బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిపై భూకబ్జా కేసు
శంషాబాద్: భూకబ్జా కేసులో బీజేవైఎం జిల్లా అధ్యక్షడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సహా 9 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు. శంషాబాద్ మండలం తోండుపల్లి గ్రామంలో భూకబ్జా చేశారనే ఆరోపణలతో తొమ్మిదిమందిపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 6/2 నుంచి 6/7 వరకు గల 18 ఎకరాల భూమిని కబ్జా చేశారని హైదరాబాద్‌కు చెందిన పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బైతి శ్రీధర్, టీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మంచేర్ల శ్రీనివాస్‌లతో పాటు శ్రీకాంత్, బైతి శ్రీనివాస్, రాచమల్ల రాజు, కుమార్, శ్రీశైలం, శేఖర్, ఆనంద్‌లపై శంషాబాద్ రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.