100మీ. చాంపియున్ బెయిలీ
గ్లాస్గో: వంద మీటర్ల పరుగులో తవుకు తిరుగులేదని జమైకా వురోసారి నిరూపించింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 100మీ. పరుగులో కెవుర్ బెయిలీ కొలె(జమైకా) చాంపియున్‌గా నిలిచాడు.
బెయిలీ తన పరుగును 10 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన అడమ్ జెమిలి 10.10 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. జమైకాకు చెందిన వురో అథ్లెట్ నికెల్ అష్మెది 10.12 సెకన్లతో 3 స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇక ఈ రేసుకు దూరంగా ఉన్న జమైకా స్టార్ ఉస్సేన్ బోల్ట్ ఆగస్ట్ 1న 4x 100 మీటర్ల రిలేలో బరిలోకి దిగనున్నాడు.
ఆస్ట్రేలియూ జోరు: పతకాల పట్టికలో ఆస్ట్రేలియూ హవా కొనసాగుతోంది. పలు విభాగాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ పతకాలు కొల్లగొడుతోంది. ఆస్ట్రేలియూ పతకాలు వందకు చేరువయ్యూయి.