మాట్లాడుతున్న గోకినేపల్లి వెంకటేశ్వర్లు
ఖమ్మంమయూరిసెంటర్: 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా సైన్యాలతో ప్రజలను అణచివేసి, ఇండియన్ యూనియన్లో విలీనం చేసుకోవడం విద్రోహం చేయడమేనని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్డీ ఆధ్వర్యంలో విద్రోహదినం సభను అవుల అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నైజాం రాజు ఖాసీమ్ రాజ్య నియంతృత్వ పరిపాలన సాగిస్తుంటే కమ్యూనిస్టు పార్టీ గెరిల్లా సైన్యాలు భూమి, భుక్తి, విముక్తి కోసం, వెట్టిచాకిరీ, అంటరాని తనాన్ని నిర్మూలించుటకు వీరోచిత త్యాగాలు చేసారన్నారు. ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య, పుల్లయ్య, కె.ఎస్.ప్రదీప్, నాగేశ్వరరావు, ఆజాద్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి పోరాటం
కామేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ పని చేస్తుందని, ఆ పార్టీ మండల నాయకులు కోలా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం తెలంగాణ విమోజన దినోత్సవం సందర్భంగా కామేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బానిసత్వానికి, నిజాం నిరుంకుశతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఈ పోరాటంలో ఎందరో తెలంగాణ ప్రజలు అమరులైనారన్నారు. పిచ్చయ్య, ఆంగోత్ లాలు, ఎస్.ఉపేందర్, కె.దర్గయ్య, రాకేష్, నాగరాజు, కొండా, కోలా అప్పారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment