bbb grade
-
భారత్ రేటింగ్ అంచనా పెంపు
న్యూఢిల్లీ: భారతదేశ సార్వభౌమ రేటింగ్‌కు సంబంధించి ‘అవుట్‌లుక్’ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రెండేళ్ల తర్వాత ‘నెగెటివ్’ నుండి ‘స్థిరం’కు అప్‌గ్రేడ్ చేసింది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ వల్ల మధ్య–కాల వృద్ధికి ఎదురయ్యే సవాళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే రేటింగ్‌ను మాత్రం ‘బీబీబీ (–) మైనస్’గా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ఫిచ్ 2006 ఆగస్టులో ‘బీబీబీ–’కు అప్‌గ్రేడ్ చేసింది. అప్పటి నుంచి ఇదే రేటింగ్ కొనసాగుతోంది. అయితే అయితే అవుట్‌లుక్ మ్రాతం ‘స్టేబుల్’–‘నెగటివ్’మధ్య ఊగిసలాడుతోంది. భారత్ ఎకానమీ రికవరీ వేగవంతంగా ఉందని, ఫైనాన్షియల్ రంగం బలహీనతలు తగ్గుతున్నాయని ఫిచ్ తాజాగా పేర్కొంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తీవ్రత వల్ల సవాళ్లు ఉన్పప్పటికీ ఎకానమీకి ఉన్న సానుకూల అంశాలు తమ తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది. మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. ► ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో భారత్ ఎకానమీ అంచనాలను 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నాం. మార్చిలో వేసిన అంచనాలు 8.5 శాతం నుంచి 7.8 శాతానికి కుదిస్తున్నాం. అంతర్జాతీయ కమోడిటీ ధరల తీవ్రత, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, కఠిన ద్రవ్య విధానం దీనికి కారణాలు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 8.7 శాతం పురోగమించింది. ► కోవిడ్ –10 మహమ్మారి షాక్ నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ దృఢమైన రికవరీని కొనసాగిస్తోంది. ► సహచర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్ పటిష్ట వృద్ధిలో పయనిస్తోంది. ఇది ఎకానమీపై మా అవుట్‌లుక్ మారడానికి కారణం. -
భారత్ వృద్ధికి ఢోకా లేదు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుతం మందగమనంలో కొనసాగుతున్నా... దేశ ఆర్థిక మూలాల పటిష్టతపై విశ్వాసాన్ని గ్లోబల్ దిగ్గజ రేటింగ్ సంస్థ– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) వ్యక్తం చేసింది. దీర్ఘకాలికంగా చూస్తే, భారత్ ఆర్థిక వృద్ధి క్రమంగా పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న వ్యవస్థాగత సంస్కరణలు, ద్రవ్య, పరపతి, విధాన నిర్ణయాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషించింది. 2020–2021లో దేశ వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. 2021–2022లో ఈ రేటు 7 శాతానికి, అటుపై ఆర్థిక సంవత్సరం 7.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది. ఈ అంచనాల నేపథ్యంలో దీర్ఘకాలికంగా భారత్ సార్వభౌమ రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’గా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక కంపెనీ లేక దేశం తన ద్రవ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలదని ‘బీబీబీ’ రేటింగ్ సూచిస్తుంది. ఎస్అండ్పీ ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను చూస్తే... ► ఇటీవలి త్రైమాసికాల్లో భారత్ ఆర్థిక వృద్ధి బలహీన ధోరణిని ప్రదర్శిస్తోంది. అయితే దేశ వ్యవస్థాగత వృద్ధి పనితీరు పటిష్టంగా, చెక్కుచెదరకుండా ఉంది. దీనివల్ల వాస్తవిక (ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని) జీడీపీ వృద్ధి క్రమంగా రెండు మూడేళ్లలో రికవరీ చెందుతుందని భావిస్తున్నాం. ► తోటి వర్థమాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చిచూస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ పనితీరు రానున్న కాలంలో మెరుగ్గానే కొనసాగుతుంది. ► తగిన ద్రవ్య, పరపతి విధానాలు, సైక్లికల్ ఫ్యాక్టర్స్ (తప్పనిసరిగా తిరిగి మెరుగుపడే కొన్ని అంశాలు), సానుకూల వ్యవస్థాగత అంశాలు ఆర్థిక వ్యవస్థ రికవరీకి దోహదపడతాయి. విదేశీ మారకద్రవ్య నిల్వల పరిస్థితి మెరుగ్గా ఉండడం ఇక్కడ గమనార్హం. ► జనాభాలో యువత అధికంగా ఉండడం, పోటీపూర్వక కార్మిక వ్యయాలు, సానుకూల కార్పొరేట్ పన్ను విధానాల వంటి అంశాలను వ్యవస్థాగతంగా భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలమైనవిగా పేర్కొనవచ్చు. 2020–2024లో వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు సగటు 7.1 శాతంగా ఉంటుందన్నది విశ్లేషణ. ► అయితే భారత్ ద్రవ్య పరిస్థితులు ఇంకా కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ముఖ్యంగా ద్రవ్యలోటు ప్రభుత్వ ప్రణాళికలను దాటిపోయింది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో దీని కట్టడి కొంత పరిమితంగానే ఉండే వీలుంది. అయితే ఆయా అంశాల్లో భారత్ పురోగతి సాధించగలిగితే, రేటింగ్ పెరిగే అవకాశాలూ ఉంటాయి. వృద్ధి, ద్రవ్యలోటు వంటి అంశాల్లో తన అంచనాలు విఫలమైతే, రేటింగ్ మరింత కోతకు కూడా వీలుంటుంది. ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల బలహీన పరిస్థితులు వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రైవేటు వినియోగాన్ని కట్టడి చేసే వీలుంది. ► జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన అంచనాల ప్రకారం– 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 5 శాతం. అయితే 2020–21లో ఈ రేటు 6 శాతంగా ఉండే వీలుందని ఎన్ఎస్ఓ పేర్కొంది. దీనికి సరిసమానంగా ఎస్అండ్పీ అంచనాలు కూడా ఉండడం గమనార్హం. -
మళ్లీ అదే రేటింగ్..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముంగిట అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తాజాగా భారత్‌కు మరోసారి ట్రిపుల్ బి మైనస్ రేటింగ్ ఇచ్చింది. దీంతో వరుసగా 13వ ఏడాది ఇదే రేటింగ్ కొనసాగించినట్లయింది. పెట్టుబడులకు సంబంధించి తక్కువ స్థాయి గ్రేడ్‌ను ఇది సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉండటమే భారత రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఫిచ్ పేర్కొంది. 2006 నుంచి భారత సార్వభౌమ రేటింగ్‌ను ఫిచ్ ఇదే స్థాయిలో కొనసాగిస్తోంది. ‘ప్రభుత్వ రుణభారం పేరుకుపోవడంతో పాటు ఆర్థిక రంగం పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ.. మధ్యకాలికంగా భారత వృద్ధి అంచనాలు పటిష్టంగా కనిపిస్తున్నాయి. విదేశీ నిల్వలు పుష్కలంగా ఉండటంతో పాటు విదేశీ పరిణామాలను దీటుగా ఎదుర్కొనగలిగే సత్తా కనిపిస్తుండటం ఈ అభిప్రాయానికి ఊతమిస్తున్నాయి‘ అని ఫిచ్ వివరించింది. మధ్యకాలికంగా ప్రభుత్వం అనుసరించబోయే ద్రవ్య విధానాలు.. రేటింగ్ అంచనాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. విధానపరమైన ఎజెండాపరంగా చూస్తే సార్వత్రిక ఎన్నికల కారణంగా తాత్కాలికంగా కొంత అనిశ్చితి నెలకొన్నా.. గడిచిన 30 ఏళ్లుగా చరిత్ర చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ సంస్కరణలపైనే దృష్టి పెడుతుండటం చూడవచ్చని వివరించింది. ‘ఎన్నికల సరళి చూస్తుంటే ప్రస్తుత ప్రభుత్వంతో పోలిస్తే కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి తక్కువ మెజారిటీనే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అది జీఎస్టీ వంటి పెద్ద సంస్కరణలకు మద్దతు కూడగట్టుకోవడం కష్టసాధ్యంగా ఉండొచ్చు. అయినప్పటికీ సంస్కరణలపై దృష్టి పెట్ట డం మాత్రం కొనసాగుతుంది‘ అని ఫిచ్ తెలిపింది. ఈసారి 6.8 శాతం వృద్ధి.. భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగాను ఉండొచ్చని ఫిచ్ అంచనా వేసింది. ఉదార ద్రవ్యపరపతి విధానాలు, బ్యాంకింగ్ నిబంధనలను సరళతరం చేయడం, ప్రభుత్వ వ్యయాలు పెంచడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. 2018–19 మధ్య కాలంలో భారత వృద్ధి రేటు సగటున 7.5 శాతంగా నమోదైందని తెలిపింది. సాధారణంగా 3.6 శాతంగా ఉండే ట్రిపుల్ బి రేటింగ్ ఉండే దేశాల సగటుతో పోలిస్తే ఇది రెట్టింపని ఫిచ్ తెలిపింది. ప్రస్తుత ప్రభుత్వం వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ), దివాలా స్మృతి వంటి కొన్ని కీలకమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని, మరికొన్ని సంస్కరణలు కూడా ప్రవేశపెట్టినప్పటికీ.. వాటి ప్రభావాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని వివరించింది. ‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించడం, పాలనాపరంగా కఠిన నిబంధనలు సరళతరం చేయడం వల్ల లావాదేవీల వ్యయాలు తగ్గాయి. అయితే వ్యాపారాల నిర్వహణకు సంబంధించి ఇంకా సవాళ్లు కొనసాగుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక కూడా ఆకర్షణీయ స్థాయిలో ఉండటం లేదు‘ అని ఫిచ్ తెలిపింది. ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోనున్న ప్రభుత్వం: గార్గ్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి విధించుకున్న ద్రవ్యలోటు లక్ష్యం 3.4 శాతానికి చేరువలోనే ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్రగార్గ్ తెలిపారు. వాస్తవానికి తొలుత 3.3 శాతానికి ద్రవ్యలోటును కట్టడి చేయాలనుకున్న కేంద్ర సర్కారు, ఇటీవలి బడ్జెట్లో ప్రకటించిన పలు రాయితీలు, పథకాలతో లోటును 3.4 శాతానికి సవరించుకుంది. ఈ లక్ష్యానికి చాలా సమీపంలోనే ఉన్నామని గార్గ్ స్పష్టం చేశారు. కొన్ని గణాంకాలు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. 2018–19లో పరోక్ష పన్నుల వసూళ్లలో లోటు ఉంటుందంటూ ప్రభుత్వం తరచూ చెబుతూ వస్తున్న విషయం గమనార్హం. ప్రత్యక్ష పన్నుల (వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను) ద్వారా తొలుత రూ.11.5 లక్షల ఆదాయం సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకోగా, దానిని సైతం రూ.12 లక్షల కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. -
‘స్థిరం’గానే ఆర్థిక వ్యవస్థ..
భారతఖ రేటింగ్ అవుటఖలుక్పై ఫిచ్ ‘బీబీబీ-’ గ్రేడ్ కొనసాగింపు... ‘జంక్’ స్థాయికి ఒకమెట్టే ఎక్కువ 2015-16లో వృద్ధి రేటు 7.5%గా అంచనా న్యూఢిల్లీ: భారతఖ ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌కు సంబంధించి తమ ‘అవుటఖలుక్’ యథాతథమని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ప్రకటించింది. భారతఖకు ఇప్చడున్న ‘బీబీబీ-’ రేటింగ్‌ను కొనసాగించింది. అవుటఖలుక్ను ‘స్థిరం’గానే ఉంచుతున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రస్తుత రేటింగ్ పెట్టుబడులకు సంబంధించి అత్యంత కనిష్ట స్థాయిది కావడం గమనార్హం. జంక్ (చెత్త) హోదాకు ‘బీబీబీ-’ ఒక మెట్టు ఎక్కువ. అనుకూల-ప్రతికూల అంశాలు రెండూ సమతౌల్యంగా ఉన్నట్లు ఈ అవుటఖలుక్ సూచిస్తుంది. మధ్య కాలికంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి పటిష్టత, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, కరెంటఖ అకౌంటఖ లోటు (?ఫఐఐ,?ఫడీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీపోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిధుల మధ్య వ్యత్యాసం) తగిన స్థాయిల్లో ఉండడం సానుకూలతలుగా పేర్కొంది. ప్రభుత్వ అధిక రుణ భారాలు, ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయ- వ్యయాల మధ్య వ్యత్యాసం), అననుకూల వ్యాపార పరిస్థితులు వంటి బలహీన వ్యవస్థీకృత అంశాలు సవాళ్లుగా వివరించింది. అయితే ఇదే సమయంలో వ్యాపార పరిస్థితులకు సంబంధించి వాతావరణం మెరుగుపడుతున్నటూ ఫిచఖ పేర్కొనడం విశేషం. భారతఖ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాజా ఫిచఖ రేటింగ్స్ ప్రకటనలో ముఖ్యాంశాలు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారతఖ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనా 7.5%. 