Bhisma
-
అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఉత్తరాయణంలో
46 రోజులపాటు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ రోజునే స్వచ్ఛంద మరణమనే వరం ద్వారా ప్రాణ త్యాగం చేసినందువల్ల మాఘశుద్ధ అష్టమికి భీష్మాష్టమి అని పేరు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయనీ విశ్వాసం. సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణ లు వదలరాదు కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడిది. భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. శిరఃస్నానం చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి. పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించుకోవాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం ‘ఓం నమోనారాయణాయ‘ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు. -
న్యూ లుక్.. న్యూ క్యారెక్టర్
‘భీష్మ’ చిత్రంతో కొత్త ప్రయాణాన్ని సంతోషంగా ఆరంభించానంటున్నారు హీరో నితిన్. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ గురువారం మొదలైంది. ‘‘దాదాపు ఏడాది తర్వాత కెమెరా ముందుకు వచ్చాను. ‘న్యూ డే.. న్యూ లుక్.. న్యూ క్యారెక్టర్’. ‘భీష్మ’ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని నితిన్ పేర్కొన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కాకుండా చంద్రశేఖర్ ఏలేటి, కృష్ణచైతన్య దర్శకత్వాల్లో సినిమాలు కమిట్ అయ్యారు నితిన్. -
రొమాంటిక్ భీష్మ
నితిన్, రష్మికా మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. సరదా సంఘటనలతో సాగుతుంది. ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే స్క్రిప్ట్ బాగా వచ్చినందుకు టీమ్ అంతా వెరీ హ్యాపీ. ప్రతి అబ్బాయి నితిన్‌గారి క్యారెక్టర్‌కి, ప్రతి యువతి రష్మిక పాత్రకి కనెక్ట్ అయ్యేలా స్క్రిప్ట్ రూపొందించాం’’ అన్నారు. ‘‘ఈ నెల 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్ తదితరులు నటించనున్న ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: సాయి శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకట రత్నం (వెంకట్), సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
ఎప్పటికీ ఒంటరిగానే!
మూడుపదుల వయసు దాటిన హీరో నితిన్ ఇంకా వివాహం చేసుకోలేదు. శుక్రవారం ‘సింగిల్ ఫర్ ఎవర్’ (ఎప్పటికీ ఒంటరిగా) అంటూ ఓ ప్రకటన ఇప్పించారు. ఇది చదివి ఇక నితిన్ ఎప్పటికీ బ్యాచిలర్‌గా మిగిలిపోతాడేమో అని ఊహించుకోకండి. ఒంటరిగా ఉంటానని నితిన్ చెప్పింది ‘భీష్మ’ చిత్రం గురించి. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందనున్న సినిమా ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ రోజు నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘భీష్మ’ అనౌన్స్మెంట్ వచ్చింది. ‘‘తొమ్మిది గ్రహాలు.. ఏడుసముద్రాలు.. 204 దేశాలు... మూడు బిలియన్స్ పైగా అమ్మాయిలు ఉన్నారు. కానీ అతను స్టిల్ సింగిల్ గానే ఉన్నాడు’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. మరి.. సినిమాలో భీష్మ బ్యాచిలర్ ౖలñఃఫ్కి ఫుల్స్టాప్ పెట్టించడానికి హీరోయిన్ ఏం చేసింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. -
భీష్మ ప్రతిజ్ఞ
నితిన్ స్టిల్ బ్యాచిలర్. అవును.. ఇంకా పెళ్లి కాలేదు. తను బ్యాచిలరే కదా అనుకుంటున్నారా? అవును. రియల్ లైఫ్‌లో బ్యాచిలరే. ఇప్పుడు స్క్రీన్ మీద కూడా బ్యాచిలర్‌గానే కనిపించనున్నారు. సినిమా పేరు ‘భీష్మ’. పురాణాల్లో భీష్మాచార్యులు సింగిల్. సినిమాకి ఈ టైటిల్ పెట్టాలనుకుంటున్నారంటే సినిమాలో పెళ్లి చేసుకోకూడదని భీష్ముడిలా ఏదైనా ప్రతిజ్ఞ చేస్తారా? లేక ఫైనల్‌గా జోడీ కుదురుతుందా?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొంత టైమ్ పడుతుంది. నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రష్మికా మండన్నా కథానాయిక. ఈ చిత్రానికి ‘భీష్మ : ది బ్యాచిలర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది మే నెలలోపు షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్‌కు సినిమా రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించనుంది. -
