BC sammelanam
-
చంద్రబాబుకు బీసీలంటే ఓటు బ్యాంకుగానే చూసారు: విజయసాయిరెడ్డి
-
బీసీలంతా ఐక్యంగా ఉంటేనే పనులు సాధ్యం:ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: బీసీ సామాజిక వర్గాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, బీసీలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలో బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ఆయన ప్రసంగించారు. 139 కులాలతో బీసీలు ఉన్నారు. అందరూ ఏకతాటి మీద నిలబడాలి. కొన్ని కులాలు విడిపోయి ఇతర కులాల్లో చేర్చాలనే డిమాండ్ చేయటం వలన ప్రయోజనం ఉండదు. ఐకమత్యంతో ఉంటేనే ఏవైనా పనులు సాధించవచ్చు. చట్టసభల్లో కూడా 50% మహిళకు అవకాశం కల్పించేలా బిల్లు తేవాలి అని విజయసాయిరెడ్డి మాట్లాడారు. బీసీల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని, కార్పొరేషన్ పదవుల్లో బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఇదీ చదవండి: తాడేపల్లిలో వైఎస్సార్సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం -
అన్ని కులాలను చంద్రబాబు మోసం చేశారు
-
అనంతపురం జిల్లాలో బీసీలకు ఓ ఎంపీ స్థానం
సాక్షి, అనంతపురం : ప్రతీ కులాన్ని మోసం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె సమీపంలో నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన శనివారం ప్రసంగించారు. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అన్యాయం, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు వైఎస్ జగన్ చెప్పారు. బాబు నాలుగేళ్ల పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? అని వైఎస్ జగన్ ప్రశ్నించగా.. ప్రజల నుంచి లేదు అన్న సమాధానం వినిపించింది. కులాలను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని.. కానీ, ప్రతీ కులాన్ని ఎలా మోసం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు మ్యానిఫెస్టో పెట్టారని, అందుకు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న పరిస్థితులే నిదర్శనమని వైఎస్ జగన్ చెప్పారు. కురుమలను ఎస్టీల్లో చేరుస్తానని , బోయలను ఎస్టీల్లో చేరుస్తానని మూడుసార్లు తీర్మానం చేశారని, రజకులను ఎస్సీలుగా మారుస్తానని చంద్రబాబు చెప్పారని.. కానీ, ఆ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని వైఎస్ జగన్ తెలిపారు. ఇంకా వైఎస్ జగన్ ఏం చెప్పారంటే... ఎన్నికల హామీని చంద్రబాబు అమలు చెయ్యరు. అధికారంలోకి వచ్చాక కూడా ఇది కేంద్రం పని అని తప్పించుకుంటున్నారు. సినిమాల్లోని విలన్ల కన్నా దారుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఇంతవరకు ఏ టీడీపీ నేత కూడా పరామర్శించలేదు. లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని ప్రకటించారు కానీ, అది నెరవేర్చలేదు. బాబు సీఎం అయ్యాక రుణమాఫీ ఎలా ఉన్నా.. ప్రతీ నెలా వచ్చే సబ్సిడీ కూడా చేనేత కార్మికులకు అందటం లేదు' అని అన్నారు. నాలుగు కత్తెర్లు, నాలుగు ఐరెన్ బాక్సులిచ్చి బీసీలపై ప్రేమ ఉందంటే ఎలా? ఇచ్చింది లేదు.. సచ్చింది లేదు.. అయినా అటు నుంచి వచ్చేసింది అన్నచందాన చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. ఓవైపులు కేక్ కట్ చేయంటారు. మరోవైపు ధర్నాలు చేయమంటారు. అలాంటప్పుడు వాళ్లు చేసింది ఏంటి?. బీసీల అభివృద్ధి అంటే వారిని పేదరికంలోని ఎలా బయటకు తీసుకురావాలి.. వారి అభివృద్ధికి ఏమేం చేయాలో ఆలోచించాలి. ఆ పని చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఒక్క దివంగత నేత వైఎస్సార్ మాత్రమే. ఆయన హయాంలో చదువుల విప్లవం వచ్చింది. ఇంజనీర్లు, డాక్టర్లు అయిన వాళ్లు ఇప్పుడు ఆ మహానేతను గుర్తు చేసుకుంటున్నారు. కానీ, వైఎస్సార్ మరణం తర్వాత పరిస్థితి తిరగబడింది. బాబు పాలనలో ఉచిత విద్య లేదు. పేదలకు ఆరోగ్య సేవలు దూరం అయ్యాయి. 