Bhagyanagar Express
-
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ‘భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ట్రైన్ నంబరు 17233 సికింద్రాబాద్ నుంచి బల్లర్షా వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల పదమూడు నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది. ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతించుచున్నాం.’ ఇదీ నిత్యం స్టేషన్లలో వినిపించే రైల్వే అధికార ప్రకటనలు. కొంతకాలంగా రైళ్ల రాకపోకలు తీవ్ర ఆలస్యమవుతూ ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఎప్పుడొస్తయో తెలియదు బల్లర్షా నుంచి కాజీపేట మధ్య నడిచే కాజీపేట ఎక్స్‌ప్రెస్, సిర్పూర్టౌన్ నుంచి భద్రాచలంరోడ్డు వరకు వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్‌లు ఏ రోజూ సమయపాలన పాటించడం లేదు. ఉదయం, సాయంత్ర పూట ఆ యా స్టేషన్లలో ప్రయాణికులు గంటల కొద్దీ వేచి చూ స్తున్నారు. రైళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక సమ యం వృథా చేసుకుంటున్నారు. దీంతో తమ రోజూ వారి కార్యకలాపాల్లోనూ ప్రభావం చూపుతోంది. ‘భాగ్యనగర్’ రోజూ లేటే! బల్లార్షా నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి బల్లార్షా మధ్య రోజూ నడుస్తున్న ట్రైన్లు ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఆలస్యంగానే నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి 3.35 గంటలకు బయలుదేరి కాగజ్‌నగర్ వరకు వెళ్లాలంటే రాత్రి ఒకటి, రెండు గంటలవుతోంది. దీంతో మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిని రోడ్, ఆసిఫాబాద్ రోడ్, కాగజ్‌నగర్, సిర్పూర్(టీ) వరకు వెళ్లాల్సిన ప్రయాణికులు అరిగోస పడుతున్నారు. రాత్రి పూట రైలు దిగి ఇంటికి వెళ్ళేందుకు రవాణా సౌకర్యం లేక స్టేషన్లోనే పడుకుని తెల్లారి వెళ్తున్నారు. గతంలో 9 గంటలకే వస్తుండగా ప్రస్తుతం తీవ్ర జాప్యం జరుగుతోంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లూ ఆలస్యమే సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్సిటీ, కాగజ్‌నగర్ సూపర్‌పాస్ట్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఏపీ, గ్రాండ్ ట్రంక్, నవజీవన్, చెన్నై సెంట్రల్, రాప్తిసాగర్తో పాటు పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు సైతం గంట, రెండు గంటల ఆలస్యంతో నడుస్తున్నాయి. అన్ని రైళ్లూ ఆలస్యమేనా? దూరం, దగ్గర అని తేడా లేకుండా చవక, భద్రత, సౌకర్యవంతంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు ఎక్కువగా పేద, మధ్య తరగతి వారు రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తారు. అయితే సకాలంలో రైళ్లు స్టేషన్లకు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది నెలలుగా ఇదే తీరుగా ఉండడంతో వివిధ అవసరాల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, సికింద్రాబాద్, విజయవాడ, చెన్నై వైపు వెళ్లే వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యంగా నడుస్తున్నాయని మైకుల్లో అనౌన్స్ చేసి అసౌకర్యానికి చింతించుచున్నాం అంటూ చెప్పి రైల్వే అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న జిల్లా నుంచి కాజిపేట నుంచి కాగజ్‌నగర్, భద్రాచలం రోడ్ స్టేషన్ల మధ్య నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు ప్రయాణం చేస్తుంటారు. వీరితో పాటు వివిధ అవసరాలకు హైదరాబాద్ రాకపోకలు సాగించేవారు ఉన్నారు. పెరిగిన టికెట్ రేట్లు గతంతో పోలిస్తే టికెట్ల రేట్లు సైతం భారీగా పెరిగాయి. కరోనా ప్రభావంతో సీనియర్ సిటిజన్స్, వివిధ కేటగిరీలకు ఇస్తున్న రాయితీలు సైతం ఎత్తేశారు. ప్యాసింజర్ ట్రైన్ల చోట ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. దీంతో టికెట్ రేట్లు సైతం పెరిగాయి. గతంలో ఉన్న టికెట్ ధరలతో పోలిస్తే రూ.15 నుంచి 20 వరకు పెరిగాయి. -
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ మళ్లీ వచ్చేస్తోంది..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్– సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, అది స్పెషల్ ట్రైన్గానే ప్రయాణికులకు సేవలందించనుందని పేర్కొన్నారు. తిరుపతి–జమ్ముతావి (02277/02278) ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఏప్రిల్ ఒకటి నుంచి పునరుద్ధరించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు నడుపనున్నట్లు గతంలో ప్రకటించిన 30 ప్రత్యేక రైళ్లను జూన్ నెలాఖరు వరకు పొడిగించినట్లు సీపీఆర్వో పేర్కొన్నారు. చదవండి: ఒక్కరూ లేరు, వింటే చోద్యం.. చూస్తే ఆశ్చర్యం హైదరాబాద్‌లో ‘ఫ్రీ చాయ్ బిస్కెట్’: ఎక్కడంటే? -
భువనగిరి వద్ద రైళ్ల రాకపోకలకు అంతరాయం
నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం సమీపంలోని ముత్తిరెడ్డిగూడెం గేటు వద్ద శుక్రవారం ఉదయం హైదరాబాద్ వైపు వెళ్లే అప్‌లైన్‌లో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. హెవీ లోడ్ కారణంగా సుమారు అరగంట సేపు ఆగిపోవడంతో పలు రైళ్ల రాకపోలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఆలేరు మండలంలోని వంగపల్లి వద్ద 10.10 గంటల నుంచి 10.30 గంటల వరకు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఆలేరు స్టేషన్లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను సుమారు అరగంట సేపు నిలిపివేశారు. వేరే ఇంజన్‌ను తెప్పించి గూడ్స్ రైలును ముందుకు పంపించడంతో సమస్య తొలగిపోయింది. -
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో రేషన్ బియ్యం పట్టివేత
సికింద్రాబాద్ నుంచి బల్లార్ష వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పోలీసులు పట్టుకున్నారు. తరచూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. -
సూది సైకో నుంచి 2 సిరంజీలు స్వాధీనం
సికింద్రాబాద్: భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్‌లో సూది ఉన్మాది శనివారం కలకలం సృష్టించాడు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్ వస్తున్న భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్‌లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద ఎక్కిన రవికుమార్ అనే సైకో ప్రయాణికులను సూదితో గుచ్చి గాయపరిచాడు. సూది ఉన్మాదిని ప్రయాణికులు చితకబాది సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రయాణికులు అతడిని పట్టుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు రవికుమార్ నుంచి రెండు సిరంజీలు, రెండు సిమ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని దాదాపు గంట పాటు విచారించారు. రవికుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే అతని మానసిక స్థితి బాగా లేదని పోలీసులు భావిస్తున్నారు. రెండు నెలల నుంచి ఇంటి దగ్గర ఉండట్లేదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. అతడి దగ్గర రెండు సిరంజీలు, సూదులు, ఒక మందు సీసా కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులను కూడా విచారించిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయింటున్నారు. ఇతడికి, నగరంలో గతంలో జరిగిన ఘటనలకు సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పులు
సికింద్రాబాద్ నుంచి బల్లార్ష మధ్య రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో పాక్షిక మార్పులు చేశారు. ఆసిఫాబాద్ రోడ్డు, విహిరిగాన్‌ల మధ్య గురువారం నుంచి రైలు వేళల్లో మార్పులు అమలుకానున్నాయి. ఈ మేరకు ఈ రైలు ప్రస్తుత సమయం ప్రకారమే మధ్యాహ్నం 3.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్ నుంచి మాత్రం రాత్రి 8.25 కు బదులు 10.25 గంటలకు బయలుదేరుతుంది. సిరిపూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో రాత్రి 9.50 గంటలకు బదులు 11.10 గంటలకు, సిర్పూర్ టౌన్ నుంచి రాత్రి 10.15 కు బదులు 11.20 గంటలకు బయలుదేరుతుంది. మాకుడి స్టేషన్ నుంచి రాత్రి 10.30 కి బదులు 11.40 గంటలకు, వీరూర్ స్టేషన్లో 10.50 కి బదులు 11.50 కి, విహిరిగాన్ స్టేషన్ నుంచి రాత్రి 11.10 గంటలకు బదులు 12.15 కు బయలుదేరుతుంది.బల్లార్ష స్టేషన్‌కు మాత్రం ప్రస్తుతం ఉన్న సమయం ప్రకారమే అర్ధరాత్రి ఒంటి గంటకు చేరుకుంటుంది. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టేషన్‌ల్లోమార్పు బెల్లంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-బీదర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టేషన్ల్లో ఈ నెల 15 నుంచి మార్పులు చేయనున్నారు. బెల్లంపల్లి-హైదరాబాద్ (17012) ఎక్స్‌ప్రెస్ నాంపల్లికి బదులుగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచే రాకపోకలు సాగిస్తుంది. ఇది ఉదయం 11 గంటలకు బెల్లంపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. హైదరాబాద్-బీదర్ (17010) ఎక్స్‌ప్రెస్ కూడా నాంపల్లికి బదులు సికింద్రాబాద్ నుంచే బయలుదేరుతుంది. ఇది సాయంత్రం 5.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9.15 గంటలకు బీదర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం ప్రస్తుతం ఉన్నట్లుగానే ఈ రైలు బీదర్ నుంచి నాంపల్లి స్టేషన్ వరకే వస్తుంది. విశాఖ-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి వారానికి 3 సార్లు విశాఖపట్టణం-నాందేడ్-విశాఖపట్టణం (18509/18510) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం నుంచి వారానికి 3 రోజులు నడపనున్నారు. ఇప్పటి వరకు ఈ రైలు బుధ,శని వారాల్లో విశాఖ నుంచి బయలుదేరుతుండగా ఇక నుంచి ఆ రెండు రోజులతో పాటు మంగళవారం కూడా విశాఖ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు బుధ,గురు,ఆది వారాల్లో ఉదయం 9గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి 9.20 కి బయలుదేరుతుంది. నాందేడ్ నుంచి విశాఖకు ఇప్పటి వరకు గురు,ఆది వారాల్లో బయలుదేరుతుండగా, ఇక నుంచి బుధవారం కూడా బయలుదేరుతుంది. నాందేడ్ నుంచి విశాఖకు వెళ్లేటప్పుడు బుధ,గురు,ఆది వారాల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరిగి 9.30 కు విశాఖకు బయలుదేరుతుంది.