ఆ మౌనానికి పరిహారం
అంపశయ్యమీద ఉండి భీష్ముడు విలపిస్తూ ఉన్నాడు. అది చూసి పాండవులు కృష్ణుడిని రహస్యంగా ‘‘కృష్ణా! ఇదేమి వింత! మహాజ్ఞాని, సర్వసంగ పరిత్యాగి అయిన భీష్మపితామహుడు, రాబోయే మృత్యువు గురించి ఆలోచించి ఎందుకు విలపిస్తున్నాడు?’’ అని అడిగారు. అందుకు శ్రీ కృష్ణుడు చిద్విలాసంగా నవ్వుతూ, ‘ఎందుకు విలపిస్తున్నాడో భీష్ముడినే అడగండి’ అన్నాడు. పాండవులు వెంటనే భీష్ముడి దగ్గరకు వెళ్లి, ‘తాతా! నువ్వు ఎందుకని విలపిస్తున్నావు? కారణం ఏమిటి ...?’ అని అడిగారు. అందుకు భీష్ముడు, ‘‘నాయనలారా! నాకు చావు వస్తుందని ముందే తెలుసు. ఎప్పుడు చావాలో కూడా నాకు తెలుసు. స్వచ్ఛంద మరణమనే వరమూ ఉంది. అయితే, నేను దిగులు పడేది, నాకు రాబోయే చావు గురించో, ఒళ్లంతా గుచ్చుకున్న బాణాల వల్ల సలుపుతున్న గాయాల గురించో కాదు. ‘‘భగవంతుని లీలలు వేటినీ తెలుసుకోలేక పోతున్నానే అని. అందుకోసమే నేను ఇంతగా విలపిస్తున్నాను. అంతేకాదు, సర్వాంతర్యామి అయిన శ్రీ కృష్ణుడు మీకు తోడునీడై ఉండి, మిమ్మల్ని అడుగడుగునా ఆపదలు నుండి కాపాడుతున్నాడు. అయినప్పటికీ మీ కష్టాలకు అంతే లేదు అని ఆలోచించి శోకిస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు. అయితే, ఆయన విలపించడానికి కారణం వేరే ఉంది. ప్రపంచంలో దేనికయినా ఆలంబనం ధర్మమే! భీష్ముడు ఒకసారి ధర్మం తప్పాడు. అది ఎప్పుడంటే, దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి ఈడ్చుకు వచ్చి వలువలు ఊడదీశాడు. అలా ఊడదీస్తుంటే ఆమె ఒక ప్రశ్న వేసింది. ‘ఈ సభలో భీష్మ ద్రోణులు ఉన్నారు. వాళ్లకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా? ధర్మం చెప్పవలసింది’ అని అడిగింది. అపుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు చేసినది దోషమే – ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని ఒడ్డే అధికారం లేదు అని ఉంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీ దేవి శపిస్తే, «ధృతరాష్ట్రుని సంతానం అంతా తన కళ్ళముందు నశించిపోతారు. పోనీ చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతికి ఒక మహా పతివ్రతకి వలువలు ఊడుస్తున్నారు. కాబట్టి ఏమి చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా, తెలియక చెప్పాడా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ‘ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మమూ అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపదీ’ అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణలో వైక్లబ్యమే! ఈ దోషానికే ఆయన అంపశయ్యమీద పడి ఉండవలసి వచ్చింది! అది తలచుకునే ఆయన విలపిస్తున్నది. ధర్మం తప్పటం, అసత్యం ఆడటం కొద్దిసార్లే చేసి ఉండవచ్చు. దాని పర్యవసానం వెంటనే ఒక్కోసారి వెంటనే అనుభవిం^è క పోవచ్చు. కానీ, ఒక్కోసారి జీవితంలో చివరి దశలో దాని ఫలితం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ధర్మాచరణను ఎప్పుడూ ఉల్లంఘించరాదు. చిన్న అబద్ధమే కదా, చిన్న అధర్మమే కదా అనుకోవడానికి వీలు లేదు. – డి.వి.ఆర్. భాస్కర్ -
కురుపితామహుడి దేవాలయం
