Admiration
-
నిరాడంబరత అంటే..?
విజ్ఞానం... సాంకేతికాభివృద్ధి వల్ల మన భౌతికమైన సుఖాన్ని పెంచే వస్తువులు ఇబ్బడిముబ్బడి గా మనకి అందుబాటులోకి వచ్చాయి. మన అవసరాలు పెరుగుతున్నాయి. పెరిగిన కొద్దీ వాటిని సమకూర్చుకోగలిగే స్థాయిలో మన ఆదాయాన్ని పెంచుకోవలసి వస్తోంది. సాంకేతిక–రంగ నిపుణులు అందించే ఫలాలను తప్పనిసరిగా పొందాల్సిందే. ఇక్కడే మన ఔచితి వ్యక్తమవ్వాలి. ప్రాధాన్యతలను తెలుసుకోవాలి. అసలు అవసరముందో లేదో వివేచన చెయ్యాలి. ఇది పరిశీలించి అప్రమత్తులమైతే నిరాడంబరతకు దగ్గరగా ఉన్నట్టే. అసాధారణ ప్రతిభ చూపిన తరువాత వచ్చే ప్రశంసలకు చిరునవ్వుతో స్పందించటం నిరాడంబరత. అద్భుతమైన ప్రతిభను ఓ కవి తన గీతంలో గాని, గాయకుడు పాటలో గాని, నర్తకి తన నాట్యంలోగాని లేదా ఏ ఇతర లలిత కళల్లో గాని చూపినపుడు ప్రజలు హర్షధ్వానాలు చేసిన క్షణాన ఎగిరెగిరి పడకుండా ఉండటం నిరాడంబరుల లక్షణం. నిరాడంబరతలో ఉన్న అనేక కోణాలలో ఇక్కడ మనకు స్ఫురించవలసింది నిగర్వం. అసామాన్యులైనా సామాన్యులవలే వర్తించటం, అందరితో కలుపుగోలుగా ఉంటూ అరమరికలు లేకుండా మాట్లాడటం నిరాడంబరుల వ్యక్తిత్వంలోని ఒక పార్శ్వమే. వారి లోని విద్వత్తు గాని, అద్వితీయమైన కళానైపుణ్యాన్ని గాని, విశేషమైన ప్రజ్ఞను గాని ఎక్కడా అసందర్భంగా.. అనుచితంగా ప్రదర్శన చేయరు. వారి వైఖరి నిండుకుండే. అట్టహాసం.. హడావిడి. వెంపర్లాట లేకుండా ఉండటమే వీరి విశిష్టత. ఆడంబరం లేకపోవటమే నిరాడంబరం. నిరాడంబరత ఇహ ప్రపంచానికే కాక ఆంతరంగిక జగత్తుకు అవసరం. నిజానికి అత్యంత ఆవశ్యకం. ఎందుకు..? నిరాడంబరత్వాన్ని మాటల్లో.. చేతల్లో చూపించే వారెందరో ఉన్నారు. అది నిస్సందేహంగా మెచ్చుకోదగ్గ విషయమే. వీరికి మనస్సు లో కూడ అదే భావన ఉండాలి. మనస్సు ఆడంబరపుటూయలలూగరాదు. ఐహిక సుఖాల వైపు మొగ్గు చూపకూడదు. నిగ్రహశక్తి కావాలి. అపుడే అద్భుత సుఖజగత్తును త్రోసిరాజనగలం. దానిని గురించి ఎవరు మాట్లాడినా.. ఎన్ని ఆకర్షణలు చూపినా అణుమాత్రమైన చలించం. ఇవి సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. వీటి ప్రభావం తాత్కాలికం. శాశ్వతమైన.. అలౌకిక ఆనందాన్నిచ్చే ఉన్నతమైన ఆలోచనాసీమలో మీ మనస్సు విహరిస్తున్న వేళ ఈ బాహ్యప్రపంచపు సుఖం గురించి చింతన ఉండనే ఉండదు. అవి పొందలేకపోతున్నామనే స్పృహే ఉండదు. ఈ స్థితిలో మాట.. చేత.. మనస్సు ఏకమై నిరాడంబరత గంభీర ప్రవాహమవుతుంది. ఆ స్థితికి చేరుకున్నవాళ్లు నిస్సందేహం గా మహానుభావులే. అందుకే నిరాడంబరత అలవడటం.. వ్యక్తిత్వంలో ఓ భాగమవ్వటం చాలా కష్టమైనదని పెద్దలంటారు. అయితే, అసాధ్యం కాదు. కాని ఎంతో సాధన చేస్తేగానీ పట్టుబడని విద్య. నిరాడంబర జీవితం.. ఉన్నత ఆలోచన అనే సిద్ధాంతాన్ని పథంగా తమ జీవితాన్ని పయనింపచేసుకున్నవారు అత్యంత నిరాడంబరులు. ఆదర్శప్రాయులు.. ప్రాతః స్మరణీయులు. నిరాడంబరత కొందరికి స్వాభావికం. కానికొందరికి అభ్యాసం వల్ల అలవడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతిభావ్యుత్పత్తులు.. ప్రజ్ఞ... చాలామందిలో ఉండచ్చు. మనకన్నా ప్రతిభావంతులు ఉండచ్చు. జ్ఞానంలో.. నైపుణ్యంలో అత్యద్భుత శక్తి సామర్థ్యాలున్నవారు అనేకులు ఉండవచ్చు. ఇది మదిలో