balu nayak
-
బాలూ నాయక్ లీడర్‌తో
-
ఆసక్తికరంగా.. దేవరకొండ రాజకీయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : దేవరకొండలో ఎన్నికల రాజకీయం ఆసక్తిగొల్పుతోంది. కాంగ్రెస్ తన అభ్యర్థిగా జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌కు టికెట్ ప్రకటించిన వెంటనే ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారాయి. దాదాపు ఏడాది కిందట టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ కాంగ్రెస్ గూటికి చేరిన బిల్యానాయక్ అనివార్యంగా కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింది. టీడీపీనుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే ముందు టికెట్ హామీతోనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. రేవంత్‌రెడ్డి వెంట రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. తీరా చివరి నిమిషం దాకా ఉత్కంఠ రేపి ఆఖరికి తమ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ బాలునాయక్ వైపే మొగ్గుచూపింది. వాస్తవానికి బాలునాయక్ కూడా చైర్మన్‌గా ఎన్నికై ఏడాది గడవక ముందే టీఆర్ఎస్ బాట పట్టారు. ఇన్నాళ్లూ ఆ పార్టీలో కొనసాగిన ఆయన దేవరకొండ టికెట్ ఆశించారు. కానీ, టీఆర్ఎస్ నాయకత్వం సీపీఐనుంచి తమ పార్టీలో ఎమ్మెల్యే హోదాలో చేరిన రవీంద్రకుమార్ కే టికెట్ ఇచ్చింది. దీంతో నారాజైన బాలు సెప్టెంబరు నెల మధ్యలో కాంగ్రెస్‌కు తిరిగి వచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో జగన్‌లాల్‌నాయక్, బిల్యానాయక్, బాలూనాయక్ మధ్య టికెట్‌కు పోటీ ఏర్పడింది. నిన్నా మొన్నటి దాకా ఎవరికి టికెట్ వచ్చినా, అందరం కలిసి పనిచేస్తామని ప్రకటనలూ ఇచ్చారు. తీరా ఇప్పుడు బాలునాయక్‌కు టికెట్ రావడతో బిల్యా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. గత ఎన్నికల్లో రెండో స్థానం గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడినుంచి పోటీ చేయలేదు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ విజయం సాధిం చింది. అంతకు ముందు (2009) కాంగ్రెస్ నుంచి బాలూనాయక్ ఎమ్మెల్యేగా చేశారు. తమ సిట్టింగ్ సీటును త్యాగం చేసి మరీ కాంగ్రెస్ ఇక్కడ సీపీఐకి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ టీఆర్ఎస్ బాట పట్టడం, జెడ్పీ చైర్మన్‌గా కాంగ్రెస్‌నుంచే ఎ న్నికైన బాలునాయక్ గులాబీ గూటికే చేరడంతో , భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నుంచి బిల్యానాయక్‌ను ఆహ్వానించింది. కానీ, ఎన్నికల్లో టికెట్ మాత్రం ఇవ్వలేకపోయింది. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ పోటీ చేసినా, మూడో స్థానంలో నిలిచింది. సీపీఐ, టీడీపీల మధ్యే ప్రధా న పోరు నడిచింది. టీడీపీనుంచి బిల్యా నాయక్ పోటీ పడగా, తక్కువ మెజారిటీతోనే ఆయన ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బిల్యాకు వచ్చిన ఓట్లను చూసే, కాంగ్రెస్ బిల్యాను పార్టీలో చేర్చుకుంది. కానీ, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు, జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పే నేతల మద్దతు, కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థా యిలో నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు తదితర కారణాలతో బిల్యాకు మొండి చేయిచూపింది. దీంతో ఆయన శనివారం బీఎల్ఎఫ్ కండువా కప్పుకున్నారు. బీఎల్ఎఫ్ తరఫున ఆయన దే వరకొండలో పోటీచేయడం ఖాయమంటున్నారు. దీంతో ఇక్కడి రాజకీయం రంజుగా మారింది. దేవరకొండ అభ్యర్థి.. నేనావత్ బాలునాయక్ పేరు : నేనావత్ బాలునాయక్ తండ్రిపేరు : లస్కర్ పుట్టిన తేదీ : 03–07–1972 విద్యార్హతలు : బీ.ఏ(ఎల్ఎల్బీ) స్వగ్రామం : సూర్యతండా, ముదిగొండ, దేవరకొండ మండలము, నల్లగొండ రాజకీయ ప్రస్థానం, చేపట్టిన పదవులు : ఎన్ఎస్యూఐ దేవరకొండ ప్రెసిడెంట్, నల్లగొండ జిల్లా సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ(1999–2004), కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు(2004–05), వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సీపీఐ అభ్యర్థి రవీంద్రకుమార్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా(2009) గెలుపొందారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐకు టిక్కెట్ కేటాయించారు(2014). చందంపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించిన ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవీ లభించింది. -
భూమి లాక్కుంటారన్న భయంతో.. రైతు మృతి
తమ పంట భూములను అధికారులు బలవంతంగా లాక్కుంటారన్న భయంతో ఒక రైతు ఆర్డీవో కార్యాలయంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో చోటుచేసుకుంది. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణలో భాగంగా ఆర్డీవో ఆఫీసులో గురువారం సమావేశం ఏర్పాటుచేశారు. ఇప్పటికే అక్కడ 600 ఎకరాలు తీసుకోగా, మరో 1400 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసం ఏర్పాటుచేసిన సమావేశానికి పలువురు రైతులు, రైతు ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న బాలు నాయక్ (50) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. తమ భూములను బలవంతంగా తీసుకుంటారని గత కొంతకాలంగా ఆయన భయపడుతున్నారని బంధవులు చెబుతున్నారు. ప్రభుత్వం అతి తక్కువ ధరకే తమ విలువైన భూములు తీసుకుంటుందని అనుమానపడుతున్నారని, అందుకే ఆయనకు గుండెపోటు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలునాయక్ మృతిపట్ల బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. -
కాంగ్రెస్‌లో పెద్ద దిక్కేదీ?
పార్టీని వీడుతున్న నేతలు.. పట్టించుకోని బాధ్యులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాయకత్వ లేమి వెక్కిరిస్తోంది. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో విశ్వాసం కలిగించే నాయకుడు లేక అధికార టీఆర్ఎస్లోకి ఒక్కొక్కరుగా వలసపోతున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా ఉన్న రెడ్యానాయక్, ఆయన కుమార్తె పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరగా వారు పార్టీ మారాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర నాయకులెవరూ అడగలేదు. అలాగే ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, యాదయ్య, కోరం కనకయ్య తదితరులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా వారిని కట్టడి చేయడానికి టీపీసీసీ నాయకత్వం ఎలాంటి ఆసక్తినీ చూపలేదు. కాంగ్రెస్‌కు దక్కిన ఏకైక జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్ (నల్లగొండ) ఆ పార్టీని వీడిపోయారు. అదే జిల్లాకు చెందిన మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి (నల్లగొండ ఎంపీ సుఖేందర్‌రెడ్డి సోదరుడు) కూడా టీఆర్ఎస్ బాట పట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి వంటి హేమాహేమీలు నల్లగొండ జిల్లాకు చెందినా పార్టీ నుంచి వలసలను ఆపలేకపోయారు. కరీంనగర్ డీసీసీబీ అధ్యక్షుడిగా గెలిచిన కొండూరి రవీందర్రావు టీఆర్ఎస్లో చేరారు. మహబూబ్‌నగర్ నుంచి కూడా టీఆర్ఎస్లోకి వలసలు ఉంటాయని ప్రచారం జరిగినా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కాపాడుకోవడంలో ఆ జిల్లా నేతలు సఫలీకృతులయ్యారు. కాంగ్రెస్ నుంచి వలసల ప్రభావం స్థానిక సంస్థల కోటా నుంచి త్వరలో శాసనమండలికి జరిగే ఎన్నికలపై ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ మంది స్థానిక సంస్థల ప్రతినిధులున్నారు. నిజామాబాద్‌లో టీఆర్ఎస్తో సమాన స్థాయిలోనే కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రతినిధులు గెలిచారు. కానీ టీపీసీసీ, సీఎల్పీ నేతల వైఖరి వల్ల స్థానిక సంస్థల నుంచి పోటీకి ఆసక్తి చూపించలేని దుస్థితి కాంగ్రెస్‌లో నెలకొంది. -
చేస్తున్నది తక్కువ.. చేయాల్సింది ఎక్కువ!
రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్లగొండ నుంచి వాటర్ గ్రిడ్‌కు శ్రీకారం సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నల్లగొండ జెడ్పీ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: ‘‘కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు అంతా కలిసి అభివృద్ధి చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో 46 వేల చెరువులకు జలకళ తెచ్చేందుకు మిషన్ కాకతీయ మొదలు పెట్టాం. దేశంలో మంచి రహదార్లు అంటే తెలంగాణలోనే ఉన్నాయన్న రీతిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. బంగారు తెలంగాణ కోసం అందరం కలిసి పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు చేస్తున్నది తక్కువ, చేయాల్సిందే ఎక్కువ ఉంది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్ మంగళవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వెనుక బడిన నల్లగొండ నుంచే వాటర్ గ్రిడ్‌కు శ్రీకారం చుడతానని, త్వరలోనే జిల్లాలో శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని తెలిపారు. ‘‘తెలంగాణది సంక్షేమ రాజ్యం. రెండున్నరేళ్లలో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తాం. ఇప్పటికే పెన్షన్లు పెంచాం. తం డాలను పంచాయతీలుగా మార్తుస్తున్నాం’’ అని వెల్లడించారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా బాలూనాయక్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. తెలం గాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇంటిం టికీ ప్రచారం చేయాలని నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కోరారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రసంగిస్తూ నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో గతంలో టీఆర్ఎస్ కొంత బలహీనంగా ఉండేదని, ఇప్పుడు పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. బాలూనాయక్‌తో పాటు చింతపల్లి, రామన్నపేట, గుర్రం పోడు, అర్వపల్లి, నూతనకల్లు మండలాలకు చెందిన అయిదుగురు జెడ్పీటీసీ సభ్యులు, చింతపల్లి, చందంపేట, దేవరకొండ, మఠంపల్లి, నేరేడుచర్ల ఎంపీపీలు, 39 మంది ఎంపీటీసీ సభ్యులు, 45 మంది సర్పంచులు, ముగ్గురు సింగిల్ విండో చైర్మన్లు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణకు కలిసి పనిచేద్దాం!
-
నేడు ‘కారు’ ఎక్కనున్న నల్లగొండ జెడ్పీ చైర్మన్
మళ్లీ టీఆర్ఎస్లోకి వలసలు షురూ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ ఎస్‌లోకి మరిన్ని వలసలకు రంగం సిద్ధమైంది. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలూ నాయక్ కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలోకి చేరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో బాలూ నాయక్ తన అనుచరులతో కలసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నల్లగొండ జిల్లాలోని గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య ధోరణులతో విసిగిపోయి కాంగ్రెస్‌ను వీడుతున్నట్టుగా ఆయన చెబుతున్నారు. బాలూ నాయక్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా పార్టీని వీడుతున్నారు. ఎవరికివారే యమునా తీరే.... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం లేకుండా పోయింది. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. భారీ సంఖ్యలో నేతలు పార్టీని వీడుతున్నా అటు అధిష్టానం నుంచి గానీ.. ఇటు రాష్ట్ర పార్టీ ముఖ్యుల నుంచి గానీ ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, విఠల్‌రెడ్డి, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే కవిత తదితరులు పార్టీకి గుడ్‌బై చెప్పారు. మరికొందరు మాజీమంత్రులూ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లాల్లో మాత్రమే ఉన్న వలసలు ఇక హైదరాబాద్ నుంచి ఉండనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన కీలక కాంగ్రెస్ నేతలు కూడా పార్టీని వీడనున్నారు. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవికి టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడి, టీఆర్ఎస్లో చేరడానికి ఆ పార్టీకి చెందిన ఓ బలమైన నేత చర్చలు జరుపుతున్నారు. -
టీఆర్ఎస్లో చేరనున్న బాలూనాయక్
నల్లగొండ: నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టు జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఏవిధమైన ఒత్తిడులు లేవని ఆయన అన్నారు. కేవలం నల్లగొండ జిల్లా అభివృద్ధికై టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు ఆయన తెలిపారు. -
ఎట్టకేలకు కాంగ్రెస్ జాబితా
బాలునాయక్ మినహా సిట్టింగులందరికీ అవకాశం సాక్షిప్రతినిధి, నల్లగొండ,సిట్టింగు ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేయడానికి తీవ్రమైన కసరత్తు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు సోమవారం సాయంత్రం అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. సీపీఐతో పొత్తులో భాగంగా వదులుకున్న దేవరకొండ నియోజకవర్గాన్ని మినహాయిస్తే, జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గుడిపాటి నర్సయ్యకు మరోసారి అవకాశం కల్పించింది. పెద్దగా సంచలనం సృష్టించిన, అనూహ్యమైన నిర్ణయాలేవీ జరగలేదు. గత కొద్ది రోజులుగా మిర్యాలగూడ నియోజకవర్గంలో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి జానారెడ్డి సన్నిహితుడు ఎన్.భాస్కర్‌రావు పేరును ఖరారు చేశారు. బీసీ కోటాలో భాగంగా భువనగిరికి పోతంశెట్టి వెంకటేశ్వర్లును ఎంపిక చేశారు. కోదాడపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆలేరు నుంచి ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, తుంగతుర్తికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడిపాటి నర్సయ్య, సూర్యాపేట - ఆర్.దామోదర్‌రెడ్డి, హుజూర్నగర్ - ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మిర్యాలగూడ -ఎన్.భాస్కర్‌రావు, నాగార్జునసాగర్ - కె.జానారెడ్డి, నల్లగొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్-చిరుమర్తి లింగయ్య, భువనగిరి - పి.వెంకటేశ్వర్లు పేర్లు జాబితాలో చోటు చేసుకున్నాయి. సీపీఐకి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలను కేటాయించింది. కోదాడలో ఎవరికి అవకాశం కలిసొస్తుందోనన్న ఉత్కంఠ కార్యకర్తల్లో నెలకొంది. కోదాడ నియోజకవర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఏఐసీసీ నాయకత్వం మాత్రం ఒక కుటుంబంలో ఒకరికే అవకాశం అన్న మెలిక పెట్టడంతో పద్మావతి అభ్యర్థిత్వం పెండింగులో పడింది. మరోవైపు గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనారిటీ నేత మహ్మద్ జానీ ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేసి, తాను రేసులో ఉన్నానని హైకమాండ్‌కు చెప్పకనే చెప్పారు. ఇప్పుడు టికెట్ ఖరారు చేస్తే వివాదాస్పదం కావడం ఖాయమని భావించినందునే కోదాడ అభ్యర్థి పేరును పెండింగ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు. ఇక, తెలంగాణ ఉద్యమంలో, ఆయా జేఏసీల్లో పనిచేసిన ఉద్యమ కారులకు ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించగా, జిల్లా నాయకత్వం మాత్రం ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ తెలంగాణ పొలిటికల్ జేఏసీలో చురుకైన పాత్రనే పోషించారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధిగా పార్టీ సంస్థాగత పదవినీ దక్కించుకున్నారు. దయాకర్ పేరును ఎస్సీ రిజర్వుడు స్థానమైన తుంగతుర్తికి పరిశీలిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. కానీ, తీరా ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గుడిపాటి నర్సయ్యకే టికెట్ దక్కింది. సామాజిక చిత్రాల దర్శకుడు ఎన్. శంకర్‌కు మిర్యాలగూడ టికెట్ ఇవ్వడానికి దాదాపు లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఈదశలో జిల్లా నేతలు మోకాలడ్డడంతో టికెట్ రాకుండా అయ్యింది. శంకర్ స్థానంలో జానారెడ్డి దగ్గరి వ్యక్తి అయిన భాస్కర్‌రావుకు టికెట్ దక్కింది. పెద్ద సంచలనాలేవీ లేకుండానే అందరు సిట్టింగులకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ నాయకత్వం జాబితాను ప్రకటించడం విశేషం.