2016-17లో ఈ రేటు 8 %కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం, వ్యవస్థీకృత సంస్కరణల ఎజెండాను క్రమంగా అమలుచేయడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు. గడచిన ఆర్థిక సంవత్సరం భారతఖ వృద్ధి రేటు 7.3%. భారతఖ జీడీపీ వృద్ధి అవుటఖలుక్ పటిష్టంగా కనిపిస్తోంది. 2015లో రిజర్వ్ బ్యాంక్ ?ఫ ఇండియా 1.25 శాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.75 శాతం) కోత కూడా జీడీపీ వృద్ధి రేటు బలోపేతానికి దోహదపడుతున్న అంశం. రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్ పూర్తిగా వినియోగదారుకు బదలాయించనప్పటికీ వృద్ధి పటిష్టత విషయంలో ప్రతికూలత ఏదీ లేదు. 1.25 శాతం రెపో కోతలో 0.60 శాతం ప్రయోజనాన్ని మాత్రమే బ్యాంకింగ్ రుణ గ్రహీతకు బదలాయించింది. బ్యాంకింగ్‌లో 2015-16లో మొండి బకాయిల భారం 4.9 %కి చేరే అవకాశం ఉంది. 2018-19కల్లా బాసెలఖ 3 నిబంధనలకు అనుగుణంగా కొత్త మూలధనం కల్పన అంశంలో... బ్యాంకింగ్ అంతర్గత నిధుల సమీకరణకు ఇది ఇబ్బందికరమైన అంశం. ప్రభుత్వ రుణ భారాలు తగ్గడం, ఆర్థిక సంస్కరణల ద్వారా మెరుగుపడిన వాణిజ్య వాతావరణ పరిస్థితులు, అధిక వృద్ధి రేటు, పెట్టుబడులు, పూర్తి అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు మున్ముందు రేటింగ్ మరింత మెరుగుదలకు దోహదపడే అంశాలు. అయితే ద్రవ్యలోటు లక్ష్యం దారితప్పడం, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల భారం పెరగడం, అధిక ద్రవ్యోల్బణం, కరెంటఖ అకౌంటఖ లోటు కట్టుతప్పడం ప్రతికూల రేటింగ్ చర్యలకు దారితీస్తాయి. సంస్కరణల వల్ల వ్యాపార సానుకూల పరిస్థితులు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే మౌలికరంగంలో ఇబ్బందులు, పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఒక్క రాత్రిలో పరిష్కారమయిపోవన్నది గుర్తించాలి. ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలు ద్రవ్యలోటు లక్ష్య (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 3.9 శాతం) సాధన అవకాశాలపై అనుమానాలు సృష్టిస్తోంది. అదనపు ఆదాయం సమకూరనిదే ద్రవ్యలోటు లక్ష్య సాధన కష్టంగా కనబడుతోంది. కేంద్రం, రా?ాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతం ఉండే అవకాశం ఉంది. ‘బీబీబీ’ రేటింగ్ ఉన్న దేశాల సగటు 2.8 శాతంకన్నా ఇది అధికం. విద్యుతఖ పంపిణీ కంపెనీల ఆర్థికభారం ప్రధానంగా రా? ప్రభుత్వాలపై పడుతోంది. 2014-15లో ప్రభుత్వ రుణ భారం జీడీపీలో 66.8 శాతం ఉంటే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 68.8 శాతానికి ఎగసే పరిస్థితి ఉంది. ‘బీబీబీ-’ శ్రేణి దేశాలకు సంబంధించి అధిక ప్రభుత్వ రుణ భారం ఉన్న దేశాల్లో భారతఖ ఒకటి. వస్తు సేవల పన్నుసహా పెద్ద సంస్కరణల అమలులో రాజ్యసభలో మద్దతు పొందడం ప్రభుత్వానికి కీలక అంశం. ఏకాభిప్రాయ సాధన సంస్కరణల అమలులో ముఖ్యమైనది. అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు దిగువ స్థాయిలో ఉండడం దేశానికి లాభిస్తున్న అంశం. 2015-2016లో సగటున బేరలఖ ధర 55 డాలర్లు ఉంటుంది. 2017లో ఇది 65 డాలర్లకు పెరిగే వీలుంది. రాజకీయ ఇబ్బందులు, సామాజిక అనిశ్చితి, ప్రత్యేక ఉద్యమాలు, తీవ్రవాదం, నక్సలైట్ల వంటి తిరుగుబాటు కార్యకలాపాల వల్ల ఆర్థిక క్రియాశీలతకు తీవ్ర విఘాతం ఏదీ కలగదు. ఏమిటీ రేటింగ్స్..? విదేశీ ఇన్వెస్టర్లు, ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు ఒక దేశంలో పెట్టుబడులు పెట్టడానికి తరచూ ఫిచఖ, ?సఅండ్పీ, మూడీ?స వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల ‘రేటింగ్స్’ను పరిగణనలోకి తీసుకుంటాయి. ?సఅండ్పీ రేటింగ్ కూడా భారతఖకు సంబంధించి ‘బీబీబీ-’స్టేబులఖగా ఉంది. పాజిటివఖ అవుటఖలుక్తో ‘బీఏఏ3’ రేటింగ్‌ను మూడీ?స ఇస్తోంది.