విశాఖలో పోలీసుల విస్తృత తనిఖీలు
విశాఖ: మావోయిస్టు నేతలు నవంబర్ 3వ తేదీన బంద్ కు పిలుపునిచ్చిన ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది. పాడేరులో అదనపు బలగాలను మోహరించారు. బంద్ నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లే ప్రజా ప్రతినిధులు సమాచారం ఇవ్వాలని పోలీసులు నేతలకు సూచించారు. ఏఓబీ ఎన్ కౌంటర్ కు సంబంధించి ఇప్పటివరకూ 16 మృతదేహాలను అప్పగించగా, బంధువులు రాని 12 మృతదేహాలను పోలీసులు ఖననం చేశారు. పాడేరులో మరో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో నవండర్ 3న బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. ఏఓబీ ఎన్ కౌంటర్ పూర్తిగా కోవర్టు ఆపరేషన్ అని మావోయిస్టు పార్టీ నేతలు తాము విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఏఓబీలో ఈ నెల 24న జరిగిన ఎన్కౌంటర్, ఆయా ఘటనలలో దాదాపు 30 మంది మావోయిస్టులు మరణించారు.