Beijing Jin Ping
-
Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ
నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడమంటే ఇదే. భారత్‌తో స్నేహసంబంధాలకు కట్టుబడి ఉన్నట్టు తీయటి కబుర్లు చెప్పే చైనా తన వక్రబుద్ధిని మరోసారి వెల్లడించుకుంది. సోమవారం నాడు సరికొత్త అధికారిక ‘ప్రామాణిక పటం’– 2023 విడుదల చేస్తూ, అందులో భారత్‌లోని పలు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమన్నట్టు చూపింది. భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తన భూభాగాలంటోంది. మొత్తం తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని కూడా ఈ కొత్త జాతీయ పటంలో తమ అంతర్భాగమనేందుకు చైనా తెగించింది. దాదాపు పొరుగు దేశాలన్నిటికీ కోపం తెప్పించడమే కాక, మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. పైపెచ్చు, అంతా సవ్యంగానే ఉన్నదన్నట్టు ‘‘జాతీయ సరిహద్దులను గీయడంలో చైనాతో పాటు వివిధ దేశాలు ఉపయోగించే పద్ధతి ఆధారంగా’’నే ఈ పటాన్ని రూపొందించినట్టు డ్రాగన్ ప్రకటించుకోవడం విచిత్రం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ఖండిస్తుంటే, బీజింగ్ మాత్రం మ్యాప్‌ల విడుదల నిత్య కృత్యమేననీ, దీనిపై అతి చేయద్దనీ విషయతీవ్రతను తక్కువ చేసి చెబుతుండడం మరీ విడ్డూరం. చెప్పేదొకటి చేసేదొకటి జిత్తులమారి చైనా నిత్యకృత్యం. అందుకే, ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా తీసుకోక తప్పదు. వారం క్రితం జొహాన్నెస్‌బర్గ్‌లో ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు సమావేశమై సంభాషించుకున్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితిని చక్కదిద్ది, సత్సంబంధాలకు కృషి చేయాలని చర్చించుకున్నారు. మరోపక్క ఈ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ–20’ శిఖరాగ్ర సదస్సుకూ చైనా అధినేత హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఉరుము లేని పిడుగులా డ్రాగన్ దేశ సరిహద్దులు ఈ ‘వక్రీకరించిన’ పటంతో బాంబు పేల్చింది. గమనిస్తే మన ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతూ, మునుపటి పటంలోనూ చైనా ఇదే తెంపరితనం చూపింది. ఆ దేశ పశ్చిమ హద్దుల్లో ఉన్న ప్రాంతాలను తనవిగా చెప్పుకొంది. అక్సాయ్‌చిన్ 1950–60ల నుంచి మన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భాగం. 1962 యుద్ధంలో చైనా దాన్ని ఆక్రమించుకుంది. అరుణాచల్నేమో దశాబ్దాలుగా తమ దక్షిణ టిబెట్లోది అంటోంది. ఆ రెండూ భారత అంతర్భాగాలని మన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, తన మూర్ఖవాదన కొనసాగిస్తోంది. పటంలోని అంశాలు అంతర్జాతీయ అంగీకృత సరిహద్దులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌ను ‘జంగ్నాన్’ (దక్షిణ టిబెట్) అని పిలుస్తూ, అది తమదేననడం బీజింగ్ సిగ్గు మాలినతనం. చరిత్ర చూస్తే టిబెట్‌కూ, బ్రిటీషు ఇండియాకు మధ్య 1914లో సిమ్లా సమావేశం జరిగింది. అప్పుడే సరిహద్దుగా మెక్‌మోహన్ రేఖను అంగీకరించాయి. చైనా చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న పటం ఆ అంగీకరించిన సరిహద్దు రేఖ చట్టబద్ధతను ఉల్లంఘించడమే! అలాగే, ద్వీప దేశమైన తైవాన్ ఏడాదిపైగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా, పట్టువదలని బీజింగ్ ‘వన్ చైనా విధానం’ అంటూ దాన్ని తమ పటంలో చూపడం దురహంకారం. ఇక, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు ప్రధాన నౌకాయాన అనుసంధానమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సైనిక, వాణిజ్యపరంగా అతి కీలకం. వివాదాస్పద ద్వీపాలతో సహా ఈ ప్రాంతమంతా చైనా తమ పటంలో కలిపేసుకుంటోంది. ఈ ప్రాంతంలో డ్రాగన్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని ఫిలిప్పీన్స్, వియత్నామ్, మలేసియా, జపాన్ తదితర దేశాలు పదే పదే ఎత్తిచూపుతున్నాయి. అయినా అది తన తీరు మార్చుకోలేదు. భౌతికంగా తన అధీనంలో లేకున్నా ఈ ప్రాంతాలు తనవేననడం చిరకాలంగా చైనా చూపుతున్న మొండివైఖరే. తాజా పటం జారీ వల్ల దానికి కొత్తగా కలిసొచ్చేదేమీ లేదు. పైగా, మిగతా ప్రపంచపు సహాయం, సానుభూతి కూడా దక్కవు. అయినా సరే, డ్రాగన్ తన దురహంకారాన్ని చాటుకోవడం గమనార్హం. ఒక్కమాటలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరికి ఈ కొత్త మ్యాప్ ప్రతీక. అధికారిక జాతీయ పటాల జారీ చైనాలో దాదాపు ఏటా జరిగే తంతు అయినా... భారత్ వరకు తీసుకుంటే చంద్రయాన్–3 విజయం, రానున్న జీ–20 సదస్సు నేపథ్యంలో ఇప్పుడీ పటాన్ని ఎందుకు విడుదల చేసినట్టు? ఇరుదేశాల మధ్య ఇలాంటి సరిహద్దు వివాదాలే గతంలోనూ సైనిక ప్రతిష్టంభనకు దారితీశాయి. 2017లో తలెత్తిన డోక్లామ్ సంక్షోభం, 2020లో గల్వాన్ లోయలో సైనిక ఘర్షణలే తాజా ఉదాహరణలు. దీంతో దౌత్య సంబంధాలూ దెబ్బతింటున్నాయి. బలగాల్ని వెనక్కి పిలిచి, ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోవాల్సిన వేళ ఇలాంటి తప్పుడు పటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏ రకంగానూ దోహదపడదు. ఇప్పటికే లద్దాఖ్‌లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. వివిధ విదేశీ సర్వేలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం భారత సరిహద్దులో చైనా వివాదాస్పద నిర్మాణాల్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుమానాలు పోగొట్టేలా మన పాలకులు వాస్తవాలను వెల్లడించాలి. నమ్మడానికి వీల్లేని పొరుగుదేశంతో నిక్కచ్చిగానే వ్యవహరించాలి. సార్వభౌమాధికారం, సమగ్రతల్లో రాజీ లేదని మాటల్లో కన్నా చేతల్లో చూపాలి. జీ–20 అధ్యక్షతతో విశ్వగురువులయ్యామని సంబరపడేకన్నా, అంతర్గత ఘర్షణలున్న అన్ని పక్షాలనూ అర్థవంతమైన సమగ్ర చర్చలతో ఒక తాటిపైకి తేవడమే అసలు విజయమని గ్రహించాలి. చైనాతో సంభాషణకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తూనే, మనకున్న ఆందోళనల్ని కుండబద్దలు కొట్టాలి. అవకాశాన్ని బట్టి అందుకు రానున్న జీ–20ను సైతం వేదికగా చేసుకోవాలి. దౌత్య, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు సరిహద్దుల్లో సామరస్య వాతావరణం కీలకమని మరోసారి అందరికీ తలకెక్కేలా చూడాలి. -
చంద్రబాబు చైనా యాత్ర మరో కోణం
సందర్భం అమరావతి, బీజింగ్ మధ్య రక్తచందన మార్గం నిర్మించాలని చంద్రబాబు ఆశిస్త్తుంటే, జిన్ పింగ్ బీజింగ్ ఇస్లామాబాద్ మీదుగా మధ్యధరా సముద్రానికి చేరడానికి ‘పట్టు రహదారి’ని నిర్మించే పనిలో పడ్డారు! వర్తమాన చరిత్రలో ఇంతకన్నా వైచిత్రి ఏముంటుందీ? చంద్రబాబు చైనా యాత్రలో సాధించిన విజయాల గురించి మీడియాలో రంగు రంగుల కథనాలు వచ్చాయి. వస్తున్నా యి. రాష్ర్టంలో అపారంగా ఉన్న ఎర్రచందనం నిల్వల్ని చైనాకు అమ్మడానికి రంగం సిధ్ధమైందనీ, అలా సమకూరే నిధులతో కొత్త రాజధాని అమ రావతి నిర్మాణం చేపడతారనేది ప్రధానాంశం. కొత్త రాజధాని నిర్మాణానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపా యలు ఖర్చవుతుందని ఏడాదిన్నర క్రితమే చంద్రబాబు అంచనా వేశారు. ఆ నిధుల్ని తాను మిత్రపక్షంగా ఉం టున్న నరేంద్రమోదీ ప్రభుత్వం అందిస్తుందని వారు ఇన్నాళ్లూ రాష్ర్ట ప్రజల్ని నమ్మిస్తూ వచ్చారు. నిజానికి కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభు త్వ సహాయం, రైతుల రుణమాఫీ అనే రెండు అంశాలు చంద్రబాబు పక్షాన లేకుంటే మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజల తీర్పు భిన్నంగా ఉండేది. ఇప్పుడు కొత్త రాజ ధానికి కేంద్ర నిధుల వ్యవహారం కూడా అటకెక్కినట్టే కనిపిస్తోంది. అనుమానం ఉన్న వాళ్లు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సాక్షాత్తు పార్లమెంటులో ఇచ్చిన డిజిటల్ డిస్ప్లేను చూడవచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమూ లేదు. మాకు ఆ ఉద్దేశమూ లేదని వారు కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఐదు లక్షల కోట్ల రూపాయలు సమకూ ర్చుకోవడానికి