్థి తెలిపారు. తను మాట్లాడుతూ.. మార్కులు చూసి ఆశ్చర్యపోయానని ఇది తాత్కాలిక మార్కు షీట్ అయినప్పటికీ, ఫలితాలు విడుదల చేయడానికి ముందు అధికారులు దానిని తనిఖీ చేయాలి కదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదవండి: కర్ణాటక: తేనె రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు ఇదిలా ఉండగా బీకామ్ చదవుతున్న మరో విద్యార్థికి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ పేపర్లో సున్నా మార్కులు వచ్చాయి. అయినా అతన్ని తదుపరి క్లాస్‌కు ప్రమోట్ చేశారు. కాగా మార్కుల విషయంపై యూనివర్సిటీ స్పందించింది. టైపింగ్ మిస్టేక్ కారణంగా ఇద్దరికి మార్కులు తప్పుగా పడ్డాయని పొరపాటు జరిగినట్లు తెలిపింది. రెండు మార్క్ షీట్లలో పొరపాట్లు జరిగాయని, వాటిని సరిచేసి మళ్లీ కొత్త ప్రొవిజినల్ సర్టిఫికెట్లుజారీ చేసినట్లు చేసినట్లు వివరణ ఇచ్చింది. -
ఆనర్స్.. బోధించేవారు లేరు సార్!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బీఏ ఆనర్స్ కోర్సు ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి తీసుకొచ్చిన ఈ కోర్సు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం లేదు. ఇప్పుడున్న కోర్సులకన్నా భిన్నంగా వీటిని ముందుకు తీసుకెళ్లాలని భావించినప్పటికీ ఫ్యాకల్టీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీన్ని పరిష్కరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది నిజాం కాలేజీలో ఎకనామిక్స్, కోఠి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను ఆనర్స్‌గా ప్రారంభించింది. సీట్లు కూడా భర్తీ అయ్యాయి. ప్రాజెక్టు వర్క్, ఫీల్డ్ స్టడీ ఎక్కువగా ఉండేలా సిలబస్ రూపొందించారు. సామాజిక అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించారు. అయితే, రాష్ట్రంలో ఆ స్థాయిలో ప్రత్యేక బోధన చేపట్టగల అధ్యాపకులు దొరకడం లేదు. ఇతర రాష్ట్రాల్లోని అధ్యాపకుల కోసం సైతం వేట మొదలు పెట్టారు. ఈ ప్రయత్నంలోనూ అవాంతరాలు ఎదురవుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎలాంటి పురోగతి కన్పించడం లేదనే విమర్శలొస్తున్నాయి. (బాసర ట్రిపుల్ఐటీకి న్యాక్ ‘సి’ గ్రేడ్.. అధికారుల తీరే కారణమా..?) నిపుణుల కోసం వేట.. ► ఆనర్స్ కోర్సుల్లో ఎదురవుతున్న సమస్యలపై ఇటీవల అధికారులు చర్చించారు. నిపుణుల కోసం జల్లెడ పట్టాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ బోధన విజయవంతంగా సాగుతుండటంతో అక్కడి అధ్యాపకులను రప్పించేందుకు సంప్రదింపులు చేపడుతున్నారు. కానీ పూర్తిస్థాయి బోధనకు వారు సుముఖంగాలేరని తెలిసింది. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక క్లాసు చెప్పగలమే తప్ప పూర్తిస్థాయిలో బోధించలేమని వారు చెబుతున్నారు. దీంతో కచ్చితమైన ప్రణాళిక కష్టమని అధికారులు వాపోతున్నారు. ► వీలైతే ఇతర రాష్ట్రాల అధ్యాపకుల చేత ఆన్లైన్ క్లాసులైనా ఇప్పించాలనుకుంటున్నారు. దీనికోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయోగం ఏమేర సత్ఫలితాలనిస్తుందనేది చెప్పలేమని అధికారులు అంటున్నారు. కొత్త కోర్సు కావడంతో విద్యార్థుల సందేహాల నివృత్తి వీలవుతుందా అనే అనుమానాలున్నాయి. ఇతర రాష్ట్రాల ఫ్యాకల్టీ ఆన్లైన్ ద్వారా కొద్దిసేపు మాత్రమే బోధించే వీలుందని నిజాం కాలేజీ అధ్యాపకుడు ఒకరు చెప్పారు. ► ప్రముఖులతో విశ్లేషణలు ఆనర్స్ కోర్సుల్లో ప్రధానాంశం. అవసరమైతే ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆ స్థాయి అధికారులతో ఆర్థిక శాస్త్రంలో మార్పులపై చెప్పిస్తామని అధికారులు చెప్పినా.. ఇంతవరకు సరైన ప్రణాళిక లేదు. ఎవరిని, ఎప్పుడు పిలవాలి? అనే దానిపై విద్యార్థులకు ఎలాంటి షెడ్యూల్ ఇవ్వలేదు. -
యువర్..‘ఆనర్స్’
బీఏ కోర్సులంటేనే బోర్ కొట్టించే పరిస్థితిని రూపుమాపేందుకు ఉన్నత విద్యా మండలి ప్రయత్నిస్తోంది. సరికొత్త రాజనీతి బోధనకు శ్రీకారం చుట్టింది. బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును తొలిసారిగా కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి సాధన చేసి సరికొత్త రాజనీతి బోధనకు శ్రీకారం చుట్టింది. విద్య, విలువల కలబోతగా కొత్త కోర్సును విద్యార్థుల ముందుకు తెచ్చింది. వినూత్న పాఠ్యప్రణాళిక ఈ కోర్సు విశేషం. బీఏ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) కోర్సులంటేనే బోర్ కొట్టించే పరిస్థితిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త కోర్సుకేకాదు, బావితరాల కోసం కొత్త రాజకీయ నాయకత్వానికి డిజైన్ చేసింది. బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును తొలిసారిగా కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టింది. 60 మంది విద్యార్థులతో ప్రయోగాత్మకంగా మొదలైన తొలిబ్యాచ్ ప్రారంభ కార్యక్రమం మంగళవారం ఇక్కడ జరిగింది. కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్ అరుణ్ పట్నాయక్, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విద్యుల్లత, రాజనీతిశాస్త్రం ప్రొఫెసర్ వి.శ్రీలత తదితరులు పాల్గొన్నారు. నాయకత్వలక్షణాలు, రాజకీయ మేధోమథనం, క్షేత్రస్థాయి రాజనీతిజ్ఞత మేళవించిన పాఠ్యప్రణాళికను ఈ కోర్సులో జోడించారు. ఈ కోర్సు ప్రాధాన్యతలపై నిపుణులు ‘ఇండస్ ప్రోగ్రామ్’లో ఏమన్నారంటే... దేశంలోనే భిన్నమైన ఆలోచన: ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి భిన్నమైన ఆలోచనలతో కోర్సుకు డిజైన్ చేశాం. సమకాలీన అంతర్జాతీయ, రాజకీయ విషయాలే బోధనాంశాలు. తరగతికే పరిమితమయ్యే పాతవిధానానికి భిన్నంగా రాజకీయప్రముఖుల అనుభవాలే పాఠ్యాంశాలుగా నేరుగా విద్యార్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. సంప్రదాయ ఫ్యాకల్టీ పాత్ర కన్నా, రాజకీయ ముఖ్యులు, విశ్లేషకులే ఇక్కడ బోధకులుగా వ్యవహరిస్తారు. నాలుగు గోడల మధ్య చదువును పక్కన బెట్టి, విశాల ప్రపంచంలో విస్తృత అవగాహన బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ ప్రత్యేకత. చారిత్రక అవసరం : ఓయూ వీసీ ప్రొ. డి. రవీందర్ ఉన్నత విద్యలో మహిళల పాత్ర 70 % మేర పెరిగింది. గొప్ప నాయకత్వ లక్షణాలను సంతరించుకునే దిశగా వాళ్లు అడుగులు వేస్తున్నారు. అందుకే బీఏ హానర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రవేశపెట్టాం. దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో అధ్యయనం చేసిన తర్వాతే ఈ కోర్సు రూపొందించాం. భావితరాలకు మంచి నాయకులను అందిస్తామనే ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాం. ఢిల్లీ కన్నా ... ఇక్కడే బెస్ట్ ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల కన్నా మెరుగైన రీతిలో బీఏ ఆనర్స్‌ను తెలంగాణ అందించాలనుకుంటోం ది. దక్షిణ భారతదేశంలో ఈ కోర్సుకు అనువైన పరిస్థితులు తెలంగాణలోనే ఉన్నాయి. భవిష్యత్‌లో ఈ కోర్సు కోసం ఇతర రాష్ట్రాల వాళ్లూ పోటీపడతారు. తెలంగాణలోని నాయకత్వ లక్షణాలు, విద్యాహబ్‌గా హైదరాబాద్ ముందుండటం వల్ల ఈ కోర్సు కు మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నాం. ఈ కోర్సు అభ్యసించిన విద్యార్ఙినులు రోల్‌మోడల్‌గా నిలుస్తారని ఆశిస్తున్నాం. – ప్రొ.వెంకటేశు రాజకీయాల్లో విలువలు పెంచే కోర్సు విలువలతో కూడిన రాజకీయాలు నేటితరానికి అవసరం. ప్రజా సంక్షేమ పాలనకు ఇదే పునాది. ముఖ్యంగా మహిళారాజకీయ చైతన్యం వెల్లివిరుస్తున్న నేపథ్యంలో హానర్స్ పొలిటికల్ కోర్సులకు ఎంతో ప్రాధాన్యముంది. పార్లమెంటరీ విలువలు, నాయకత్వ లక్షణాలు కలబోసి రూపొందించిన ఈ పాఠ్యప్రణాళిక... వాస్తవాలే పాఠాలు మార్చి అందించే బోధనావిధానం తెలంగాణను దేశంలో గర్వంగా నిలుపుతుందని భావిస్తున్నాం. – ముసలయ్య (రాజనీతి శాస్త్రం ఆచార్యుడు) -
అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఆనర్స్’
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడేలా రాష్ట్రంలో బీఏ (ఆనర్స్) పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. సామాజిక, ఆర్థిక అంశాలపై విస్తృత అవగాహన, బహుళజాతి సంస్థల్లోనూ ఉపాధి అవకాశం కల్పించగల నైపుణ్యం అందించడమే కోర్సుల ముఖ్య లక్ష్యమని చెప్పింది. సివిల్స్ వంటి జాతీయ పోటీ పరీక్షల్లో సైతం నెగ్గుకొచ్చే ప్రమాణాలు ఆనర్స్ కోర్సుల ప్రత్యేకతలని తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోతున్న బీఏ(ఆనర్స్) పాఠ్య ప్రణాళిక, ప్రత్యేక తలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో నిపుణులు గురువారం విలేకరులకు వివరించారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్, నిజాం కాలేజీలో ఎకనమిక్స్ ప్రవేశపెట్టామని, ఈ నెల 20 వరకూ ప్రవేశం పొందవచ్చన్నారు. వచ్చే ఏడాది నుంచి మరికొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులతో విస్తరించనున్నట్లు ఓయూ వీసీ ప్రొ.డి.రవీందర్ చెప్పారు. ఉన్నత విద్యా మండలి వైఎస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విజ్జుల్లత, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణ పాల్గొన్నారు. -
ప్రముఖులతో పాఠాలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠ్యపుస్తకాల చదువులను తగ్గించి, సామాజిక అవగాహన మేళవించి సరికొత్త బోధనను అందుబాటులోకి తేనున్నారు. రాజకీయ ప్రముఖులు, ఆర్థికవేత్తలు, మాజీ ఐఏఎస్‌లు, ఇతర మేధావులతో పాఠాలు చెప్పించబోతున్నారు. ఈ దిశగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి బీఏ ఆనర్స్ కోర్సులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మంగళవారం హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ కొత్త కోర్సును లాంఛనంగా ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ (పొలిటికల్), నిజామ్ కాలేజీలో బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్)ను అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలుపెట్టనున్న ఈ కోర్సులో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్‌లో వీటిని చేరుస్తారు. రెండు కాలేజీల్లో లభించే ఆదరణను బట్టి రాష్ట్రవ్యాప్తంగా కోర్సును విస్తరించే వీలుందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ప్రస్తుతానికి మూడేళ్ల కాలపరిమితితోనే కోర్సు ఉంటుందని, మున్ముందు నాలుగేళ్లకు పెంచుతామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ పాల్గొన్నారు. కోర్సు లక్ష్యం ఇదీ.. ఉమ్మడి రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం బీఏ ఆనర్స్ కోర్సును సమర్థవంతంగా నిర్వహించారు. అప్పట్లో ఈ కోర్సు చేసిన వారికి ఇంటర్మీడియెట్ బోధించే అర్హత కూడా ఉండేది. సైన్స్ కోర్సుల ప్రాధాన్యం పెరగడంతో ఆనర్స్ తెరమరుగైంది. సంప్రదాయ బీఏ కోర్సుల్లో చేరే వారి సంఖ్య 16 శాతానికి పరిమితమైంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో బీఏ చదివే వారి సంఖ్య పెరుగుతోంది. అదీగాక ఈ కోర్సు కోసం ఇక్కడి నుంచి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. సామాజిక అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ఉన్నత విద్యామండలి తెలిపింది. పాఠ్యపుస్తకాల్లో అంశాలకు 50 శాతం మార్కులిస్తే, సామాజిక అవగాహనకు మరో 50 మార్కులు ఇస్తారు. ఆనర్స్ కోర్సును వ్యాపారం కాకుండా, ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహిస్తే బాగుంటుందని వినోద్‌కుమార్ సలహా ఇచ్చారు. సమాజాన్ని అర్థం చేసుకోకపోతే అది చదువే కాదని, దీన్ని గుర్తించే ఆనర్స్ తెస్తున్నట్టు తెలిపారు. -
డిగ్రీ తెలుగు పాఠ్యాంశంగా ‘సాక్షి’ కథనం
సాక్షి, హైదరాబాద్: నేటితరానికి ‘సాక్షి’కథనం ఓ పాఠ్యాంశమైంది. యువతరాన్ని మేల్కొలిపే ఆయు ధమైంది. గతేడాది (డిసెంబర్ 21, 2020) ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ‘ఊరినే అమ్మేశారు’ శీర్షికతో ప్రచురితమైన వార్తాకథనాన్ని డిగ్రీ మూడో ఏడాది తెలుగు పుస్తకంలో పాఠంగా చేర్చారు. తెలుగు అకాడమీ రూపొందించిన తెలు గు సాహితీ దుందుభి పుస్తకాన్ని ఉన్నత విద్యామం డలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మంగళవారం ఇక్కడ ఆవిష్క రించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీ ఏ కోర్సుల ద్వితీయ భాషగా ఈ పుస్తకాన్ని అందించారు. విద్యార్థుల్లో రచనానైపుణ్యాలను పెంచాలన్న సంకల్పంతో ‘సాక్షి’కథనాన్ని జర్నలిజం మౌలికాం శాల శీర్షికలో చేర్చారు. రికార్డులు తారుమారు చేస్తూ ఊరినే అమ్మేసిన ఓ ఘనుడి నిర్వాకం వల్ల కామా రెడ్డి జిల్లా బూరుగిద్ద పల్లెవాసులు పడే గోసను ‘సాక్షి’ ప్రజల దృష్టికి తెచ్చి ప్రభుత్వ యంత్రాం గాన్ని కదిలించింది. పుస్తకావిష్కరణలో ‘సాహితీ దుందుభి’ ప్రధానసంపాదకుడు సూర్యాధనంజ య్, ఆచార్య కాశీం, లావణ్య, ఎస్.రఘు, వి.శ్రీధర్, శంకర్, కృష్ణయ్య, డా.భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
నాన్నకు ప్రేమతో...కూతురు
కరోనాతో కన్నుమూసిన తండ్రి కల నెరవేర్చడానికి 13 ఏళ్ల తనిష్క బిఎ ఎల్‌ఎల్‌బిలో చేరాలనుకుంది. అయితే, అందుకు పర్మిషన్ లభించకపోవడంతో బిఎ సైకాలజీలో చేరింది. 12 ఏళ్ల వయసులో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 11 ఏళ్ల వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ఎనిమిదేళ్ల వరకు స్కూల్‌కు వెళ్లిన తనిష్క ఆ తర్వాత ఇంటి నుంచే చదువు కొనసాగించింది. చిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ తండ్రి కలను నెరవేర్చాలనుకుంటోంది తనిష్క. స్కూల్ ఏజ్‌లో డిగ్రీ స్థాయి చదువులతో బిజీగా ఉన్న తనిష్క మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఏరోడ్రోమ్ ప్రాంతంలో నివసిస్తోంది. 13 ఏళ్ల వయసు. స్కూల్ చదువు కూడా పూర్తి కాని ఈ అమ్మాయి ఇప్పుడు బి.ఎ సైకాలజీ చేస్తోంది. తండ్రి కల నెరవేర్చాలనే లక్ష్యంగా బిఎ ఎల్ఎల్బి కోసం అనుమతి కోరింది. కానీ, చిన్న వయసు అనే కారణంగా ఇంకా అనుమతి లభించలేదు. దీంతో బిఎ సైకాలజీలో చేరింది. ఈ డిగ్రీ పూర్తి చేశాక, ఎల్ఎల్బి చేస్తానంటోంది తనిష్క. -
గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు
-
నాలుగేళ్ల బీఏ ఈడీ కోసం ఎన్ఐటీఈ
న్యూఢిల్లీ: నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఈడీ, బీఎస్సీ ఈడీ కోర్సుల నిర్వహణ కోసం జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్ఐటీఈ)ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మానవ వనరుల శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు కోసం సమగ్ర ముసాయిదా రూపొందించాల్సిందిగా మంత్రిత్వ శాఖ గత ఏడాది నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను అధ్యయనం చేసిన ఈ కమిటీ.. ప్రీప్రైమరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ స్కూళ్ల టీచర్లకు అవసరమైన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏఈడీ, బీఎస్సీఈడీ కోర్సుల నిర్వహణ కోసం ప్రత్యేక సంస్థ అవసరమని పేర్కొంది. ‘కొత్తగా ఏర్పాటయ్యే ఎన్ఐటీ ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయటం కాకుండా.. ప్రస్తుత ఉపాధ్యాయులు, విద్యావేత్తల వృత్తిపరమైన అవసరాలను తీర్చుతుంది. విధాన పరమైన మార్గదర్శకాలను రూపొందిస్తుంది.’అని కమిటీ తన ముసాయిదాలో పేర్కొంది. -
31న ఓయూ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు
హైదరాబాద్: ఓయూ డిగ్రీ ఆఖరి సంవత్సర వార్షిక పరీక్ష ఫలితాలను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ కుమార్ శుక్ర వారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ద్వితీయ, తృతీయ సంవత్సరాలు, దూరవిద్య డిగ్రీ ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఫ్రెంచ్, జర్మన్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఫ్రెంచ్, జర్మన్ లాంగ్వేజస్ సీనియర్, జూనియర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవే శాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ ఫారెన్ లాంగ్వేజెస్ విభా గం ప్రకటించింది. ఈ కోర్సుల వ్యవధి 4నెలలు . ఆసక్తి గల విద్యార్థులు జూన్ 11 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం 80194 27898 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. -
పీజీ...ఎందుకు క్రేజీ?
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ బీఏ, బీఎస్సీ, బీకాం ఫైనలియర్ పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని యూనివర్సిటీల్లో ముగిశాయి. మరికొన్నింటిలో త్వరలో ముగియనున్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్నత విద్యవైపు దృష్టి సారిస్తే మంచి భవిష్యత్ అవకాశాలు సొంతం చేసుకోవచ్చని విద్యావేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీతో పోలిస్తే పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారికి ఎక్కువ అవకాశాలుండటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో డిగ్రీ తర్వాత పీజీ ఎందుకు చేయాలి? పీజీతో ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. పీజీ ఎందుకు? గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోనే సివిల్స్, ఎస్ఎస్సీ, గ్రూప్స్, బ్యాంక్స్, రైల్వేస్ వంటి పోటీ పరీక్షలు రాసే అవకాశం ఉన్నప్పుడు పీజీ ఎందుకు? అనే ప్రశ్న సహజంగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉదయిస్తుంది. అయితే సంపూర్ణ మూర్తిమత్వం ఉన్న వ్యక్తులుగా ఎదగాలన్నా.. నిర్దేశిత సబ్జెక్టుల్లో మంచి పరిజ్ఞానం పొందాలన్నా పీజీతోనే సాధ్యం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్‌తోనే పూర్తిస్థాయి నైపుణ్యాలు పొందలేం. డిగ్రీ కళాశాలలు సాధారణంగా మండల కేంద్రాల్లో సైతం ఉంటాయి. అక్కడ వివిధ అంశాలపై విద్యార్థులకు ఎక్స్పోజర్ చాలా తక్కువగా లభిస్తుంది. పట్టణాల్లో చదివితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అదే పీజీ అయితే యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో, లేదా క్యాంపస్ కళాశాలల్లో చదవాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులకు వివిధ అంశాలపై అపార నైపుణ్యాలు సొంతమవుతాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు, నిపుణులైన ఫ్యాకల్టీ ఉంటారు. దీనివల్ల వివిధ అంశాలపై సానుకూల వాతావరణంలో చర్చలు జరపొచ్చు. యూజీతో పోల్చుకుంటే పీజీతో కెరీర్ అవకాశాలెన్నో ఉన్నాయి. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలకు డిగ్రీనే అర్హతగా ఉన్నప్పటికీ.. యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఎకనమిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్‌కు నిర్దేశిత సబ్జెక్టుల్లో పీజీ చేసినవారు మాత్రమే అర్హులు. అదేవిధంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేయాలంటే పీజీ ఉండాల్సిందే. ఇక యూనివర్సిటీలు/కేంద్రీయ విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా పనిచేయాలంటే పీజీతోపాటు పీహెచ్డీ ఉండాల్సిందే. వివిధ ప్రైవేటు ఉద్యోగాల్లోనూ పీజీ పట్టా ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. పీజీ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తున్నారు. కార్పొరేట్, సేవా రంగాలు, మేనేజ్మెంట్ వంటి నిర్దిష్ట విభాగాల్లో పీజీ చదివినవారికే అత్యుత్తమ అవకాశాలున్నాయి. వేతనాల్లో కూడా వీరే ముందుంటున్నారు. సంబంధిత విభాగాల్లో టీమ్ లీడర్‌గా ఎంపిక చేయాలన్నా.. అభ్యర్థి అకడమిక్ అర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ముందంజకు.. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, గ్రూప్స్, బ్యాంక్స్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో డిగ్రీ అభ్యర్థుల కంటే పీజీ చదివినవారికే ఎక్కువ అవకాశాలుంటున్నాయి. వివిధ పరీక్షల్లో విజేతలుగా నిలిచినవారిని పరిశీలించినట్లయితే పీజీ అభ్యర్థులే ఉద్యోగ సాధనలో ముందుంటున్నారు. గ్రాడ్యుయేషన్‌లో చదివిన సబ్జెక్టులనే వీరు పీజీలో ఎంచుకోవడం ఇందుకు కారణం. ఉదాహరణకు డిగ్రీలో జాగ్రఫీ చదివినవారు పీజీలో కూడా అదే సబ్జెక్టును పూర్తిస్థాయిలో రెండేళ్లపాటు అధ్యయనం చేస్తారు. దీంతో ఆ సబ్జెక్టుపై మంచి పట్టు సాధిస్తారు. ఈ పరిజ్ఞానంతో పోటీ పరీక్షల్లో డిగ్రీ ఉత్తీర్ణులతో పోలిస్తే సులువుగా ఉద్యోగాలను దక్కించుకుంటున్నారు. కొత్త స్పెషలైజేషన్లు డిగ్రీతో పోల్చుకుంటే పీజీలో నేడు ఎక్కువ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. బహుళజాతి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండటం, ఈ-కామర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం, ప్రైవేటు రంగాల అవసరాల నేపథ్యంలో ఎన్నో స్పెషలైజేషన్లు పీజీలో అందుబాటులోకొచ్చాయి. ఎంకాంలో ఈ-కామర్స్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్; ఎంఏలో లిబరల్ ఆర్ట్స్, రూరల్ డెవలప్మెంట్, సోషల్‌వర్క్; ఎంఎస్సీలో బయోఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్ వంటి వినూత్న స్పెషలైజేషన్లను ఆయా యూనివర్సిటీలు/కళాశాలలు ప్రవేశపెట్టాయి. ఈ కోర్సులను అభ్యసించడం ద్వారా ఉన్నత విద్యావకాశాలతోపాటు ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు. -
ఐబీపీఎస్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్
ఆకర్షణీయ వేతనాలు, ఆహ్లాదకర పనివాతావరణం, కెరీర్లో చకచకా ఎదిగేందుకు విస్తృత అవకాశాలు.. ఇవే నేటి యువతకు బ్యాంకులో కొలువుదీరడాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తున్నాయి. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ.. చేసిన కోర్సు ఏదైనా ఇప్పుడు చాలా మంది బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) గేట్ వే వంటిది. ఇది నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులో కొలువును ఖాయం చేసుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగ నియామకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఐబీపీఎస్ తాజాగా కొన్ని పరీక్షల విధానాన్ని మార్చింది. వీటిపై స్పెషల్ ఫోకస్.. ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఎస్బీఐ సొంతంగా నియామక ప్రక్రియ చేపడుతోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునెటైడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. వీటి తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు ఐబీపీఎస్ కొన్ని పరీక్షల విధానంలో మార్పులు చేసింది. వీటికి పాత విధానమే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల్లో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్లు; ఆఫీస్ అసిస్టెంట్ నియామకాలకు కామన్ రిటెన్ ఎగ్జామినేషన్(సీడబ్ల్యూఈ)-4ను పాత విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఒకే పరీక్ష నిర్వహిస్తారు.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ వంటి స్పెషలిస్టు ఆఫీసర్ల నియామకాలకు కూడా పాత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. నియామక ప్రక్రియలో ఒకే పరీక్ష ఉంటుంది. ప్రధాన మార్పులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్, ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రెయినీ నియామకాలకు ఇప్పటి వరకు ఒకే పరీక్ష ఉండేది. ఇక నుంచి రెండు దశల్లో అంటే ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో నిర్దేశ మార్కులు సాధించిన వారిని మెయిన్ రాసేందుకు అనుమతిస్తారు. ఇందులో విజయం సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది జాబితా రూపకల్పనకు ప్రిలిమ్స్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. సీడబ్ల్యూఈ-5 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. మార్పులెందుకు? ప్రస్తుతం బ్యాంకు పరీక్షలకు ఏటా లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. 2013-14లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని క్లరికల్ పరీక్షలకు 14.24 లక్షల మంది, ఆఫీసర్ కేడర్ పరీక్షలకు 13.19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకే పరీక్ష ఉండటం వల్ల అందులో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం కష్టమవుతోంది. అందువల్ల పరీక్ష దశలోనే అభ్యర్థులను వడపోసేందుకు ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షల విధానాన్ని తెచ్చినట్లు తెలుస్తోంది. మారిన ఫీజు చెల్లింపు విధానం ఇప్పటి వరకు దరఖాస్తు ఫీజును ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో చెల్లించే వెసులుబాటు ఉండేది. ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, మొబైల్ వేలెట్, క్యాష్‌కార్డు ద్వారా చెల్లించవచ్చు. ప్రిపరేషన్ ప్రణాళిక ఐబీపీఎస్ 2015-16లో నిర్వహించనున్న పరీక్షలకు కేలండర్‌ను ముందుగానే విడుదల చేసింది కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు పటిష్ట ప్రణాళిక వేసుకునేందుకు అవకాశం లభించింది. పరీక్ష విధానం ఏదైనా కష్టపడేవారికి విజయం తథ్యం. ప్రభుత్వరంగ బ్యాంకుల క్లరికల్, పీవో పరీక్షలకు ప్రిలిమినరీ, మెయిన్ రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టినా, పరీక్షల సిలబస్, మార్కులు, సమయం, ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌కు ఎందరిని ఎంపిక చేస్తారు తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రిలిమ్స్‌లో రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లపై ప్రశ్నలు ఉండే అవకాశముంది. తక్కువ ప్రశ్నలు ఉండి, స్వల్ప వ్యవధిలో పరీక్ష ముగిసేలా ఉంటుంది. మెయిన్‌లో ఇప్పుడున్న సబ్జెక్టుల నుంచి కొంత క్లిష్టతతో ప్రశ్నలు అడిగే అవకాశముంది. గత సబ్జెక్టులనే కొనసాగించే అవకాశముంది కాబట్టి పరీక్ష విధానంలో మార్పుల వల్ల ఆందోళన చెందనవసరం లేదు. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ముఖ్యం. రోజూ కోచింగ్ తీసుకునే సమయాన్ని మినహాయించి, ఇంటి దగ్గర ప్రిపరేషన్‌కు మూడు, నాలుగు గంటలు కేటాయించాలి. శిక్షణ కేంద్రంలో నిర్వహించే రోజువారీ, వారంతపు పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. దానికనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు. రీజనింగ్‌లో ఎరేంజ్మెంట్, పజిల్ సాల్వింగ్ విభాగాలు చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు బ్లడ్ రిలేషన్స్ సమస్యల సాధన కీలకం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ ముఖ్యమైంది. 8, 9 పాఠ్యపుస్తకాల్లోని అంశాలను ప్రాక్టీస్ చేస్తే క్వాంటిటేటివ్ విభాగంలో అధిక స్కోర్ సాధనకు వీలవుతుంది. ఇంగ్లిష్‌లో కటాఫ్ దాటేందుకు చాలా మంది అభ్యర్థులు ఇబ్బందులుపడుతున్నారు. ఈ పరిస్థితి రాకూడదంటే కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్ వర్డ్స్‌పై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించడానికి ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి. ోజూ తప్పకుండా నమూనా పరీక్షలు రాయాలి. గ్రూపుగా ఏర్పడి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. -
సివిల్స్‌కు అనుగుణంగా డిగ్రీ!
* బీఏ సిలబస్‌లో మార్పులు చేర్పులు * ఆంత్రోపాలజీ కాంబినేషన్లతో కొత్త కోర్సులు * సోషియాలజీ, సోషల్ వర్క్ పాఠ్యాంశాల్లోనూ మార్పులు * బీఏ విద్యార్థులు ఎన్జీవోలతో కలసి పనిచేసేలా ఒప్పందం * చదువు పూర్తికాగానే ఉపాధి అవకాశాలు లభించేలా ఏర్పాట్లు * తె లంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: సివిల్స్ పోటీ పరీక్షలకు అనుగుణంగా డిగ్రీ సిలబస్‌లో మార్పులు తేవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సివిల్స్ రాసేవారు ఆంత్రోపాలజీ సబ్జెక్టుకు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే ఆంత్రోపాలజీ కాంబినేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో (బీఏ) కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు డిగ్రీ స్థాయిలో ఆంత్రోపాలజీ కాంబినేషన్‌తో కోర్సులు ఉన్నా.. ఇటు ప్రభుత్వ కాలేజీలు, అటు ప్రైవేటు కాలేజీలు ఆ కోర్సులకు అడ్మిషన్లు తీసుకోవడం లేదు. ఇకపై అలా కాకుండా ఆయా కోర్సులను అన్ని కాలేజీలు కచ్చితంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత కాలేజీల్లో కచ్చితంగా ఈ కోర్సులకు అడ్మిషన్లు చేపట్టాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్ మారనుంది. ఈ మార్పుల్లో భాగంగా ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ వర్క్ సబ్జెక్టుల సిలబస్‌ను మార్చాలని నిర్ణయించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం ఆధ్వర్యంలో అన్ని యూనివర్సిటీల విభాగాధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, డీన్లతో సోమవారం సమావేశం జరిగింది. ఇందులో డిగ్రీ సిలబస్‌లో తీసుకు రావాల్సిన మార్పులపై చర్చించారు. మార్పులు చేర్పుల్లో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సిలబస్, యూపీఎస్సీ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలోని ప్రధాన అంశాలతో బీఏలో మూడేళ్లపాటు ఆంత్రోపాలజీ కాంబినేషన్‌తో కోర్సును నిర్వహిస్తారు. తద్వారా సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి డిగ్రీ స్థాయి నుంచే పునాది వేయొచ్చని మండలి వైస్ చైర్మన్ మల్లేశ్ పేర్కొన్నారు. దీంతో డిగ్రీ తర్వాత కోచింగ్ సెంటర్లలో ఆంత్రోపాలజీలో శిక్షణ పొందాల్సిన అవసరం ఉండదన్నారు. బీఏలో హిస్టరీ-ఆంత్రోపాలజీ-సోషియాలజీ, ఆంత్రోపాలజీ-పొలిటికల్ సైన్స్-ఫిలాసఫీ, ఆంత్రోపాలజీ-సైకాలజీ-ఇంగ్లిష్ లిటరేటర్ వంటి కాంబినేషన్లతో మార్పులు తెస్తామన్నారు. సోషియాలజీ, సోషల్ వర్క్ సబ్జెక్టుల సిలబస్‌లోనూ మార్పులు తేనున్నారు. ఈ మార్పులపై మరింత లోతుగా అధ్యయనం చేసి సిలబస్‌ను మార్చేందుకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సోషియాలజీ డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ విశ్వ విద్యాలయాల విభాగాధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి అదనంగా.. డిగ్రీ కాలేజీల్లో బోధించే 10 మంది లెక్చరర్లతో మరో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. వీటన్నింటికి సమన్వయకర్తగా ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ గణేశ్ వ్యవహరిస్తారు. సోషియాలజీలో ముఖ్యంగా ప్రాంతీయ సంస్కృతి అంశంలో తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతికి పెద్దపీట వేస్తారు. సోషియాలజీ, సోషల్ వర్క్ వంటి సబ్జెక్టులతో బీఏ చేసే వారి సిలబస్‌ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చడంపై దృష్టి సారిస్తారు. ఇందులో భాగంగా క్షేత్ర పర్యటనలు, ఇతర ప్రాక్టికల్స్ విషయంలో ఎన్జీవో సంస్థలతో కలసి విద్యార్థులు పని చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. దీంతో డిగ్రీ పూర్తయ్యాక విద్యార్థులకు ఎన్జీవో సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. -
కాంతులీనే కెరీర్‌కు ‘కొలువంత’ అండగా...
