Bacterial
-
వామ్మో చైనా ఇన్ఫెక్షన్
వాషింగ్టన్: చైనాలో నానాటికీ పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని కొత్త రకం బ్యాక్టీరియల్ నిమోనియా దేశమంతటా శరవేగంగా వ్యాపిస్తుండటం మరింత భయోత్పాతానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో తక్షణం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అమెరికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. చైనాకు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించాలని ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. -
మందులు విఫలమైతే కొత్త సమస్యలు
రోగకారక బ్యాక్టీరియాను నిర్మూలించే యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోవడం అతిపెద్ద ఉత్పాతానికి దారితీయనుంది. అవసరానికి మించి యాంటీబయాటిక్స్ ఉపయోగించడం కారణంగా బ్యాక్టీరియాపై వాటి ప్రభావం సన్నగిల్లిపోతోందని రెండు అంతర్జాతీయ అధ్యయనాలు బయట పెట్టాయి. కోవిడ్–19 మహమ్మారి ప్రభావంతో వీటిని ఎవరూ పట్టించుకోలేదు. 2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో దాదాపు 50 లక్షలు ఏఎంఆర్ (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) సంబంధిత మరణాలే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయవలసిన సాంక్రమిక వ్యాధుల నియంత్రణ వ్యూహాల్లో మార్పులు తప్పనిసరి. యాంటీబయాటిక్స్‌ను హేతుపూర్వకంగా వాడేలా బలమైన క్రమబద్ధీరణ వ్యవస్థలు అవసరం. అంతర్జాతీయ వైద్య పత్రికల్లో ఈ సంవ త్సరం రెండు ప్రమాదకరమైన కథనాలు ప్రచురితమయ్యాయి. సూక్ష్మజీవులు నిరోధకత పెంచుకుంటున్న విషయాన్ని అవి ఎత్తి చూపాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి వాటి కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి వాడే మందులు పనిచేయడం లేదని తెలిపాయి. టైఫాయిడ్ జ్వరానికి కారణమయ్యే బ్యాక్టీరియా అయిన సాల్మోనెల్లా టైఫీకి వాడే మందులు పనిచేయక పోవడం గురించి ‘లాన్సెట్’ తాజా అధ్యయనం చర్చించింది. జనవరి మొదట్లో లాన్సెట్ ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ బ్యాక్టీరియల్ యాంటీమై క్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్ 2019’ అనే మరొక అధ్యయనం కూడా చేసింది. సూక్ష్మజీవుల ఏజెంట్లలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు వాటిపై వాడే మందులు పనిచేయడం లేదని కూడా ఈ అధ్యయనం తెలిపింది. పొంచి ఉన్న విపత్తు గురించి ఈ రెండు అధ్యయనాలు వెల్లడించిన అంశాలను కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, భారతదేశం నుంచి 2016–19 మధ్య టైఫాయిడ్ బ్యాక్టీరియాకు సంబంధించిన జీనోమ్ స్వీక్వెన్స్ను పరిశీలించినందున టైఫాయిడ్‌పై చేసిన తాజా అధ్యయనం చాలా పెద్దదనే చెప్పాలి. 1905 నుంచి 2018 వరకు 70కి పైగా దేశాలనుంచి 4,000 సూక్ష్మజీవి రకాలను పరిశీలించగా, పై నాలుగు దేశాలనుంచి వేరుపర్చిన 3,489 కొత్త సీక్వెన్స్ రకాలను పరిశోధకులు తాజాగా ఆవిష్కరించారు. సూక్ష్మజీవి సంహారకాలకు తట్టుకుని, వివిధ భౌగో ళిక ప్రాంతాలకు బ్యాక్టీరియా వ్యాప్తి చెందిన విధాన్ని వీరు పరిశీలిం చారు. బ్యాక్టీరియా జన్యు ఉత్పరివర్తనాలు సిప్రోఫ్లాక్సాసిన్, ఎరిత్రో మైసిన్ వంటి సాధారణంగా ఉపయోగించే యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకున్నాయి. గత 30 సంవత్సరాల్లో ఒక ఖండంలో కానీ, ఇతర ఖండాల్లో కానీ యాంటీబయాటిక్స్‌కి నిరోధకత దాదాపు 200 రెట్లు పెరిగిందని గుర్తించారు. జన్యు ఉత్పరివర్తనాలు, వ్యాప్తి మూలాలకు సంబంధించి చూస్తే దక్షిణాసియా 90 శాతం మ్యుటే షన్లతో అతిపెద్ద ప్రాంతంగా నిలిచింది. అలాగే దక్షిణాసియా నుంచి అగ్నేయాసియాకు, దక్షిణాఫ్రికాకు ఈ మ్యుటేషన్లు విస్తరించాయిని తాజా అధ్యయనం తెలిపింది. పైగా యూరప్‌కూ, రెండు అమెరికన్ భూఖండాలకూ ఇవి వ్యాపించాయని కనుగొన్నారు. దీనివల్ల రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టసాధ్యమైపోయింది. చికిత్స చేస్తున్నప్పుడు వైఫల్యాల సంఖ్య పెరిగింది. రోగులు ఆసుపత్రుల్లో గడపాల్సిన వ్యవధి పెరగడంతో ఖర్చు పెరిగింది. మరణాల రేటు కూడా పెరిగింది. నిరోధకత పెంచుకున్న బ్యాక్టీరియా రకాలు వివిధ దేశాలకే కాకుండా వివిధ ఖండాలకు కూడా వ్యాపిం చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయవలసిన సాంక్రమిక వ్యాధుల నియంత్రణ వ్యూహాల్లో మార్పు చేయడం తప్పనిసరి. యాంటీబయాటిక్స్‌కి ఏమాత్రం లొంగని బ్యాక్టీరియా రకాల ఆవి ర్భావం కారణంగా, వ్యాధి నిరోధక పద్ధతులను కూడా మార్చు కోవాలి. టైఫాయిడ్ సాంక్రమికంగా వచ్చే దేశాల్లో టైఫాయిడ్ వ్యాక్సిన్లను కూడా మార్చవలసి ఉంటుంది. ఈ సంవత్సరం మొదట్లో ప్రచురితమైన అధ్యయనం సూక్ష్మజీవి సంహారకాలకు నిరోధకత (ఏఎంఆర్) అంతర్జాతీయ తలనొప్పిగా మారినట్లు పేర్కొంది. దాదాపు 200 దేశాల్లో ఇది పొడసూపటమే కాదు, 20 పైగా బ్యాక్టీరియా వ్యాధికారకాలు కూడా బయటపడ్డాయి. 2019లో చేసిన ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభ వించిన మరణాల్లో దాదాపు 50 లక్షల మరణాలు ఏఎమ్ఆర్ (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) సంబంధిత మరణాలే. అంటే బ్యాక్టీరియాను సంహరించే మందులు పనిచేయక ఇన్ని మరణాలు సంభవించాయన్నమాట. వీటిలో నాలుగింట మూడొంతుల మర ణాలు ప్రధానంగా ఆరు బ్యాక్టీరియా రకాల వల్లే సంభవించాయి. ఈ ఆరింటిలో ఈష్చెరిషియా కోలి అనేది ప్రమాదకరమైనదిగా పరిణ మించింది. శ్వాససంబంధ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకాయని ఈ అధ్య యనం తెలిపింది. దీన్నే సాధారణ పరిభాషలో నిమోనియా అని పిలుస్తుంటారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆరు కీలక బ్యాక్టీరియాలు అత్యధికంగా మందులకు నిరోధకతను సాధించడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియా నిరోధక యాంటీబయాటిక్స్‌ను డాక్టర్లు అతిగా సిఫార్సు చేయడం లేదా దుర్వినియోగం చేయడం వల్ల సమస్య తీవ్రమైంది. 2016లో అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం అమెరికాలో డాక్టర్లు సిఫార్సు చేసిన యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్లలో 30 శాతం వరకు అనవసరమని తేలింది. జ్వరం, గొంతు నొప్పి, సైనస్ వంటి సాధారణ సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్‌ను సిఫార్సు చేశారని తేలింది. భారతదేశం విషయంలో ఇది మరింత ఎక్కువగానే ఉంటుందనడంలో సందేహమే లేదు. మన దేశంలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లతో పనిలేకుండా, ఫార్మసిస్టులు, అనధికారిక వ్యక్తులు కూడా వీటిని నేరుగా రోగులకు ఇచ్చేయడం రివాజు. దగ్గు, డయే రియా, పొత్తికడుపు నొప్పి వంటి అతి సాధారణ జబ్బులకు కూడా వీటిని సిఫార్సు చేస్తున్నారు. చెప్పాలంటే ఆసుపత్రుల్లో చేరే ప్రతి వాళ్లకూ వేగంగా ఉపశమించేలా బ్యాక్టీరియా సంహారక మందులను రాసిపడేస్తున్నారు. నాణ్యత లేని మందులు కూడా బ్యాక్టీరియా విస్తరణకు కారణం అవుతున్నాయి. అవసరం లేని చోట వాడుతున్న యాంటీబయాటిక్స్ జన్యు ఉత్పరిపర్తనాలకు దారి తీస్తోంది. దీనివల్ల ఒక ప్రత్యేక ఏజెంట్ కంటే మొత్తం డ్రగ్స్‌కే బ్యాక్టీరియా అలవాటుపడుతోంది. కొన్నేళ్ల క్రితం చేసిన ఒక అధ్యయనంలో, పేదదేశాల్లో వాడే యాంటీబయా టిక్స్‌లో ఎనిమిదింట ఒకటి, మలేరియా మందుల్లో ఐదింట ఒకటి నాణ్యత లేకుండా ఉన్నాయని బయటపడింది. నాణ్యత లేని లేబ రేటరీ పరీక్షలు, డాక్టర్లు సూచించిన చికిత్సను రోగి చివరివరకూ పాటించకపోవడం, యాంటీబయాటిక్స్ని ఇష్టానుసారం మార్చడం కూడా పరిస్థితిని దిగజార్చుతున్నాయి. కోళ్ల పరిశ్రమలో, జంతువుల్లో యాంటీబయాటిక్స్ ఉపయోగించడం భయానక పరిస్థితిని సృష్టిస్తోంది. మందులను, ఆసుపత్రుల్లో వ్యర్థాలను డిస్పోజ్ చేయడంలో లోపాలతో పాటు కొన్ని పరిశ్రమల వల్ల పర్యావరణం నేరుగా కాలుష్యానికి గురవుతోంది. వాతావరణంలో మానవ, జంతు సూక్ష్మజీవికణాలు కలగలిసిపోతున్నాయి. దీంతో మానవులు, జంతువులలో కూడా బ్యాక్టీరియా వ్యతిరేక నిరోధకత తగ్గిపోతోంది. యాంటీబయాటిక్ మందు అయిన కోలిస్టిన్‌ను దశాబ్దాలుగా పశువులకు ఇస్తూ రావడం వల్ల అవి నేరుగా మానవుల్లో ఇన్ఫెక్షన్లకు దారితీసి బీభత్సం సృష్టించింది. ఇన్ఫెక్షన్కు చివరి ప్రయత్నంగా మాత్రమే కోలిస్టిన్ వాడాల్సి ఉంటుంది. కానీ ఆ అంశానికి ఎవరూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రోగక్రిమి నాశకాల శక్తి తగ్గిపోవడానికి సంబంధించి భారత్ మేలుకోవలసిన తరుణం ఆసన్నమైంది. యాంటీబయాటిక్స్‌ను హేతుపూర్వకంగా రాసే, ఉపయోగించే బలమైన క్రమబద్ధీరణ వ్యవస్థలు అవసరం. వీటి ఉత్పత్తిలో నాణ్యతను తప్పక పాటించేలా చూడాలి. ‘ఏఎంఆర్’ను కనుగొని పర్యవేక్షించే పద్ధతులను ప్రారంభిం చాలి. యూరప్, అమెరికాల్లో లాగా మన ఆసుపత్రుల్లో సాంక్రమిక వ్యాధుల విభాగాల ప్రత్యేక వ్యవస్థను తప్పక ఏర్పాటుచేయాలి. అప్పుడే అధికంగా యాంటీబయాటిక్స్ ఉపయోగించడాన్ని నియంత్రించడం, పర్యవేక్షించడం సాధ్యపడుతుంది. రాకేశ్ కోచర్ వ్యాసకర్త మాజీ అధ్యక్షుడు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నయా ట్యాబ్లెట్: బ్యాక్టీరియా ఖతం.. నీరు ఫిల్టర్
బయటికి వెళ్లినప్పుడు మంచి నీళ్లు కావాలంటే.. వెంటనే ఓ బాటిల్ కొంటారు. మరి బాటిల్స్ అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్తే? కంటి ముందు నీటి ప్రవాహాలున్నా... తాగడానికి అనువుగా లేకపోతే? మనిషికి ఎంత కష్టం కదా! ఇక ఆ బాధ అక్కర్లేదు. మీరు అడవుల్లో ఉన్నా, గుట్టలపై ట్రెక్కింగ్ చేస్తున్నా... ముందు నీటి కాలువ ఉంటే చాలు. ఆ నీటిని ఫిల్టర్‌చేసే ట్యాబ్లెట్ వచ్చేసింది. అదే హైడ్రోజెల్. కలుషితమైన నీటిని గంటలోపే స్వచ్ఛమైన తాగునీరుగా మార్చేస్తుంది. టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన కెమికల్ ఇంజనీర్లు దీనిని కనిపెట్టారు. అక్కడి విద్యార్థి యోహాంగ్ గుయో సూర్యకాంతితో నీటిని శుద్ధి చేసే ప్రయోగం చేస్తుండగా అనుకోకుండా హైడ్రోజెల్ ఆలోచన వచ్చింది. నీటి కొరత తీరొచ్చు... ప్రపంచ జనాభాలో మూడోవంతు ప్రజానీకానికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. నీటిని తాగాలంటే మరగబెట్టడమో, శుద్ధీకరణో చేయాల్సిందే. ఆ రెండు పద్ధతులకు విద్యుత్ అవసరం. అంతేకాదు... అధిక సమయం, శ్రమ కూడా. కానీ ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుకు తగిన వనరులు లేవు. కానీ హైడ్రోజెల్ ఒక్క ట్యాబ్లెట్ ఉంటే... ఇవేవీ అక్కర్లేవు. హైడ్రోజెల్లో ఉన్న హైడ్రోజెన్ పెరాక్సై డ్... నీటిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఇందుకు విద్యుత్ అవసరం లేదు. ఇందులో ఎలాంటి హానికారకాలు లేవు. సూర్యకాంతితో నీరు ఆవిరయి అందులోని కాలుష్యాన్ని వేరు చేసినట్టుగానే... హైడ్రోజెల్ తనంతట తానే నీటిని శుద్ధి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాగునీటి కొరతను తీర్చడంలో హైడ్రోజెల్ గొప్పగా సహాయపడుతుందని టెక్సాస్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుహియాయు తెలిపారు. -
ప్రకృతే పరమౌషధం!
ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. జంతువులు, మొక్కల నుంచి.. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. మధుమేహానికి మందు ఇచ్చి.. గిలా మాన్స్టర్.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్–4 అనే హార్మోన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుందని నార్త్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. థర్మస్ అక్వాటికస్ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. హా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఫంగస్‌పై పోరు నుంచి.. కేన్సర్ చికిత్సకు.. పాక్లిటాక్సెల్.. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్‌లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప మాగేనిన్.. ఆఫ్రికన్ క్లాడ్ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్’ ప్రొటీన్‌ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్‌ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మరెన్నో మందులు.. ►జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్‌ను కృత్రిమంగా తయారుచేశారు. ►మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్‌ను కృత్రిమంగా తయారు చేశారు. ►రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ను పలు రకాల ఫంగస్ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల విలువ! మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. -
గంగా జలాల్లో హానికర బ్యాక్టీరియా
సాక్షి, న్యూఢిల్లీ: జీవితంలో చేసుకున్న పాపాలు పోవాలంటే గంగా స్నానం చేయాల్సిందేనని పూర్వీకుల నుంచి నానుడిలో ఉన్న మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గంగా స్నానం చేయడం వల్ల మనం చేసుకున్న పాపాలు పోవడం సరికదా, ఇప్పటివరకు లేని కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చి నదిలో కలుస్తున్న రసాయనాలకు తోడు, పుణ్యం కోసం స్నానాలు చేసే యాత్రికులు పడేసే చెత్తతో ఇప్పటికే కలుషితమైంది. ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు గంగా ప్రక్షాళనకు ఖర్చు చేస్తున్నప్పటికీ, పరిస్థితిలో మార్పు ఏమాత్రం కనిపించ ట్లేదు. గతేడాది కరోనా కారణంగా లాక్డౌన్ సమయంలో కాలుష్యం జాడలేని గంగానదిలో మళ్ల పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన కాలుష్యం పరిస్థితిని దయనీయంగా మార్చేసింది. కాలుష్య కాసారంగా మారిన గంగానదిలో స్నానం చేయడం హానికరమని తాజాగా ఐఐటీఆర్ చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో గంగానదిలో పెద్ద ఎత్తున శవాలు కొట్టుకురావడం, నదీ పరివాహక ప్రాంతాల్లో శవాలు కనిపించడంతో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ళు, ఐఐటిఆర్ లక్నో సంస్థలకు గంగా నీటిపై దర్యాప్తు చేసే బాధ్యతను నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అప్పగించింది. మొదటి దశలో మే 24 నుంచి జూన్ 6 వరకు నమూనాలను తీసుకున్నారు. రెండో దశ జూన్ 10 నుంచి జూన్ 21 మధ్య పూర్తయింది. ఆ తరువాత పూర్తిస్థాయిగా పరిశీలించిన అనంతరం తుది నివేదికను సిద్ధం చేశారు. గంగా స్నానం హానికరం..! ఈ పరిశోధనలో, గంగానది నీటిలో బీఓడీ అనగా జీవరసాయన ఆక్సిజన్ డిమాండ్ ప్రమాణం కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఒక లీటరు శుభ్రమైన నది నీటిలో బీఓడీ స్థాయి 3 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలి. కానీ గంగానది ప్రవాహంలోని చాలా చోట్ల లీటరు నీటిలో బీఓడీ 20–25 మి.గ్రా. వరకు ఉందని పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం దీనివల్ల జలచరాలకు ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్ ప్రమా ణాల కంటే ఎక్కువగా ఉన్ననీటిలో స్నానం చేయ డం హానికరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హానికరమైన బ్యాక్టీరియా గుర్తింపు ఈ అధ్యయనంలో ఉత్తరప్రదేశ్ నుంచి బిహార్ వరకు గంగానది నీటిలో కరోనా లేదని తేలింది. ఈ రెండు రాష్ట్రాల్లోని 13 నగరాల నుంచి తీసుకున్న మొత్తం 67 నమూనాల ఆర్టీ–పీసీఆర్ రిపోర్ట్లు నెగెటివ్‌గా వచ్చాయి. గంగానది నీటిలో మాత్రం హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ప్రతి నమూనా లో ఈ–కోలి బ్యాక్టీరియాను కనుగొన్నారు. అంతేగాక నీటిలో ఆక్సిజన్ కొరత ఉందని నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గంగానది నుంచి 12 ప్రదేశాలలో, యమునా నది నుంచి ఒక ప్రదేశంలో నమూనాలను తీసుకు న్నట్లు లక్నో ఐఐటీఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్కే బారిక్ తెలిపారు. ఐఐటీఆర్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎ.బి. పంత్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ప్రీతి చతుర్వేది నాయకత్వంలోని బృందం గంగా నీటిపై అధ్యయనం చేసింది. కరోనా ఆనవాళ్ల కోసం చేసిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన తర్వాత కూడా గంగా నీటిలో కాలుష్య జాడను కనుక్కొన్నేందుకు వివిధ పారామితులను విశ్లేషించారు. అందులో కొన్ని భౌతిక రసాయన పారామితులు నిర్ధారిత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. భౌతిక రసాయన పారామితులలో పీహెచ్, కలర్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ (డీఓ), బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), నైట్రేట్, క్లోరైడ్, అమ్మోనియం నైట్రోజన్, భాస్వరంల పారామితులను ప్రమాణాలకు తగ్గట్లుగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించారు. ప్రతి నమూనాలోనూ ఈ–కోలి బ్యాక్టీరియా ఉనికి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తీసుకున్న 67 నమూనాలు అన్నింటింలోనూ ఈ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ బాక్టీరియా సాధారంగాణ మానవులు,జంతువుల కడుపులో ఎల్లప్పుడూ ఉంటుంది. దాని వేరియంట్స్ చాలావరకు హాని కలిగించవు. కానీ కొన్నిసార్లు కడుపులో మెలిపెట్టినట్లు కావడం, విరేచనాలు వంటి లక్షణాలకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా కొన్నిసార్లు ఈ–కోలి బ్యాక్టీరియా కారణంగా కొందరిలో మూత్రపిండాలు పనిచేయడం మానేసి రోగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. గంగా నీటిలో ‘ఫీకల్ స్ట్రెప్టోకోకి’ ఆనవాళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావో, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఘాజిపూర్, కాన్పూర్ నగరాల్లో గంగానది నుంచి తీసుకున్న నమూనాలలో ఫీకల్ స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియాను కనుగొన్నారు. అదే సమయంలో బిహార్‌లోని సారన్లో ఒకటి, భోజ్‌పూర్‌లో తీసుకున్న మూడు నమూనా ల్లోనూ ప్రమాదకరమైన రకం బ్యాక్టీరియా స్ట్రెప్టోకోకి ఉనికిని గుర్తించారు. ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ రావడానికి ఇది ప్రధాన కారణమని పరిశోధకులు తెలిపారు. ఇదిమాత్రమేగాక బ్యాక్టీరియా కడుపు, ప్రేగులకు సంబంధించిన అనేక ఇతర రుగ్మతలకు కూడా కారణమవుతుంది. -
త్వరలో ఎలక్ట్రానిక్ ద్రావణాలు
లండన్: వ్యాధి నిర్ధారణకు త్వరలోనే ఓ వినూత్నమైన విధానం అందుబాటులోకి రానుంది. బ్యాక్టీరియా రూపంలో ఉండే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సెన్సర్లు కలిగిన ద్రావణాన్ని తాగడం ద్వారా అనారోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్ సెన్సర్లు పరిమాణంలో ఎర్ర రక్త కణాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఫ్రాన్స్‌లోని ఈపీఎఫ్‌ఎల్‌కు చెందిన పరిశోధకులు దీన్ని తయారు చేశారు ఇది అందుబాటులోకి వస్తే కేన్సర్‌తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణా పద్ధతులు సులువవుతాయని పేర్కొన్నారు. -
ఆ బద్ధకాన్ని వదిలించే బ్యాక్టీరియా మందు!
ఉదయం నిద్ర లేవగానే కడుపు కదలకపోతే.. మనలో చాలామందికి అదో వెలితి. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితముండదు. ఇలాంటి అన్ని రకాల మలబద్ధకం సమస్యలకు తాము ఓ వినూత్నమైన పరిష్కారాన్ని కనుక్కున్నామని అంటున్నారు మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు. ట్రైప్టామిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసేలా ఓ బ్యాక్టీరియాలో జన్యుమార్పులు చేయడం ఈ కొత్త పద్ధతిలోని విశేషమని పూర్ణ కశ్యప్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మలబద్ధకంతో ఇబ్బంది పడే వారికి సాధారణంగా డాక్టర్లు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, లేదంటే ప్రోబయాటిక్లు తీసుకోవాలని సూచిస్తూంటారని, అయితే మన పేవుల్లో ఉండే సూక్ష్మజీవి ప్రపంచం ఎవరికి వారిదే ప్రత్యేకమైంది కాబట్టి చాలా సందర్భాల్లో డాక్టర్ల సూచనలు పనిచేయవని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము ట్రైప్టామిన్ను పెద్దఎత్తున ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియాపై పరిశోధనలు మొదలుపెట్టామని ఈ రసాయనం మన పేవుల్లో ఉత్పత్తి అయ్యే సెరెటోనిన్‌ను పోలి ఉంటుందని చెప్పారు. ఎలుకల్లో ఈ బ్యాక్టీరియాను జొప్పించినప్పుడు వాటి పేవుల్లో ద్రవాలు ఎక్కువగా స్రవించాయని, ఫలితంగా ఆహారం తొందరగా కదలడంతోపాటు ఆ సమస్య కూడా తీరిందని ఆయన వివరించారు. పైగా తాము ఎంచుకున్న బ్యాక్టీరియా అక్కడికక్కడే నశించిపోతుంది కాబట్టి దుష్ప్రభావాలు ఏమీ ఉండవని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో మూడేళ్లలో ఈ కొత్త బ్యాక్టీరియా వైద్యం అందుబాటులోకి రావచ్చునని అంచనా. -
బ్యాక్టీరియా... మన జన్యువులను నియంత్రిస్తాయా?
వినడానికే ఆశ్చర్యంగా అనిపించే విషయమిది. శరీరంలో.. ముఖ్యంగా కడుపు, పేవుల్లో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా మన జన్యువులను నియంత్రించడం ద్వారా మన ఆరోగ్యానికి కారణమవుతున్నాయని మూడు దేశాల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా చేసిన పరిశోధన ద్వారా తెలిసింది. నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి. మనం పండ్లు, కాయగూరలు తిన్నప్పుడు.. వాటిని బ్యాక్టీరియా జీర్ణం చేసుకుంటాయి. ఈ క్రమంలో అవి కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి బ్యాక్టీరియా నుంచి బయటపడి మన కణాల్లోకి ప్రవేశించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇలా అవి మన కణాల్లోకి చేరినప్పుడు అక్కడ ఉండే జన్యువుల ప్రవర్తనపై ప్రభావం చూపుతాయన్నమాట. బ్యాక్టీరియా విడుదల చేసే రసాయనాలు షార్ట్ చెయిన్ ఫ్యాటీయాసిడ్ల రూపంలో ఉంటాయని, హెచ్‌డీఏసీ అనే ప్రొటీన్ ఉత్పత్తిని అడ్డుకోవడం ద్వారా ఇవి జన్యువుల్లో రసాయన మార్పులకు కారణమవుతున్నాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ ప్యాట్రిక్ వర్గా వెయిజ్ అంటున్నారు. కడుపు, పేవుల్లోని బ్యాక్టీరియా తొలగించిన ఎలుకల్లో హెచ్‌డీఏసీ ప్రొటీన్ ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితి పేవుల్లో కేన్సర్‌కు ఒక కారణమని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేశాయని ప్యాట్రిక్ తెలిపారు. కేన్సర్ నివారణతోపాటు మంచి ఆరోగ్యానికి శరీరంలోని కొన్ని బ్యాక్టీరియా కీలకమని తమ పరిశోధన చెబుతోందని ఆయన వివరించారు. -
ఈ బ్యాటరీ స్పెషల్ గురూ..
రోజూ వేసుకునే దుస్తులతోనే మన ఫోన్లు, ఇతర సూక్ష్మ ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది. అబ్బో! సూపర్! అంటున్నారా? నిజంగానే ఆ రోజులు దగ్గరపడ్డాయి. బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త సోకేయిన్ ఛోయి అచ్చం ఇలాంటి వస్త్రాలనే అభివృద్ధి చేశారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ వస్త్రంపై నల్లటి డిజైన్ లాంటివి కనిపిస్తున్నాయి కదా... అవన్నీ ప్రత్యేకమైన మైక్రోబియల్ ఫ్యుయల్‌సెల్స్. మరోలా చెప్పాలంటే బ్యాటరీలు. శరీరంపై ఉండే బ్యాక్టీరియా సూడోమోనాస్ ఎరుగినోసాను వాడుకుంటూ ఈ బ్యాటరీ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మైక్రోబియల్ ఫ్యుయల్సెల్లను సులభంగా తయారు చేయడంతోపాటు వాటితోనే నూలు పోగుల్లాంటివి సృష్టించడం ద్వారా ఛోయి విద్యుత్తు ఉత్పత్తి చేసే వస్త్రాలను తయారు చేయగలిగారు. ఒక చదరపు సెంటీమీటర్ విస్తీర్ణం ఉన్న ఫ్యుయల్ సెల్‌తో గరిష్టంగా 6.4 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని ఛోయి అంటున్నారు. ఈ బ్యాటరీలతో కూడిన దుస్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఛోయి గతంలో కాగితాలపై ఇలాంటి బ్యాటరీలను తయారుచేశారు. అంతేకాకుండా మడిచేసే కాగితం, పలుచటి అగ్గిపెట్టె, నక్షత్రాల ఆకారాల్లో కూడా ఈ ఫ్యుయల్సెల్స్ను తయారు చేసినా... వస్త్రంలోకి అమరిపోయేలా చేయడం మాత్రం ఇదే తొలిసారి. -
డెర్మటాలజీ కౌన్సెలింగ్
నా మోచేతులు మామూలుగా అయ్యేదెలా? నా వయసు 20. నా బాహుమూలలు చాలా నల్లగా ఉంటాయి. ఒక్కోసారి భరించలేనంత దురదగా కూడా ఉంటుంది. తగిన సలహా ఇవ్వగలరు. - పి. విమల, కడప బాహుమూలలు నల్లగా ఉండటానికి అనేక కారణాలుంటాయి. బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాటిలో ముఖ్యకారణాలు. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల దురదగా కూడా ఉంటుంది. సాధారణంగా అధిక బరువు ఉండటం, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా బాహుమూలల్లో ఉండే చర్మం నల్లగా లేదా ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. అంతేకాదు, అలర్జీ, కొన్నిరకాల బాడీ స్ప్రేలు, డియోడరెంట్ స్ప్రేలు, హెయిర్ రిమూవల్ క్రీములు ఉపయోగించడం వల్ల కూడా బాహుమూలల్లో ఉండే చర్మం నల్లబడిపోతుంది. అందువల్ల అటువంటి కొత్తరకం హెయిర్ రిమూవల్ క్రీములు, స్ప్రేలు ఉపయోగించేటప్పుడు ముందుగా ముంజేతులు లేదా మణికట్టు మీద కొద్దిగా రాసుకుని, చర్మం కందటం, ఎర్రబడటం లేదా దురదగా ఉండటం వంటి పరిణామాలు ఉంటే వెంటనే వాటి వాడకం మానెయ్యాలి. లేజర్ హెయిర్ రిడక్షన్ మెథడ్స్ అనుసరించడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, అక్కడ చర్మం పొడిగా ఉండేలా చూసుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో తెలుసుకునేందుకు మంచి డెర్మటాలజిస్టును కలిసి వారి సలహా మేరకు యాంటీఫంగల్ క్రీములు, పౌడర్లు వాడండి. అదేవిధంగా కోజిక్ యాసిడ్ వంటివి ఉండే డీపిగ్మెంటింగ్ క్రీమును అప్లై చేసి కాసేపటికి శుభ్రంగా కడిగేయటం వల్ల, అల్ఫాహైడ్రాక్సీ పీల్స్ వాడకం వల్ల తప్పకుండా మంచి ఫలితముంటుంది. దీనితోబాటు అధిక బరువు ఉంటే తగ్గేందుకు ప్రయత్నించడం అవసరం. నా వయసు 38. నా మోచేతులు బాగా గరుకుగా, నల్లగా మారి, చూడటానికి అసహ్యంగా కనపడుతున్నాయి. తిరిగి మామూలుగా తయారు కావాలంటే ఏం చేయాలో దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - పి.పద్మజ, మచిలీపట్నం మోచేతులు నల్లగా, గరుకుగా మారడానికి కారణం చాలామంది మోచేతులను నిర్లక్ష్యం చేయడమే. అంతేకాదు, ఎక్కడ బడితే అక్కడ మోచేతులను ఎక్కువసేపు బలంగా ఆనించి ఉంచడం, మోపు చేసి లేవటం కూడా మరోకారణం. గ్లైకోలిక్ యాసిడ్, సాలిస్లిక్ యాసిడ్ ఉండే క్రీములను రాత్రి పడుకునే ముందు మోచేతులకు అప్లై చేసి, సున్నితంగా మర్దనా చేసి తిరిగి నిద్ర లేవగానే గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడిగెయ్యాలి. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేస్తే మోచేతుల మీది చర్మం తిరిగి మామూలు రంగులోకి మారుతుంది. అదేవిధంగా విటమిన్ ఎ పుష్కలంగా కలిగి ఉండే ట్రెటినోయిన్ వంటి క్రీములను వాడితే చర్మం గరుకుదనం తగ్గి మృదువుగా మారుతుంది. సన్‌స్క్రీన్ క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
బాబుకు పదే పదే విరేచనాలు...!
మా బాబుకు పదమూడు నెలలు. రెండు నెలల క్రితం వాడికి విపరీతంగా విరేచనాలు అయ్యాయి. దాంతో హాస్పిటల్లో చేర్చి చికిత్స చేయించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా మాటిమాటికీ తిరగబెడుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గడం, వెంటనే మళ్లీ పెరగడం జరుగుతోంది. ఇది మినహా వాడికి ఇతరత్రా ఏ సమస్యలూ లేవు. అంటే... ఆడుకోవడం, ఆహారం తీసుకోవడం, పెరుగుదల ఇవన్నీ సక్రమంగానే ఉన్నాయి. మా వాడికి ఉన్న సమస్య ఏమిటి? వాడి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పండి. - శైలజ, చెన్నై మీరు వివరించిన లక్షణాలను బట్టి, మీ అబ్బాయికి దీర్ఘకాలిక (క్రానిక్) డయేరియా ఉన్నట్లు చెప్పవచ్చు. అంటే... ఏ సందర్భంలోనైనా విరేచనాలు రెండు వారాల కంటే ఎక్కువగా కొనసాగితే వాటిని దీర్ఘకాలిక డయేరియాగా పరిగణించవచ్చు. సాధారణంగా మన దేశంలోని పరిసరాలను పరిగణనలోకి తీసుకుంటే దీర్ఘకాలిక డయేరియాకు ప్రధానంగా ఇన్ఫెక్షన్స్ను కారణంగా చెప్పవచ్చు. అదే ఆర్థికంగా బలమైన దేశాలను తీసుకంటే అక్కడ వివిధ వయసుల వారిలో వచ్చే క్రానిక్ డయేరియాలను బట్టి అనేక కారణాలను విశ్లేషించాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్లకు గల కారణాలను పరిశీలిస్తే వైరల్, బ్యాక్టీరియల్, పోస్ట్ ఇన్ఫెక్షియస్, ట్రాపికల్ స్ప్రూ, ఎంజైమ్‌లలో మార్పులు, ఆహారం అరుగుదలలో మార్పులు... అంటే ఇందులోనూ మరీ ముఖ్యంగా చక్కెర పదార్థాలు, ప్రోటీన్ల అరుగుదలలో మార్పులు కూడా కారణం కావచ్చు. వీటితోపాటు ఇమ్యునలాజికల్, అలర్జిక్ వంటి అంశాలు కూడా విరేచనాలకు కారణమవుతాయి. అలాగే పేగుల స్ట్రక్చరల్ లోపాలు, మొటిలిటీలో మార్పులు కారణం కావచ్చు. వీటికి తోడు ఎండోక్రైన్ కారణాలనూ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. పిల్లల్లో వాళ్ల బరువు / ఎదుగుదల నార్మల్‌గా ఉంటే చాలావరకు తీవ్రమైన (సీరియస్) అంశాలు అంటే... ఐబీడీ, ఎంజైముల్లో లోపాలు, అనటామికల్ లోపాలు, ఇమ్యునలాజికల్ సమస్యల వంటివి అందుకు కారణం అయ్యే అవకాశం పెద్దగా లేదు. పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు అవుతున్న సందర్భంలో కంప్లీట్ స్టూల్ ఎగ్జామినేషన్ (క్రానిక్ డయేరియా వర్కప్), కొన్ని స్పెషల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎంజైమ్ పరీక్షలు, అవసరాన్ని బట్టి ఇంటస్టైనల్ బయాప్సీ, మైక్రో బయలాజికల్ పరీక్షలు, ఇంటస్టైనల్ మార్ఫాలజీ పరీక్షలు, ఇమ్యునలాజికల్ పరీక్షలు చేయించడం వల్ల నిర్దిష్టంగా కారణాన్ని తెలుసునే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబుకు ‘పోస్ట్ ఎంటరైటిస్’ అనే కండిషన్ ఉన్నట్లుగా చెప్పవచ్చు. అంటే... ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక లోపల జరిగిన నష్టం (డ్యామేజీ) వల్ల కొన్ని ఆహారాలకు అతడి కడుపు సెన్సిటివిటీని వృద్ధి చేసుకున్నట్లుగా విశ్లేషించవచ్చు. ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ వంటి వాటికి అతడి కడుపు సెన్సిటివ్‌గా మారడం లేదా ఇంకోరకం బ్యాక్టీరియా వల్ల మరోసారి ఇన్ఫెక్షన్ రావడం జరిగి ఉండవచ్చు. అలాగే ఈ వయసు పిల్లల్లో కొన్నిసార్లు రోజుకు 3 నుంచి 6 సార్లు విరేచనాలు కావచ్చు. దీన్ని ‘టాడ్లర్స్ డయేరియా’ అంటారు. మీ బాబు తీసుకున్న ఆహారం అతడి ఆహారకోశంలో ఉండాల్సిన టైమ్ కంటే తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్ గట్ ట్రాన్జిట్ టైమ్) కూడా ఒక కారణం కావచ్చు. పై కండిషన్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. తీసుకునే ఆహారంలో కొద్దిగా ఫైబర్ తగ్గించడం, చక్కెర పదార్థాలను పూర్తిగా మానేయడం ద్వారా గట్‌ఫ్లోరా పూర్తిగా రీప్లేస్ చేయడం వల్ల ఈ కండిషన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్-ఏ ఇవ్వడం, ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం వల్ల పై కండిషన్లను పూర్తిగా నయం చేయవచ్చు. ఇక ఎలాంటి సందర్భాల్లోనైనా డయేరియా లక్షణాలు తగ్గకుండా ఉంటే ఇతర కారణాలను అన్వేషించి, వాటికి తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీ బాబు విషయంలో పెరుగుదల, ఆడుకోవడం అంతా నార్మల్‌గా ఉందంటున్నారు కాబట్టి పైన పేర్కొన్న జాగ్రత్తలను తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్