beef biryani
-
జాతరలో బీఫ్ బిర్యానీకి నో.. కలెక్టర్‌కు నోటీసులు
చెన్నై: సంప్రదాయంగా వస్తున్న అంబూరు బిర్యానీ జాతరలో.. పంది, గోడ్డు మాంసానికి అనుమతి నిరాకరించడంపై తమిళనాడు ఎస్సీఎస్టీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు తిరుపత్తూరు జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. తన చర్యలపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో కలెక్టర్‌ను కోరింది కమిషన్. అంబూర్ బిర్యానీ ఫెస్టివల్..అనాదిగా జరుగుతున్న ఈ జాతరలో 20 రకాల బిర్యానీలు వండి వడ్డిస్తారు. షెడ్యూల్ ప్రకారం.. మే 13-15 తేదీల మధ్య ఈ జాతర జరగాలి. అయితే భారీ వర్షాల కారణంగా ఈ జాతరను తాత్కాలికంగా రద్దు చేసింది జిల్లా పరిపాలక విభాగం. కానీ, అంతకు ముందు జిల్లా కలెక్టర్, అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బిర్యానీ ఫెస్టివల్లో బీఫ్ (గొడ్డు), పోర్క్(పంది)కు అనుమతి లేదని, వాటి బిర్యానీల స్టాల్స్ పెట్టొద్దంటూ జిల్లా కలెక్టర్ అమర్ ఖుష్వాహ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై పలు అభ్యంతరాలు సైతం వ్యక్తం అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. తమిళనాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించింది. అలా ఎందుకు ఆదేశించారో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది కమిషన్. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కమ్యూనిటీలపై వివక్ష కిందకే వస్తుందని, దీనిని అంటరానితనంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్న కమిషన్.. కలెక్టర్‌కు పంపిన నోటీసుల్లో పేర్కొంది. -
అది ఆవు కాదు బర్రె మాంసం బిర్యానీ!
లక్నో: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) క్యాంటీన్లో వడ్డించిన బిర్యానీ ఆవు మాంసంతో చేసింది కాదని, దానిని బర్రె (గెదే) మాంసంతో వండారని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆదివారం వివరణ ఇచ్చారు. ఏఎంయూ క్యాంటీన్లో బీఫ్ బిర్యానీ వడ్డిస్తుండటంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. మైనారిటీ యూనివర్సిటీ అయిన ఏఎంయూలోని మెడికల్ కాలేజీ క్యాంటీన్లో బీఫ్ బిర్యానీ వండుతున్నారని వాట్సాప్‌లో ఫొటోలు దర్శనమివ్వడం శుక్రవారం దుమారం రేపింది. బీఫ్ బిర్యానీ ఫొటోలు ఒక్కసారిగా వైరల్ కావడంతో ఈ ఆరోపణలను వర్సిటీ వెంటనే ఖండించింది. 'నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నాను. మత అలజడులు సృష్టించేందుకే వీటిని వ్యాప్తి చేస్తున్నారు. ఏఎంయూ క్యాంటీన్లో గెదే బిర్యానీ మాత్రమే లభిస్తుంది. ఆవు మాంసం ఎంతమాత్రం లేదు. ఈ విషయంలో మా తనిఖీలతో స్థానిక బీజేపీ ఎంపీ సైతం సంతృప్తి చెందారు' అని ఏఎంయూ వర్సిటీ వీసీ జమీర్ ఉద్దీన్ షా తెలిపారు. 'బీఫ్ బిర్యానీ' వడ్డిస్తున్న ఏఎంయూ క్యాంటీన్ కాంట్రాక్టర్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక బీజేపీ మేయర్, పార్టీ నేతలు శనివారం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మరోవైపు స్థానిక బీజేపీ ఎంపీ సతీష్ గౌతం మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రాంగణంలో బీఫ్ బిర్యానీని వండడం కానీ వడ్డించడం కానీ చేయడం లేదని వీసీ తెలిపారని, దీనిపై ఇంకా ప్రశ్నించడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు.