బన్నీ జీవితంలో బెస్ట్ సెల్ఫీ
ఈ జనరేషన్ హీరోలందరూ సినిమాలతో పాటు ఇతర బిజినెస్‌ల మీద కూడా దృష్టి పెడుతున్నారు. కొంత మంది సినీ నిర్మాణరంగంలో డబ్బులు పెడుతుంటే మరికొందరు హోటల్ బిజినెస్, క్రీడారంగంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో సత్తా చాటుతున్న బన్నీ బిజినెస్‌మేన్‌గా కూడా ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు.
ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ హైక్లాస్ బార్ ఓపెన్ చేశాడు బన్నీ. ఇద్దరు పార్టనర్స్‌తో కలిసి బన్నీ ప్రారంభించిన క్లబ్ సూపర్ హిట్ అయ్యింది. అదే బాటలో మరో బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడు స్టైలిష్ స్టార్. ఇటీవల చిరంజీవి, నాగార్జునలతో కలిసి కేరళ ఫుట్‌బాల్ టీంను సొంతం చేసుకున్న సచిన్ టెండుల్కర్, ఇప్పుడు బ్యాడ్మింటన్ టీంను కూడా కొన్నాడు. నాగ్, నిమ్మగడ్డ ప్రసాద్‌లతో పాటు అల్లు అర్జున్ కూడా ఈ టీంకు భాగస్వామిగా వ్యవహరించనున్నాడు.
ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్లో ప్రకటించిన అల్లు అర్జున్, సచిన్ టెండుల్కర్, పుల్లెల గోపీచంద్, నిమ్మగడ్డ ప్రసాద్‌లతో కలిసి దిగిన సెల్ఫీని తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. తన జీవితంలో దిగిన బెస్ట్ సెల్ఫీలలో ఇదీ ఒకటి అంటూ కామెంట్ చేసిన బన్నీ, లెజెండరీ క్రీడాకారులతో కలిసి బెంగళూరు బ్లాస్టర్స్ బ్యాడ్మింటన్ టీంకు భాగస్వామిగా వ్యవహరించటం ఎంతో ఆనందంగా ఉందన్నాడు.One of my Best selfie's ! Legendary Sports men ! Great Honour being associated & Co-owners of the Team #BengaluruBlasters pic.twitter.com/n9DjljUpPW— Allu Arjun (@alluarjun) 8 December 2016