Betrayal
-
Pawan Kalyan: పక్కలో బల్లెం
పదేళ్లుగా ఆయన వెంట ఉన్నా. జనసేన కోసం ఎంతో కష్టపడ్డా. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పని చేశా. పవన్ కల్యాణ్‌పై నమ్మకం ఉంది. సీటు గ్యారెంటీగా నాకే వస్తుంది.. టికెట్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో అప్పటికే రెండుసార్లు పవన్‌ను కలిసిన తర్వాత కూడా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మీడియా ముఖంగా భావోద్వేగంగా మాటలివి. కానీ, చివరకు ఏం మిగిలింది?.. విజయవాడ వెస్ట్ సీటును ఆఖరిగా బీజేపీ ఎగరేసుకుపోయింది. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో విజయవాడ వెస్ట్ పరిణామాలు వాడీవేడిగా సాగాయి. అప్పటికే పొత్తు ప్రకటన చేసినా.. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలు ఇక్కడి సీటు తమదేనంటూ ప్రకటించుకున్నాయి. టీడీపీ నేతలు జలీల్‌ఖాన్, బుద్దా వెంకన్నలు ఎవరికివారే ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలతో తమ బలప్రదర్శనలు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే.. ఈలోపే విజయవాడ వెస్ట్ సీటు ఆలోచన వదులుకోవాలని, అది జనసేనకు కేటాయిస్తామని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. మొదటిసారి.. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లొచ్చనే చర్చా మొదలైంది. దీంతో జలీల్‌ఖాన్ ఒక అడుగు ముందుకేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. విజయవాడ వెస్ట్ సీటును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో ‘చూద్దాం’ అని పవన్ జలీల్‌ఖాన్‌తో చెప్పారనే విషయం బయటకు పొక్కింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కాస్త ఆందోళనకు లోనయ్యారు. వెంటనే పవన్ కల్యాణ్‌ను కలిశారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్‌పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పవన్ ఇచ్చిన భరోసాతో సీటు కచ్చితంగా తనకే వస్తుందని పాపం పోతిన మహేష్ భావించారు. రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, టీడీపీ బదులు బీజేపీ రూపంలో టికెట్ గండాన్ని.. చంద్రబాబు తెర వెనుక జరిపిన కుట్రల్ని ఆయన పసిగట్టలేకపోయారు. రెండోసారి.. కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది. ఆ సమయంలోనే విజయవాడ వెస్ట్‌పై బీజేపీ నేతలు కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ సీటు తమకే కావాలని బీజేపీ పట్టింది. దీంతో పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్న మహేష్.. ఆగ్రహానికి లోనయ్యారు. మళ్లీ పవన్ కల్యాణ్‌ను కలిశారు. టికెట్‌పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. కంగారు పడొద్దంటూ పవన్ మరోసారి అభయం ఇవ్వడంతో మహేష్ మెత్తబడ్డారు. కానీ, అప్పటికే వెస్ట్ సీటుపై నిర్ణయం జరిగిపోయింది!. బీజేపీ నేత వ్యాఖ్యలతో కన్ఫర్మ్ విజయవాడ వెస్ట్ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గత గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. వెస్ట్ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. పార్టీ డిసైడ్ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని ప్రకటన చేశారు. దీంతో.. మహేష్ మళ్లీ ఆందోళనకు దిగారు. అయినా నమ్మకమే! ఈసారి ఏకంగా.. తన కార్యాలయంలోనే మహేష్ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో.. ‘‘పార్టీకి విధేయుడిగా, పదేళ్లు నాకు నమ్మకస్తుడిగా ఉన్న నీకు.. విజయవాడ వెస్ట్ సీటు ఖాయం అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. తాజా సమావేశంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నా. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైఎస్సార్సీపీతో పోటీ పడలేరు. ఒకవేళ ఇక్కడి సీటు బీజేపీకే వెళ్తే.. అది కచ్ఛితంగా వైఎస్సార్సీపీకి అనుకూలిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ మాట నిలబెట్టుకోలేకపోతే? అనే ప్రశ్నకు.. ఒకవేళ బీజేపీ సుజనా చౌదరికే గనుక టికెట్ ఇస్తే రెబల్‌గా పోటీ చేస్తా.. అదీ పవన్ ఫొటోతోనే అని. తమ సత్తా చూపించుకునేందుకు కొత్త తరం నేతలకు కూడా అవకాశాలు దక్కాలి కదా అని వ్యాఖ్యానించారు. కానీ.. మూడోసారీ.. చివరకు విజయవాడ వెస్ట్‌లో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ జాబితాలో టికెట్ సుజనా చౌదరికే వెళ్లింది. అయినా విజయవాడ వెస్ట్ సీటుపై పోతిన వెంకట మహేష్ పట్టువీడడం లేదు. జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు రెండ్రోజుల ముందు మూడోసారి మహేష్‌ను పిలిపించుకున్న పవన్.. బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, మహేష్ ససేమీరా అంటున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పవన్ పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ వల్ల నిజంగా కాలేదా? కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం అని చెబుతున్న మహేష్‌కు.. పవన్ మాత్రం అన్యాయం చేశారు. అయితే.. టీడీపీ-బీజేపీల బలవంతపు పొత్తు కోసం విశ్వప్రయత్నం చేసిన పవన్.. మధ్యలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని, పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. మరి అంతగా బాధపడిపోయిన పవన్.. పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లకు కాకుండా జంప్‌జిలానీలకు ఒకట్రెండు సీట్లు ఇచ్చిన పవన్.. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో బీజేపీని ఒప్పించలేకపోయారా?.. నమ్మకంగా ఉన్న మహేష్‌కు టికెట్ ఇప్పించలేకపోయారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనసైనికులిప్పుడు. సీటు మహేష్కేనంటూ నమ్మించి మోసం చేశారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తూ వెన్నుపోటులో చంద్రబాబునే మించిపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు పాచికేనా? విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. అభ్యర్థి విషయంలో మాత్రం ‘రాజీ’ పడిందా?. వక్కల గడ్డ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాంలాంటి వాళ్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. నమ్మకస్తులు ఉన్నా.. సుజనా చౌదరికే టికెట్ ఎందుకు ఇచ్చారు? పేర్ల పరిశీలనలో ఏం జరిగింది?.. అని బీజేపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో చక్రం తిప్పిన చంద్రబాబే.. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరికే విజయవాడ వెస్ట్ నియోజక వర్గం టికెట్ దక్కేలా చేశారనే టాక్ బలంగా వినిపిస్తోందిప్పుడు. -
‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’
ప్రేమ పేరుతో ఆకతాయిల చేష్టలు ఎక్కువైపోతున్నాయి. అమ్మాయి ఒప్పుకోలేదని, దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించి, తనను దూరం పెట్టిందన్న కక్షతో యువతి ఇంట్లో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన షాజపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. 25 ఏళ్ల సుభాష్ ఖరాడి దేవాస్ నగరంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో శివాని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి యువతి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో అతడిని ఆమె దూరం పెట్టింది. అప్పటి నుంచి శివాని, ఆమె కుటుంబ సభ్యులపై సుభాష్ కక్ష పెంచుకున్నాడు. చదవండి: అతి త్వరలోనే ముంబైని పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపులు ఈ క్రమంలో ఆదివారం రాత్రి మలిఖేడి గ్రామంలోని యువతి తండ్రి జాకీర్ ఖాన్ ఇంట్లోకి కంట్రీమేడ్ పిస్టోల్‌తో చొరబడ్డాడు. ఇంట్లో శివానీ ,ఆమె తండ్రి, సోదరుడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో తండ్రి జాకీర్ అక్కడికక్కడే మరణించగా.. యువతి, ఆమె సోదరుడు ఇండోర్ ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. అయితే శివాని పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాల్పుల అనంతరం ఖరాడీ తన ఫేస్బుక్లో యువతితో కలిసి దిగిన ఫోటోతో పోస్టు పెట్టారు. ‘ ప్రేమ పేరుతో నాకు ద్రోహం చేసింది. అందుకే ఆమెను చంపాను. జీవితంలో తనకు మర్చిపోలేని బాధను ఇచ్చాను’ అని పోస్టులో పేర్కొన్నాడు. అయితే కొన్ని గంటలకే అతడి మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించింది. కదులుతున్న రైలు నుంచి కిందకు దూకండంతో అతడు మరణించి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా పోలీసు చీఫ్ యశ్పాల్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. -
నమ్మక ద్రోహాన్ని సహించబోం: అమిత్ షా
ముంబై: రాజకీయాల్లో దేన్నైనా భరించొచ్చుగానీ.. ద్రోహాన్ని సహించలేమని అన్నారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. సోమవారం ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో దేన్నైనా సహించగలంగానీ.. ద్రోహాన్ని సహించలేం. ఉద్దవ్ థాక్రే(శివసేన అధినేత) బీజేపీకి చేసింది ముమ్మాటికీ ద్రోహమే. అందుకే ఆయనకు అలా(ప్రభుత్వం కుప్పకూలి.. సీఎం పదవీచిత్యుడు అయ్యడు) జరిగింది. ఉద్దవ్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో మోసం చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అని షా వ్యాఖ్యానించారు. శివసేన చీలడానికి, తదనంతర పరిణామాలకు ఉద్దవ్ థాక్రేనే కారణం. అతని అధికార దాహమే.. దగ్గరి వాళ్లను ఎదురు తిరిగేలా చేసింది. బీజేపీని మోసం చేయడమే కాదు.. నమ్మిన సిద్దాంతాలకు వెన్నుపోటు పొడిచారు. అంతేకాదు.. మహరాష్ట్ర ప్రజలను ఘోరంగా అవమానించారు. దురాశతో అతను చేసిన పని.. పార్టీని ముంచేసింది. ఉద్దవ్ థాక్రేను ముఖ్యమంత్రిని చేస్తామని ఏనాడూ మేం చెప్పలేదు. తలుపులు మూసుకుని గదుల్లో రాజకీయాలు చేయడం మాకు తెలియదు. మాకు తెలిసింది ఓపెన్ పాలిటిక్స్ అని అమిత్ షా అక్కడున్న నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ముంబై స్థానిక సంస్థల ఎన్నికల కోసం మిషన్ 150ను తెరపైకి తెచ్చింది బీజేపీ. దేశంలోనే అత్యంత సంపన్నమైన పౌర సంస్థగా బృహణ్‌ముంబై కార్పొరేషన్‌కు పేరుంది. అందుకే దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ సుదీర్ఘ కాలం నుంచి ప్రయత్నిస్తోంది. ఇదీ చదవండి: ‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’ -
సొంత జిల్లాకు బాబు తీరని ద్రోహం
సొంత జిల్లాకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేశారు. తన పాలనలో అస్మదీయులకు లబ్ధి చేకూర్చడంపైనే దృష్టి సారించారు. ప్రాజెక్టుల అంచనాలు ఎడాపెడా పెంచేసి, ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేసి జిల్లా రైతాంగం నోట్లో మట్టికొట్టారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశలో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు 90 శాతం పూర్తయినా కృష్ణా జలాలు తరలించలేదని గగ్గోలు పెట్టిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వల్ల చిత్తూరు, కడప జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. వేల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పనులు నిరుపయోగం అయ్యేందుకు ప్రత్యక్ష కారకులయ్యారు. బి.కొత్తకోట: జిల్లాలో హంద్రీ–నీవా ప్రాజెక్టుకు సంబంధించిన ఉపకాలువలు, రిజర్వాయర్లలో ఒక్క పుంగనూరు ఉపకాలువ మినహా మిగిలిన మొత్తం ప్రాజెక్టుకు కృష్ణా జలాలను అనంతపురం జిల్లాలోని ప్రధాన కాలువ ఎన్పీకుంట మండలం నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలోకి ప్రవేశిస్తుంది. దీనికి మధ్యలో పెద్దరాంపల్లె–పుల్లకూరవాండ్లపల్లె (ఎన్పీ కుంట మండలం) మధ్యలోని సొరంగం కీలకం. ఈ సొరంగం మీదుగానే కృష్ణా జలాలు రావాలి. అయితే గత టీడీపీ పాలనలో సొరంగం పనులు పూర్తి చేయించకపోవడంతో జలాల తరలింపు ఆగిపోయింది. ఈ పనుల అంచనాలను పెంచుకున్నా.. పనులపై శ్రద్ధ చూపకపోవడంతో జిల్లాలో రూ.3,500 కోట్ల పనులు నిరుపయోగమయ్యాయి. తద్వారా గత టీడీపీ పాలనలో రెండు జిల్లాలకు తీరని అన్యాయం జరిగింది. అంచనా పెంచి వదిలేసిన వైనం.. అనంతపురం జిల్లాలోని ఎన్పీ కుంట మండలం పెద్దరాంపల్లె–పుల్లకూరవాండ్లపల్లె మధ్యలో 5.20 మీటర్ల వ్యాసంతో సొరంగం తవ్వకం, లైనింగ్ పనులను కిలోమీటర్ 412.000 నుంచి 415.000 వరకు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం 3.5 కిలోమీటర్ల సొరంగం తవ్వకం, లైనింగ్, రెండువైపులా 150 మీటర్ల కాలువ నిర్మాణం పనులను రూ.27.12 కోట్లతో శ్రీఅవంతిక సాయి వెంకట జాయింట్ వెంచర్ సంస్థ చేపట్టింది. ఈ సంస్థ 2015 మార్చినాటికి రూ.6.34 కోట్ల పనులు చేసి చేతులు దులుపుకుంది. మరో రూ.20.78 కోట్ల పనులు నిలిచిపోగా గత ప్రభుత్వం పనుల అంచనాలను పెంచుకునే చర్యల్లో భాగంగా 2016లో రూ.6.0679 కోట్ల సొరంగం, కాలువ పనులకు అంచనాలు పెంచి టెండర్లు నిర్వహించగా మ్యాక్స్ ఇన్ఫ్రా(ఐ) లిమిటెడ్ సంస్థ రూ.15.08 కోట్లకు పనులు దక్కించుకుంది. ఈ సంస్థ ఐదేళ్లలో రూ.6.64 కోట్ల పనులే చేసి మిగిలిన రూ.8.43 కోట్ల పనులు వదిలేసింది. లైనింగ్ పనులను వెడ్సర్ కన్స్ట్రక్చర్ సంస్థకు రూ.17.75 కోట్లకు అప్పగించగా రూ.65 లక్షల పనులే పూర్తి చేసినట్టు సమాచారం. సొరంగానికి సంబంధించి గత ప్రభుత్వం చివరినాటికి 115 మీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. కదిరి వైపు నుంచి ఈ పనులు పెద్దమండ్యం వైపునకు సాగే కాలువ వైపు ఆగిపోయాయి. పూర్తయితే కృష్ణమ్మ గలగల అనంతపురం జిల్లా కదిరి సమీపంలో హంద్రీ–నీవా రెండు కాలువలు విడిపోతాయి. కుడివైపున పుంగనూరు ఉపకాలువ తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలంలోకి ప్రవేశించి పలమనేరు నియోజకవర్గం నుంచి మొదలయ్యే కుప్పం ఉపకాలువలో కలుస్తుంది. ఎడమవైపు నుంచి సాగే ప్రధాన కాలువ ఎన్పీ కుంట మండలం మీదుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలోకి ప్రవేశించి వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్తుంది. పెద్దమండ్యం మండలం నుంచి అడవిపల్లె రిజర్వాయర్‌కు నీటిని తరలించే కాలువల నిర్మాణం జరిగింది. ఈ సొరంగం పూర్తయితే జిల్లాలోని అడవిపల్లె, కలిచర్ల, వైఎస్సార్ కడప జిల్లాలోని శ్రీనివాసపురం రిజర్వాయర్లకు, ఉపకాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు కృష్ణా జలాలు అందుతాయి. జిల్లాలో సాగే 30 కిలోమీటర్ల ప్రధానకాలువ, 30.750 కిలోమీటర్ల తంబళ్లపల్లె ఉపకాలువ, 44.200 కిలోమీటర్ల చింతపర్తి ఉపకాలువ, 25.170 కిలోమీటర్ల ఎల్లుట్ల ఉపకాలువ, 23.500 కిలోమీటర్ల వాయల్పాడు ఉపకాలువ, 142.200 కిలోమీటర్ల నీవా ఉపకాలువ, 0.125 టీఎంసీ సామర్థ్యం కలిగిన కలిచర్ల రిజర్వాయర్, 1.418 టీఎంసీ సామర్థ్యం కలిగిన అడవిపల్లె రిజర్వాయర్లకు కృష్ణాజలాల తరలింపు సాధ్యమవుతుంది. అడవిపల్లె నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా చిత్తూరు సమీపంలోని ఎనీ్టఆర్ జలాశయానికి చిత్తూరు నగర ప్రజల తాగునీటికి నీరు తరలిస్తారు. ఈ పనులు పూర్తి చేసేందుకు రూ.3,500 కోట్లు ఖర్చు చేశారు. 3 మాసాల్లో పూర్తికి లక్ష్యం ఎన్పీ కుంట మండలంలో ఆగిన సొరంగం పనులకు సంబంధించిన కాంట్రాక్టర్‌కు గత ప్రభుత్వంలో రూ.1.20 కోట్లు, ఏడాదిగా జరిగిన పనుల బిల్లు రూ.50 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు చెల్లించాలి. మిగిలిపోయిన సొరంగం పనులను మూడు మాసాల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. – ఎం.వెంకటరమణ, హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్ ఎస్ఈ, అనంతపురం 35 మీటర్లు తవ్వించాం.. ఈ ఏడాది కాలంలో 35 మీటర్ల సొరంగం పనులు చేయించాం. రెండు లేక మూడు నెలల్లో పనులు పూర్తి చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో కాంట్రాక్టర్ పనులు సత్వరమే పూర్తి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సొరంగం పని పూర్తయ్యాక లైనింగ్ పనులు చేపడతాం. – రాజగోపాల్, హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈ, ధర్మవరం -
విమోచనం అంటే ద్రోహం చేయడమే
ఖమ్మంమయూరిసెంటర్: 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా సైన్యాలతో ప్రజలను అణచివేసి, ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసుకోవడం విద్రోహం చేయడమేనని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్డీ ఆధ్వర్యంలో విద్రోహదినం సభను అవుల అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నైజాం రాజు ఖాసీమ్ రాజ్య నియంతృత్వ పరిపాలన సాగిస్తుంటే కమ్యూనిస్టు పార్టీ గెరిల్లా సైన్యాలు భూమి, భుక్తి, విముక్తి కోసం, వెట్టిచాకిరీ, అంటరాని తనాన్ని నిర్మూలించుటకు వీరోచిత త్యాగాలు చేసారన్నారు. ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య, పుల్లయ్య, కె.ఎస్.ప్రదీప్, నాగేశ్వరరావు, ఆజాద్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటం కామేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ పని చేస్తుందని, ఆ పార్టీ మండల నాయకులు కోలా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం తెలంగాణ విమోజన దినోత్సవం సందర్భంగా కామేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బానిసత్వానికి, నిజాం నిరుంకుశతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఈ పోరాటంలో ఎందరో తెలంగాణ ప్రజలు అమరులైనారన్నారు. పిచ్చయ్య, ఆంగోత్ లాలు, ఎస్.ఉపేందర్, కె.దర్గయ్య, రాకేష్, నాగరాజు, కొండా, కోలా అప్పారావు పాల్గొన్నారు. -
ఏపీ ప్రజలకు మోదీ ద్రోహం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్(ఏపీ)కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్వారా ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఏపీలో కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకహోదాపై కృతనిశ్చయంతో పోరాడుతుందన్న నమ్మకం తనకు ఉందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఉమ్మడి ఏపీకి చెందిన మాజీ ప్రధాని పీవీ దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనీ, ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అదేనని సుర్జేవాలా అన్నారు. గత ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ఇచ్చిన ఆ హామీని అమలు చేయకపోవడం ద్వారా రాజ్యాంగ విధానాలను మోదీ తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేసే ముందు జైట్లీసహా ఇతర బీజేపీ సీనియర్ నేతలతో చర్చిస్తే వారు సమ్మతించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే విషయం అసలు పరిశీలనలోనే లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులోనే చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇది కోట్లాదిమంది ఏపీ ప్రజలకు బీజేపీ చేసిన సిగ్గుమాలిన నమ్మక ద్రోహమేనని సుర్జేవాలా అన్నారు. మోదీ తమ మాటనిలబెట్టుకుంటారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు వేచిచూస్తున్నారనీ, మాట నిలుపుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని సుర్జేవాలా పేర్కొన్నారు. -
కర్షకులను మోసగించిన కాంగ్రెస్
మలౌత్(పంజాబ్): రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, దేశానికి వెన్నెముకలాంటి రైతులను ఆ పార్టీ ఓటు బ్యాంకులా చూసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల విధానాల కారణంగా రైతులు నిరాశ, నిరుత్సాహంతో జీవితాలను గడపాల్సి వచ్చేదని చెప్పారు. ‘గత కొన్నేళ్లుగా మీరు పెట్టిన పెట్టుబడికి 10 శాతం లాభమే ఎందుకు పొందుతున్నారో నాకు తెలుసు. దీని వెనుక ఉన్న విషయం ఏమిటో తెలుసు. రైతులు దేశానికి ఆత్మవంటి వారు. వారే మన అన్నదాతలు. అయితే కాంగ్రెస్ పార్టీ వారిని అన్నివేళలా మోసం చేసింది.రైతులను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగానే చూసింది’’అని చెప్పారు. బుధవారం పంజాబ్‌లోని మలౌత్‌లో నిర్వహించిన ఓ రైతు ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఇటీవల ఖరీఫ్ పంటలకు కేంద్రప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని పెంచిన నేపథ్యంలో బీజేపీ ఈ ర్యాలీచేపట్టింది. కిసాన్ కల్యాణ్ ర్యాలీ పేరిట నిర్వహించిన బహిరంగ సభకు హరియాణా సీఎం ఖట్టర్, పంజాబ్ మాజీ సీఎం బాదల్, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్‌బాదల్ తదితరులు హాజరయ్యారు. నాలుగేళ్లుగా రికార్డు స్థాయి ఉత్పత్తి ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. గత నాలుగేళ్లుగా రైతులు రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధిస్తున్నారని, వారికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. వరి, గోధుమ, పత్తి, చెరకు, పప్పులు ఏ పంటలైనా గత రికార్డులను బద్ధలు కొడుతున్నాయన్నారు. తన ప్రసంగం సందర్భంగా కొన్ని మాటలను పంజాబీలో మాట్లాడి రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పంజాబీలు సరిహద్దుల్లో పోరాడుతున్నారని, పంజాబ్ దేశానికి స్ఫూర్తిని అందిస్తుందని చెప్పారు. రైతులు కోతలు పూర్తయిన తర్వాత వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టవద్దని సూచించారు. ఈ సమస్యను అధిగమించేందుకు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ కోసం రూ.50 కోట్లు కేటాయించామని చెప్పారు. వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ కోసం యంత్రాల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. -
నమ్మకద్రోహానికి మారు పేరు చంద్రబాబు
= మందకృష్ణ మాదిగ ఆరోపణ = శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామికి పూజలు సింగరాయకొండ: చంద్రబాబు నియంతృత్వ విధానాలను మానుకోకపోతే ఆయన పాలనకు కాలం చెల్లకతప్పదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మండలంలోని పాతసింగరాయకొండ శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి తరువాత విలేకరులతో మాట్లాడారు. తాను చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమంటే అరెస్టులు, నిర్బంధాలతో చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో నడిపించి, గెలిపించిన మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఆయన ఓటమికి కృషి చేసిన వారిని అందలం ఎక్కించడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. నిన్నటివరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రావెలను తొలగించి మాల అయిన నక్కా ఆనంద్‌బాబుకు పదవి కట్టబెట్టారని చెప్పారు. మమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తే బెదిరే వారం కాదని.. ప్రభుత్వాన్ని మార్చే శక్తి మాదిగలకు మాత్రమే ఉందన్నారు. తమ గోడు వినాల్సిన పాలకులు పట్టించుకోకపోవడంతో వివిధ దేవాలయాలు తిరుగుతూ దేవుళ్లు, దేవతలకు ప్రార్థిస్తున్నామని చెప్పారు. గతంలో తమకు స్వేచ్ఛ లేని రోజుల్లో మా తాత గుర్రం జాషువా గబ్బిలం ద్వారా మా విన్నపాలను దేవతలకు, దేవుళ్లకు విన్నవించాడని గుర్తు చేశారు. ఈనెల 27 నుంచి జూలై 2 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 27న అన్ని మండలాల్లో కాళ్లు, చేతులు తాళ్లతో కట్టుకుని నోటికి నల్లగుడ్డలు కట్టుకుని అంబేడ్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమం, 29న విగ్రహాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన, 30న చంద్రబాబు చెప్పులు కుట్టిన ఫొటో పెట్టుకుని చెప్పులు, బూట్లు పాలిష్ చేయడం, జులై 2న అన్ని మండలాల్లో 100 డప్పులు, వెయ్యి గొంతులతో నినాదాలు చేస్తూ కురుక్షేత్ర మహాసభకు మాదిగజాతిని సర్వసన్నద్ధం చేస్తామని చెప్పారు. జూలై 7న మాదిగలంతా అమరావతిలో జరిగే కురుక్షేత్ర సభకు తరలి రావాలన్నారు. దేవునికి మొక్కుకున్నా.. జూలై 17న పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించాలని, ఈ లోగా ప్రధానమంత్రి మోదీ క్యాబినెట్ ఆమోదం పొంది అఖిల పక్ష సహకారంతో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని, వర్గీకరణ కోసం పోరాడుతున్న వెంకయ్యకు తగిన బలాన్ని, శక్తిని అందించాలని, చంద్రబాబు ప్రతిపక్షంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, జగన్ కూడా వర్గీకరణ అంశం పట్టించుకోవాలని, జూలై 7న కురుక్షేత్ర మహాసభ విజయవంతం అవ్వాలని దేవుడ్ని కోరుకున్నానన్నారు. తరువాత పట్టణంలో ర్యాలీగా వెళ్లి పోలీస్‌స్టేషన్ సెంటరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. చంద్రమాదిగ, ఉపాధ్యాయులు ఆనంద్, డేవిడ్, భిక్షాలు, నరసింహులు, కరుణమ్మ, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. -
జనశక్తి నేత కూర రాజన్నపై ‘రాజద్రోహం’ తగదు
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క దోమలగూడ: జనశక్తి నాయకులు కూర రాజన్న తదితరులపై రాజద్రోహం ఆరోపణలతో నమోదైన కర్నూలు కుట్ర కేసును ఎత్తి వేసి బేషరతుగా విడుదల చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. దోమలగూడలోని అరుణోదయ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. కూర రాజన్న, మరో 11 మంది అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన నీలం రాంచంద్రయ్య స్మృతిలో ప్రజలు నిర్మించుకున్న రాంచంద్రయ్య స్మారక పాఠశాల ఒడిదుడుకులు ఎదుర్కొంటుండటంతో ఈ విషయాన్ని చర్చించడానికి హైదరాబాదు నుంచి వెళ్లిన కూర రాజన్న తిరుగు ప్రయాణంలో అనారోగ్యంతో కర్నూలులో ఆగాడన్నారు. రాజన్నతో పాటు కార్మిక సంఘం, రైతు కూలీ సంఘం నాయకులైన నంబి నర్సింహ్మయ్య, మోతా వెంకట్రావు, కర్నాకుల వీరాంజనేయులు, మాస్టారు నాగేందర్రావు, పెంచలయ్య, అందే బాలాజీలను అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి బలవంతంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అంతకుముందే కర్నూలులో నివాసముంటున్న రాంచంద్రయ్య స్మారక పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయుడు, బోల్లవరం గ్రామ మాజీ సర్పంచు ఒడ్డె పోతనను ఇంట్లో అరెస్టు చేశారని, పీఓడబ్ల్యూ కార్యాలయంలో రైతుకూలీ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బోయ సుంకులును, కర్నూలు బస్టాండ్‌లో వసంత్, చాకలి శ్రీను అనే యువకులను పట్టుకున్నారని చెప్పారు. వీరందరిపై 121 ఎ, 120 బి సెక్షన్ల కింద రాజద్రోహం కుట్ర కేసులు నమోదు చేశారన్నారు. ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. ప్రజా సంఘాల నాయకులు విఠల్‌రాజ్ (ఏఐఎప్‌టియూ), హన్మేష్ (సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ), ఆవుల అశోక్, (పీడీఎస్‌యూ), మోహన్ బైరాగి (అరుణోదయ), రామలింగం (శోషిత జనసభ), నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
రామోజీ! జీజే రెడ్డి గుర్తున్నాడా?
నేటికీ మార్గదర్శి రికార్డుల్లో జీజేఆర్ పేరుతోనే షేర్లు మార్గదర్శితో పాటు ‘ఈనాడు’ కూడా జీజేఆర్ మానసపుత్రికే! అతని వద్ద గుమస్తాగా చేరి, అంచెలంచెలుగా ‘ఎదిగిన’ రామోజీ మార్గదర్శిలో రామోజీ ప్రారంభ వాటా కేవలం 10 రూపాయలే! పెట్టుబడులన్నీ జీజేఆర్వేనంటున్న నాటి రామోజీ సహోద్యోగులు ‘ఈనాడు’ పెట్టుబడులు, మెషినరీ... అన్నీ జీజేఆర్ పుణ్యమే! దేశం నుంచి సాగనంపి... వాటన్నింటినీ దిగమింగిన రామోజీ! నమ్మకద్రోహానికి రామోజీ నిలువెత్తు నిదర్శనం: జీజేఆర్ గ్రామస్తులు రాజగురువు ఎదుగుదల వెనక ‘దేశద్రోహ’ కోణం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో జీజే రెడ్డి అనే వ్యక్తి పేరిట షేర్లు దేశద్రోహం కేసులో దేశం వదిలి పరారైన చరిత్ర అతనిది అతని ఆస్తులు, ఖాతాలు, షేర్లనూ జప్తు చేసిన ప్రభుత్వం మార్గదర్శిలోని జీజేఆర్ షేర్లను మాత్రం స్వాధీనం చేయని రామోజీ దేశద్రోహానికి తీసిపోని నేరమేనంటున్న విశ్లేషకులు నిత్యం ఉషోదయంతోపాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగనీతులు వల్లించే పచ్చ పుత్రిక ‘ఈనాడు’ మూలాల్లోనే దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేంతటి ‘ద్రోహం’ దాగుంది! పోటీ పత్రికల ఉసురు తీసేందుకు పతాక శీర్షికన పనికిరాని పాచి కథనాలను నిత్యం వండి వార్చి వినోదించే రామోజీ తాలూకు మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలోని పెట్టుబడులే... సీఐఏ ఏజెంట్‌గా న్యాయస్థానమే ప్రకటించిన ఓ వ్యక్తివి!! అంతేనా... పునాదుల నుంచి పెరుగుదల దాకా వాటికి కావాల్సిన నిధులు, ఇతరత్రా సాయం వంటి సర్వ వనరులూ.. దేశ రహస్యాలను విక్రయానికి పెట్టిన కేసులో ఇరుక్కున్న ఆ వ్యక్తి అందజేసినవే. అసలు మార్గదర్శి, ఈనాడు ప్రాణం పోసుకున్నది కూడా.. ‘అపరాధిగా ప్రకటితుడై’, అరెస్టు భయంతో దేశం వదిలిపోయిన ఆ వ్యక్తి ఆలోచనల్లో నుంచే! అతని పేరు గాదిరెడ్డి జగన్నాథరెడ్డి, ఉరఫ్ జి.జె. రెడ్డి. అతను 1960, 1970ల్లో ఢిల్లీ రాజకీయ, అధికార వర్గాల్లో తిరుగులేని రీతిలో హవా చలాయించిన వ్యక్తి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కార్యాలయంలోకి కూడా నేరుగా వెళ్లగలిగిన హై ప్రొఫైల్ ‘పెద్దమనిషి’! అలాంటి వ్యక్తి దగ్గర తొలినాళ్లలో గుమస్తాగిరీ చేసిన రామోజీ... ఆనక అతని పెట్టుబడితో, ఆద్యంతం అతని దన్నుతోనే ఇటు చిట్‌ఫండ్, అటు పత్రిక పెట్టి... జీజేఆర్ దేశం వదిలిపోయాక వాటిని సొంతం చేసుకుని... పోటీ పత్రికలను, సంస్థలను అడ్డంగా అణగదొక్కి మరీ ‘పెద్ద’మనిషిగా ఎదిగారు. రాజగురువుగా దర్జాగా రూపాంతరం చెందారు! దేశద్రోహం కేసులో జీజేఆర్ స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతాలతో పాటు పలు సంస్థలు, కంపెనీల్లో అతనికున్న వాటాలను కూడా 1977లోనే ప్రభుత్వం స్తంభింపజేసింది. అయినా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో జీజేఆర్‌కున్న షేర్లను, అతనివేనని భావిస్తున్న ఇతర పెట్టుబడులను మాత్రం గుట్టుగా దాచేసుకున్న గుండెలు తీసిన బంటు రామోజీ! వాటిని తక్షణం ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుందని తెలిసి కూడా దర్జాగా అట్టిపెట్టుకోవడం ద్వారా దేశద్రోహానికి ఏ మాత్రమూ తక్కువ కాని నేరానికి పాల్పడ్డారాయన. మార్గదర్శిలో ఆ షేర్లు ఇప్పటికీ జీజేఆర్ పేరుతోనే కొనసాగుతుండటం విశేషం. తన తండ్రి పెట్టుబడులను తిరిగివ్వండని ఆయన కొడుకు అడిగినా ‘అలాంటివేమీ లేవు పొ’మ్మంటూ ఉత్తి చేతులతో తిప్పి పంపిన కర్కశ హృదయుడు రామోజీ... ‘‘అతనికి పలు కంపెనీల్లో భారీ మొత్తంలో షేర్లున్నాయి. పలు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. షేర్లు చేతులు మారకుండా వేగంగా స్పందించండి. బ్యాంకు ఖాతాలను తక్షణం స్తంభింపజేయండి. ఇందుకవసరమైన అన్ని అధికారాలూ సమకూరుస్తూ సీఐడీ డీఎస్పీ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నాం. డీఎస్పీ తక్షణం రంగంలోకి దిగి వివిధ సంస్థల్లోని ఆయన షేర్లను జప్తు చేయాలి. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలి. ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలి’’ - ఇవీ ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పి.కె.ధామ్ 1977 ఏప్రిల్ 7న ఇచ్చిన ఉత్తర్వులు! ఇందులో పేర్కొన్న ‘భారీ మొత్తంలో షేర్లున్న’ ఆ ‘అతను’ గాదిరెడ్డి జగన్నాథరెడ్డి. ఈయనను చాలా రకాలుగా పరిచయం చేయవచ్చు. జీజే రెడ్డిగా 1960లు, 70ల్లో ఢిల్లీలో బాగా పేరు మోసిన బడా బాబు. పెద్ద పెద్ద వ్యక్తులు, నేతలతో సంబంధాలతో పాటు పలు కమ్యూనిస్టు దేశాలతో మన దేశానికి, ఇక్కడి నాయకులకు మధ్య ‘సంధానకర్త’గా కూడా చక్రం తిప్పిన వ్యక్తి. వీటికి తోడు.. ‘సీఐఏ ఏజెంటు’ అని సాక్షాత్తూ భారత ప్రభుత్వమే పేర్కొన్న వ్యక్తి!! వీటన్నింటికీ మించి.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్‌కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్! అంతకంటే కూడా మించి.. రాష్ట్ర రాజకీయాల్లో చిరకాలం పాటు తెర వెనకగా చక్రం తిప్పిన, మళ్లీ తిప్పాలని ఎంతగానో ఆశ పడుతున్న రామోజీకి ఆరంభ దశలో ‘అన్నివిధాలా’ దారి చూపిన ‘మార్గదర్శి’ కూడా ఈయనే!! మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నేటికీ 288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయి. దేశద్రోహ చట్టం కింద నేరాభియోగం ఎదుర్కొన్న జీజేఆర్, 1977లో దేశం వదిలిపోయారు. అనంతరం ఆయన ఆస్తులన్నింటినీ భారత ప్రభుత్వం జప్తు చేసింది. ఢిల్లీలో అత్యంత ఖరీదైన బంగ్లా, హైదరాబాద్ రామచంద్రాపురంలో భూములు, బ్యాంకు ఖాతాలతో పాటు పలు సంస్థల్లో ఆయన పేరిట ఉన్న షేర్లన్నీ జప్తయ్యాయి. కానీ రామోజీ మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని జీజేఆర్ షేర్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదు. అంతేకాదు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్‌కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే.. అంతకు దాదాపు మూడు రెట్ల వాటాలు నేటికీ మార్గదర్శి వాటాదారుల జాబితాలో జీజేఆర్ పేరిటే దర్శనమిస్తున్నాయి. వాటిని 1977లోనే ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిన రామోజీ, అలా చేయకపోవడం ద్వారా ఢిల్లీ కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా తుంగలో తొక్కారు! అది తీవ్రమైన నేరమని తెలిసి కూడా అసలే ఖాతరు చేయలేదు. ‘అమ్మ రామోజీ!’ అని ఎవరికైనా అనిపించే ఈ అంశాలన్నీ అసలు వాస్తవాలకు కేవలం ఒక పార్శ్వం మాత్రమే. వీటి ఆధారంగా తీగ లాగితే అసలు డొంకంతా అడ్డంగా బయటపడింది. మార్గదర్శితో పాటు రాజగురువు ఆర్థిక మూలాలన్నీ జీజేఆర్ పెట్టుబడులతోనే ముడిపడి ఉన్న వైనం వెలుగులోకి వచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ 1962 ఆగస్టు 31న హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదైంది. అందులో రామోజీ ప్రారంభ వాటా కేవలం 10 రూపాయలు! ఆయన సోదరుడు కాశీ విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది. అలా ఇద్దరు సోదరులూ కలిసి కేవలం 20 రూపాయల పెట్టుబడితో సంస్థను స్థాపించారు. వాస్తవానికి సంస్థకు భారీ మొత్తంలో నిధులను ఒంటి చేత్తో సమకూర్చింది.. దాని ప్రమోటర్ డెరైక్టర్‌గా రంగప్రవేశం చేసిన జీజేఆరే అన్నది ఆయన సన్నిహితులతో పాటు అప్పటి రామోజీ సహోద్యోగులు కూడా ఘంటాపథంగా చెప్పేమాట! ‘ఇంతింతై...’ అన్నట్టుగా అనంతర కాలంలో సాగిన మార్గదర్శి, రామోజీ ఎదుగుదలకు జీజేఆర్ పెట్టుబడులే ప్రధాన ఆలంబన! మార్గదర్శితో పాటు రామోజీకి చెందిన డాల్ఫిన్ హోటల్స్‌లోనూ జీజేఆర్ పెట్టుబడులున్నట్టు ఆయన కుమారుడు యూరి రెడ్డి కూడా స్వయంగా ధ్రువీకరించారు. పైగా, తాను పెంచి పోషించిన రామోజీ ఎదుగుదలను చూసి జీజేఆర్ సంతోషించేవారని కూడా ఆయన చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, గుడివాడ తదితర చోట్ల క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ జరిపిన విస్తృత పరిశోధనలో రామోజీ సహచరులు, వ్యాపారంలో ఆయనకు అండగా నిలిచిన వ్యక్తులు, వారి పిల్లలు వెల్లడించిన వివరాలు దిగ్భ్రాంతి గొలిపేలా ఉన్నాయి... జీజేఆర్‌ను నిచ్చెనలా వాడుకున్న రామోజీ... కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని జొన్నపాడుకు చెందిన జీజేఆర్‌కు ఢిల్లీలోని సంపన్నులు, రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ పెద్దలతో కూడా అతి సన్నిహిత సంబంధాలుండేవి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కార్యాలయంలోకి కూడా నేరుగా వెళ్లగలిగిన సత్తా అతనిది! ఇందిర ఇంటి సమీపంలోనే సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో విశాలమైన బంగ్లాలో ఆయన నివాసం. పైగా ఆమె చిన్న కొడుకు సంజయ్‌గాంధీతో పాటు అప్పట్లో రాజకీయంగా చక్రం తిప్పిన మహ్మద్ యూనస్ వంటి పలువురు రాజకీయ ప్రముఖులతో చెప్పలేనంత చనువు! ఇక రాష్ట్రానికి చెందిన జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, అంజయ్య, రఘురామయ్య వంటి రాజకీయ దిగ్గజాలతో జీజేఆర్‌కున్న పరిచయాలు, సాన్నిహిత్యం గురించైతే చెప్పనవసరమే లేదు! వీటన్నింటినీ తన వ్యాపారాభివృద్ధికి అత్యంత తెలివిగా వాడుకున్నారు రామోజీ. 1960ల తొలి నాళ్లలో కృష్ణా జిల్లా గుడివాడ రోడ్లపై రామోజీ సైకిల్ మీద తిరిగేవారని ఆయన సొంతూరు పెదపారుపూడి వాసులే చెబుతుంటారు. అప్పట్లో రామోజీ ఆర్థికంగా ఏమాత్రమూ స్థితిమంతుడు కాదనేందుకు సొంతూళ్లోని ఆయన ఇల్లే నిదర్శనం. అలాంటి రామోజీ, జొన్నపాడుకే చెందిన ప్రముఖ నక్సలైటు, అప్పటి కమ్యూనిస్టు నాయకుడు కొండపల్లి సీతారామయ్య సిఫార్సు లేఖతో జీజేఆర్ చెంతకు చేరారు. రామోజీని జీజేఆర్ ఢిల్లీలోని తన బంగ్లాలోనే గుమస్తాగా కుదుర్చుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతారు. ఇదంతా 1960ల నాటి సంగతి. అప్పట్లో తాను ఢిల్లీలో ఒక మలయాళీకి చెందిన అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో పనిచేశానని రామోజీ తనకు 75 ఏళ్లు నిండిన సందర్భంగా రాసుకున్న ‘75 వసంతాల వెలుగు’ పుస్తకంలో స్వయంగా చెప్పుకున్నారు. వాస్తవానికి మార్గదర్శిని స్థాపించకముందు ఢిల్లీలో రామోజీ పని చేసింది జీజేఆర్ బంగ్లాలోనేనంటారు. అనంతర కాలంలో కూడా రామోజీ ఆ బంగ్లాకు తరచూ వచ్చి వెళ్లేవారని జీజేఆర్ కుమారుడు యూరి వివరించారు. పైగా మార్గదర్శితో తన సాన్నిహిత్యం గురించి జీజేఆర్ ఇతర డెరైక్టర్లతో తాను రాసుకున్న అవగాహన పత్రంలో స్వయంగా ఇలా పేర్కొన్నారు... ‘‘నాకు కొన్ని కంపెనీల్లో తక్కువ, మరికొన్నింట్లో ఎక్కువ షేర్లు ఉండొచ్చు. నేను చేసే పని స్వభావం మన డెరైక్టర్లందరికీ తెలిసిందే. నేను వ్యవస్థాపకునిగా ఉన్న నవభారత్లోనూ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోనూ మనమంతా సమాన భాగస్వాములుగానే చేరాం. సంస్థను నిర్వహించే వారే డెరైక్టర్ల తరఫున ట్రస్టీగా వ్యవహరించాలని కూడా మనం ముందుగా అనుకున్నదే. రష్యా నుంచి అందిన డబ్బే మన సంస్థ ఎదుగుదలకు కారణమన్నది కూడా నేను మళ్లీ చెప్పాల్సిన పని లేదు. అయితే (మన) రెండో తరం వారికి ఈ విషయాలన్నీ తెలియవు. కాబట్టి షేర్లను డెరైక్టర్లందరికీ సమాన నిష్పత్తిలో కేటాయిస్తే వారికి (మున్ముందు) పేచీలుండవు’’ అని! అంతేకాదు, 1976లో జీజేఆర్ సమర్పించిన ఐటీ రిటర్నుల్లో నంబర్‌వన్ కంపెనీ కూడా.. మార్గదర్శి చిట్‌ఫండ్సే! ఎన్నెన్నో ప్రశ్నలు...! జీజేఆర్ ఉదంతానికి సంబంధించి ఇటు రామోజీ తీరుపై, అటు ప్రభుత్వ వ్యవహార శైలిపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి... 1. మార్గదర్శి చిట్‌ఫండ్స్ తొలి డెరైక్టర్లలో ఒకరు దేశద్రోహానికి పాల్పడి పారిపోయినా, ఆ సంస్థను మాత్రం ప్రభుత్వం విచారించలేదు. ఎందుకు? 2. దేశం వదిలి వెళ్లేనాటికి మార్గదర్శి డెరైక్టర్ హోదాలో ఆ సంస్థలో జీజేఆర్ పెట్టిన పెట్టుబడులు ఎన్ని? ఇప్పుడు వాటి వాస్తవ విలువెంత? 3. జీజేఆర్ దేశద్రోహి అని కోర్టే నిర్ధారించిన నేపథ్యంలో, మార్గదర్శిలోని వాటాలు ప్రభుత్వానికే చెందుతాయి కదా! మరి వాటిని ప్రభుత్వం ఎందుకు జప్తు చేయడం లేదు? 4. జీజేఆర్ వంటి అజ్ఞాత ఇన్వెస్టర్లు మార్గదర్శిలోనూ, రామోజీ గ్రూపులోని ఇతర సంస్థల్లోనూ ఇంకెంతమంది ఉన్నారు? 5. నవభారత్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎదుగుదలకు రష్యా నుంచి అందిన డబ్బే కారణమని ఇతర డెరైక్టర్లతో రాసుకున్న అవగాహన ఒప్పందంలో జీజేఆరేస్వయంగా ధ్రువీకరించిన విషయం. దీనిపై కూడా ప్రభుత్వం గానీ, దర్యాప్తు సంస్థలు గానీ ఎందుకు దృష్టి సారించలేదు? తవ్వుకుంటూ పోయేకొద్దీ ఈ అనుమానాల జాబితా పెరిగేదే తప్ప తరిగేది కాదు. పైగా రామోజీ వైపు వేలెత్తి చూపుతున్న ఈ ఉదంతానికి సంబంధించిన కేసు కూడా అలాంటిలాంటిది కాదు. అత్యంత తీవ్రమైన దేశద్రోహ అభియోగం. ఈ నేపథ్యంలో పై సందేహాలకు సమాధానాలు దొరకాలన్నా, రామోజీ అసలు రంగు నిగ్గుదేలాలన్నా.. ఈ మొత్తం బాగోతానికి సంబంధించి 1960 నుంచి నేటిదాకా నిష్పాక్షికంగా లోతైన దర్యాప్తు జరగడమే ఏకైక మార్గం! జీజేఆర్ పరారీ వెనక ఉన్నదెవరు? అరెస్టు ఖాయమని ముందే పక్కా సమాచారం అందడంతో, వారంటు జారీ కాకముందే జీజేఆర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. చెకస్లోవేకియా పాస్‌పోర్టుపై అతను దేశం వదిలి వెళ్లినట్టు చెబుతారు. 1985లో అక్కడే చనిపోయినట్టు కుమారుడు చెప్పారు. అయితే జీజేఆర్ పరారీ వెనక కూడా రామోజీ హస్తమే ఉన్నట్టు చెబుతారు. కేసులోని ఇతర నిందితులు ఢిల్లీ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలాలు కూడా ఆ అనుమానాలను బలపరిచేవిగానే ఉన్నాయి. జి.ఎస్.మూర్తి అనే రామోజీ సహచరుడు చెకస్లోవేకియా దౌత్య కార్యాలయంలో పనిచేసే జీజేఆర్ భార్య సాయంతో అతని ప్రయాణానికి డాక్యుమెంట్లు సిద్ధం చేయించారని వారు కోర్టులో వాంగ్మూలమిచ్చారు. హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న జీజేఆర్‌కు వాటిని అందజేశారని కూడా వివరించారు. జీజేఆర్ తొలుత ఢిల్లీ నుంచే పారిపోయేందుకు ప్రయత్నించినట్టు, అశోకా ట్రావెల్స్ సంస్థ ద్వారా టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు సమాచారం. కానీ ‘ఎందుకనో’.. చివరి నిమిషంలో వ్యూహం మార్చి, హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి దేశం వదిలి ఉడాయించాడు! ఇదంతా రామోజీయే ఏర్పాటు చేశారని, తదనంతరం ‘తన’ సంస్థల్లోని జీజేఆర్ పెట్టుబడులన్నింటినీ దర్జాగా సొంతం చేసుకున్నారని చెబుతారు. ఇదీ కేసు దేశ రహస్యాలను ఇతరులకు చేరవేయడం ద్వారా అంతర్గత భద్రతకు విఘాతం కలిగించే పనులకు పాల్పడ్డాడంటూ జీజేఆర్పై 1977లో ఢిల్లీ శ్రీనివాసపురి పోలీస్‌స్టేషన్‌లో అధికార రహస్యాల చట్టం కింద కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 26/1977) నమోదైంది. జీజేఆర్తో పాటు చెకస్లోవేకియాకు చెందిన ఆయన భార్య నటాషా, నాటి ప్రణాళికా సంఘం టెక్నికల్ డెరైక్టర్ కె.సారిన్తో పాటు మరో నలుగురు ఇందులో నిందితులు. 1977 ఏప్రిల్ 7న ఢిల్లీ కోర్టు జీజేఆర్‌ను దోషిగా నిర్ధారించింది. ఆయన సీఐఏ ఏజెంటుగా పని చేస్తున్నాడని, తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో ‘బి-5/23, సఫ్దర్‌జంగ్ ఎన్క్లేవ్’లోని జీజేఆర్ ఇంటితో పాటు అక్కడ, హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఇతరత్రా ఆస్తులను, బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. మార్గదర్శి వంటి పలు సంస్థల్లో జీజేఆర్‌కు ఉన్న షేర్లను కూడా జప్తు చేసేందుకు కోర్టు ఒక రిసీవర్‌ను నియమించింది. కోర్టు తీర్పు చాలావరకు అమలైంది. పైగా, జప్తు చేసిన బంగ్లాను తమకు తిరిగివ్వాలంటూ కొంతకాలానికి జీజేఆర్ భార్య నటాషా ఢిల్లీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసినా లాభం లేకపోయింది. అందులో తాముండేందుకు కనీసం ఒక గదినైనా ఇవ్వాలని కోరినా కోర్టు ససేమిరా అంది. పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా కొట్టేసింది. జీజేఆర్ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అప్పగించరాదన్న ప్రభుత్వ కృతనిశ్చయానికి ఇదే నిదర్శనం. అలాంటిది... మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని జీజేఆర్ షేర్లను మాత్రం ప్రభుత్వం ఎందుకనో ‘పట్టించుకోలేదు’. నాటి నుంచీ నేటిదాకా రామోజీ వ్యాపార మూలాలను కదప(లే)కుండా ఉండిపోయింది. మార్గదర్శితో పాటు రామోజీ సంస్థల్లోని ఆస్తులన్నీ జీజేఆర్వేనని, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లగానే రామోజీ వాటిని కాజేశారని జొన్నపాడువాసులు చెబుతారు.