కమ్మాడ్ తోంగ్ ఎన్కౌంటర్ బూటకం
-దక్షిణ బస్తర్ డివిజన్ కార్యదర్శి వికాస్
భద్రాచలం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం ఠాణా పరిధిలోని కమ్మాడ్ తోంగ్ గ్రామంలో ఈ నెల 23వ తేదీన సోడిపాండు(50) అనే గ్రామస్తుడిని సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు బూటకపు ఎన్కౌంటర్ చేశాయని మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కార్యదర్శి వికాస్ పేర్కొన్నారు. ఎన్కౌంటర్ను ఖండిస్తూ ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు.
కమ్మాడ్తోంగ్ గ్రామంపై దాడి చేసి ఇళ్లలో ఉన్న ప్రజల్ని పట్టుకుని కొట్టారని.. కొందర్ని విడిచి పెట్టారని తెలిపారు. గ్రామస్తుల ముందే పాండును అడవిలోకి తీసుకెళ్లి డ్రస్ తొడిగించి చెట్టుకు కట్టేసి కాల్చి చంపారని పేర్కొన్నారు. లక్ష రివార్డు ఉన్న జన్మిలీషియా కమాండర్ ఎన్కౌంటర్లో చనిపోయాడని బస్తర్ ఐజీ ఎస్ఆర్పీ కల్లూరి బూటకపు ప్రచారం చేస్తున్నాడని ఆ ప్రకటనలో ఆరోపించారు.