bhashanam
-
భాషణం: ‘ఇప్పుడే వచ్చేస్తాను’ అని వెళ్లిపోతే?
మనుషులకు, మూగజీవులకు మధ్య ఉండేది జీవవైవిధ్యంలాంటి స్నేహం. అందుకేనేమో తరచు వాటి స్వభావాలను మనుషులకూ అన్వయించి మాట్లాడుతుంటాం. monkey business అనే మాట ఇలాంటి అన్వయమే. అల్లరిచిల్లరి వ్యవహారాన్ని, అంగీకారయోగ్యం కాని ప్రవర్తననీ ‘మంకీ బిజినెస్’ అంటారు. The teacher suspected that there had been some monkey business going on in the class. Dog అనే మాటతో అయితే ఇలాంటివి సవాలక్ష ఉన్నాయి. dog eat dog (స్వార్థం కోసం దేనికైనా వెనకాడని లోకమిది అని చెప్పడం), put on the dog (మన గురించి మనం గొప్పగా భావించుకుని అలా ప్రవర్తించడం, మనకంత సీన్ లేకపోయినా), every dog has its day (ప్రతి ఒక్కరికీ ఒక మంచిరోజు వస్తుందని చెప్పడం), give a dog a bad name (కొత్త ఆరోపణను మోపడానికి పాత తప్పును ఎత్తిచూపడం. ‘కుక్కను కొట్టి చంపాలంటే ముందుగా అది పిచ్చిదని ప్రచారం చేయాలి’ అనే అర్థంలో ఈ మాట మన వాడుకలో ఉంది), why keep a dog and bark yourself? (పనివాణ్ణి పెట్టుకుని కూడా మళ్లీ నువ్వే ఆ పని చేసుకోవడం ఎందుకు అని ప్రశ్నించడం), you can't teach an old dog new tricks (అలవాట్లను ఒక పట్టాన మార్చలేమని చెప్పడం), the hair of the dog (రాత్రి తాగిన మందు ఎక్కువై ఉదయాన్నే తలంతా భారంగా ఉండి, మోకాళ్లు గుంజేస్తుంటే ఆ బాధను తగ్గించుకోడానికి మళ్లీ సేవించే పిసరంత మద్యమే... ది హెయిర్ ఆఫ్ ది డాగ్), love me, love my dog (నన్ను ఇష్టపడితే నాలోని లోపాలను కూడా ఇష్టపడాలి అని చెప్పడం), see a man about a dog (ఎక్కడికి వెళుతున్నదీ, ఎందుకు వెళుతున్నదీ చెప్పకుండా ‘ఇప్పుడే వచ్చేస్తాను’ అని చెప్పడం. ఉదా: టాయ్‌లెట్‌కు వెళ్లవలసి వస్తే I have just got to see a man about a dog. I will be back in a minute అనొచ్చు), sick as a dog (విపరీతంగా వాంతి అయితే ఇలా అంటారు), tail wagging the dog (కుక్క... తోకని కాకుండా, తోకే కుక్కని ఊపుతుందని చెప్పడం. చెప్పిన మాట వినకుండా పిల్లలు పెద్దవాళ్లను ఒక ఆట ఆడిస్తున్నా కూడా అది టెయిల్ వ్యాగింగ్ ది డాగ్ కిందికే వస్తుంది), work like a dog (ఒళ్లు హూనమయ్యేలా పనిచేయడం). A dog in the manger అంటే గడ్డివాములో కుక్కతంతు. తను తినదు, తినడానికి వచ్చే గేదెల్ని తిననివ్వదు. మనుషుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉంటారు. వాళ్లు ప్రయోజనం పొందరు. పొందేవాళ్లను పొందనివ్వరు. manger అంటే పశువులకోసం దాణా వేసి ఉంచే పెట్టె. దీనిని ‘మేంజర్’ అని పలకాలి.