బాబు దగ్గరున్న ఏకైక వనరు ఎర్రచం దనం నిల్వలే. గత ఏడాది రాష్ర్ట ప్రభుత్వం గ్లోబల్ టెం డర్ల ద్వారా 4,160 టన్నుల ఎర్రచందనం దుంగలను అమ్మకానికి పెట్టినపుడు సగటున టన్నుకు 18 లక్షల రూపాయల చొప్పున మొత్తం 750 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ఈ లెక్కన 5 లక్షల కోట్ల రూపా యల నిధుల సమీకరణకు రాష్ర్ట ప్రభుత్వం దాదాపు 30 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగల్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ యూని యన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ అంతరించిపో తున్న వృక్ష సంతతిగా పేర్కొన్న ఎర్రచందనాన్ని ప్రభు త్వం ఆ స్థాయిలో అమ్మకానికి పెట్టవచ్చునా? అనేది ఇంకో సందేహం. 2012 అక్టోబర్‌లో అంతర్జాతీయ బయోడైవర్సిటీ సదస్సు హైదరాబాద్‌లో జరిగినప్పుడే ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది. పెళుసుగా ఉండే ఎర్ర చందనం కలప ఫర్నిచర్‌కు పనికిరాదనీ, దాన్ని అణు విద్యుత్ కేంద్రాల్లో వినియోగిస్తున్నారని చైనా గుట్టు విప్పారు. ఎర్రచందనాన్ని చైనా అణు విద్యుత్ కేంద్రా ల్లోనే వినియోగిస్తోందా? లేక అణ్వాయుధాల తయారీ లోనూ వినియోగిస్తోందా? అన్నది కూడా ఎవరికైనా రావలసిన సందేహమే. దీనికి సమాధానం రెండోది కూడా అయితే చైనా అణ్వాయుధ పాటవాన్ని పెంచుకో వడంలో మనం సహితం ఎర్రచందనం పేడు ఒకటి ధారబోస్తున్నామన్న మాట. చైనాలో చంద్రబాబు 11 ఒప్పందాలు చేసుకున్నా రనే వార్త వచ్చిన రోజునే చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోం దని ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. కీలక మైన భారత వైమానిక, రక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై చైనా ప్రభుత్వం నిఘా ఉంచిం దని ఆ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. చైనా హ్యాకర్లు ప్రభుత్వరంగ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడి కీలక మైన సమాచారాన్ని సేకరిస్త్తున్నారన్నది దీని సారాంశం. భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, వియ త్నాం, మలేసియా, నేపాల్, సింగపూర్, ఇండోనేసియా లాంటి ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా గూ ఢచర్యం సాగిస్తోందని ఆ సెక్యూరిటీ సంస్థ చెబుతోంది. బాబు ఇండియా విమానం ఎక్కిన మరునాడే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పాకిస్తాన్ విమానం ఎక్కారు. నవాజ్ షరీఫ్‌ని ఆలింగనం చేసుకుని ‘మన స్నేహబం ధం కొండలకన్నా ఎత్తయినది, సముద్రాలకన్నా లోతై నది, తేనెకన్నా తీయనైనద’ని అన్నారు. ప్రపంచపటం మీద చైనా ఒంటరిగా ఉన్నప్పుడు బీజింగ్‌కు స్నేహ హ స్తాన్ని సాచింది ఇస్లామాబాద్ ఒక్కటేనని గుర్తు చేసుకు న్నారు. ఈ ఏడాది తన విదేశీ పర్యటనని పాకిస్తాన్‌తోనే మొదలు పెట్టానని గొప్పగా చెప్పుకున్నారు. అటు నవా జ్ షరీఫ్ కూడా జిన్ పింగ్‌కు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్-ఈ -పాకిస్తాన్’తో సత్కరిం చారు. ఇది మన భారతరత్నతో సమానం. ఒకవైపు, సాంస్కృతిక సారూప్యత రీత్యా ఏపీ కొత్త రాజధాని అమరావతిని చైనీయులు రెండో స్వగృహంగా భావించాలని బాబు కోరి వస్తే, మరోవైపు చైనా తన దేశం నుంచి మధ్యధరా సముద్రానికి చేరే చారిత్రక సిల్క్ రూట్ పునరుద్ధరణకు పాకిస్తాన్‌తో ఒప్పందం చేసుకుంది. రూ.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ 3 వేల కిలోమీటర్ల కారిడార్ ప్రాజెక్టు వల్ల పాకిస్తాన్-చైనా మధ్య రోడ్డు లింకులు రైలు మార్గా లు, పైపులైన్లు నిర్మించనున్నారు. అమరావతి బీజింగ్ మధ్య బాబు రక్తచందన మార్గం నిర్మించాలని ఆశిస్త్తుంటే, జిన్ పింగ్ బీజింగ్ ఇస్లామాబాద్ మీదుగా మధ్యధరా సముద్రానికి చేర డానికి ‘పట్టు రహదారి’ని నిర్మించే పనిలో పడ్డారు! వర్తమాన చరిత్రలో ఇంతకన్నా వైచిత్రి ఏముంటుందీ? (రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు) మొబైల్ : 76749 99063 - డానీ