పెట్టుకోవాలి. ఈ నిరంతర స్ఫురణ మనల్ని నిరాడంబరులుగానే ఉంచుతుంది. అతిశయం.. ఆవేశ కావేశాలు.. అతి విశ్వాసం మనల్ని నిరాడంబరతకు దూరం చేస్తాయి. నిరాడంబరత్వం మన ఆహార్యానికీ వర్తిస్తుంది. మనం వేసుకునే దుస్తులు మన ఆలోచనా తీరును చెపుతాయి. సమయానికి.. సందర్భానికి ఏ రకమైన ఉడుపులు వేసుకోవాలో నేర్పుతాయి. ఎంత విలువైన దుస్తులు ధరిస్తే మనకంతటి విలువ అనుకునే వారందరూ ఆడంబరులే. శుభ్రమైన... సాధారణమైన దుస్తులు ధరించి కూడ గొప్ప వ్యక్తిత్వం, ప్రజ్ఞ కలవారు లోకంలో మన్నన పొందుతారు. గొప్ప విద్యావేత్త... మేధావి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సాధారణ దుస్తులు ధరించి తను ప్రసంగించవలసిన సభకు విచ్చేసినపుడు ఆయనకు జరిగిన అనుభవం... ఆయన దానికి స్పందించిన తీరు మనకందరకు తెలుసు. మనిషికి జ్ఞానం... ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రధానం. వాటికే విలువివ్వాలి. నిరాడంబరులను చూస్తే కొంతమందికి చిన్న చూపు. ఒక రకమైన ఏవగింపు. వారు పిసినారులని, జీవితాన్ని, దానిలోని సుఖాన్ని అనుభవించటం తెలియదని ఆలోచన.. మితిమీరిన పొదుపు తో ఈ దేహాన్ని కష్టపెడతారని వారి భావన. నిజానికి వీరే నిరాడంబరతలోని అందాన్ని.. ఆనందాన్ని చూడలేక అలా విమర్శ చేస్తుంటారు. ఐహిక సుఖం అశాశ్వతమైనది. అస్థిరమైనది. చంచలమైనది. నిరాడంబరత ఇచ్చేది ఆనందం. ఇదే శాశ్వతమైనది.. నిజమైనది. మనకవసరమైన వాటినే ఉంచుకోవాలి. మనం ఉపయోగించని వస్తువులను అవసరార్థులకు ఇచ్చే అలవాటు చేసుకోవాలి. అనవసరంగా కొనే అలవాటు మానుకోవాలి. ఈ పొదుపరితనమే ఒకరకమైన నిరాడంబరత్వం. నిరాడంబరత అలవరచుకోవటం వల్ల మనం సమయాన్ని వృధా కానీయం. మనకెంతో సమయం మిగులుతుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన జీవనగమనాన్ని పరిశీలించి లోపాలను సరిదిద్దుకోవచ్చు. చేయతగ్గ మంచిపనులను చేసేందుకు సమయం కేటాయించవచ్చు. చావు పుట్టుకల చట్రం నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించవచ్చు. మనలోని మానవీయతను మన జీవనం లో చూపి ఈ సృష్టిలో మనిషి సర్వోన్నతుడన్న గొప్పవారి మాటలను రుజువు చేయచ్చు. మానవుడు మహనీయుడు కాగలడని వెల్లడి చేయవచ్చు. లేనివారికి.. యోగ్యులైనవారికి మన శక్తిమేరకు దానం చేయవచ్చు. ఆపన్నులకు చేయూతనివ్వవచ్చు. నిరాడంబరతను అలవరచుకుంటే దానిలో నిబిడీకృతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఏమిటా ఐశ్వర్యం..!? పొదుపరితనం.. నిర్మలత్వం... పవిత్రత..« దార్మికత...అద్భుతమైన ఆత్మసంతృప్తి...ఉన్నత ఆలోచన... సాధన... సత్యశోధన ఇలా ఎన్నో ఎన్నెన్నో. పారమార్థిక దృష్టిలో మనమెంత నిరాడంబరులమైతే అంతటి ఐశ్వర్యవంతులం. ఎవరికి తృప్తి ఉంటుందో వారే ధనవంతులు. ఈ తృప్తికి.. అంతులేని సంపద కలిగి ఉండటానికి సంబంధమే లేదు. ఈ తృప్తి ఎలా వస్తుంది.. ఎవరికి ఉంటుంది? నిరాడంబరత వల్ల... ఆ విధమైన జీవితం గడపగలిగే వారికుంటుంది. అంటే సాదాసీదా జీవన శైలి. దీనివల్ల తృప్తి వస్తుంది. ఇదే మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇది గొప్ప ఆనందస్థితి. దీన్ని సాధించటానికే యోగుల దగ్గర నుండి సామాన్యుల వరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు... వారి వారి జీవిత నేపథ్యం.. ఆలోచనా విధానం... వారికి తోచిన మార్గాలననుసరించి. గమ్యాలు వేరు, కాని లక్ష్యం ఒకటే. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
