Balaka Suman
-
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
-
తారక మంత్రం!
అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్ తారకమంత్రాన్ని జపిస్తోంది. యువనేత, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం జిల్లాకు రానున్నారు. పెద్దపల్లి మండలం రంగంపల్లిలో నిర్వహించే బహిరంగసభలో ఆయన మాట్లాడనున్నారు. జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేసేందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి, పార్టీ నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు. సాక్షి, పెద్దపల్లి: టీఆర్ఎస్ యువనేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రంగంపల్లిలోని ఆర్టీవో కార్యాలయం పక్కనున్న మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ జరగనుంది. కేటీఆర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి.వివేక్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు తదితరులు పాల్గొననున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత జిల్లాలో తొలి ప్రచార సభ కావడంతో భారీగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. కనీసం 15 నుంచి 20 వేల మందిని తరలించాలని పార్టీ నేతలు సన్నహాలు చేస్తున్నారు. పూర్తిగా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సభ కావడంతో ఈ నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల నుంచి ప్రజలను సమీకరిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బహిరంగసభ విజయవంతానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే మండలాలు, గ్రామాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. జనసమీకరణ బాధ్యతను పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులకు అప్పగించారు. కాగా...కేటీఆర్ జిల్లాకు వస్తున్న సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. కేటీఆర్‌పై ఆశలు... క్యాడర్లో ఉత్తేజాన్ని నింపేందుకు, నేతలు ఏకతాటిపై వచ్చేందుకు తారక మంత్రం పనిచేస్తుందని పార్టీ భావిస్తోంది. నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్న నేతలంతా ఇటీవల ఒక్కటయ్యారు. వీరిలో మరింత ఐక్యత పెరిగేందుకు కేటీఆర్ పర్యటన దోహదం చేస్తుందనే ఆలోచనతో నేతలున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ తనయుడిగా రాజకీయం అరంగేట్రం చేసిన కేటీఆర్ అనతికాలంలోనే స్వీయ నేతగా ఎదిగారు. మంత్రిగా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయంగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. తండ్రి తరహాలోనే తన వాగ్ధాటితో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. పార్టీ వర్గాలు సైతం ఆయనను భవిష్యత్ నాయకుడిగా పరిగణిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తొలి దశ ప్రచార బాధ్యతలను పూర్తిగా కేటీఆరే ఎత్తుకున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కేసీఆర్, కేటీఆర్‌లు ప్రచారం చేపట్టే విధంగా పార్టీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ముందుగా కేటీఆర్ అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రచార సభలు పూర్తి చేసిన అనంతరం, కేసీఆర్ సభలు ఉంటాయని పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. కాగా సభల్లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించడంతో పాటు, కూటమిపై విమర్శలను కేటీఆర్ ఎక్కుపెడుతున్నారు. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. మొత్తానికి పార్టీకి స్టార్కాంపేయినర్గా కేటీఆర్ ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. -
కాళేశ్వరానికి కాంగ్రెస్ ఆటంకాలు
సుమన్ సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. పెద్దపల్లిలో బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రచ్చ చేసేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీధర్‌బాబు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతులు పచ్చగా ఉండడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, వారి కుట్ర పూరిత వైఖరిని రైతులు ప్రజాభిప్రాయ సేకరణలోనే ఎండగట్టారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ఆరు నెలల్లో 36 కేసులు వేశారని మండిపడ్డారు. -
కాంగ్రెస్‌ది దిగజారుడు రాజకీయం
మీరాకుమార్ను బలిపశువును చేస్తున్నారు: బాల్క సుమన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికపై టీఆర్ఎస్ వైఖరిని కాంగ్రెస్ తప్పుపట్టడాన్ని ఖండిస్తున్నామని, రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఎందుకిస్తున్నామో పార్టీ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. కోవింద్ దళితుడు మాత్రమే కాకుండా న్యాయ కోవిదుడని, సీఎం కేసీఆర్ సూచనతోనే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత అభ్యర్థిని మోదీ ఎంపిక చేశారని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారంబాల్క సుమన్ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ ఫోన్ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నేతల అభిప్రాయం తీసుకుని ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. దళితుల మీద కాంగ్రెస్‌కు ప్రేమ ఉంటే ఎన్డీయే కంటే ముందే ఎందుకు దళిత అభ్యర్థిని ప్రకటించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆరోపించారు. మీరాకుమార్ అంటే తమకూ ప్రత్యేక అభిమానం ఉందని, కాంగ్రెస్ ఆమెను బలి పశువును చేస్తోందన్నారు. సీబీఐ కేసులకు భయపడే టీఆర్ఎస్ ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఇచ్చిందనడం బట్టకాల్చి మీద వెయ్యడమేనని, సీబీఐ కేసుల చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని వ్యాఖ్యానించారు. ఎన్డీయేలోలేని బీజేడీ, జేడీయూ, అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా టీఆర్ఎస్ తరహాలోనే కోవింద్‌కు మద్దతు ఇస్తున్న విషయం కాంగ్రెస్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంపత్ అవగాహన లేమితో క్రాస్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ ఓట్లన్నీ కోవింద్‌కే పడతాయన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కోదండరాంగ్గా మారారని, తప్పుడు ప్రయోజనాలతో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. -
ఓయూలో హత్యలు చేసిన బాల్క సుమన్: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్య మం ముసుగులో ఎంపీ బాల్క సుమన్ విద్యార్థులను హత్య చేశారని ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చిన తర్వాత ఆ హత్యల వివరాలను బయటపెడతానన్నారు. ‘నాకు గుండు కొట్టిస్తానని సుమన్ అంటున్నడు. దమ్ముంటే నన్ను ముట్టుకో. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులే సంగారెడ్డికి రావాలంటే భయపడతరు’ అని జగ్గారెడ్డి అన్నారు. సుమన్‌కు దమ్ముంటే ఓయూ లో సీఎంతో సభ పెట్టించాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌లోనూ సుమన్‌ను తిరక్కుండా చేయగలనన్నారు.