ఫస్ట్ కష్టాలు
సగటు జీవి అయోమయం
అసలు సమస్యలు నేటి నుంచే మొదలు
బ్యాంకుల ముందు భారీగా క్యూలు
గంటల వ్యవధిలో ఖాళీ అవుతున్న క్యాష్ట
జీతం డబ్బులు చేతికొచ్చేనా అంటున్న ఉద్యోగులు
పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడి 22 రోజులు దాటింది. అప్పటినుంచి చిల్లర నోట్ల కోసం సామాన్యుడి పాట్లు అన్నీ ఇన్నీ కావు. డిసెంబర్ ఒకటో తారీఖు నాటికైనా ప్రభుత్వం కొంత ఊరట కల్పిస్తుందని ఆశించారు. అరుుతే ఆ పరిస్థితి లేదు. మొదటి తేదీ వస్తే చాలు.. నెలవారీ బకారుులు, ఇంటి అద్దె, పాల బిల్లు, కిరాణా, పిల్లల ఫీజులు, చీటీలు.. ఇలా ఎన్నో సమస్యలుంటారుు. చేతిలో డబ్బుంటే వీటిని చెల్లించి హారుుగా ఊపిరి పీల్చుకుంటారు మధ్య తరగతి జనం. ప్రస్తుతం బ్యాంకులో చాలీ చాలనీ నగదు కారణంగా ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు. ఇక ప్రైవేటు సంస్థలో పనిచేసే చిరుద్యోగుల ఖాతాల్లోకి నగదు జమ అరుునప్పటికీ అవి చేతికందడం గగనంగా మారింది. రోజంతా బ్యాంకు క్యూలో నిల్చున్నా రూ. రెండు వేలు చేతికందడం కష్టంగా ఉంది.
చిత్తూరు /పలమనేరు: ప్రతి నెలా ఒకటో తారీఖు కొంత ఆనందాన్నిస్తుంది. ఈ ఒకటో తేదీ మాత్రం ఆందోళన రేకిత్తిస్తోంది. ప్రభుత్వం దగ్గర నుంచి సామాన్యుడి వరకు అమ్మో ఒకటో తారీఖు అంటూ వణికిపోతున్నారు. నల్లధనం కట్టడి చేసేందుకు పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. ప్రధాని ప్రకటన అనంతరం ఖాతాల నుంచి నగదు తీసుకునేందుకు ఎదురవుతున్న ఇబ్బందులు సామాన్యులను అయోమయానికి గురిచేస్తున్నారుు. నోట్ల రద్దు ప్రకటన తరువాత సామాన్యులు మూడు వారాల పాటు ఓపిగ్గా నెట్టుకొచ్చారు. నేడు ఒకటో తారీఖు. పాల బిల్లు నుంచి ఇంటి అద్దె వరకు ఎన్నో చెల్లింపులు. ఏటీఎంలు రూ.2 వేల కంటే విదల్చవు. బ్యాంకుల ఎదుట ఉన్న బారులు చూసి ఈ గండం గడిచేదెట్టా అని సగటు జీవి సతమతం అవుతున్నాడు.
పెట్రోలు బంకుకు వెళ్తే చిల్లర ఉంటేనే పోస్తామంటున్నారు. రైతులు తమ పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు. మొదటి వారాన్ని ఎలా దాటాలా అంటూ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గురువారం నుంచి కొత్త నెల ప్రారంభం అవుతుండటంతో ఏటీఎంల వద్ద ఉండే చేంతాడంత బారులను తలచుకొని సామాన్యులు చింతచెందుతున్నారు. బుధవారం నాడే ఎక్కడైనా నగదు దొరుకుతుందేమోనని ఏటీఎంల చుట్టూ చక్కర్లు కొట్టారు. కానీ ఏం లాభం. ఎక్కడా నగదు లేదు.
ఇదిగో సాక్ష్యం...
పలమనేరు మండలంలోని పెంగరగుంటకు చెందిన గిరిబాబు రెండు పాడి ఆవులను మేపుతూ నెలకు పది వేల ఆదాయాన్ని గడిస్తున్నాడు. ఇతని ఇద్దరు పిల్లలు వారి చదువుకు నెలకు రూ.1.200 కరెంటు చార్జీకి రూ.450, బియ్యం, ఇంటి సరుకులకు రూ.4,200, ఆస్పత్రి ఖర్చుగా రూ.500, బైక్ పెట్రోల్‌కు రూ.1,000, గ్యాస్ సిలిండర్‌కు రూ.600. మొబైల్ రీచార్జ్, డిష్ రీచార్జ్‌లకు రూ.600, అదనపు ఖర్చులుగా మరో 1,500 అవుతోంది. ఆ లెక్కన నెలకు ఇతని కుటుంబం ఖర్చు రూ.10 వేలు అవుతోంది. ఇతని రెండు పాడి ఆవుల ద్వారా రోజుకు పది లీటర్ల పాలుపోస్తాడు. అరుుతే బ్యాంకులో జమ అరుున పాలబిల్లు ఒకేదఫా తీసుకునేందుకు వీలుకావడం లేదు. దీంతో బ్యాంకులో నగదు ఉన్నా ఈ నెల 5వేలు అప్పుచేయాల్సిందే. అరుుతే అప్పు పుట్టడం లేదు. దీంతో ఈనెల పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన చెందుతున్నాడు.
క్షేత్రస్థాయిలో తప్పని సమస్యలు
అధికారులు చెబుతున్నట్టు నగదు రహిత లావాదేవీలతోనే అన్ని సమస్యలు తీరడం లేదనే విషయం క్షేత్రస్థారుులో తెలుస్తోంది. ఉదాహరణకు పలమనేరు పట్టణంలో 15వేల కుటుంబాలు 55వేల జనాభా ఉంది. వీరిలో 2వేల కుటుంబాలకు పైగా అద్దె ఇళ్లలో ఉన్నారు. వీరు నెల అద్దెలుగా కొందరు చెక్కులిస్తున్నారు. ఖాతాలు లేనివారి పరిస్థితి గందరగోళంగా మారింది. పట్టణంలో పలు ఇళ్లకు పాడిరైతులే పాలు పోసున్నారు. వీరి వద్ద స్వైపింగ్ మిషన్లు లేవు. స్కూళ్లు, కాలేజీల్లో నగదు లావాదేవీలే జరుగుతున్నారుు. చిన్నపాటి దుకాణాల్లో సరుకుల అమ్మకాలు నగదుతోనే, ప్రతినెలా చీటీలు కట్టేవారు కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఫలితంగా బ్యాంకుల నుంచి డబ్బులు దొరక్క సాధారణ ప్రజలు ఇబ్బందుల పడుతున్నారు.
పెన్షనర్లకు ప్రత్యేక కౌంటర్లు
తమకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. చిల్లర నగదు ఇవ్వడానికి ఆర్బీఐ ఒప్పుకోవడం లేదు. సీనియర్ సిటిజన్లకు ఆరోగ్యపరమైన సమస్యలు అధికంగా ఉంటారుు కాబట్టి బ్యాంకులు దీన్ని దృష్టిలో ఉంచుకుని రూ.25 వేలు చిల్లరనోట్లు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 28 వేల మంది పెన్షనర్లు ఉన్నారు.