bandisanjay Kumar
-
20న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి సన్మానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు, మరో ఆరుగురు బీజేపీ ఎంపీల సన్మాన కార్యక్రమంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ఈ నెల 19న వారికి సన్మాన కార్యక్రమం జరపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిది. అయితే ఈ కార్యక్రమాన్ని 20 వతేదీ సాయంత్రానికి వాయిదా వేసినట్టుగా పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఈ నెల 19న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నూతన కేబినెట్ తొలిసమావేశం జరగనుండడంతో ఈ మార్పు జరిగినట్టు తెలుస్తోంది.ఈ భేటీకి కేబినెట్ మంత్రి హోదాలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సన్మాన కార్యక్రమం 19వ తేదీకి బదులు 20వ తేదీకి వాయిదా వేసినట్టు పార్టీవర్గాల సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్‌కుమార్ 19న నగరానికి చేరుకుని కరీంనగర్‌కు వెళ్తారు. 20వ తేదీ సాయంత్రం తిరిగి ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మిగతా ఎంపీలతో కలిసి ఓపెన్‌టాప్ జీప్‌లో ర్యాలీగా పార్టీ ఆఫీసుకు చేరుకుంటారని తెలుస్తోంది. సన్మాన కార్యక్రమం ఇలా... గురువారం (20న) సాయంత్రం 4గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు కేంద్రమంత్రులు, ఎంపీలను ర్యాలీగా తీసుకు రానున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్ తెలంగాణ’పేరిట సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు, అసెంబ్లీకి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్ (యూపీ నుంచి ప్రాతినిధ్యం)ను ఘనంగా సన్మానించనున్నారు. బేగంపేట నుంచి ఓపెన్‌టాప్ జీప్లలో వారిని కార్యాలయం వరకు వాహనాల కాన్వాయ్‌లో మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా తీసుకురానున్నారు. మోదీకి ధన్యవాద సభ ఇక రాష్ఠ్రం నుంచి ఎనిమది మంది ఎంపీలను గెలుచుకోవడం పట్ల.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాద సభ నిర్వహించనున్నారు. అనంతరం చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, కొద్దిరోజుల తర్వాత పార్టీ జాతీయనేతల ఆధ్వర్యంలో, రాష్ట్రంలో పెద్దఎత్తున మోదీ ధన్యవాద సభ’నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారు ల, రాష్ట్ర కార్యదర్శుల, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఎంపీలకు స్వాగత ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శులు (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు. 21న అన్ని మండలాల్లో యోగా డే కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడు తూ, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘సెల్యూట్ తెలంగాణ’ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2028) రాష్ట్రంలో 88 సీట్లలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ముందుకు సాగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు కాసం తెలియజేశారు. -
కమలాన్ని ఆ ఇద్దరే ముంచారా..?
సాక్షి, హైదరాబాద్ : నాయకుల వల్ల పార్టీకి మేలు జరుగుతోందా? పార్టీ వల్ల నాయకులు లబ్ది పొందుతున్నారా? పార్టీకి ఇమేజ్ పెరిగితే లాభ పడేది ఎవరు? నాయకులకు పేరొస్తే ఎవరికి లాభం చేకూరుతుంది? ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో ఇదే చర్చ జరుగుతోంది. ఇద్దరు నాయకుల వ్యవహారంపై హాట్ హాట్‌గా అంతర్గత చర్చలు సాగుతున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? వారే ఎందుకు చర్చనీయాంశాలుగా మారారు? కాషాయసేనకు తెలంగాణ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకే జిల్లాకు చెందినవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు ముఖ్యమైన బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బండి సంజయ్ రాజకీయ జీవితం అంతా బీజేపీలోనే కొనసాగుతోంది. ఈటల రాజేందర్ కొంతకాలం క్రితం గులాబీ పార్టీ నుంచి కాషాయ పార్టీలోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ను ధిక్కరించి కమలం పార్టీ తరపున మళ్ళీ హుజూరాబాద్నుంచి అసెంబ్లికి ఎన్నికయ్యారు. అయితే ఇద్దరి మధ్యా ఏర్పడిన విభేదాల అగాధం తెలంగాణ బీజేపీని ఓ కుదుపు కుదుపుతోంది. ఈటల వచ్చాకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి బండి సంజయ్‌కు దూరమైందనే చర్చలు సాగుతున్నాయి. బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత పార్టీ డీలా పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ ఎఫెక్ట్ ఇంకా పార్టీని వీడకపోగా..కాంగ్రెస్ ను కాదని సెకండ్ ప్లేస్ కు వచ్చి కారు పార్టీని ఢీకొట్టే స్థాయికి చేరిన కమలం పార్టీ..ఇప్పుడు మూడోస్థానంతో డీలా పడిపోవడంతో.. పార్టీలో అంతర్గతంగా ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని అనుకుని కమలం బాట పట్టిన ఈటల.. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీని పరుగులు తీయిస్తున్న బండి సంజయ్ పై బాగానే ఫోకస్ చేశారు. ఈ క్రమంలో బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా పార్టీలో వ్యవహారాలు మారాయి. ఇద్దరు నేతలు బాహాటంగానే ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోవడం..ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రస్థాయిలో కీలకంగా ఉన్న ఓ నేత అడ్వాంటేజ్ గా తీసుకోవడం వంటి పరిణామాలు కొన్ని జరిగాయి. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండికి అప్పటికే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ వంటివాళ్ళతో పొసగకపోవడం వంటి ఎన్నో కారణాలు, సంఘటనలు అన్నీ కలిసి..బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా చేశాయి. కొందరు నేతల మాట విన్న ఢిల్లీ పెద్దలు బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో...బీజేపీ గ్రాఫ్ మొత్తం వేగంగా పడిపోయింది. అయితే, ఈ మొత్తం వ్యవహారానికి ఈటల రాజేందర్ పార్టీలో చేరికే ప్రధాన కారణమనేవారూ కొందరు తయారయ్యారు. దీంతో ఈటల చేరిక ఇప్పుడు బీజేపీకి ప్లస్సా..?మైనస్సా..అనే చర్చకు తెరలేపింది. బండి సంజయ్ విషయానికొస్తే.. మూడుసార్లు కరీంనగర్లో కార్పోరేటర్ గా పనిచేసి.. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. తిరిగి పుంజుకుని కరీంనగర్ నుంచే ఎంపీగా గెల్చారు. ఆ తర్వాత అనూహ్యంగా బీజేపీ పెద్దల ఆశీస్సులతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడయ్యారు. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేతబట్టినప్పటినుంచీ పరుగులు తీయించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కేడర్‌లో ఒక కొత్త జోష్ నింపారు. బండి సంజయ్ కంటే ముందు.. బండి సంజయ్ హయాంలో.. బండి సంజయ్ తర్వాత.. బీజేపీ ఎలా ఉందనే స్పష్టమైన గ్రాఫ్ ను జనం ముందు బండి ఉంచారు. బండి హయాంలో పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిందనే టాక్ కమలం శ్రేణుల్లో తీసుకురాగలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో గాని..