Ballet method
-
ఇందూరుకు అధునాతన ఈవీఎంలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు బరి లో ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్ నిర్వహణకు వీలున్న అధునాతన ఎం–3 రకం ఈవీఎంలను జిల్లాకు తెప్పించింది. వీటి పనితీరు ను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సం స్థలు ఈసీఐఎల్, భెల్ కంపెనీలకు చెందిన ఇంజనీర్లు చేరుకున్నారు. 600 మందికి పైగా ఇంజనీర్లు వీటి పరిశీలన కోసం నగరానికి వచ్చారు. నియోజకవర్గం పరిధిలో 1,788 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో పోలింగ్ కేం ద్రానికి ఒక్కో కంట్రోల్ యూనిట్, వీవీపీఏటీలతో పాటు 12 బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఏర్పాట్ల పర్యవేక్షణ కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ సుదీప్‌జైన్, ఎన్నికల సంఘం అదనపు సీఈఓ బుద్ద ప్రకాష్, ఈసీఐ కన్సల్టెంట్ నిఖిల్‌కుమార్ బుధవారం నిజామాబాద్‌లో పోలింగ్ ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. నియోజకవర్గం ప్రత్యేక అధికారిగా నియమితులైన వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా కూడా జిల్లాకు వచ్చారు. సుదీప్‌జైన్ మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు ఎం–2 ఈవీఎంఎస్ ద్వారా, 4 బ్యాలెట్ యూనిట్లతో మాత్రమే ఎన్నికలు నిర్వహించామన్నారు. నిజామాబాద్ స్థానానికి 185 మంది బరిలో ఉండటంతో ఎం–3 ఈవీఎంలతో 12 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఎన్నిక ఎంతో చాలెంజ్‌తో కూడుకుందని, అతి తక్కువ సమయంలో దీన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఇంత వరకు ఎం–3 ద్వారా ఎన్నికలు నిర్వహించలేదని.. 12 బ్యాలెట్ యూనిట్స్‌తో ఎన్నిక నిర్వహించడం ఇదే తొలిసారని అన్నారు. ‘బ్యాలెట్ పద్ధతిలోనేఎన్నికలు నిర్వహించాలి’ సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న రైతు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగర శివారులోని విజయలక్ష్మీ ఫంక్షన్‌హాలులో ఈవీఎంలపై అవగాహన కల్పించే కేంద్రం వద్ద ఆందోళన చేశారు. -
‘మండలి’ పోరుకు సర్వం సిద్ధం
రెండు నెలలుగా ఎదురుచూస్తున్న శాసన మండలి పోరు సమయం రానే వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సర్వ ఏర్పాట్లను సిద్ధం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన కొన్ని పోలింగ్ కేంద్రాలను ఈ ఎన్నికలకూ వినియోగించనున్నారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంల ద్వారా నిర్వహించగా, ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఈనెల 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, రెండు నెలలుగా అధికారులు సమీక్షలు, సమావేశాలు, బ్యాలెట్ బాక్సుల సేకరణ, పోలింగ్ సిబ్బంది నియామకం తదితర పనులతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉపాధ్యాయ అభ్యర్థులు ఏడుగురు, పట్టభద్రుల అభ్యర్థులు 17 మంది పోటీలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాట్లు.. ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో ఉపాధ్యాయులు, పట్టభధ్రుల ఓటర్లు కలిపి మొత్తం 9,343 మంది ఉన్నారు. విడిగా చూస్తే.. పట్టభద్రులు 7,789 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 5,687 మంది ఉండగా, మహిళలు 2,100 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు 1,554 మంది ఉండగా, ఇందులో పురుషులు 1,129 మంది, మహిళలు 425 మంది ఉన్నారు. వీరందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటును మొదటి ప్రాధాన్యతతో వినియోగించుకోనున్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్ రెవెన్యూ డివిజన్లలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ ఎన్నికలు బ్యాలెట్ బాక్సు పద్ధతిలో జరుగనున్నందున మొత్తం 40 బాక్సులను అందుబాటులో ఉంచారు. ఇందులో ఒక్కో పీఎస్‌లో ఒక్కోటి వినియోగించగా, మరో ఇరవై బాక్సులు రిజర్వులో ఉండనున్నాయి. మండలానికి ఒకటి చొప్పున ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల పోలింగ్ కేంద్రాలు కలుపుకొని ఒక్కో దగ్గర రెండేసి పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పీఎస్‌లకు మండలం చుట్టుపక్కల 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న వారు స్వచ్ఛందంగా వచ్చి ఓటేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రాల్లోనే పీఎస్‌లను ఏర్పాటు చేయడంతోగట్టి పోలీసు బందోబస్తు నడుమ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. సిబ్బంది సిద్ధం.. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహనకు ఆయా మండలాల తహసీల్దార్లను, ఎంపీడీవోలను రూట్, జోనల్ అధికారులుగా నియమించారు. జిల్లాలో మొత్తం 20 మంది రూట్, జోనల్ అధికారులు ఉన్నారు. ఇందులో పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలకు ఏడుగురు, ఉపాధ్యాయ పీఎస్‌లకు 13 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు, మూడు మండలాలకు, ఇద్దరు ముగ్గురు చొప్పున విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికలకు మొత్తం 120 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 24 మంది ప్రిసైడింగ్ అధికారులు ఉండగా, 96 మంది ఓపీవోలు ఉన్నారు. ఇందులో ప్రిసైడింగ్ అధికారులు 24 మంది ఉండగా, ఇతర ప్రిసైడింగ్ అధికారులు (ఓపీవో)–(1) 22 మంది, ఓపీవో(2)–22 మంది, ఓపీవో(3)–22 మంది, అదనపు ఇతర ప్రిసైడింగ్ అధికారులు(4)–15 మంది, అదనపు ఓపీవో(5)–15 మంది ఉన్నారు. కాగా, ఎన్నికల సిబ్బందికి ఇది వరకే మొదటి విడత శిక్షణ ఇవ్వగా, సోమవారం రెండో విడత శిక్షణ ఇవ్వనున్నారు. వీరితోపాటు ఉట్నూర్‌కు ఎంపీడీవో ఫణీందర్, ఆదిలాబాద్‌కు డీఏవో శ్రీనివాస్‌రావు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలుండగా, 17 వీడియో సర్వేలియన్స్ బృందాలు ఉన్నాయి. ఐదు కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్.. పోలింగ్‌కు ఒకరోజు ముందు ఆదిలాబాద్‌లోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సిబ్బంది సామగ్రిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఉట్నూర్ డివిజన్‌కు సంబంధించిన ఆర్డీవో కార్యాలయంలో పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సామగ్రిని తీసుకెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో ఐదు పీఎస్‌లలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఆదిలాబాద్‌లో నాలుగు పీఎస్‌లలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనుండగా, ఉట్నూర్‌లో ఒక కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ చేపట్టనున్నారు. మంచిర్యాల జిల్లాలో.. మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 1,436 మంది ఉండగా, 15 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా, ఓటు హక్కు ఉన్న పట్టభద్రులు జిల్లాలో 13,980 మంది ఉండగా, 27 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఈసారి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆశించిన మేరకు పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోకపోయినా, 13,980 మంది మాత్రం ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 9,670 ఉండగా, మహిళలు 4,308 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఇక ఉపాధ్యాయులు 1,436 మంది ఓటు హక్కు పొందగా, వీరిలో పురుషులు 948, మహిళలు 488 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ బరిలో ఉన్న అభ్యర్థులు ఓటు తమకే వేయాలని నేరుగా ఓటర్లకు వాయిస్ కాల్ చేస్తూ, వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా ప్రచారం చేయడం గమనార్హం! పట్టభద్రుల ఓటర్లు 13,980 మంది ఉండగా, 17 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరు టీఎన్జీవోస్ నాయకులు, ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్టు ఉద్యోగులు, వివిధ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేసి తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇక పార్టీల తరుపున పోటీలో ఉన్న వారు పార్టీ నాయకులను కలిసి తమ తరుపున ప్రచారం చేసి గెలిపించాలని ఆ పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోరుతూ ప్రచారం చేసుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో.. నిర్మల్: జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు 12,063 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 8,278 మంది, మహిళలు 3,785 మంది ఉన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 1,731 మంది ఉండగా, వీరిలో 1,277 మంది పురుషులు, 454 మంది మహిళలు ఉన్నారు. ప్రతీ మండలానికి ఒక పోలింగ్ కేంద్రం చొప్పున, నిర్మల్ జిల్లా కేంద్రంలో మాత్రం అదనంగా నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈసారి ఉపాధ్యాయ, పట్టభద్రులవి కలిపి కామన్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల పరంగా సమస్యలు తలెత్తకుండా భద్రత ఏర్పాట్లను కూడా పటిష్ఠంగా నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల వివరాలు.. మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఉపాధ్యాయులు 1,731 1,277 454 