bailey bridge
-
Major Sita Ashok Shelke: వయనాడ్ వారియర్
వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయవిధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండెధైర్యంతో ΄ాటు మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే... సామాన్య ప్రజల నుంచి రిటైర్డ్ ఆర్మీ అధికారుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు...వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన చూరల్మాల గ్రామంలో కొత్తగా నిర్మించిన బెయిలీ బ్రిడ్జి రెయిలింగ్‌పై సగర్వంగా నిలుచున్న మేజర్ సీతా షెల్కే ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.లింగ వివక్షతను సవాలు చేసి సగర్వంగా వెలుగుతున్న ఫొటో అది.‘ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లతో కలిసి మేజర్ సీత షెల్కే పదహారు గంటలోనే 24 టన్నుల సామర్థ్యం ఉన్న బెయిలీ వంతెనను నిర్మించారు’ అని అభినందిస్తూ ‘ఎక్స్’లో ΄ోస్ట్ పెట్టారు లెప్టినెంట్ కల్నల్ జేఎస్ సోది(రిటైర్డ్). తన కామెంట్‌తో ΄ాటు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు.‘ఒక్క చిత్రం చాలు వంద మాటలు ఎందుకు!’ అన్నట్లు ఈ ఫొటోలలో ఒక్కటి చూసినా చాలు సీత బృందం కష్టం, శక్తిసామర్థ్యాలు తెలుసుకోవడానికి.ఒకవైపు నేల కూలిన చెట్లు, మరోవైపు అడుగు వేయనివ్వని శి«థిలాలు, వేగంగా ప్రవహిస్తున్న నది, పై నుంచి వర్షం, పరిమిత స్థలం... ఒక్క అనుకూలత కూడా లేని అత్యంత ప్రతికూల పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిట్టూర్చకుండా బ్రిడ్జీ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చేసింది ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన సీత.సహాయచర్యలు చేపట్టడంలో ఈ బ్రిడ్జి కీలకం కానుంది.‘ఇది సైన్యం విజయం మాత్రమే కాదు. సహాయకార్యక్రమాల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు, స్థానిక అధికారులు... ఎంతోమంది విజయం’ వినమ్రంగా అంటుంది సీత.కొండచరియలు విరిగిపడిన చోట పనిచేయడం పెద్ద సవాలు. అక్కడ పురుషులతో సమానంగా పనిచేసింది సీత.మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన సీతకు ‘సాహసం’ చిన్నప్పటి నుంచి సన్నిహిత మిత్రురాలు. ఆ ధైర్యమే ఆమెను సైన్యంలోకి తీసుకువచ్చింది.మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్(ఎంఈజీ) అనేది వంతెనలు నిర్మించడం, మందు΄ాతరలను నిర్వీర్యం చేయడం...ఇలాంటి పనులెన్నో చేస్తుంటుంది. ఈ ఇంజినీరింగ్ యూనిట్ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే ప్రమాదాల అంచున పనిచేయడం. ఏమాత్రం అప్రమత్తంగా లేక΄ోయినా ్ర΄ాణాలు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే. ‘మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్’లోని డెబ్బై మంది సభ్యులలో ఏకైక మహిళ సీత. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ అసౌకర్యం అనుకోలేదు. అధైర్య పడి΄ోలేదు.‘మహిళ కదా... ఇది రిస్క్ జాబ్ కదా’ అని ఎంతోమంది సీతతో అనేవాళ్లు.‘రిస్క్ లేనిది ఎక్కడా!’ అనేది ఆమె నోటి నుంచి వేగంగా వచ్చే మాట.‘రిస్క్ తీసుకోక ΄ోవడం కూడా పెద్ద రిస్కే’ అనుకునే సీతా అశోక్ షెల్కే ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో ధైర్యంగా ΄ాల్గొంది. నిద్ర, తిండి, నీళ్లు.... ఇలాంటివేమీ పట్టించుకోకుండా పనిచేసింది. ‘మగవాళ్లు ఎంత కష్టమైనా పనైనా చేస్తారు. మహిళలకు కష్టం’ అనే మాట ఆమె ముందు నిలిచేది కాదు.వాయనాడ్‌లో సహాయ, నిర్మాణ కార్యక్రమాలలో తన బృందంతో కలిసి నాన్–స్టాప్‌గా పనిచేస్తున్న సీత మోములో అలసట కనిపించదు....రాకెట్ వేగంతో పనిచేయాలనే తపన తప్ప. ఆ తపనే ఆమెను అందరూ ప్రశంసించేలా చేస్తోంది. -
