Bhajan groups
-
మెట్రోలో నవరాత్రి సందడి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోనూ ఈ వేడుకల సందడి కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి గిటార్ వాయిస్తూ అమ్మవారి పాటలు పాడటం కనిపిస్తుంది. ఈ వీడియో క్యాప్షన్‌గా ‘జై మాతా ది’ అని రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి గిటార్ ప్లేచేస్తూ పాటలు పాడుతుండగా, అక్కడున్న ఇతర ప్రయాణికులు అతనితో కలిసి పాడటం కనిపిస్తుంది. మరికొందరు దానిని వీడియో తీస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన చాలా మంది.. గిటార్ వాయిస్తూ పాటలు పాడుతున్న వ్యక్తిని మెచ్చుకుంటున్నారు. फूहड़ रील वालों ने मेट्रो को दूषित कर दिया था और इन्होंने मेट्रो का शुद्धिकरण कर दिया😍जय माता शेरावाली🙏 pic.twitter.com/pjOULqMCSu— Vikash Mohta (@VikashMohta_IND) October 5, 2024ఇది కూడా చదవండి: దుర్గమాసుర సంహారం -
తిరుమలలో ఉద్రిక్తత
సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. కొత్త ప్రాజెక్టు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయ నాలుగు మాడవీధుల్లో అఖండ హరినామ సంకీర్తన చేయాలని భజన బృందాలు తిరుమలకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంతంలో నిషేధిత కార్యక్రమాలు చేపట్టకూడదని విజిలెన్స్ అధికారులు మాడవీధుల్లోని గేట్లను మూసివేసి వారిని వెనక్కు పంపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. భజన కార్యక్రమాలకు టీటీడీ ప్రాధాన్యం ఇచ్చి, జానపద కళాకారులను ఆదుకోవాలని కొంతకాలంగా భజన బృందాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా అదే డిమాండ్‌తో ఆదివారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో తెలుగు భజన బృందాలు సుమారు 11 వేల మంది అలిపిరి కాలిబాటలో మెట్లోత్సవం నిర్వహించారు. తర్వాత ఆలయ నాలుగు మాడవీధుల్లో అఖండ హరినామ సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఆలయం ఎదురుగా ఆస్థాన మండపం వద్దకు తరలివచ్చారు. ఆందోళన కార్యక్రమాలు మాడవీధుల్లో నిర్వహించరాదన్న నిబంధన ఉంది. దాంతో ఆలయ విజిలెన్స్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న టీటీడీ జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు భజన బృందాల నేతలతో చర్చించారు. హరినామ సంకీర్తనకు ముళ్లగుంత స్థలాన్ని కేటాయించామన్నారు. దీంతో కళాకారులు అక్కడకు వెళ్లి హరినామ సంకీర్తన నిర్వహించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి దర్శనం నిలిపివేత బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం శ్రీవారి ఆల యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు అన్ని రకాల దర్శనాలు నిలిపివేస్తారు. తర్వాత ఆలయాన్ని శుద్ధిచేసి ఉదయం 11 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. -
కల్పవృక్ష వాహనంపై గోవిందుడి వైభవం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం ఉదయం గోవిందరాజస్వామి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ వాయిద్య విన్యాసాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వాహన సేవ అనంతరం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. సుగంధ పరిమళాలు, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి సర్వభూపాల వాహన సేవ సాగింది. కార్యక్రమంలో పెదజీయంగార్, చిన్నజీయంగార్, టీటీడీ స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో చంద్రశేఖర్‌పిళ్లై, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ కళావేదికలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో భాగంగా గోవిందరాజస్వామి ఆలయంలో ఉదయం ఎస్కె.స్వర్ణకుమారి బృందం విష్ణుసహస్రనామ పారాయణం సాగింది. అనంతరం కే.రవీంద్రరెడ్డి పురాణ ప్రవచనం, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోవిందరాజస్వామి పుష్కరిణిలో రాత్రి ఎం.వాణి హరికథ పారాయణం చేశారు. మహతి కళాక్షేత్రంలో చెన్నైకు చెందిన జే.జనని బృందం ప్రదర్శించిన భక్తి సంగీతం అలరించింది. రామచంద్ర పుష్కరిణి వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల హరికథా కాలక్షేపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నేడు గరుడ సేవ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గరుడ సేవ జరగనుంది. ఉదయం పల్లకీ సేవ నిర్వహించనున్నారు.