పెద్ద మొత్తంలో మాస్ కాపీయింగ్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో మొన్న బిహార్‌లో చూశాం. అది ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో కూడా అందరికి తెలుసు.
లక్నో: పెద్ద మొత్తంలో మాస్ కాపీయింగ్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో మొన్న బిహార్‌లో చూశాం. అది ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో కూడా అందరికి తెలుసు. ఇప్పుడు అలాంటి భారీ మాస్ కాపీయింగే యథేచ్చగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం యూపీ 10వ తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. నేడు గణితం పరీక్ష పత్రానికి విద్యార్థులు జవాబులు రాశారు. అయితే, అవి ఎలా రాశారో తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే.
యూపీలోని బల్లియా ప్రాంతంలోని ఓ స్కూల్లో విద్యార్థులు పెద్ద మొత్తంలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ మీడియా కంటికి చిక్కారు. యథేచ్చగా చూసి రాస్తూ, గ్రూప్ డిస్కషన్స్ చేసుకుంటూ, బయటకొచ్చి చిట్టీలు తీసుకెళ్తూ దొరికిపోయారు. వీటిని చూస్తున్నవారికి నిజంగా ఈ విద్యార్థులేమన్నా నిల్చుని చూసి వ్రాత రాస్తున్నారా, కబుర్లు చెప్పుకుంటున్నారా, మిఠాయిలు పంచుకుంటున్నారా అనే అనుమానం రాక మాత్రం తప్పదు.