108, ఆరోగ్యశ్రీలు నిర్వీర్యం అయ్యాయి. చంద్రబాబు కంటే నేను చిన్నవాడినే కావొచ్చు కానీ, ఆయనలా మోసం చెయ్యను. కులాల అభివృద్ధి కోసం కచ్ఛితంగా కృష్టి చేస్తాను. ప్రజలకు మేలు చేసేందుకే నవరత్నాలు తీసుకొచ్చాను. పేదరికం దూరం చేసేందుకు నాన్న ఒక్క అడుగు ముందుకు వేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తా. నవరత్నాల పథకం ద్వారా ప్రతీ చిన్నారి చదువుకుంటారు. ప్రతీ తల్లి ఖాతాలో ఏటా 15 వేలు ఇస్తాం. చదువుల కోసం అప్పుల చేసే అవసరం లేకుండా ప్రతీ బీసీ కుటుంబానికి అండగా ఉంటా. పని చేసే శక్తి కోల్పోయిన వాడు ఆకలితో అలమటించకూడదు. బాబు పాలనపై మనకు మనమే ప్రశ్నించుకోవాలని తరుణం వచ్చింది అని జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన బీసీ సంఘాలతో ముఖాముఖి కొనసాగించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్న సానుకూలంగా స్పందించారు. ‘‘అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదం పునరావృతం కాబోదు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో కనీసం ఒక ఎంపీ స్థానం బీసీలకే కేటాయిస్తాం. విభజన తర్వాత అన్యాయం జరిగిన కులాలకు అండగా ఉంటాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
రాజ్యాధికారమే లక్ష్యం
‘బీసీ సమ్మేళనం’లో కుల సంఘాల ప్రతినిధుల పిలుపు అధికారంతోనే బీసీల సర్వతోముఖాభివృద్ధి బడుగులను అణగదొక్కుతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి డిసెంబర్ 17న నిజాం కళాశాలలో బీసీ సభ రాజ్యాధికారం ద్వారానే బడుగు, బలహీన వర్గాల ప్రజలు సర్వతోముఖాభివృద్ధి సాధించగలరని వెనుకబడిన తరగతుల సంఘాల నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బడుగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని, ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘రాజ్యాధికారమే లక్ష్యం’ అనే నినాదంతో ‘బీసీ కులాల సమ్మేళనం’ సదస్సును శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. అన్ని బీసీ కుల సంఘాల ప్రతినిధులతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలను రాజకీయ పార్టీలన్నీ ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాయే తప్ప.. వారి సంక్షేమాన్ని గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ చైర్మన్ పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉన్నా కిరణ్ సర్కారు పట్టించుకోవడం లేదని, 16 బీసీ ఫెడరేషన్లకు పాలకవర్గాలను నియమించలేదని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అన్ని పార్టీలూ 150 సీట్లు కేటాయించాలని, పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 50 శాతం నిధులు కేటాయించాలని, ఎస్సీల తరహాలోనే బీసీలకు కూడా 50 శాతం సబ్సిడీతో రూ. 5 నుంచి 15 లక్షల వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ కులాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 17న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కృష్ణయ్య ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా బీసీలకు సామాజిక న్యాయం అందలేదని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించిన ప్రభుత్వం.. బీసీ కమిషన్‌పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. న్యాయవ్యవస్థలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా రాష్ట్ర హైకోర్టులో అది అమలుకావడం లేదని ఈశ్వరయ్య ఆరోపించారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించాలని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలు ఐకమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధించగలరని సూచించారు. రాష్ట్రంలోని అన్ని కులాల వారికీ అసెంబ్లీలో చోటుదక్కాలని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆకాక్షించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే ఎల్.రమణ, బీసీ నేతలు శ్రీనివాసగౌడ్, బొజ్జ కృష్ణయ్య, పలువురు బీసీ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. డిసెంబర్ 17న రాజకీయ పార్టీ ప్రకటన?: బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించాలని బీసీ కుల సంఘాల నేతలు భావిస్తున్నారు. వచ్చే నెల 17న నిజాం కళాశాల మైదానంలో జరిగే బీసీ సభలో కొత్త పార్టీని ప్రకటించాలని వారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణయ్య అధ్యక్షతలో రూపుదాల్చనున్న ఈ పార్టీలో అన్ని బీసీ కులాలకు సమ ప్రాధాన్యం దక్కుతుందని నేతలు చెప్తున్నారు. ఇతర పార్టీల్లోని బీసీ నేతలను తమ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.