Ballia school
-
Video Viral: స్కూల్ విద్యార్థులతో టాయిలెట్ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్
లక్నో: ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో ప్రిన్సిపల్ టాయిలెట్లు శుభ్రం చేయిస్తున వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బలియా జిల్లా పిప్రా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ స్కూల్లోని విద్యార్థులను ప్రిన్సిపల్ వాష్‌రూమ్‌లు శుభ్రం చేయాలని ఆదేశించాడు. ప్రిన్సిపల్ పక్కన నిలబడి పిల్లలచేత టాయిలెట్లు కడిగించాడు. అంతేగాక విద్యార్థులకు మరుగుదొడ్డి సరిగ్గా శుభ్రం చేయాలని ఆదేశాలు ఇస్తున్నాడు. సరిగా క్లీన్ చేయకుంటే తాళం వేస్తానని, అప్పుడు అందరూ మల విసర్జన కోసం ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని బెదిరించాడు. ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. Primary School Students Made To Clean Toilet by Principle in Ballia, Uttar Pradesh. The incident was reported from Pipra Kala Primary School of Sohav Block in Ballia. pic.twitter.com/oYaqqBhFJA — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) September 8, 2022 ఇందులో కొందరు విద్యార్థులు టాయిలెట్‌ను శుభ్రం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్‌గా మారింది. అదికాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు విధ్యాశాఖ అధికారి అఖిలేష్ కుమార్ ఝా తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: పగ తీర్చుకున్నాడు.. కాటేసిన పామును కసితీరా కొరికి -
డిక్టేషన్, డిస్కషన్స్‌తో మ్యాథ్స్ రాసేశారు
లక్నో: పెద్ద మొత్తంలో మాస్ కాపీయింగ్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో మొన్న బిహార్‌లో చూశాం. అది ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో కూడా అందరికి తెలుసు. ఇప్పుడు అలాంటి భారీ మాస్ కాపీయింగే యథేచ్చగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం యూపీ 10వ తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. నేడు గణితం పరీక్ష పత్రానికి విద్యార్థులు జవాబులు రాశారు. అయితే, అవి ఎలా రాశారో తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. యూపీలోని బల్లియా ప్రాంతంలోని ఓ స్కూల్లో విద్యార్థులు పెద్ద మొత్తంలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ మీడియా కంటికి చిక్కారు. యథేచ్చగా చూసి రాస్తూ, గ్రూప్ డిస్కషన్స్ చేసుకుంటూ, బయటకొచ్చి చిట్టీలు తీసుకెళ్తూ దొరికిపోయారు. వీటిని చూస్తున్నవారికి నిజంగా ఈ విద్యార్థులేమన్నా నిల్చుని చూసి వ్రాత రాస్తున్నారా, కబుర్లు చెప్పుకుంటున్నారా, మిఠాయిలు పంచుకుంటున్నారా అనే అనుమానం రాక మాత్రం తప్పదు.