వయనాడ్ విలయం: మేజర్ సీతాషెల్కేకు హ్యాట్సాఫ్! (ఫొటోలు)
-
చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జి
డెహ్రాడూన్: ప్రొక్లెయినర్‌ను తీసుకుని ఓ భారీ వాహనం వంతెనపైనుంచి వెళ్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. వాహనంతోపాటు అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ 40 అడుగుల లోతులో పడిపోయారు. గాయాలపాలైన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలోని మున్సియారి ప్రాంతంలో సోమవారం జరిగింది. రివులేట్ నదిపై 2009లో ఈ వంతెన నిర్మించారు. ఇది భారత్-చైనా సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. (చదవండి: పతంజలి కరోనా మందుకు బ్రేక్!) వంతెన సామర్థ్యం 18 టన్నులు ఉండగా.. ప్రొక్లెయినర్, లారీతో కలిపి మొత్తం బరువు 26 టన్నులకు చేరిందని పోలీసులు తెలిపారు. వంతెన బలహీనంగా ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నప్పటికీ లారీని అలానే పోనిచ్చారని వెల్లడించారు. వాహన డ్రైవరుపై కేసు నమోదా చేశామని అన్నారు. ఇక డ్రైవర్ పరిస్థితి నిలడకగా ఉండగా, క్లీనర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసత్రి వర్గాలు తెలిపాయి. వంతెన కూలిపోవడంతో దాదాపు 15 ఊళ్లకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొత్త వంతెన నిర్మించాలంటే రెండు వారాలు పడుతుందని జిల్లా అధికారులు తెలిపారు. (చదవండి: మార్గమధ్యలో కరోనా.. అంతా పరుగో పరుగు!) -
72 గంటల్లోనే గల్వాన్ నదిపై బ్రిడ్జి నిర్మాణం
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్న భారత్.. ఒకవేళ చైనా గనుక తోక జాడిస్తే సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమవుతోంది. తాజా ఘర్షణలకు మూల కారణంగా చైనా ఆరోపిస్తున్న రోడ్డు, వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా పదాతిదళాలు, సైనిక, యుద్ధ వాహనాల రాకపోకలకై గల్వాన్ నదిపై తలపెట్టిన పోర్టబుల్ బ్రిడ్జి(బెయిలీ బ్రిడ్జి- ) నిర్మాణాన్ని భారత ఆర్మీ ఇంజనీర్లు గురువారం మధ్యాహ్నం పూర్తిచేసినట్లు సమాచారం. సోమవారం రాత్రి జిత్తులమారి డ్రాగన్ దొంగ దెబ్బ కొడుతుంటే ఓ వైపు వారికి సమాధానం చెబుతూనే.. మరోవైపు భారత ఆర్మీ అధికారులు వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చైనా కుయుక్తులకు 20 మంది సైనికులు అమరులైనప్పటికీ పోరాట పటిమతో ముందుకు సాగుతూ.. మంగళవారం ఉదయం నుంచే నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఉద్రిక్తతల నడుమ వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగంలో 72 గంటల్లో 60 మీటర్ల పొడవైన బెయిలి బ్రిడ్జిని నిర్మించారు. భారత ఆర్మీలోని కరూ- బేస్ట్ డివిజన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్మీ ఇంజనీర్లు జాప్యానికి తావివ్వకుండా.. అత్యంత ప్రతికూల పరిస్థితులు, గడ్డకట్టే చలిలో సైనికుల పహారా నడుమ చకచకా ఈ పనిని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. (బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు!) త్వరలోనే రోడ్డు నిర్మాణం కూడా.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన పెట్రోల్ పాయింట్ 14 వద్ద జూన్ 16న భారత ఆర్మీ డివిజనల్ కమాండర్ మేజర్ జనరల్ అభిజిత్ బాపట్ చైనా కమాండర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఓ వైపు సామరస్యపూర్వకంగా చర్చలు జరుగుతున్నా.. చైనా కుయుక్తులను దృష్టిలో పెట్టుకుని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ చేపట్టిన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని సైనికులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. అదే విధంగా గల్వాన్, ష్కోక్ నదుల సంగమ ప్రదేశంలోని ఈస్ట్‌బ్యాంక్‌లో చేపట్టిన డీఎస్డీబీఓ రోడ్డు నిర్మాణాన్ని కూడా త్వరలోనే పూర్తిచేసేందుకు భారత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా గాల్వన్ నదిపై బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే గాల్వన్ లోయతో పాటు నార్త్ సెక్టార్లకు సైన్యం సులభంగా రాకపోకలు సాగించవచ్చు. (జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఏంటంటే..) ఇక నిర్మాణాల నేపథ్యంలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న చైనా.. గల్వాన్ లోయపై పట్టు సాధించేందుకు వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. అంతేగాక భారత భూభాగంలోని గాల్వన్ నదిపై డ్యామ్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎర్త్- ఇమేజింగ్ కంపెనీ ప్లానెట్ ల్యాబ్స్ ఇటీవల విడుదల చేసింది. కాగా తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ ప్రాంతంలోని భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద అక్రమంగా వేసిన గుడారాన్ని తొలగించమని భారత సైనికులు సూచించగా.. చైనా ఆర్మీ దాడికి తెగబడిన విషయం తెలిసిందే. రాళ్లు, ఇనుప రాడ్లను ఉపయోగించి దొంగదెబ్బ కొట్టారు. ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులు కాగా.. చైనా ఇంతవరకు తమ సైనిక మరణాల సంఖ్యను అధికారికంగా వెల్లడించడం లేదు. అంతేగాక గాల్వన్ నదిపై నిర్మిస్తున్న కట్టడంపై మౌనం వహిస్తోంది. -
భారీ ప్రవాహంతో కుప్పకూలిన బ్రిడ్జి
-
భారీ ప్రవాహంతో కుప్పకూలిన బ్రిడ్జి
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆ ప్రవాహ వేగానికి బెయిలీ బ్రిడ్జి ఒకటి మధ్యలో కూలిపోయింది. సమీపంలోని రోహ్టంగ్ టన్నెల్ ప్రాజెక్టుకు నిర్మాణ సామగ్రి తరలించడం కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి మీద లారీ వెళ్తుండగా కూలిపోయింది. డ్రైవర్‌ను వెంటనే రక్షించారు. బెయిలీ బ్రిడ్జి ఉన్నట్టుండి కూలిపోయింది గానీ, ఇందులో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రోహ్తంగ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బ్రిగెడియర్ డీఎన్ భట్ తెలిపారు. రాబోయే నాలుగైదు రోజుల్లో బ్రిడ్జిని పునరుద్ధరిస్తామని, కొట్టుకుపోయిన లారీని కూడా బయటకు తీస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు రావడంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో ఈ ప్రాంతంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. లెహ-మనాలి మార్గంలో ఉన్న రోహ్తంగ్ పాస్ వద్ద తలపెట్టిన 8.8 కిలోమీటర్ల రోహ్తంగ్ సొరంగం దేశంలోనే అతి పొడవైన సొరంగం అవుతుంది. మంచు కారణంగా ఆరు నెలల పాటు రోహ్తంగ్ పాస్‌ను మూసేస్తారు. సొరంగం నిర్మాణం పూర్తయితే ఏడాది పొడవునా రోహ్తంగ్ పాస్ మార్గాన్ని తెరిచే ఉంచేందుకు అవకాశం ఏర్పడుతుంది.