Barnes
-
క్రికెట్ చరిత్రలో తొలి బౌలర్‌గా..
హమిల్టన్: క్రికెట్లో బ్యాట్స్‌మెన్, కీపర్, స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నవారు హెల్మెట్ పెట్టుకోవడం సాధారణ విషయం. అంతేకాకుండా డేంజర్ జోన్లో ఫీల్డింగ్ చేసే వారు సైతం హెల్మెట్లను ధరించడం మనం చూశాం. అయితే తాజాగా ఓ బౌలర్ హెల్మెట్ పెట్టుకుని బౌలింగ్ చేసిన ఘటన న్యూజిలాండ్ దేశవాళీ టీ 20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది. న్యూజిలాండ్ సీమర్ వారెన్ బార్నెస్ తలకు హెల్మెట్‌కు పెట్టుకుని బౌలింగ్ చేశాడు. దాంతో ఇప్పటివరకూ క్రికెట్లో కొనసాగుతున్న సంప్రదాయానికి బార్నెస్ చెక్ పెట్టాడు. హమిల్టన్ వేదికగా సెడాన్ పార్క్‌లో ఒటాగో-నార్తరన్ నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. తొలుత నార్తరన్ నైట్స్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ కాలుకు బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి తాకింది. ఆ బంతి తలకి తాకి ఉంటే ఇంకేమైనా ఉందా? అని భావించిన వారెన్ తాను బౌలింగ్ వేస్తున్నప్పుడు బేస్‌బాల్ అంపైర్ ధరించే హెల్మెట్‌ను పెట్టుకుని మరీ బౌలింగ్ వేశాడు. మ్యాచ్ అనంతరం తాను హెల్మెట్ ధరించడాన్ని వారెన్ సమర్థించుకున్నాడు. బౌలింగ్ చేసేటప్పుడు తన తల నేరుగా బ్యాట్స్‌మెన్ వైపే ఉంటుందని, కాబట్టి బ్యాట్స్‌మెన్ కొట్టే బంతి తలకు తాకే అవకాశం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో బౌలింగ్ వేసే సమయంలో హెల్మెట్ ధరించిన తొలి బౌలర్‌గా బార్నెస్ గుర్తింపు పొందాడు. -
ఇలాంటి బర్త్ డే ఎక్కడా చూడలేరేమో.. !
వాషింగ్టన్: ఒక వ్యక్తి వందో పుట్టిన రోజు జరుపుకోవడమంటేనే ఈ రోజుల్లో ఆశ్చర్యకరమైన విషయం. అలాంటిది ముగ్గురు స్నేహితులు కలిసి వందో పుట్టిన రోజు జరుపుకునే సందర్భం వస్తే ఎలా ఉంటుంది? అమెరికాలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఒక స్నేహితుడుగానీ, స్నేహితురాలుగానీ కలిసి పుట్టిన రోజు జరుపుకునే సందర్భాలు కేవలం వేళ్లపై లెక్కబెట్టుకునేన్ని మాత్రమే ఉండే ఈ రోజుల్లో ఏకంగా ఓ ముగ్గురు స్నేహితురాళ్లు పుట్టిన రోజుకు హాజరుకావడమే కాకుండా ఏకంగా వందో పుట్టిన రోజు కలిసి ముందస్తుగా జరుపుకున్నారు. ఈ ముగ్గురికి కూడా అక్కడి మేయర్ ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు. వాషింగ్టన్ లో 1916 జూలై నెలలో బార్నెస్, బట్లర్, అండర్ వుడ్, రూత్ హామెట్ అనే నలుగురు జన్మించారు. వీరు చిన్నప్పటి నుంచే మంచి స్నేహితురాళ్లు. సంసారాల్లో వేర్వేరు జీవితాలతో బిజీగా ఉన్న పండుగలు, పబ్బాలకే కాకుండా తమ పుట్టిన రోజుకు తప్పనిసరిగా కలుస్తుంటారు. వాషింగ్టన్ లోని జియాన్ బాప్టిస్ట్ చర్చిలో తమ పుట్టిన రోజు జరుపుకుంటారు. మరికొద్ది రోజుల్లో వారికి వందేళ్లలోకి అడుగుపెడతారు. అయితే, ఈ నలుగురిలో బార్నెస్ అనే తమ స్నేహితురాలు చనిపోగా మిగిలి ఉన్న ఆ ముగ్గురు స్నేహితురాళ్లు అదే చర్చిలో వందో పుట్టిన రోజు కేక్ కట్ చేశారు. ఎంతో సంబురంగా జరిగిన వేడుకలో తమ కుటుంబాల సంతానమే ఒక పెద్ద సమూహంగా దర్శనమిచ్చింది. ఈ సందర్బంగా ఒక్కొకరు ఒక అరగంట మాట్లాడి తమ స్మృతులు నెమరు వేసుకున్నారు.