కోతులు, కుక్కలు కొంతవరకు అయ్యాయి కనుక ఇప్పుడు పులులు, సింహాల దగ్గరి వెళ్దాం. Beard the lion అనే ఒక మాట ఉంది. సింహం గుహలోకి వెళ్లి జూలు పట్టి లాగడం లాంటిదిది. ముఖ్యమైన స్థానంలోని వ్యక్తులను నేరుగా వారున్న చోటికే వెళ్లి కలిసి, వారికి నచ్చని విషయం గురించి మాట్లాడడాన్ని beard the lion (in his / her den) అంటారు. ఇక్కడ beard అంటే గడ్డం కాదు, సంద ర్శించడం. ఇలాంటి దుస్సాహసాన్ని lion-hearted పీపుల్ మాత్రమే చేయగలరు. లయన్ హార్టెడ్ అంటే మాంచి ధైర్యస్థులని. ఇక tiger దగ్గరికి వద్దాం. ఈ పదంతో ఇంగ్లిషులో పెద్దగా ఎక్స్ప్రెషన్స్ లేవు. Paper tiger అనే మాట మాత్రం తరచు వినిపిస్తుంటుంది. కాగితం పులి అని దీని అర్థం. పైకి గంభీరంగా, ప్రమాదకరంగా కనిపిస్తూ లోపల మామూలుగా ఉండే మనుషులను, దేశాలను ఉద్దేశించి ఇలా అంటారు. ప్రధానంగా దీనిని నెగటివ్ సెన్స్‌లో వాడతారు. Work like a dog అనే మాట ఉన్నట్లే... do (all) the donkey work అనే పలుకుబడి ఉంది. దీనర్థం బోరింగ్ జాబ్ అని. అలాగే S talk the hind leg(s) off a donkey అంటే... తెరిపిలేకుండా అదే పనిగా వాగుతుండడం. hind legs అంటే వెనక కాళ్లు. hind ని ‘హైండ్’ అని పలకాలి. ఇంతకీ వాగుడుకి, గాడిద వెనక కాళ్లకీ సంబంధం ఏమిటి? అసలీ వ్యక్తీకరణ ఎలా పుట్టుకొచ్చింది? స్పష్టమైన ఆధారాల్లేవు. గాడిదలు సాధారణంగా వెనక కాళ్లపై కూర్చోవు. వాటిని అలా కూర్చోబెట్టడానికి తల ప్రాణం తోకకు వస్తుందట. గంటల తరబడి గాడిద వెనక కూర్చొని వాటి కాళ్లను క న్విన్స్ చెయ్యాలన్న వ్యంగ్యార్థంలోంచి ఈ ఫ్రేజ్ వచ్చిందని చెబుతారు. ఎవరినైనా, ఏ విషయంలోనైనా ఒప్పించడానికి అదేపనిగా వాళ్ల చెవులను వాయగొట్టడాన్ని ‘టాక్ ది హైండ్ లెగ్స్ ఆఫ్ ఎ డాంకీ’ అనడం ఇందుకేనేమో. Donkey years అనే మాట కూడా ఇలాగే వచ్చి ఉండాలి. దీర్ఘకాలం అనే అర్థంలో. అయితే అవి years కాదు, ears అనే భాషావేత్తలూ ఉన్నారు. ears కాలక్రమంలో years అయ్యాయని ఇంకో అభిప్రాయం. -
భాషణం: ఒప్పుకోవాలి లేదంటే తిప్పికొట్టాలి
ప్రశంసలకు ఆనందించడం, విమర్శలకు బాధపడడం మానవ సహజం. ప్రశంసతో ఏ గొడవవా లేదు. విమర్శే... మనసుని గాయపరచడమే కాకుండా, సమాధానం చెప్పుకోవలసిన స్థితిలోకి మనిషిని నెట్టేస్తుంది. అంటే విమర్శను ఫేస్ చేసి తీరాలి. విమర్శ నిజమైతే నిజమని ఒప్పుకోవాలి. అందులో వాస్తవం లేకపోతే అవాస్తవం అని వాదించాలి. అయితే మనలో కొందరు ఇవేవీ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. దానికి రెండు కారణాలు. ఎవరో ఏదో అంటే దాన్ని పట్టుకుని మన టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఒకటి. విమర్శను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం ఒకటి. అయితే తప్పించుకోవడం అన్నది ఎప్పటికీ కరెక్ట్ సొల్యూషన్ కాదు. ఫేస్ చెయ్యాల్సిందే. అవసరం అయితే ఫైట్ చెయ్యాలి. గెలిచామా ఓడామా అన్నది తర్వాతి సంగతి. ముందైతే యాక్షన్‌కి రియాక్షన్ ఉండాలి కదా. ఒక్క విమర్శ అనే కాదు, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంగ్లిష్‌లో దీన్నే facing the music అంటారు. అంటే తప్పు చేసినప్పుడు శిక్షను ఫేస్ చెయ్యాలి. మనం చేసిన ఒక పని వల్ల ప్రతికూల ఫలితాలు వస్తే తట్టుకోవాలి. పారిపోకూడదు. ఈ వాక్యాలు చూడండి. 