తెలంగాణలో గాని ఎవరికీ రానంత క్రేజ్‌తో ఓ సక్సెస్ ఫుల్ రథసారధిగా పేరు తెచ్చుకున్నారు బండి సంజయ్. ఇదే సమయంలో పార్టీలో వచ్చిన ఈ పేరును కాపాడుకోవడంలో మాత్రం సంజయ్ వైఫల్యం చెందాడనేవారూ ఉన్నారు. అందరినీ కలుపుకోలేకపోవడం.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో క్లారిటీ లేకపోవడం.. చేయకూడనివి చేయడం, చేయాల్సినవి చేయకపోవడం.. మీడియా ముందు ఆచితూచి మాట్లాడాల్సిన చోట తప్పటడుగులు వేయడం వంటివన్నీ.. పార్టీలోని ఆయన అంతర్గత ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారాయి. అప్పటికే పార్టీ అంతర్గత ప్రథమ ప్రత్యర్థిగా తయారైన ఈటల రాజేందర్‌తో పాటు..బండి అంటే పడనివారంతా ఏకమై ఆయనపైకి తమ వద్ద ఉన్న అస్త్రాలను ఎక్కుపెట్టడంతో.. బండి పదవి ఊడిందనే టాక్ నడుస్తోంది. బండి సంజయ్ సారథిగా ఉన్నంతకాలం ఒక బూమ్ తో కనిపించిన బీజేపి ఎదుగుదల పాలపొంగులా పడిపోవడంతో.. ఇప్పుడు ఆ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఒక రాజకీయ పార్టీని బలోపేతం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారిగా పుంజుకోవడం అంటే అంత సులభంగా జరిగేది కూడా కాదు. కానీ, బండి సారథ్యంలో బలంగా తయారైన పార్టీని, అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టే పార్టీగా తయారైన పార్టీని.. అందరూ కలిసి నిండా ముంచేశారన్నది ఇప్పుడు వినిపించే టాక్. దీంతో ఈటల చేరిక.. సంజయ్ అధ్యక్ష పదివి నుంచి దిగిపోవడం.. రెండూ పార్టీకి మేలు కంటే నష్టాన్నే చేకూర్చాయనే చర్చోపచర్చలకు తెరలేచింది. మరిప్పుడు మునిగిపోతున్న బీజేపీ నావను.. తిరిగి గట్టెక్కించే అవకాశం అసలుందా...? మరి ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందమేనా..? లేక కీలక నేతలైన బండి, ఈటల వైరమే.. పుట్టి ముంచిందా అనే భిన్నరకాల విశ్లేషణలు జనం మధ్య జరుగుతున్నాయి. -
ఎంపీ వర్సెస్ మంత్రిగా కరీంనగర్ రాజకీయం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో ఇద్దరు నేతల మధ్య రాజకీయ పోరు తీవ్ర రూపం దాలుస్తోంది. వేర్వేరు పార్టీల నుంచి ఇద్దరు నేతలు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నా... ఒకరి నీడను మరొకరు తాకడం లేదు. వీరిలో ఒకరు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల మంత్రి పదవి చేపట్టిన గంగుల కమలాకర్ అయితే... మరొకరు ఎమ్మెల్యేగా గంగుల చేతిలో ఓడిపోయి... కరీంనగర్ బీజేపీ ఎంపీగా ఘన విజయం సాధించిన బండి సంజయ్‌కుమార్. ఎంపీగా సంజయ్ గెలిచిన నాటి నుంచి గంగులతో అంటీ ముంటనట్టుగానే ఉంటున్నప్పటికీ... గత కొద్దిరోజులుగా దూరం మరింత పెరిగింది. ఎంతగా అంటే ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లో కూడా సంజయ్ పాల్గొన లేనంతగా...! వచ్చే మునిసిపల్ ఎన్నికలను ఇరుపార్టీలు సవాల్‌గా తీసుకున్న నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వార్ ఎటువైపు దారితీస్తుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. స్మార్ట్‌సిటీ టెండర్ల ఖరారుపై వ్యతిరేకత కరీంనగర్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ మిషన్ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. రూ.1878 కోట్ల అంచనా వ్యయంతో కరీంనగర్‌ను ఆధునీకరించాలనేది ఈ స్మార్ట్‌సిటీ కాన్సెప్ట్. ఇందులో భాగంగా పటిష్టమైన సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. రూ.217.7 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీల్లో సుమారు 30 కిలోమీటర్ల మేర తొలిదశలో రోడ్ల నిర్మాణానికి గత సంవత్సరం ఆన్లైన్లో టెండర్లు ఆహ్వానించగా, ఒకసారి బిడ్డర్లు ఎవరూ రాక రద్దయింది. రెండోసారి మూడో ప్యాకేజీ టెండర్ ఖరారైనప్పటికీ, ఒకటి, రెండు ప్యాకేజీలకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. ఓ వైపు కోర్టులో కేసు ఉండగానే మూడోసారి టెండర్లను పిలిచారు. ఈ టెండర్ల ప్రక్రియ గడువు మూడురోజుల్లో పూర్తవుతుందనగా, ఆ టెండర్లను వాయిదా చేసినట్లు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ ఓ ప్రతిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గంగుల మంత్రి కాకముందే ఎమ్మెల్యే హోదాలో రంగ ప్రవేశం చేసి, 2వ విడత కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్‌ను కేసు ఉపసంహరించుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో మూడో విడత టెండర్లలో పాల్గొన్న రాజరాజేశ్వర కన్స్ట్రక్షన్స్ సంస్థకు రూ.164 కోట్ల విలువైన 1, 2 ప్యాకేజీలను అప్పగిస్తూ టెండర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక్కడే ఎంపీ హోదాలో తొలిసారి సంజయ్ రంగ ప్రవేశం చేశారు. సింగిల్ టెండర్‌ను ఆమోదించడం, ఒకవైపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి, టెక్నికల్ అంశాలను సాకుగా చూపి కాంట్రాక్టర్‌ను ఖరారు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపించడమే కాకుండా టెండర్లపై విచారణ జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఎంపీ, మంత్రి మధ్య గ్రానైట్ రాయి దీనిపై రాద్ధాంతం సాగుతుండగానే మరోవైపు కరీంనగర్లో గ్రానైట్ వ్యాపారులు వందల కోట్ల రూపాయల రాయల్టీని ప్రభుత్వానికి ఎగ్గొట్టారని, అపరాధ రుసుం కింద విధించిన సుమారు రూ.700 కోట్లు సర్కారుకు చెల్లించలేదని హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విమర్శించారు. గంగుల కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని సంజయ్ 2009 నాటి గ్రానైట్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారనేది టీఆర్ఎస్ నేతల వాదన. మంత్రిగా గంగుల ప్రమాణం స్వీకారం చేసిన తరువాత సంజయ్ విమర్శల జోరు పెంచగా, ఇటీవల గంగుల కూడా తీవ్రంగానే స్పందించారు. కాగా ఇటీవల కరీంనగర్ వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్మార్ట్‌సిటీ టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని వ్యాఖ్యానించడం, పారదర్శకంగా స్మార్ట్‌సిటీ పనులు జరిగేలా చూస్తామనడం గంగుల వర్గానికి ఉత్సాహాన్ని ఇవ్వగా, గ్రానైట్ సమస్యపై మాత్రం కిషన్‌రెడ్డి ఎంపీ సంజయ్‌కు అనుకూలంగా మాట్లాడారు. అధికారిక కార్యక్రమాలకు దూరం గంగుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత స్మార్ట్‌సిటీ పనులు, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదే రోజు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ హాజరు కాలేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి కరీంనగర్ వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా, మంత్రి కమలాకర్ హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న కారణంగా మంత్రి రాలేదని టీఆర్ఎస్ నేతలు సమర్థించుకున్నారు. కాగా సోమవారం కలెక్టరేట్లో మంత్రి కమలాకర్ ‘నేను సైతం... నా నగరం కోసం’ అనే అధికారిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాన్ని కమలాకర్ స్వయంగా డిజైన్ చేసినప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో పాల్గొనే కార్యక్రమం. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి కూడా సంజయ్ రాలేదు. అలాగే 5వ డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా జరుగగా, సంజయ్ యధావిధిగా హాజరుకాలేదు. ఒకరు లేని సమయంలో మరొకరు ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ రూపొందిస్తున్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి నెలకొంది. రాజకీయ సమకాలికులే... ఇంజినీరింగ్ చదివి వ్యాపారం చేసుకుంటూ 2000 సంవత్సరంలో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు గంగుల కమలాకర్. అప్పటి కరీంనగర్ మునిసిపాలిటీకి టీడీపీ తరఫున వార్డు కౌన్సిలర్‌గా గెలిచి వెనుదిరిగి చూడలేదు. కరీంనగర్‌కే చెందిన బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, శిక్షక్‌గా ఎదిగి ఏబీవీపీ ద్వారా తొలుత విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. తరువాత 1994లోనే అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్‌గా గెలిచి దాదాపు పదేళ్లు కొనసాగారు. 2005లో తొలి కార్పొరేషన్‌కు బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ కౌన్సిల్లో గంగుల సైతం టీడీపీ తరఫున ఫ్లోర్‌లీడర్. 2009లో గంగుల ఎమ్మెల్యేగా గెలిచి, 2013లో టీఆర్ఎస్లో చేరారు. 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లో గంగుల కమలాకర్‌పై పోటీ చేసిన సంజయ్ రెండుసార్లు ఓడిపోయారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అనూహ్య విజయం సాధించారు. రాజకీయ సమకాలికులే అయినప్పటికీ, పార్టీలు వేరు కావడంతో ప్రస్తుతం ఎంపీ వర్సెస్ మంత్రిగా కరీంనగర్ రాజకీయం మారింది. -
శక్తివంతమైన భారత్ నిర్మాణమే లక్ష్యం
► బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ ► కరీంనగర్లో నవభారత నిర్మాణ్ ర్యాలీ కరీంనగర్‌సిటీ : శక్తివంతమైన భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ అన్నారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు సోమవారం చేస్తున్న ఆందోళనను వ్యతిరేకిస్తూ కరీంనగర్లో నవభారత్ నిర్మాణ్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో బీజేపీ, బీజేవైం కార్యకర్తలు త రలివచ్చారు. రాజీవ్‌చౌక్, టవర్, బస్టాండ్, తెలంగాణచౌక్ మీదుగా ర్యాలీ స ర్కస్గ్రౌండ్కు చేరుకుంది. ఉగ్రవాదం, నల్లధనాన్ని వెలికితీయడం, అవినీతి ని నిర్మూలించడం, నకిలీనోట్లకు అడ్డుకట్ట వేసేందుకు పెద్ద నోట్ల మార్పిడి అని ముద్రించిన ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు దేశాభి వృద్ధిని విస్మరించి స్వార్థపూరితంగా వ్యవహరించాయన్నారు. పెద్దనోట్ల మా ర్పిడి నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోరుు ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. పెద్దనోట్ల మార్పిడితో లక్షల కోట్ల రూపాయలు బ్యాం కుల్లో డిపాజిట్లు కావడంతో తక్కువ వడ్డీకి ఎక్కవ రుణాలు ఇచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. ప్రజలందరూ తప్పుడు ప్రచారం నమ్మకుండా ఇతరుల డబ్బును తమ ఖాతాలో జమ చేసుకోవద్దన్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన బంద్‌ను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. బీజేపీ, బీజేవైఎం నాయకులు బేతి మహేందర్‌రెడ్డి, బోరుునిపల్లి ప్రవీణ్‌రావు, కటకం లోకేశ్, దుబాల శ్రీనివాస్, సింగిరాల రామరాజు, ముజీబ్, కచ్చు రవి, పొన్నం మొండయ్యగౌడ్, చిట్టిబాబు, రెడ్డవేని రాజు, ప్రవీణ్, బోనాల నరేశ్, తిరుపతి, శేఖర్, వామన్, మహేశ్, సంతోష్, కొంరయ్య, వేణు, గూడెల్లి ఆంజనేయులు, రాజేందర్‌రెడ్డి, జగన్, జశ్వంత్, సత్యం, సృజన్, రమేశ్, శ్రీనివాస్, అఖిల్, రమణారెడ్డి, భాస్కర్, సారుులు పాల్గొన్నారు.