పట్టభద్రులు 12,063 8,278 3,785 మొత్తం పోలింగ్ కేంద్రాలు–27, పోలింగ్ అధికారులు–109 కుమురంభీం జిల్లాలో.. ఆసిఫాబాద్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఎన్నికల నిర్వహణపై పోలీస్ శాఖతోపాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు, ఎన్నికల సిబ్బందితో పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 493 మంది, పట్టభద్రుల ఓటర్లు 4,355 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా ఐదు జోన్లలో 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ డివిజన్లో 12, కాగజ్‌నగర్‌లో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఒకే పోలింగ్ బూత్‌లో ఉపాధ్యాయ, పట్టభద్రుల రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఐదు జోన్లలో 8 మంది నోడల్ అధికారులు, 26 మంది పీవోలు, 39 మంది ఏపీవోలు 26 మంది ఓపీవోలను నియమించారు. ప్రత్యేక శిక్షణ.. ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి రెండు దఫాలుగా శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 13న తొలిదశ శిక్షణ పూర్తి కాగా, 18న ఎన్నికల సిబ్బందితోపాటు మైక్రో ఆబ్జర్వర్స్కు రెండో దఫా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సామాగ్రిని ఈ నెల 21న పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి ఎన్నికల సామగ్రితోపాటు బ్యాలెట్ బాక్సులు జిల్లాకు చేరుకోగా, ఆసిఫాబాద్ ఆర్డీవో కార్యాలయంలో, కాగజ్‌నగర్ ప్రభుత్వ జూనియర్కళాశాలల్లో ఈ సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 4 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేయగా.. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో ప్రతి డివిజన్‌కు రెండు బృందాలు, రెండు వీడియో సర్వేలియన్స్ బృందా లు ఉంటాయి. ఈనెల 26న ఎన్నికల ఫలితాలు విడుదల చేయగా, 28తో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. 22న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 21, 22న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించి నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. -
మళ్లీ బ్యాలెట్‌కు నో
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పందించారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలె ట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న కొన్ని రాజకీయ పక్షాల డిమాండ్‌కు తలొగ్గబోమని స్పష్టం చేశారు. మళ్లీ బ్యాలెట్ బాక్సులను వినియోగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈవీఎంలను కొందరు ఫుట్బాల్లా ఆడుకుంటున్నారనీ, వాటి పనితీరుపై ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. బ్యాలెట్‌తో సిబ్బందికి నరకమే.. ఢిల్లీలో గురువారం జరిగిన ‘మేకింగ్ అవర్ ఎలక్షన్స్ ఇన్‌క్లూజివ్ అండ్ యాక్సెసబుల్’ అనే కార్యక్రమంలో అరోరా మాట్లాడుతూ.. ‘నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా మేం బ్యాలెట్ పేపర్ల విధానానికి మొగ్గుచూపబోం. మనుషుల సాయంతో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, కౌంటింగ్‌లో తీవ్రమైన ఆలస్యం.. ఇదంతా పోలింగ్ సిబ్బందికి నరకంలా ఉంటుంది. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి విమర్శలు, సలహాలు స్వీకరించేందుకు సిద్ధం గా ఉన్నాం. ఇదే సమయంలో బెదిరింపులు, ఒత్తిడి, విజ్ఞప్తులకు తలొగ్గి ఈవీఎంలను వదిలి బ్యాలెట్ విధానానికి మళ్లే ప్రసక్తే లేదు. మనం ఈవీఎంలను ఫుట్‌బాల్‌గా ఎందుకు మార్చేశాం? వాటిపై ఉద్దేశపూర్వకంగా బురదచల్లే కార్యక్రమం కొనసాగుతోంది’ అని తెలిపారు. ఒకే ఫలితం రావాలి కదా.. ఈవీఎంల సమర్థతపై స్పందిస్తూ..‘2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్నిరోజులకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మిజోరంతో పాటు తాజాగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఎన్నికల ఫలితాలు నమోదయ్యాయి. నిజంగా ఈవీఎంలలో సమస్య ఉంటే ఇక్కడంతా ఒకేరకమైన ఫలితాలు రావాలి కదా. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)లో రూపొందిస్తారు. వీటిని హ్యాక్ లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. ఇటీవల రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.76 లక్షల పోలింగ్ కేంద్రాల్లో కేవలం ఆరంటే ఆరు చోట్ల మాత్రమే ఈవీఎంల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయంలో అలసత్వం చూపకుండా మేం వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాం’ అని అరోరా వెల్లడించారు. ఇక వీవీప్యాట్ యంత్రాలకు సంబంధించి చిన్నచిన్న ఘటనలు నమోదయ్యాయని అంగీకరించారు. వీవీప్యాట్ యంత్రాల వినియోగం విషయంలో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నామనీ, ఈ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ‘బ్యాలెట్’తోనే ఎన్నికలు జరపండి త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈవీఎంల సమర్థతపై తలెత్తిన వివాదంతో మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే నీలినీడలు కమ్ముకున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం సాంకేతికను దుర్వినియోగం చేస్తున్నారనీ, ఇందులో తమకు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. విద్యావంతులైన ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్నారు. హ్యాకర్ సయిద్ షుజా చేసిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. -
ముహూర్తం ఖరారు
* ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ * జనవరి 11న కంటోన్మెంట్ ఎన్నికలు * పార్టీలకు అతీతం... పోలింగ్‌లో బ్యాలెట్ * అంతా మిలటరీ అధికారుల కనుసన్నల్లోనే... కంటోన్మెంట్: ఎట్టకేలకు కంటోన్మెంట్ ఎన్నికల నగారా మోగింది. వచ్చే ఏడాది జనవరి 11న బోర్డు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఒక్కసారిగా స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం ఎనిమిది వార్డులకు చెందిన సుమారు 2.30 లక్షల మంది ఓటర్లు... ఎనిమిది మంది సభ్యులను బోర్డుకు ఎన్నుకుంటారు. పార్టీలకు అతీతంగా బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యేక ఓటరు జాబితాను వినియోగించనున్నారు. కొత్త చట్టం వచ్చాక రెండోసారి... కంటోన్మెంట్ చట్టం -1924 స్థానంలో ‘ది కంటోన్మెంట్స్ యాక్ట్ -2006’ అమల్లోకి వచ్చాక ఎన్నికలు నిర్వహించడం ఇది రెండోసారి. ఈ చట్టం ప్రకారం తొలిసారి 2008 మే 18లో జరిగిన ఎన్నికల ద్వారా సికింద్రాబాద్‌లో తొలి పాలకమండలి ఏర్పాటైంది. 2013 జూన్ 5తో ఈ పాలకమండలి గడువు పూర్తయినప్పటికీ, రెండుసార్లు పొడిగించారు. ఈ ఏడాది జూన్ 5తో తొలి పాలక మండలి గడువు ముగిసింది. అప్పటి నుంచి మిలటరీ అధికారి అయిన బోర్డు అధ్యక్షుడు, మెంబర్ సెక్రటరీగా వ్యవహరించే సీఈఓల ఆధ్వర్యంలోని ప్రత్యేక బోర్డు ఆధ్వర్యంలోనే పాలన కొనసాగుతోంది. ఇదీ బోర్డు స్వరూపం దేశ వ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులలో ఒక్కటి మినహా 61 చోట్ల ప్రజల ద్వారా ఎన్నికైన సభ్యులతో కూడిన బోర్డు కొలువుదీరుతుంది. జనాభా పరంగా నాలుగు కేటగిరీలుగా వీటిని విభజించారు. వీటిలో అత్యధిక జనాభాతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అతి పెద్దదిగా కొనసాగుతోంది. మొత్తం 16 మంది సభ్యులు ఉండే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు స్థానిక మిలటరీ స్థావరం కమాండర్ (జీఓసీ-ఇన్-సీ) లేదా, అతని ద్వారా నియమితులైన బ్రిగేడియర్ ర్యాంకు అధికారి అధ్యక్షుడిగా ఉంటారు. బోర్డు సీఈఓగా పనిచేసే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్‌కు చెందిన అధికారి సభ్య కార్యదర్శిగా కొనసాగుతారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ఇద్దరు మిలటరీ అధికారులు హెల్త్ ఆఫీసర్ (సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెడికల్ ఆఫీసర్), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (గారిసన్ ఇంజనీర్)లతో పాటు మరో ముగ్గురు మిలటరీ అధికారులను అధ్యక్షుడు నామినేట్ చేస్తారు. వీరితో పాటు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, లేదా అడిషనల్ మెజిస్ట్రేట్ స్థాయి అధికారి (డీఆర్ఓ)ని బోర్డు సభ్యుడిగా నామినేట్ చేస్తారు. అంటే మొత్తం 16 మందిలో 8 మంది ప్రజల చేత ఎన్నికైన సభ్యులు కాగా, ఆరుగురు మిలటరీ అధికారులు, ఒక ఐడీఈఎస్ అధికారి (సీఈఓ), రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి (మెజిస్ట్రేట్) సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక ఓటరు జాబితా సాధారణంగా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే ఓటరు జాబితానే వినియోగిస్తారు. కంటోన్మెంట్లలో జరిగే ఎన్నికలకు మాత్రమే ప్రత్యేకంగా జాబితాను రూపొందిస్తారు. కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్ -2007 ప్రకారం ఈ జాబితాను తయారు చేస్తారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు ఎన్నికల సంఘం రూపొందించిన జాబితా ఆధారంగా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పాల్గొంటుండగా.. ప్రత్యేకమైన జాబితాలో పేరు నమోదు చేసుకుంటేనే బోర్డు ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులవుతారు.