భాషణం: ఒప్పుకోవాలి లేదంటే తిప్పికొట్టాలి | accept the criticism or revert it | Sakshi
Sakshi News home page

భాషణం: ఒప్పుకోవాలి లేదంటే తిప్పికొట్టాలి

Published Sun, Sep 15 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

accept the criticism or revert it

ప్రశంసలకు ఆనందించడం, విమర్శలకు బాధపడడం మానవ సహజం. ప్రశంసతో ఏ గొడవవా లేదు. విమర్శే... మనసుని గాయపరచడమే కాకుండా, సమాధానం చెప్పుకోవలసిన స్థితిలోకి మనిషిని నెట్టేస్తుంది. అంటే విమర్శను ఫేస్ చేసి తీరాలి. విమర్శ నిజమైతే నిజమని ఒప్పుకోవాలి. అందులో వాస్తవం లేకపోతే అవాస్తవం అని వాదించాలి. అయితే మనలో కొందరు ఇవేవీ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. దానికి రెండు కారణాలు. ఎవరో ఏదో అంటే దాన్ని పట్టుకుని మన టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఒకటి. విమర్శను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం ఒకటి. అయితే తప్పించుకోవడం అన్నది ఎప్పటికీ కరెక్ట్ సొల్యూషన్ కాదు. ఫేస్ చెయ్యాల్సిందే. అవసరం అయితే ఫైట్ చెయ్యాలి. గెలిచామా ఓడామా అన్నది తర్వాతి సంగతి. ముందైతే యాక్షన్‌కి రియాక్షన్ ఉండాలి కదా.
 
 ఒక్క విమర్శ అనే కాదు, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంగ్లిష్‌లో దీన్నే facing the music అంటారు. అంటే తప్పు చేసినప్పుడు శిక్షను ఫేస్ చెయ్యాలి. మనం చేసిన ఒక పని వల్ల ప్రతికూల ఫలితాలు వస్తే తట్టుకోవాలి. పారిపోకూడదు. ఈ వాక్యాలు చూడండి. 1. Deepa broke a dining-room window and had to face the music when her father got home. 2. After failing a math test, Akhil had to go home and face the music.
 
 Chin music అంటే... ‘సంభాషణ’ అని. Talk ను  conversation ను ఉద్దేశించి చెప్పేటప్పుడు chin music అనే మాటను యూజ్ చేస్తారు. కొంతమంది స్నేహితులు ఉంటారు. ఒకరికొకరు తారసపడినప్పుడు ఇక వారిద్దర్నీ ఎవరూ ఆపలేరు. గంటలు గంటలు అలా మాట్లాడుకుంటూనే ఉంటారు.  వాళ్ల సంభాషణ chin music అన్నమాట. అలాగే కొంతమంది అవతలివాళ్లకు చాన్స్ ఇవ్వకుండా ఏకధాటిగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్లదీ చిన్ మ్యూజిక్కే. (1. Whenever those two get together, you can be sure there will be plenty of chin music. 2. Prakash just loves to hear himself talk. He will make chin music for hours at a time.)
 
 ఇక సంతోషకరమైన విషయాలను విన్నప్పుడు చక్కటి సంగీతం విన్నంత హాయిగా ఉంటుంది. ఈ సందర్భాన్ని సూచించే మాట... music to ears. ఉద్యోగులు నెలాఖరులో జీతాల కోసం ఎదురుచూస్తుంటారు. జీతాల రోజు ఆ ఉదయం నుంచే ఆరాలు మొదలౌతాయి. జీతాలు పడ్డాయా, ఇంకా పడలేదా అని. ఆ మధ్యాహ్నమో, సాయంత్రమో వార్త తెలుస్తుంది... జీతాలు పడ్డాయని. అప్పుడది music to ears. చాలాకాలంగా ఎదురుచూస్తున్నది నెరవేరిందన్న వార్త music to ears. ఏదైనా సరే అది సంతోషకరమైన వర్తమానం అయితే వీనుల విందే కదా. ఈ సెంటెన్స్ చూడండి. The rattle of the letterbox was music to my ears - the letter had arrived at last. గేటు బయట ఉత్తరాల పెట్టె చప్పుడు చెవులకు సంగీతంలా అనిపించిందట. అంటే ఎదురు చూస్తున్న ఉత్తరం వచ్చిందని.
 
 Stop the music అంటే చేస్తున్న పనిని అక్కడికక్కడ, అప్పటికప్పుడు ఆపేయమని. న్యూస్‌పేపర్ ప్రింట్ అవుతున్నప్పుడు stop the music అని ఆదేశాలు వస్తే, తక్షణం ప్రింటింగ్ ఆపేయమని అర్థం. అంటే అత్యవసరమైన వార్తేదో ఆఖరి నిమిషంలో వచ్చిందని. దాన్ని మేకప్ చేసి ఫ్రెష్‌గా ప్రింటింగ్‌కి ఎక్కించాలని.  
 
 బాగుంటే కొంటాం... లేదంటే విని ఊరుకుంటాం
 Ambient music అంటే... ఒక లయ గానీ, క్రమంగానీ లేని మంద్రస్థాయి సంగీతం. ఒక ప్రాంగణంలో వేచి ఉన్న వారికి మనోవినోదం కలిగించేందుకు ఇలాంటి సంగీతాన్ని వినిపిస్తుంటారు. ఇలాంటిదే canned music. దీన్నే సరదగా muzak (మ్యూజాక్) అని అంటుంటారు. ఇది రికార్డెడ్ మ్యూజిక్ అన్నమాట. జనం ఉన్నచోట, ఎయిర్‌పోర్ట్‌లలో, హోటళ్లలో, దుకాణాలలో ఇది నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని దేశాల్లో దీనిని elevator music అంటారు. ఇక Music box అంటే గిఫ్ట్ బాక్స్‌ను ఓపెన్ చెయ్యగానే వినిపించే సంగీతం. Jukebo నే కొందరు music box అంటుంటారు. అది తప్పు. ఒఠజ్ఛు ఛౌ్ఠ అంటే ఆడియో షాపులలో కొత్తగా వచ్చిన సినిమా పాటల్ని, సంగీతాన్ని ఉచితంగా వినిపించే సాధనాలు. టెస్ట్ డ్రైవ్‌లాంటివి. బాగుంటే కొంటాం. లేదంటే విని ఊరుకుంటాం. విదేశాల్లో కొన్ని చోట్ల juke box లనే listening booths  అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement