హైదరాబాద్: ఏఓబీలో ఈ నెల 24న జరిగిన ఎన్‌కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు నేతలు నవంబర్ 3వ తేదీన బంద్ కు పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల్లో ఆ రోజు బంద్ కు పిలుపునిస్తూ ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది.
40 ఏళ్ల తమ పార్టీ చరిత్రలో ఆ ఎన్ కౌంటర్ వల్ల మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఏఓబీ ఎన్ కౌంటర్ పూర్తిగా కోవర్టు ఆపరేషన్ అని మావోయిస్టు పార్టీ నేతలు తాము విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఏఓబీలో ఈ నెల 24న జరిగిన ఎన్‌కౌంటర్, ఆయా ఘటనలలో దాదాపు 30 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.
5 రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్!
Published Sat, Oct 29 2016 2:31 PM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement
Advertisement