ఆ మొసలి పిల్లలు భలే ఉన్నాయి..
చెన్నై: తమిళనాడులో మొసలి పిల్లలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అవి కూడా ఒకటికాదు రెండు కాదు. ఏకంగా 21 పిల్లలు.. కోయంబత్తూర్లోని జంతు ప్రదర్శన శాలలో ఉంచిన ఈ మొసలి పిల్లలను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.
పెద్ద మొసళ్ల నుంచి రక్షించేందుకుగాను అధికారులు వీటిని కొన్ని ప్లాస్టిక్ నీళ్ల టబ్బుల్లో పెట్టి విడివిడి ఎన్క్లోజర్లలో పెట్టారు. ఇటీవల జన్మించిన వీటిని పెద్ద మొసళ్లు చంపేస్తాయని భావించి వాటిని విడిగా ఏర్పాటుచేశామని, వాటికి జూకు వచ్చిన వాళ్లంత అట్రాక్ట్ అవుతున్నారని అధికారులు చెప్పారు.