Bedi
-
బిషన్‌సింగ్, చేతన్ చౌహాన్‌లపై గౌతీ ఫైర్..
న్యూఢిల్లీ : ఆటగాడిగా గౌతమ్ గంభీర్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అతని మాటల్లో కూడా అంతే పదును కనిపిస్తుంది. ఇక తాను అండగా నిలిచిన ఒక ఆటగాడి రాష్ట్రం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అతను ఊరుకుంటాడా! తాజాగా అతని మాటలు దీనిని మరోసారి నిరూపించాయి. అఫ్గానిస్తాన్‌తో టెస్టు కోసం ఢిల్లీ పేసర్ నవదీప్ సైని భారత జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. హరియాణాలోని కర్నాల్‌లో పుట్టిన సైని రంజీల్లో ఢిల్లీ తరఫునే ఆడినా... దిగువ స్థాయి క్రికెట్లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. అతడు ‘బయటి వ్యక్తి’ అంటూ గతంలో బిషన్‌సింగ్ బేడి, చేతన్ చౌహాన్ విమర్శించారు. సైనిని ఢిల్లీకి ఆడించడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్‌పై కూడా వ్యతిరేకత కనబర్చారు. తాజాగా సైని ఎంపికను నిరసిస్తూ ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారులు కరపత్రాలు పంచడంతో పాటు నల్ల బ్యాండ్లు ధరించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. ‘బయటి వ్యక్తి సైని భారత జట్టుకు ఎంపిక కావడంపై ఢిల్లీ సభ్యులు బేడి, చౌహాన్‌లకు నా సానుభూతి. నల్ల బ్యాండ్లు బెంగళూరులో కూడా ఒక్కో రోల్‌కు రూ. 225 చొప్పున లభిస్తున్నాయని నాకు తెలిసింది. సైని ముందుగా భారతీయుడు, ఆ తర్వాతే అతని రాష్ట్రం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను’ అని గంభీర్ ట్వీట్ చేశాడు. -
బేడీలతోనే గోడదూకి..
అతడో రౌడీషీటర్.. హత్యలతో పాటు మొత్తం పది కేసుల్లో నిందితుడు.. కొద్ది రోజుల నుంచి అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు.. ఇంతటి ఘరానా నేరస్తుడిని బయటకు తీసుకెళాల్సిన సందర్భంలో అప్రమత్తంగా ఉండాల్సిన ఎస్కార్ట్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా సదరు నిందితుడు చేతులకు బేడీలతోనే కోర్టు గోడ దూకి ఏంచక్కా పారిపోయాడు. కోల్‌సిటీ : గోదావరిఖని ఐబీ కాలనీకి చెందిన నీలపు వంశీకృష్ణ(23)ను గంజాయి రవాణా కేసులో ఈనెల 15న పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించగా జిల్లా జైలుకు తరలించారు. 2010 నవంబర్ 7న ఐబీ కాలనీలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట పిడుగు సతీష్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటనలో వంశీకృష్ణ ప్రధాన నిందితుడు. ఈ కేసు విచారణ నిమిత్తం వంశీకృష్ణను కరీంనగర్ జైలు నుంచి గోదావరిఖని కోర్టుకు గురువారం ఉదయం ఎస్కార్ట్ సిబ్బంది మధుసూధన్‌రావు, సుభాష్ తీసుకొచ్చారు. సుభాష్ కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టులో సమర్పించడానికి సుభాష్ వెళ్లగా, మధుసూధన్‌రావు ఎస్కార్ట్‌గా ఉన్నారు. ఇంతలో మూత్రవిసర్జన కోసమంటూ కోర్టు గోడ ప్రహరీవైపు వెళ్లిన వంశీకృష్ణ చేతులకున్న బేడీలతోనే గోడదూకి పరారయ్యాడు. ఎస్కార్ట్ సిబ్బంది తేరుకునే లోగానే గోడ అవతలివైపు రోడ్డుపై అప్పటికే బైక్‌తో సిద్ధంగా యువకుడితో కలిసి పారిపోయాడు. ఈ ఘటనపై మధుసూధన్‌రావు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రామగుండం సీఐ నారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎస్కార్ట్ పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పథకం ప్రకారమే పరారీ.. వంశీకృష్ణ పక్కా పథకం ప్రకారమే పరారైనట్టు తెలుస్తోంది. కోర్టు ఆవరణలో ఎస్కార్ట్ పోలీసు ల ఆధీనంలో ఉన్న వంశీకృష్ణను కుటుంబసభ్యులతో పాటు కొంతమంది యువకులు కలిసి మాట్లాడి వెళ్లినట్టు సమాచారం. ఇదే క్రమంలో నిలువెత్తు ఉన్న గోడ దూకి, అవతల రోడ్డుపై సిద్ధంగా ఉన్న బైక్‌పై పారిపోయేందుకు వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. గాంధీనగర్‌కు చెందిన నాగరాజు అనే యువకుడు వంశీకృష్ణను బైక్‌పై తీసుకెళ్లినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చినట్టు సమాచారం. పోలీసులు పెట్రోల్‌బంక్‌ల్లోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల వైపు రహదార్లలో గాలింపు చేపడుతున్నారు. పది కేసుల్లో నిందితుడు.. వంశీకృష్ణపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో పది కేసులుండగా, ఇందులో పలు హత్యకేసులు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. 2010లో కరీంనగర్ కిసాన్‌నగర్‌లో ఓ ఇంట్లోకి చొరబడి తండ్రీకొడుకును దారుణంగా హత్య చేసిన కేసుతో పాటు అదే సంవత్సరం నవంబర్ 7న గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట రౌడీషీటర్ పిడుగు సతీష్‌ను కత్తులతో పొడిచి చంపిన కేసులో కూడా ఇతడు నిందితుడు. ఇదే కేసులో వంశీకృష్ణ సోదరుడు రవిబాబు, అతడి మిత్రులు కట్టెకోల సుధీర్, దనాల శేఖర్, దాసరి ప్రేమ్‌కుమార్, కండె నరేందర్, తొర్రికొండ శ్రీనివాస్‌పై కేసు నమోదయింది. తర్వాత తొర్రికొండ శ్రీనివాస్ పోలీసులకు చిక్కకుండా పారిపోగా, కట్టెకోల సుధీర్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అప్పటినుంచి ఈ సంఘటనపై కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. తర్వాత వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వంశీకృష్ణపై రౌడీషీట్ తెరిచారు. -
బల్లకింద చేతులకు బేడీలు !
అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరుగెట్టిస్తోంది. జిల్లాలో వరస దాడులతో బెంబేలెత్తిస్తోంది. చైతన్యవంతులైన ప్రజలు ఏసీబీని ఆశ్రయించడం ఆ శాఖకు కలిసివచ్చే అంశంగా మారింది. అందిన ప్రతి ఫిర్యాదునూ వినియోగించుకుంటూ అవినీతి అధికారుల భరతం పడుతోంది. స్థాయి భేదం లేకుండా బల్ల కింద చేతులకు బేడీలు వేయిస్తోంది. సాక్షి, గుంటూరు : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు ఏసీబీ మాట వింటేనే వణికి పోతున్నాయి. అవినీతి అధికారులను వరసగా వలపన్ని పట్టుకుంటున్న ఏసీబీపై ప్రజల్లో విశ్వాసాసం పెరిగింది. గతంలో గ్రామ స్థాయి అధికారులు మినహా ఉన్నతాధికారులు ఏసీబీకి చిక్కినట్టు తెలిసేకాదు. అయితే ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. అవినీతికి పాల్పడుతున్న ఎంతటివారినైనా ఏసీబీ వదిలిపెట్టడం లేదు. లంచం డిమాండ్ చేస్తున్నారని తెలియగానే పక్కా వ్యూహం పన్ని దాడి చేసి అరెస్టు చేస్తోంది. జిల్లాలో ఈ ఏడాది మొదట్లో నరసరావుపేట డివిజనల్ సహకార శాఖ అధికారి రామారావును ఏసీ బీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటరమణను వలపన్ని పట్టుకున్నారు. ఇక అక్కడ నుంచి జిల్లా స్థాయిలో అవినీతికి పాల్పడే అధికారుల పనిపట్టడంలో నిమగ్నమయ్యారు. ఐజీ కార్యాల మేనేజర్ శంకర ప్రసా ద్, దుర్గి ఎస్ఐ వెంకటకృష్ణలను పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. ఇటీవల లక్ష రూపాయల లంచం తీసుకుంటున్న సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ హనుమంతు నాయక్‌ను పట్టుకున్నారు. తాజాగా మైనింగ్ శాఖలో గుంటూ రు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల డిప్యూటీ డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి.ప్రసాద్ రూ. 80 వేలు లంచం తీసుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు ఇవ్వగా దాడిచేసి డబ్బుతో సహా ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇలా వరసగా జిల్లాస్థాయి అధికారులు ఏసీబీ వలలో చిక్కుతుండటంతో అన్ని శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గతానికి భిన్నంగా... గతంలో ఏసీబీ అధికారులు ఏడాదికి జిల్లాలో నలుగురు లేదా ఐదుగురు అవినీతి అధికారులను మించి పట్టుకోలేకపోయేవారు. అప్పట్లో ఏసీబీ కార్యాలయం జిల్లాలో ఉండేది కాదు. బాధితులు ఏసీబీని ఆశ్రయించాలంటే కృష్ణా జిల్లా విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ఏసీబీలోని కొందరు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఏ అధికారిపై ఎవరు ఫిర్యాదు చే శారనే విషయాన్ని లీక్ చేస్తుండడం వల్ల దాడులకు అవకాశం ఉండేది కాదనే ఆరోపణలు అప్పట్లో ఉండేవి. దీనికితోడు విద్యావంతులు తప్ప అసలు ఏసీబీ అధికారులంటే ఎవ రు, వారిని ఎలా కలవాలి అనే విషయాలపై ప్రజల్లో అవగాహన ఉండేది కాదు. ఆరు నెలల కిందట గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో ఏసీబీ కార్యాల యాన్ని ఏర్పాటు చేసి ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలతోపాటు సిబ్బందిని నియమించడంతో జిల్లా ప్రజలకు ఏసీబీ అధికారులు అందుబాటులో వచ్చినట్టయింది. అంతేకాక ప్రజల్లో చైతన్యం పెరిగింది. పక్కా పథకం ప్రకారం దాడులు .. వివిధ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న ప్రజలను డబ్బు కోసం వేధిస్తున్న ఉద్యోగులపై ఏసీబీ అధికారులు నిఘా ఉంచుతున్నారు. బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగానే తమ వద్ద నుంచి అధికారికి ఫోన్ చేయించి ఆ అధికారి మాటలు రికార్డు చేయడం, లేదా బాధితుడిని నేరుగా పంపి డబ్బు ప్రస్తావన తీసుకువచ్చి నిర్ధారించుకుంటున్నారు. ఆ తరువాత వ్యూహం పన్ని దాడి చేస్తున్నారు. దాడుల సమయంలో అధికారులు పారిపోవాలని ప్రయత్నించినా, డబ్బు ఎక్కడ పెట్టారో చెప్పకపోయినా తమదైన శైలిలో విచారించి అరెస్ట్ చేస్తున్నారు.