పీహెచ్‌సీకి జిల్లాస్థాయిలో ప్రశంస
బొంరాస్‌పేట: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సేవలకు జిల్లా స్థాయిలో ఉత్తమ పీహెచ్సీగా గుర్తింపు అభించింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీఎంఅండ్హెచ్ఓల సమక్షంలో మండల వైద్యాధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ బుధవారం ప్రశంసలు అందుకున్నారు. స్థానిక పీహెచ్సీలో పెరిగిన కాన్పులు, ఓపీలకు అందించిన సేవల విషయంలో ప్రగతి సాధించినందుకుగానూ జిల్లా అధికారుల అభినందనలు లభించాయని డాక్టర్ రవీంద్ర చెప్పారు. మండల వైద్య ఆరోగ్య సిబ్బంది, మండల ప్రజల సహకారంతో పీహెచ్సీ గుర్తింపు దక్కిందన్నారు. మెరుగైన సేవలు కొనసాగిస్తూ మండలానికి ప్రత్యేకను తెచ్చేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈమేరకు ఎంపీడీఓ హరినందనరావు తదితర మండలస్థాయి అధికారులు అభినందనలు తెలియజేశారు. జిల్లా ఉత్తమ పీహెచ్సీ సూపర్వైజర్గా నర్సిములు మర్పల్లి: జిల్లా కలెక్టర్ సమక్షంలో జిల్లా వైద్యాధికారి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ సూపర్వైజర్గా ప్రశంస పత్రం అందుకోవడం సంతోషంగా ఉందని పట్లూర్ పీహెచ్సీ సూపర్వైజర్ నర్సిములు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవంను పురస్కరించుకొని జిల్లాలో జనాభా నియంత్రణ కోసం అత్యుత్తమ సేవలు అందించిన వైద్యశాఖ సిబ్బందికి జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్, జిల్లా వైద్యాధికారి దశరథ్ పలువురికి ఆవార్డులు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో పట్లూర్ పీహెచ్సీ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న నర్సిములుకు బుధవారం కలెక్టర్ సమక్షంలో ఆవార్డుతో పాటు ప్రశంసపత్రం అందజేసినట్లు నర్సిములు తెలిపారు. ఈ అవార్డుతో తనపై మరింత పనిభారం పెరగనుందని ఆయన అన్నారు. ఆవార్డు, ప్రశంస పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్‌కు, జిల్లా వైద్యాధికారి దశరథ్కు నర్సిములు కృతజ్ఞతలు తెలిపారు. -
నాయర్‌పై ప్రశంసల జల్లు
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో త్రిశతకం సాధించిన కరుణ్ నాయర్‌పై ప్రధాని మోదీతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. ►‘చారిత్రక ట్రిపుల్ సెంచరీ సాధించినందుకు కరుణ్ నాయర్‌కు అభినందనలు. నీ ఘనతపై మేమంతా గర్వంగా ఫీలవుతున్నాం’. – ప్రధాని మోదీ ►‘కరుణ్ ట్రిపుల్ సెంచరీ సాధించిన క్షణాలు భారత క్రికెట్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. దేశానికి మరింత పేరు తేవాలి’. – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు) ► ‘నాయర్ సాధించిన ఫీట్‌పై స్పందించేందుకు మాటలు రావడం లేదు. అతడి బ్యాటింగ్ తీరు అద్భుతం’. – కపిల్ దేవ్ ►‘కరుణ్, కేఎల్ రాహుల్ ఆట అసాధారణం. వీరిని చూస్తే గతంలో కర్ణాటక నుంచే వచ్చిన విశ్వనాథ్, ద్రవిడ్ బ్యాటింగ్ గుర్తుకువస్తోంది’. – గావస్కర్ ►‘300 క్లబ్‌లోకి స్వాగతం. 12 ఏళ్ల ఎనిమిది నెలల నుంచి ఇందులో నేనొక్కడినే ఉంటూ బోర్‌గా ఫీలవుతున్నాను. మరోసారి ఈ ఫీట్ సాధిస్తావనుకుంటున్నాను’. – సెహ్వాగ్ -
