చదువుకు వయసు ఒక ఆటంకం కాదంటారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ పరిధిలోగల బిత్రీ చైన్‌పూర్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా అలియాస్ పప్పు భరతౌల్ ఈ మాట నిజమని నిరూపిస్తున్నారు.
గత ఏడాది మాజీ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ మిశ్రా ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు బీఏ పరీక్షలకు హాజరవుతున్నారు. బీఏ మొదటి సంవత్సరం హిందీ సబ్జెక్టు పరీక్షను రాశారు. తాను ఇంటర్మీడియట్ పాసయ్యానని, గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక ఎల్‌ఎల్‌బీ చేయాలనుకుంటున్నానని ఆయన మీడియాకు తెలిపారు.
తాను లా కోర్సు పూర్తి చేశాక పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం చేస్తానని రాజేష్ కుమార్ మిశ్రా తెలిపారు. తన జీవితంలో రాజకీయాలకు, చదువులకు, వయసుకు సంబంధం లేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను న్యాయవాది కావాలనుకునేవాడినని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యానని, గ్రాడ్యుయేషన్ కూడా పాసవుతానని అన్నారు. ప్రతి సమస్యకు చదువుతోనే పరిష్కారం లభ్యమవుతుందని, విద్యతోనే పేదరికాన్ని తరిమికొట్టవచ్చని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment