Bailey
-
నిరాశపరిచిన మ్యాక్స్ వెల్: బెయిలీ
బెంగళూరు: విధ్వంసకర ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ జార్జి బెయిలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్ అతడు నిరాశపరిచాడని పేర్కొన్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన మ్యాక్స్ వెల్ కేవలం 62 పరుగులే చేశాడు. వన్డే వరల్డ్ కప్ లో రాణించిన అతడు ఐపీఎల్ లో చతికిలపడడాన్ని బెయిలీ జీర్ణించుకోలేకపోతున్నాడు. మ్యాక్స్ వెల్ ఆటతీరు అతడికే అసంతృప్తి కలింగించేలా ఉందని వెల్లడించాడు. తనదైన శైలిలో అతడు ఆడలేకపోతున్నాడని తెలిపాడు. ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ ఆడి వచ్చిన మ్యాక్స్ వెల్ భారత్ లో పరిస్థితులకు అలవాటు పడడానికి సమయం పడుతుందని అన్నాడు. పంజాబ్ కు ప్లేఆప్ అవకాశాలు సజీవంగా ఉన్నాయని తెలిపాడు. తాము పుంజుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ ఏడింట్లో ఓడింది. కేవలం 2 విజయాలు మాత్రమే దక్కించుకుంది. -
బెయిలీపై ఓ మ్యాచ్ నిషేధం?
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా కెప్టెన్ బెయిలీ పై ఒక్క మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఆదివారం భారత్‌తో జరిగిన మ్మాచ్‌లో ఆసీస్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. దీంతో బెయిలీ సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23 న ఇంగ్లాండ్ తో జరగనున్న మ్యాచ్‌లో బెయిలీ ఆడేది సందేహంగా మారింది. -
100మీ. చాంపియున్ బెయిలీ
గ్లాస్గో: వంద మీటర్ల పరుగులో తవుకు తిరుగులేదని జమైకా వురోసారి నిరూపించింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 100మీ. పరుగులో కెవుర్ బెయిలీ కొలె(జమైకా) చాంపియున్‌గా నిలిచాడు. బెయిలీ తన పరుగును 10 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన అడమ్ జెమిలి 10.10 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. జమైకాకు చెందిన వురో అథ్లెట్ నికెల్ అష్మెది 10.12 సెకన్లతో 3 స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇక ఈ రేసుకు దూరంగా ఉన్న జమైకా స్టార్ ఉస్సేన్ బోల్ట్ ఆగస్ట్ 1న 4x 100 మీటర్ల రిలేలో బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియూ జోరు: పతకాల పట్టికలో ఆస్ట్రేలియూ హవా కొనసాగుతోంది. పలు విభాగాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ పతకాలు కొల్లగొడుతోంది. ఆస్ట్రేలియూ పతకాలు వందకు చేరువయ్యూయి.