ఇంజనీరు అంకన్రావు కిడ్నాప్‌పై కనిపించని పురోగతి
అసోం: చిరంగ్ జిల్లాలో ఆదివారం కిడ్నాప్‌కు గురైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజనీర్ బత్తుల అంకన్రావు కిడ్నాప్ కేసుపై మూడురోజులైన పురోగతి కనిపించలేదు. ఇంకా అంకన్రావు బోడో తీవ్రవాదుల చెరలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు రాష్ట్రప్రభుత్వ స్థాయిలోనూ స్పందన కరువు కాగా. అటు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో అంకన్రావు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోంలోని చిరంగ్ జిల్లాలో ఆదివారం అంకన్రావు పనిచేస్తున్న సైట్లో పనులు ముగించుకుని మరో ముగ్గురు సూపర్వైజర్లతో కలిసి కారులో బస చేసిన ప్రాంతానికి తిరిగి వస్తుండగా సాయంత్రం ఆయుధాలు ధరించిన బోడో మిలిటెంట్లు అటకాయించి వారిపై దాడి చేసి బంధించిన సంగతి తెలిసిందే.
వారిలో ముగ్గురిని విడిచిపెట్టగా అంకన్ రావును మాత్రం తీవ్రవాదులు వదిలిపెట్టలేదు. ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులు అంకమ్మరావు భార్యకు ఆదివారం రాత్రి సమాచారమిచ్చారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం జాగర్లమూడి గ్రామానికి చెందిన అంకమ్మరావు హైదరాబాద్‌కు చెందిన బొల్లినేని శీనయ్య నిర్మాణ కంపెనీలో పదేళ్లుగా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ అసోంలోని ఆమ్‌గుడి గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్‌కు సంబంధించిన కాంట్రాక్టు చేపట్టింది. అక్కడి అంకమ్మరావు ఏడాది నుంచి సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. అంకమ్మరావు గురించి అన్వేషణ ప్రారంభించామని, మిలిటెంట్ల డిమాండ్లు ఇంకా చెప్పలేదని అన్నారు.