అహోబిలంలో బాలాలయ ప్రతిష్ట
- శ్రీజ్వాలానృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ
అహోబిలం(ఆళ్లగడ్డ): ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలంలో సోమవారం బాలాలయ ప్రతిష్ట మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ జ్వాలానరసింహస్వామి, చెంచులక్ష్మీ, శ్రీదేవి అమ్మవార్లు కొలువైన గుడి జీర్ణోద్ధరణ పనులను సోమవారం ప్రారంభించారు. గుడి జీర్ణోద్దరణ పనులకు ముందు బాలాలయ ప్రతిష్ట నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఉదయం నిత్యపూజలతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపి దివ్యదర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సహీత శ్రీలక్ష్మీనరసింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అర్చన, అభిషేకాది పూజల అనంతరం ప్రత్యేక మండపంలో కొలువుంచారు. వేద మంత్రోచ్చారణల మధ్య పీఠాధిపతి శ్రీమాన్ శఠకోప రంగారాజ యత్రీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో హోమం, పున్యాహవచనం, మృత్యుసంగ్రహనం, అంకురార్పణ, చిత్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి గోపుర విమానప్రయాన పనులు చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ కామేశ్వరి, ముద్రకర్త వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయన్, వేద పండితులు పాల్గొన్నారు