పోలీసుల పనితీరు భేష్
డీజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ► యువత ఐసిస్ బాట పట్టకుండా బలగాలు కృషి చేశాయి ► ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశాయి ► పెద్ద నోట్ల రద్దుతో జాతి వ్యతిరేక శక్తులకు నిధులు ఆగిపోతాయి సాక్షి, హైదరాబాద్: దేశ అంతర్గత భద్రతలో కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల పాత్ర ప్రశంసనీయమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. యువత ఐసిస్ వైపు తప్పుదోవపట్టకుండా కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు సమన్వయంతో కృషి చేశాయని, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్మూలించాయని కొనియాడారు. ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లు, వామపక్ష తీవ్రవాదం, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులతో గడచిన ఏడాది కాలంగా దేశ అంతర్గత భద్రత పెను సవాళ్లను ఎదుర్కొందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో డీజీపీ, ఐజీపీల 51వ జాతీయ సదస్సును రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారుల మధ్య ఆరోగ్యదాయకమైన పోటీ ఉంటే చక్కని ఫలితాలు సాధించవచ్చన్నారు. పెద్ద నోట్ల రద్దుతో.. జాతి వ్యతిరేక శక్తులకు అందే నిధులు ఆగిపోతాయన్నారు. రాష్ట్రాలు, కేంద్ర సంస్థల పోలీసు సిబ్బంది ఉత్తమ విధానాలపై పరస్పరం సమాచారం ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స, ప్రాసిక్యూషన్ వంటి వివిధ భద్రతా విభాగాల సేవలను సముచితంగా గుర్తించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా హోంశాఖ, ఇంటెలిజెన్స బ్యూరోకు చెందిన అధికారులకు ఇండియన్ పోలీస్ పతకాలను రాజ్‌నాథ్ ప్రదానం చేశారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశంలో.. భద్రతపరంగా దేశం ఎదుర్కొంటున్న వివిధ అంశాలపై చర్చలు జరిపి, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలపై ఒక కార్యాచరణను రూపొందిస్తారు. అంతకుముందు రాజ్‌నాథ్ అకాడమీలో సర్దార్ పటేల్ విగ్రహం వద్ద, ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన అమరవీరుల స్మారకం వద్ద పూలమాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు కిరెన్ రిజిజు, హన్సరాజ్ గంగారామ్ అహిర్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్ రుషి, అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ, భద్రత, నిఘా సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అనంత ఔదార్యం పశువులపై మమకారం
♦ పొలాన్ని బీడుగా ఉంచి మూగజీవాలకు నీరు ♦ నాలుగు నెలలుగా మూడు పూటలా.. ♦ 200 జీవాలకు నీటి దానం ♦ తిమ్మాపురం రైతు అనంతిపై ప్రశంసల జల్లు అసలే కరువు... ఆపై వేసవి... ఎక్కడా చుక్క నీరు దొరకని పరిస్థితి. గొంతు తడుపుకునేందుకు రైతులు, ప్రజలే కాదు పశువులు సైతం తల్లడిల్లిపోతున్నాయి. చాలాచోట్ల ప్రాణాలు సైతం వదులుతున్నాయి. ఇలాంటి గడ్డుపరిస్థితుల్లో ఓ రైతన్న కరుణించాడు. పెద్ద మనసుతో తన పొలాన్ని బీడుగా పెట్టి దాదాపు రెండు వందల పశువులకు నిత్యం తాగునీటిని అందిస్తున్నాడు. నాలుగు నెలలుగా మూడుపూటలా నీరందిస్తోన్న రైతు అనంతిని స్థానికులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. - రేగోడ్ ఆనందంగా ఉంది... నా భూమిని బీడుగా ఉంచి పశువులకు తాగునీటిని అందిస్తున్నా. వాటి దాహార్తిని తీర్చే అవకాశం రావడం నాకెంతో ఆనందంగా ఉంది. పశువులు బతికితేనే వ్యవసాయం నిలుస్తుంది. పాడిపరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. - అనంతి, రైతు, తిమ్మాపురం రే గోడ్ మండలం కొండాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన మాల అనంతికి రెండు చోట్ల కలిపి మొత్తం మూడెకరాల భూమి ఉంది. ఎకరంన్నర ఉన్న భూమిలో పెద్దబండపై నాలుగు నెలల క్రితం బోరుబావి తవ్వించాడు. తన కష్టానికి ప్రతిఫలంగా వేసిన బోరులో నీళ్లు పుష్కలంగా వచ్చాయి. పంట వేద్దామనుకునే లోపే గ్రామంలో నీటి సమస్య మొదలైంది. ప్రజలతోపాటు పశువులు పడుతున్న ఇబ్బందులను తలచుకుంటేనే భయమేస్తోంది. స్థానికులంతా కలిసి రైతు అనంతిని కలిశారు. నీటి గోసతో పశువులు తల్లడిల్లుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన స్వయాన రైతు కావడం.. స్థానికుల విన్నపంతోపాటు పశువుల బాధను అర్థం చేసుకున్న అనంతి వాటికి తాగు నీటిని అందించేందుకు ముందుకు వచ్చాడు. తన పొలాన్ని బీడుగా ఉంచి బోరునుంచి నీటిని వదులుతున్నాడు. రోజుకు మూడుసార్లు సుమారు రెండు వందల పశువులకు నాలుగు నెలలుగా దాహార్తిని తీరుస్తున్నాడు. ప్రశంసలు... పశువులకు నీటిని అందిస్తోన్న రైతు అనంతిని స్థానికులు, రైతులు అభినందిస్తున్నారు. ఆయన తన పొలంలో సాగు చేపడితే కనీసం రూ.25 వేల లాభం వచ్చేది. కానీ డబ్బులను ఆశించకుండా పశుసంతతిని కాపాడాలనే పెద్దమనసుతో ఆయన ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నారు. -
భాషణం: ఒప్పుకోవాలి లేదంటే తిప్పికొట్టాలి
ప్రశంసలకు ఆనందించడం, విమర్శలకు బాధపడడం మానవ సహజం. ప్రశంసతో ఏ గొడవవా లేదు. విమర్శే... మనసుని గాయపరచడమే కాకుండా, సమాధానం చెప్పుకోవలసిన స్థితిలోకి మనిషిని నెట్టేస్తుంది. అంటే విమర్శను ఫేస్ చేసి తీరాలి. విమర్శ నిజమైతే నిజమని ఒప్పుకోవాలి. అందులో వాస్తవం లేకపోతే అవాస్తవం అని వాదించాలి. అయితే మనలో కొందరు ఇవేవీ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. దానికి రెండు కారణాలు. ఎవరో ఏదో అంటే దాన్ని పట్టుకుని మన టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఒకటి. విమర్శను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం ఒకటి. అయితే తప్పించుకోవడం అన్నది ఎప్పటికీ కరెక్ట్ సొల్యూషన్ కాదు. ఫేస్ చెయ్యాల్సిందే. అవసరం అయితే ఫైట్ చెయ్యాలి. గెలిచామా ఓడామా అన్నది తర్వాతి సంగతి. ముందైతే యాక్షన్‌కి రియాక్షన్ ఉండాలి కదా. ఒక్క విమర్శ అనే కాదు, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంగ్లిష్‌లో దీన్నే facing the music అంటారు. అంటే తప్పు చేసినప్పుడు శిక్షను ఫేస్ చెయ్యాలి. మనం చేసిన ఒక పని వల్ల ప్రతికూల ఫలితాలు వస్తే తట్టుకోవాలి. పారిపోకూడదు. ఈ వాక్యాలు చూడండి. 1. Deepa broke a dining-room window and had to face the music when her father got home. 2. After failing a math test, Akhil had to go home and face the music. Chin music అంటే... ‘సంభాషణ’ అని. Talk ను conversation ను ఉద్దేశించి చెప్పేటప్పుడు chin music అనే మాటను యూజ్ చేస్తారు. కొంతమంది స్నేహితులు ఉంటారు. ఒకరికొకరు తారసపడినప్పుడు ఇక వారిద్దర్నీ ఎవరూ ఆపలేరు. గంటలు గంటలు అలా మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ల సంభాషణ chin music అన్నమాట. అలాగే కొంతమంది అవతలివాళ్లకు చాన్స్ ఇవ్వకుండా ఏకధాటిగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్లదీ చిన్ మ్యూజిక్కే. (1. Whenever those two get together, you can be sure there will be plenty of chin music. 2. Prakash just loves to hear himself talk. He will make chin music for hours at a time.) ఇక సంతోషకరమైన విషయాలను విన్నప్పుడు చక్కటి సంగీతం విన్నంత హాయిగా ఉంటుంది. ఈ సందర్భాన్ని సూచించే మాట... music to ears. ఉద్యోగులు నెలాఖరులో జీతాల కోసం ఎదురుచూస్తుంటారు. జీతాల రోజు ఆ ఉదయం నుంచే ఆరాలు మొదలౌతాయి. జీతాలు పడ్డాయా, ఇంకా పడలేదా అని. ఆ మధ్యాహ్నమో, సాయంత్రమో వార్త తెలుస్తుంది... జీతాలు పడ్డాయని. అప్పుడది music to ears. చాలాకాలంగా ఎదురుచూస్తున్నది నెరవేరిందన్న వార్త music to ears. ఏదైనా సరే అది సంతోషకరమైన వర్తమానం అయితే వీనుల విందే కదా. ఈ సెంటెన్స్ చూడండి. The rattle of the letterbox was music to my ears - the letter had arrived at last. గేటు బయట ఉత్తరాల పెట్టె చప్పుడు చెవులకు సంగీతంలా అనిపించిందట. అంటే ఎదురు చూస్తున్న ఉత్తరం వచ్చిందని. Stop the music అంటే చేస్తున్న పనిని అక్కడికక్కడ, అప్పటికప్పుడు ఆపేయమని. న్యూస్‌పేపర్ ప్రింట్ అవుతున్నప్పుడు stop the music అని ఆదేశాలు వస్తే, తక్షణం ప్రింటింగ్ ఆపేయమని అర్థం. అంటే అత్యవసరమైన వార్తేదో ఆఖరి నిమిషంలో వచ్చిందని. దాన్ని మేకప్ చేసి ఫ్రెష్‌గా ప్రింటింగ్‌కి ఎక్కించాలని. బాగుంటే కొంటాం... లేదంటే విని ఊరుకుంటాం Ambient music అంటే... ఒక లయ గానీ, క్రమంగానీ లేని మంద్రస్థాయి సంగీతం. ఒక ప్రాంగణంలో వేచి ఉన్న వారికి మనోవినోదం కలిగించేందుకు ఇలాంటి సంగీతాన్ని వినిపిస్తుంటారు. ఇలాంటిదే canned music. దీన్నే సరదగా muzak (మ్యూజాక్) అని అంటుంటారు. ఇది రికార్డెడ్ మ్యూజిక్ అన్నమాట. జనం ఉన్నచోట, ఎయిర్‌పోర్ట్‌లలో, హోటళ్లలో, దుకాణాలలో ఇది నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని దేశాల్లో దీనిని elevator music అంటారు. ఇక Music box అంటే గిఫ్ట్ బాక్స్‌ను ఓపెన్ చెయ్యగానే వినిపించే సంగీతం. Jukebo నే కొందరు music box అంటుంటారు. అది తప్పు. ఒఠజ్ఛు ఛౌ్ఠ అంటే ఆడియో షాపులలో కొత్తగా వచ్చిన సినిమా పాటల్ని, సంగీతాన్ని ఉచితంగా వినిపించే సాధనాలు. టెస్ట్ డ్రైవ్లాంటివి. బాగుంటే కొంటాం. లేదంటే విని ఊరుకుంటాం. విదేశాల్లో కొన్ని చోట్ల juke box లనే listening booths అంటారు.