1. Deepa broke a dining-room window and had to face the music when her father got home. 2. After failing a math test, Akhil had to go home and face the music. Chin music అంటే... ‘సంభాషణ’ అని. Talk ను conversation ను ఉద్దేశించి చెప్పేటప్పుడు chin music అనే మాటను యూజ్ చేస్తారు. కొంతమంది స్నేహితులు ఉంటారు. ఒకరికొకరు తారసపడినప్పుడు ఇక వారిద్దర్నీ ఎవరూ ఆపలేరు. గంటలు గంటలు అలా మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ల సంభాషణ chin music అన్నమాట. అలాగే కొంతమంది అవతలివాళ్లకు చాన్స్ ఇవ్వకుండా ఏకధాటిగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్లదీ చిన్ మ్యూజిక్కే. (1. Whenever those two get together, you can be sure there will be plenty of chin music. 2. Prakash just loves to hear himself talk. He will make chin music for hours at a time.) ఇక సంతోషకరమైన విషయాలను విన్నప్పుడు చక్కటి సంగీతం విన్నంత హాయిగా ఉంటుంది. ఈ సందర్భాన్ని సూచించే మాట... music to ears. ఉద్యోగులు నెలాఖరులో జీతాల కోసం ఎదురుచూస్తుంటారు. జీతాల రోజు ఆ ఉదయం నుంచే ఆరాలు మొదలౌతాయి. జీతాలు పడ్డాయా, ఇంకా పడలేదా అని. ఆ మధ్యాహ్నమో, సాయంత్రమో వార్త తెలుస్తుంది... జీతాలు పడ్డాయని. అప్పుడది music to ears. చాలాకాలంగా ఎదురుచూస్తున్నది నెరవేరిందన్న వార్త music to ears. ఏదైనా సరే అది సంతోషకరమైన వర్తమానం అయితే వీనుల విందే కదా. ఈ సెంటెన్స్ చూడండి. The rattle of the letterbox was music to my ears - the letter had arrived at last. గేటు బయట ఉత్తరాల పెట్టె చప్పుడు చెవులకు సంగీతంలా అనిపించిందట. అంటే ఎదురు చూస్తున్న ఉత్తరం వచ్చిందని. Stop the music అంటే చేస్తున్న పనిని అక్కడికక్కడ, అప్పటికప్పుడు ఆపేయమని. న్యూస్‌పేపర్ ప్రింట్ అవుతున్నప్పుడు stop the music అని ఆదేశాలు వస్తే, తక్షణం ప్రింటింగ్ ఆపేయమని అర్థం. అంటే అత్యవసరమైన వార్తేదో ఆఖరి నిమిషంలో వచ్చిందని. దాన్ని మేకప్ చేసి ఫ్రెష్‌గా ప్రింటింగ్‌కి ఎక్కించాలని. బాగుంటే కొంటాం... లేదంటే విని ఊరుకుంటాం Ambient music అంటే... ఒక లయ గానీ, క్రమంగానీ లేని మంద్రస్థాయి సంగీతం. ఒక ప్రాంగణంలో వేచి ఉన్న వారికి మనోవినోదం కలిగించేందుకు ఇలాంటి సంగీతాన్ని వినిపిస్తుంటారు. ఇలాంటిదే canned music. దీన్నే సరదగా muzak (మ్యూజాక్) అని అంటుంటారు. ఇది రికార్డెడ్ మ్యూజిక్ అన్నమాట. జనం ఉన్నచోట, ఎయిర్‌పోర్ట్‌లలో, హోటళ్లలో, దుకాణాలలో ఇది నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని దేశాల్లో దీనిని elevator music అంటారు. ఇక Music box అంటే గిఫ్ట్ బాక్స్‌ను ఓపెన్ చెయ్యగానే వినిపించే సంగీతం. Jukebo నే కొందరు music box అంటుంటారు. అది తప్పు. ఒఠజ్ఛు ఛౌ్ఠ అంటే ఆడియో షాపులలో కొత్తగా వచ్చిన సినిమా పాటల్ని, సంగీతాన్ని ఉచితంగా వినిపించే సాధనాలు. టెస్ట్ డ్రైవ్లాంటివి. బాగుంటే కొంటాం. లేదంటే విని ఊరుకుంటాం. విదేశాల్లో కొన్ని చోట్ల juke box లనే listening booths అంటారు. -
భాషణం: లాగి బిగించుకోవాల్సిందే!
రోజులెప్పుడూ ఒకలా ఉండవు. ఏమీ లేని వాళ్లకు ఏదైనా కలిసి వస్తే సంతోషమే కానీ, బాగా బతికినవాళ్లు ఊహించని విధంగా చితికిపోవడమన్నది చాలా బాధాకరమైన పరిణామం. అయితే ఉన్ననాడు ఎలా ఉన్నా, లేనినాడు మాత్రం సర్దుకుపోవాల్సిందే. ఇలా సర్దుకుపోవడాన్నే tightening the belt అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1930-40 మధ్య కాలంలో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసింది. ఎందరో సంపన్నులు, సామాన్యులు తినడానికి తిండే లేని దుర్భరమైన స్థితికి చేరుకున్నారు. ఆ సమయంలో పుట్టిందే tighten your belt అనే పదబంధం. ఆ ‘గ్రేట్ డిప్రెషన్’ పీరియడ్‌లో చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండి లేక, బరువు తగ్గి, బక్కచిక్కిపోయినవారు తమ ప్యాంట్లు కిందికి జారకుండా నడుముకు ఉండే బెల్టును మరింత గట్టిగా (ఇంకో రంథ్రం లోపలికి) బిగించుకునేవారట. అలా ఈ మాట వాడుకలోకి వచ్చిందంటారు. మారిన ఆర్థిక పరిస్థితిని బట్టి అవసరాలను కుదించుకోవడమన్నది అంతరార్థం. సడెన్‌గా జీతం రావడం లేటవుతుంది, లేదా అనుకోని అత్యవసరానికి పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు అయివుంటుంది. అలాంటి సందర్భంలో మిగతా అవసరాలను తగ్గించుకోవలసి వస్తుంది. రెండు పాల ప్యాకెట్లు తీసుకునేవాళ్లు ఒకటితో సరిపెట్టుకుంటారు. వారానికి రెండుసార్లకు బదులు ఒకసారే చికెన్ తింటారు. పండగ వస్తున్నా సరే, ఉన్నబట్టలతోనే సర్దుకుంటారు కానీ, కొత్తవి కొనరు. ఇదంతా కూడా బెల్ట్‌ని టైట్ చేసుకోవడమే. ఈ వాక్యం చూడండి. I have had to tighten my belt since I stopped working full-time. ఫుల్ టైమ్ వర్క్ చేయడం లేదు కాబట్టి ఖర్చులు తగ్గించుకున్నానని చెప్పడం. ఇక be in a tight corner అంటే కష్టాల్లో ఉండడం. Keep a tight rein on అంటే అదుపులో ఉంచుకోవడం. ఇక్కడ ట్ఛజీ అంటే కళ్లెం వేసే తోలు బెల్టు లాంటిది. rein ని ‘రెయిన్’అని పలకాలి. (ఉదా: My father always kept us on a tight rein). Sit tight అంటే కదలకుండా, ఓపిగ్గా, సుదీర్ఘంగా కూర్చోవడం. Tight lipped అంటే పెదవి విప్పకపోవడం, కోపాన్ని అణుచుకోవడం. Sleep tight అంటే హాయిగా నిద్రపోవడం. గుడ్ నైట్ చెప్పడానికి బదులుగా కొంతమంది sleep tight అని అంటారు. Tight fisted అంటే డబ్బు ఖర్చుపెట్టడానికి వెనకాడడం. (వాడుక భాషలో పిసినారి). Belt tight చేసుకున్న అనుభవం ఉన్నవారు tight fisted గా ఉండడం సహజమే. In a tight spot అంటే క్లిష్ట పరిస్థితి, సంక్షోభం. (If there is shortage of fuel, everyone who drives to work will be in a tight spot.) Tight-arse అని ఇంకో మాట ఉంది. దాని అర్థం కూడా tight fisted అనే. కాకపోతే అక్కడ fist, ఇక్కడ arse. దీన్ని ‘ఆస్’ అని పలకాలి. arse అంటే ఏ అవయవ భాగంతో అయితే మనిషి కూర్చుంటాడో ఆ భాగం. (You won't get a drink out of him, he is a real tight arse). అలాగే Close chewer and a tight spitter అనే మాట కూడా. అంటే అస్సలు డబ్బు ఖర్చుపెట్టని వ్యక్తి. పిల్లికి భిక్షం వేయడంటారే... అలా! ఇలాంటివారు ‘మీ ఇంటికొస్తే ఏమిస్తావ్? మా ఇంటికొస్తూ ఏం తెస్తావ్?’ అన్నట్లుంటారు. Run a tight ship అంటే సంస్థని క్రమశిక్షణగా, ఒక పద్ధతి ప్రకారం నడపడం. (The new office manager really runs a tight ship). On a tight leash అంటే ఆధీనంలో ఉంచుకోవడం. Leash అంటే.. కుక్కను కట్టే తోలు పటకా. ఈ వాక్యాలు చూడండి. 1. I keep my dog a tight leash so it won't bother people. 2. My father keeps my brother on a tight leash. 3. The boss has us all on a tight leash. I have had to tighten my belt since I stopped working full-time.