‘‘నేను బ్యాంకు పరీక్షలకు ప్రిపేరవుతున్నాను?.. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అధిక శాతం ఉద్యోగార్థుల నోటి నుంచి వస్తున్న మాట ఇది! గ్రూప్స్ సహా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర నోటిఫికేషన్లు కరువైన వేళ.. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా వస్తున్న బ్యాంకు ఉద్యోగాల ప్రకటనలు నిరుద్యోగులకు అడగా నిలుస్తున్నాయి.. కాస్త్త శ్రమిస్తే చాలు.. కాంతులీనే కొలువును చేజిక్కించుకోవచ్చనే ధీమానిస్తున్నాయి.. తాజాగా ఇలాంటి వారి ముందుకు ఐబీపీఎస్ నుంచి పీవో నోటిఫికేషన్ రూపంలో మరో అవకాశం తలుపుతట్టింది.. ఈ నేపథ్యంలో పీవో నోటిఫికేషన్ వివరాలతో పాటు పరీక్షలో గెలుపు గమ్యానికి చేర్చే సుస్థిర సోపానాలపై ఫోకస్.. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ.. చేసిన కోర్సు ఏదైనా ఇప్పుడు చాలా మంది బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. పోటీ తీవ్రంగానే ఉన్నప్పటికీ, ప్రకటనలు కూడా ఎప్పటికప్పుడు వస్తుండటంతో కష్టపడితే తప్పకుండా ఉద్యోగం వస్తుందన్న ధీమాతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగం-కుటుంబ జీవితానికి మధ్య సమన్వయం సాధించగలిగే చక్కటి పని వాతావరణం, కెరీర్లో ఎదగడానికి అవకాశాలు విస్తృతంగా ఉండటం.. ఇలా వివిధ కారణాల వల్ల నేటి యువత బ్యాంకులో కొలువుదీరేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే శరవేగంగా విస్తరిస్తున్న బ్యాంకింగ్ రంగానికి మరింత ఊపునిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కదులుతోంది. దేశంలో ఆర్థిక అనుసంధానానికి ఊతమిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో కొత్తగా 15 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవాలని, వీటిలో అత్యధికంగా 12 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే తెరవాలనే ఆలోచన ఉంది. ఈ తరుణంలో బ్యాంకింగ్ రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో యువతకు ఉద్యోగావకాశాలు పలకరించనున్నాయి. ఐబీపీఎస్.. పీవో: తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. ప్రొబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్మెంట్ ట్రెయినీస్ లేదా తత్సమాన ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా, పోస్టులు ఎక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. వేలాది మంది ఉద్యోగుల పదవీ విరమణతోపాటు కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తుండటంతో ఖాళీలు పెరుగుతున్నాయి. భాగస్వామ్య బ్యాంకులు: ఐబీపీఎస్ ఆధారంగా ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకుంటున్న బ్యాంకులు.. అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారతీయ మహిళా బ్యాంకు, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఈసీజీసీ, ఐడీబీఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంకు, ఏదైనా ఇతర బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ. అర్హత: భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులు. అయితే ఫలితాలు 2014, ఆగస్టు 11 లేదా అంతకంటే ముందు వెల్లడై ఉండాలి.వయో పరిమితి: కనిష్ట వయసు 20 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు. జూలై 2, 1984; జూలై 1, 1994 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.ఎంపిక విధానం: తొలుత ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఖాళీలనుబట్టి నిర్దేశిత కటాఫ్ ఆధారంగా కామన్ ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే తాజా నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్ష స్కోర్ కార్డు మార్చి 31, 2016 వరకు చెల్లుబాటవుతుంది. ప్రశ్నపత్రం: ఆన్లైన్లో జరిగే పరీక్ష ప్రశ్నపత్రంలో ఐదు విభాగాలుంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. విభాగం గరిష్ట మార్కులు రీజనింగ్ 50 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 జనరల్ అవేర్నెస్ (బ్యాంకింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి) 40 కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ తప్ప) మాధ్యమంలో ఉంటుంది. ఆర్బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. 506 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత సరిపోతుంది. వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ జనరల్ అభ్యర్థులకు పదేళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రెండు గంటల వ్యవధిలో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష- విభాగాలు: విభాగం {పశ్నలు మార్కులు రీజనింగ్ 40 40 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40 న్యూమరికల్ ఎబిలిటీ 40 40 జనరల్ అవేర్నెస్ 40 40 కంప్యూటర్ నాలెడ్జ్ 40 40 ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు: జూలై 16-ఆగస్టు 6, 2014. ఫీజు చెల్లింపు (ఆన్లైన్): జూలై 16-ఆగస్టు 6, 2014. ఫీజు చెల్లింపు (బ్యాంకు శాఖల్లో): జూలై 18-ఆగస్టు 11, 2014. ఆన్లైన్ పరీక్ష: సెప్టెంబర్, 2014. వెబ్సైట్: rbi.org.in ఇండియన్ బ్యాంక్ ముఖ్య తేదీలు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జూలై 16-జూలై 30, 2014. దరఖాస్తు సవరణకు చివరి తేదీ: జూలై 30, 2014. ఫీజు చెల్లింపు: జూలై 16-జూలై 30, 2014. పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు (ఒక్కో పోస్టుకు) రూ.50. ఇతర అభ్యర్థులకు రూ.550 వెబ్సైట్: www.indianbank.in సన్నద్ధతకు సిద్ధం.. (ఐబీపీఎస్ పీవో పాటు ఇతర బ్యాంకు ఉద్యోగాలకూ ఉపయోగపడే ప్రిపరేషన్ ప్రణాళిక..) రీజనింగ్: అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని, తార్కిక విశ్లేషణను అంచనా వేసేందుకు బ్యాంకు పరీక్షలో రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఈ విభాగం విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. దాదాపు 50 మార్కులు దీనికి కేటాయిస్తారు. స్టేట్మెంట్-కన్‌క్లూజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్; ర్యాంకింగ్స్, సిరీస్, ఆల్ఫాబెట్ టెస్ట్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. కాన్సెప్టులపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి అధిక మార్కులు సాధించవచ్చు. ఇంగ్లిష్ లాంగ్వేజ్: కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్ వర్డ్స్‌పై దృష్టిసారించాలి. ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించడానికి ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఒక ప్యాసేజ్లో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ను గుర్తించగలగాలి. ఈ పరిజ్ఞానాన్ని బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ప్రీవియస్ పేపర్ల్లోని ప్రశ్నలకు అన్వయిస్తూ ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి. వేగంగా చదవడం, తప్పులను గుర్తించే నైపుణ్యం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి. ఈ విభాగం నుంచి 40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థులు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ విభాగంలో పైచార్టు, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పారాగ్రాఫ్/కేస్‌లెట్స్; టేబుల్స్ రూపంలోని సమస్యలను సాధించాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన సమస్యలకు వేగంగా సమాధానాలు గుర్తించేందుకు కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలు, వర్గ మూలాలు, ఘన మూలాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. మొత్తంమీద ఆైఈకఅ సమస్యల సాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పెర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ; యావరేజ్; ప్రాఫిట్-లాస్; సింపుల్-కాంపౌండ్ ఇంట్రస్ట్; రేషియో-ప్రొపోర్షన్-వేరియేషన్; నంబర్ థియరీ (రిమైండర్స్); టైమ్-స్పీడ్-వర్క్; జియోమెట్రీ (ఏరియా, వాల్యూమ్, పెరీమీటర్) తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్నెస్: ఈ విభాగంలో సాధారణంగా 75 శాతం ప్రశ్నలు బ్యాంకింగ్ రంగానికి, మిగిలిన 25 శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్‌పై వస్తున్నాయి. క్రీడలు; పుస్తకాలు-రచయితలు; వార్తల్లో వ్యక్తులు; అవార్డులు; జనాభా లెక్కలు; సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర అంశాలపై దృష్టిసారించాలి. బ్యాంకింగ్ రంగ పరిజ్ఞానానికి సంబంధించి ప్రామాణిక బ్యాంకింగ్ అవేర్నెస్ పుస్తకాలను ఎంచుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు (ఉదా: వడ్డీ రేట్లు, బ్యాంకుల ఉన్నతాధికారుల పేర్లు, లోగోలు, బైలైన్స్..) తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌లో వాడే పదాలు, వాటి అర్థాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్బీఐకి సంబంధించిన అంశాలను కరెంట్ అఫైర్స్ కోణంలో అధ్యయనం చేయాలి. ప్రైవేటు బ్యాంకులకు లెసైన్సులు, మాట్లాడే ఏటీఎంల ఏర్పాటు, కార్డ్ లెస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ తదితర వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దినపత్రికలు, ప్రామాణికమైన పోటీ పరీక్షల మ్యాగజైన్లను చదవడం ద్వారా జనరల్ అవేర్నెస్పై పట్టు సాధించవచ్చు. న్యూస్ బులెటన్లు చూస్తుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం: కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎంఎస్ ఆఫీస్, ఆపరేటింగ్ సిస్టమ్స్/సాఫ్ట్వేర్ బేసిక్స్, ఇంటర్నెట్/నెట్వర్క్, వైరస్/సెక్యూరిటీ, డేటాబేస్ తదితర అంశాలకు సంబంధించిన బేసిక్స్‌ను నేర్చుకోవాలి. షార్ట్‌కట్ కమాండ్స్‌ను తెలుసుకోవాలి. ప్రిపరేషన్‌కు ఎన్సీఈఆర్టీ బేసిక్ కంప్యూటర్ పుస్తకాలు అక్కరకొస్తాయి. బ్యాంక్ పీవో కెరీర్ ప్రస్థానం ప్రభుత్వ/ప్రైవేటురంగ బ్యాంకుల్లో జూనియర్, మిడిల్, సీనియర్, టాప్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగాలుంటాయి. అధిక బ్యాంకుల్లో జూనియర్ స్థాయిలో అసిస్టెంట్ మేనేజర్; మిడిల్ మేనేజ్మెంట్లో డిప్యూటీ మేనేజర్, మేనేజర్; సీనియర్ మేనేజ్మెంట్లో చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్; టాప్ మేనేజ్మెంట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలుంటాయి. వీటిని స్కేల్-1, స్కేల్-2.. ఇలా స్కేల్-7 వరకు పోస్టులుగా వ్యవహరిస్తారు. ఇవి కాకుండా స్పెషల్ స్కేలుగా చీఫ్ జనరల్ మేనేజర్, మేనేజింగ్ డెరైక్టర్ ఉద్యోగాలుంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఎండీ స్థాయికి చేరిన వారంతా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రస్థానాన్ని ప్రారంభించినవారే.. అంటే సుమారు 25 ఏళ్లకు కెరీర్‌ను ప్రారంభించిన వారు 35 ఏళ్లకు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశముంది. జీతభత్యాలు: పీవోల జీతం వారు పనిచేసే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. అన్ని చోట్లా మూల వేతనం, కరువు భత్యం వంటివి సమానంగా ఉన్నా.. హెచ్ఆర్ఏ, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ వంటివి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఒకరకంగా; జైపూర్, చండీగఢ్, విజయవాడ, విశాఖపట్నం, కోయంబత్తూరు వంటి ప్రాంతాల్లో మరో విధంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి తక్కువగా ఉంటాయి. నెలకు రూ.25 వేల కనీస వేతనం నుంచి కెరీర్ ప్రారంభమవుతుంది. చాలా బ్యాంకుల్లో ఆఫీసర్ ఇల్లు వెతుక్కుంటే దాన్ని బ్యాంకే లీజుకు తీసుకొని, అందులో ఫర్నిచర్ సమకూరుస్తుంది. ఆ ఫర్నిచర్ నిర్వహణకు అదనపు అలవెన్సు అందిస్తుంది.రెండు/నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి. వాహనాల కోసం ఆఫీసర్ స్థాయికి అనుగుణంగా పెట్రోలు ఇస్తారు. ఇల్లు కొనుగోలుకు/నిర్మాణానికి తక్కువ వడ్డీకి, సాధారణ వడ్డీపై రుణాలిస్తారు (సాధారణంగా బ్యాంకుల్లో అన్ని రుణాలపైనా నెలవారీ చక్రవడ్డీ వసూలు చేస్తారు). బ్యాంకింగ్ పరిజ్ఞానం పెంచుకునేందుకు రెండు/మూడు దినపత్రికలు, మ్యాగజైన్లు సమకూర్చుకునేందుకు అవకాశమిస్తారు. నాలుగేళ్లకోసారి ఉద్యోగం చేసే చోటు నుంచి, స్వస్థలానికి వెళ్లేందుకు కుటుంబం మొత్తానికి డబ్బులిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలోనైనా కుటుంబంతో కలిసి పర్యటించేందుకు అవకాశమిస్తారు. కొన్ని బ్యాంకులు సీనియర్ స్థాయి అధికారులకు విదేశీ పర్యటనకు అవకాశమిస్తున్నాయి. మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి క్రాస్ సెల్లింగ్ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీటివల్ల రాజమార్గంలో అదనపు ఆదాయం సమకూరుతుంది. క్రాస్ సెల్లింగ్ బాగా చేసిన వారికి ధన రూపంలోనే కాకుండా, విదేశీ పర్యటన అవకాశాం కూడా కల్పిస్తున్నారు. విధుల నిర్వహణ: ఉద్యోగంలో బాధ్యతల విషయానికొస్తే ఎప్పుడైనా కనీసం మూడేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పనిచేయాలి. ప్రతి మూడేళ్లకు ఒకసారి బదిలీ ఉంటుంది. దీనివల్ల పిల్లల చదువుకు ఇబ్బంది కలిగితే ప్రత్యేక అలవెన్సు ఇస్తారు. ప్రొబేషన్ పూర్తికాగానే ఫీల్డ్ ఆఫీసర్‌గా, ఐదారు ఏళ్ల తర్వాత స్వతంత్రంగా బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ప్రతిభ కనబరిస్తే, పెద్ద బ్రాంచ్‌లో మేనేజర్ అవకాశమిస్తారు. ఆపైన పదోన్నతలు ద్వారా 30-45 బ్రాంచ్‌ల సమాహారమైన ప్రాంతీయ కార్యాలయం; 100-150 బ్రాంచ్‌ల సమాహారమైన జోనల్ కార్యాలయాల్లో వివిధ సాయిల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. క్రెడిట్, కంప్యూటర్, ఫారెన్ ఎక్స్ఛ్ంజ్, రికవరీ, ట్రెజరీ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధచూపి, ప్రావీణ్యం సంపాదించిన వారికి ప్రధాన కార్యాలయంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ తదితర బ్యాంకులకు విదేశాల్లో శాఖలున్నాయి. ఆయా దేశాల్లో క్లరికల్ ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారుగానీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగులను ఇక్కడి నుంచి డిప్యుటేషన్‌పై పంపిస్తారు. వీరికి ప్రత్యేక అలవెన్సులు ఉంటాయి. విభిన్న నేపథ్యాల నుంచి బ్యాంకుల్లో చేరిన వారికి బ్యాంకింగ్ దైనందిన జీవితంలో అవసరమైన విద్యను అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ముంబై).. జేఏఐఐబీ/సీఏఐఐబీ కోర్సులు అందిస్తోంది. వీటిని పూర్తిచేసిన వారికి ఒక్కో పరీక్షకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇస్తారు. వీటి ప్రభావం పదోన్నతులపైనా ఉంటుంది. ఈ కోర్సులకు అదనంగా మరికొన్ని డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు కూడా ఉన్నాయి. వీటిని పూర్తిచేస్తే అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రాక్టీస్ కొద్దీ ఫలితం రోజువారీ పరీక్షలు: రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ముఖ్యం. రోజూ కోచింగ్ తీసుకునే సమయాన్ని మినహాయించి, ఇంటి దగ్గర ప్రిపరేషన్‌కు మూడు, నాలుగు గంటలు కేటాయించాలి. శిక్షణ కేంద్రంలో నిర్వహించే రోజువారీ, వారంతపు పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. దానికనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు. ప్రిపరేషన్‌కు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, ‘బ్యాంకింగ్ అండ్ యూ’ మ్యాగజైన్లు ఉపయోగపడతాయి. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేశామన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్లో దానికే ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యమైన అంశాలు: రీజనింగ్‌లో ఎరేంజ్మెంట్, పజిల్ సాల్వింగ్ విభాగాలు చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు బ్లడ్ రిలేషన్స్ సమస్యల సాధన కీలకం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ ముఖ్యమైంది. 8, 9 పాఠ్యపుస్తకాల్లోని అంశాలను ప్రాక్టీస్ చేస్తే క్వాంటిటేటివ్ విభాగంలో అధిక స్కోర్ సాధనకు వీలవుతుంది. నమూనా పరీక్షలు: ప్రతి రోజూ తప్పకుండా నమూనా పరీక్షలు రాయాలి. బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించి పేరున్న పబ్లికేషన్ల మ్యాగజైన్లలో మోడల్ టెస్ట్‌లు ఇస్తున్నారు. వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కొన్ని ప్రచురణ సంస్థలు ఆన్లైన్ మాక్ టెస్ట్‌ల ప్యాకేజీలను అందిస్తున్నాయి. కొంత మొత్తం చెల్లించి వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలాంటి మాక్ టెస్ట్‌ల వల్ల విజయంలో కీలకపాత్ర పోషించే టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. అసలు పరీక్ష రోజున ఒత్తిడికి చోటు లేకుండా చేయొచ్చు. వ్యూహం: పరీక్షలో తొలుత ఒక్కో విభాగానికి 20 నిమిషాలు చొప్పున కేటాయిస్తూ వీలైనన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఆ తర్వాత ప్రతి విభాగంలో మిగిలిన ప్రశ్నలను సాధించేందుకు ప్రయత్నించాలి. తొలుత న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలను సాధిస్తే మంచిది. -
ఏయూ దూరవిద్య నేటి పరీక్ష వాయిదా
ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), న్యూస్‌లైన్ : ఏయూ దూరవిద్యా కేంద్రం శుక్రవారం నిర్వహించాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ పరీక్షలు వాయిదా వేసినట్టు కేంద్రం సంచాలకుడు ఆచార్య ఎల్డీ సుధాకర్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగే మొదటి సంవత్సరం, మధ్యాహ్నం జరిగే మూడో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష కారణంగా ఈ పరీక్షను వాయిదా వేసినట్టు ఆయన వివరించారు. ఈ పరీక్షను జూన్ ఒకటో తేదీ ఆదివారం నిర్వహిస్తామన్నారు. ఆ రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మిగిలిన పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రం మార్పు బీఎస్సీ విభాగంలో కాకినాడ పి.ఆర్.ప్రభుత్వ కళాశాలను ఎంపిక చేసుకున్నవారు ఎంఎస్ఎన్ కళాశాలో పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది. విద్యార్థులు మారిన పరీక్షా కేంద్రాల నుంచి తమ హాల్ టికెట్లు పొంది పరీక్షకు హాజరుకావాలని సూచించారు. -
విద్యార్థులకు బీఆర్‌ఏయూ షాక్
పొందూరు, న్యూస్‌లైన్: ప్రశ్న పత్రాల లీకులతో విమర్శలు ఎదుర్కొంటున్న డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ అధికారులు డిగ్రీ విద్యార్థులకు షాక్ ఇచ్చారు. ప్రశ్న పత్రంలో ఓ ప్రశ్న ముద్రించకపోవడంతో విద్యార్థు లు దానికి మార్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వివరాలు ఇవీ... శుక్రవారం డిగ్రీ రెండో సంవత్సరం(బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీ ఎం) విద్యార్థులకు జనరల్ తెలుగు పేపర్ పరీక్ష జరిగింది. ప్రశ్న పత్రం చూసి అవాక్కవడం విద్యార్థుల వంతైంది. కారణమేమిటంటే... ప్రశ్న పత్రం రెండవ పుటలో ఐదవ ప్రశ్నలో నాలుగు ప్రశ్నలిచ్చి ఒకదానికి వ్యాసం(జవా బు) రాయవలసి ఉంది. అయితే ఇందులో మూడు ప్రశ్నలే ఇచ్చారు. రోమన్ నంబర్ 1, 3, 4ల్లో ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. రెండో ప్రశ్న స్థానంలో కేవలం అంకె వేసి వదిలేశారు. ఈ ప్రశ్నకు ఎనిమిది మార్కులు కేటాయించా రు. దీంతో తాము చేయని తప్పునకు అనవసరంగా ఎనిమిది మార్కులు కోల్పోవలసి వచ్చిందని పలువురు విద్యార్థులు ‘న్యూసలైన్’కు తెలిపారు. తమకు జరిపిన అన్యాయాన్ని యూనివర్సిటీ ఉపకులపతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ప్రశ్నపత్రం కోడ్ నంబర్ ట్చట002. ఈప్రశ్నపత్రం మొత్తం 70 మార్కులకు కేటాయించారు.