భీష్ముడు... మహాభారత యుద్ధంలో స్వచ్ఛంద మరణాన్ని పొందిన కురు పితామహుడు.విష్ణుసహస్ర నామాలను చెప్పిన మహానుభావుడు.పాండవులకు నీతిబోధ చేసిన రాజనీతిజ్ఞుడు.తండ్రి వివాహం కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా తనువు చాలించిన పుణ్యపురుషుడు.అలాంటి భీష్ముడికి ఒకే ఒక ఆలయం దేశంలో ఉంది. భారత కథలో... శంతనుడు గంగానదిని పెళ్లి చేసుకుందామనుకుంటాడు. అప్పుడు గంగాదేవి ‘నేను ఏమి చేసినా ప్రశ్నించకూడదు. అలా చేస్తే నేను నిన్ను విడిచివెళ్లిపోతాను’ అంది. అంగీకరించాడు శంతనుడు. పెళ్లయ్యింది. గంగాదేవికి ప్రథమ పుత్రుడు ఉదయించాడు. ఆమె ఆ బిడ్డను తీసుకువెళ్లి గంగలో విడిచింది. ఈ విధంగా ఏడుగురు బిడ్డలను గంగలో విడిచింది. ఎనిమిదవ పుత్రుడిని విడిచి పెడుతుండగా శంతనుడు అడ్డు తగిలాడు. తను విధించిన షరతు ప్రకారం గంగాదేవి శంతనుడిని విడిచి వెళ్లిపోతూ అష్టమ శిశువును తనతో తీసుకువెళ్లి పెంచి పెద్దవాడిని చేస్తానని చెప్పింది. ఆ బిడ్డకు ‘దేవవ్రతుడు’ అని నామకరణం చేసి పెంచి పెద్దవాడిని చేసి శంతనుడికి అప్పచెప్పి వెళ్లిపోయింది. ఒకనాడు శంతనుడు సత్యవతి అనే మత్స్య కన్యను చూసి మోహించాడు. ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆమెకు కలగబోయే కుమారుడే సింహాసనం అధిష్టించాలని షరతు విధించాడు ఆమె తండ్రి దాసరాజు. ఈ విషయం తెలుసుకున్న గంగానందనుడు తన తండ్రి కోసం తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. నాటి నుంచి భీష్ముడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పది రోజుల పాటు యుద్ధం చేసి శిఖండిని అడ్డుగా పెట్టుకుని అర్జునుడు చేసిన యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్యపై శయనించాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేస్తానన్నాడు. యుద్ధం ముగిసిన తరవాత తన వద్దకు వచ్చిన పాండవులకు నీతిబోధ చేశాడు. భీష్ముడు శర శయ్య మీద ఉన్నప్పుడే విష్ణుసహస్ర నామాలను రచించాడని ప్రతీతి. విష్ణుమూర్తిని ధ్యానిస్తూ 1008 నామాలు పఠించాడు భీష్ముడు. ఆయన జీవితం భారతీయులకు ఒక గ్రంథం లాంటిది. అరుదైన దేవాలయం... అలహాబాద్ నగర నడిబొడ్డున అత్యంత అరుదైన భీష్మ దేవాలయం ఉంది. యాభై సంవత్సరాల నాటి ఈ దేవాలయానికి దేశంలోని మారుమూలల నుంచి ఎందరో భక్తులు వచ్చి భీష్మపితామహుడిని సందర్శించుకుని, భ్రాతృత్వాన్ని అలవరచుకుంటున్నారు. పెద్దలను స్మరించుకోవడం కోసం ఈ దేవాలయానికి ప్రధానంగా పితృపక్షాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అక్కడి దారగంజ్‌లోని నాగవాసుకి అత్యంత సమీపంలో దేవాలయానికి భీష్మ దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని జె.ఆర్.భట్ అనే న్యాయవాది నిర్మింపచేశాడు. 1961 నాటికి నిర్మాణం పూర్తయ్యింది. భీష్మపితామహుడు అంపశయ్యపై పడుకున్న భంగిమలో ఇక్కడ దర్శనమిస్తాడు. గంగాభక్తురాలైన ఒక వృద్ధ స్త్రీ ప్రతిరోజూ నదిలో స్నానం చేయడానికి వచ్చేదట. ఆమె స్వయంగా భట్ దగ్గరకు వచ్చి గంగాపుత్రునికి ఒక దేవాలయం నిర్మించమని వేడుకుందట. ఆమె వేడుకున్న తర్వాత ఆయనలో ఆలోచనకు అంకురార్పణ జరిగిందట. అలా గంగానదీ సమీపాన ఉన్న నాగవాసుకి దేవాలయానికి సమీపంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. కురుక్షేత్రలో భీష్మకుండ్ హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ప్రదేశాన్ని చూడవచ్చు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన చోట ఒక పెద్ద నీళ్ల ట్యాంకు ఉంది. దానిని బన్గంగ లేదా భీష్మకుండ్ అంటారు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి దాహం వేసి మంచినీరు కావాలని కోరడంతో, అర్జునుడు బాణంతో పాతాళగంగను బయటకు తీసుకువచ్చాడని, ఈ భీష్మకుండ్ అదేనని స్థానికులు చెబుతారు. – డా.పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ -
జాతీయాలు
అంపశయ్య భీష్ముడు తనను నిరాకరించాడనే కోపంతో ‘నిన్ను సంహరిస్తాను’ అని శపథం చేస్తుంది అంబ. దీనికి సమాధానంగా ‘నువ్వు ఏ రోజు అయితే ఆయుధం చేతపూని నా ఎదుట నిల్చుంటావో... అప్పుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను’ అని ప్రతిన పూనుతాడు భీష్ముడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి శివుడి కోసం తపస్సు చేసి ‘అంబ’ శిఖండిగా మారుతుంది. మహాభారత యుద్ధంలో... శిఖండిని అడ్డు పెట్టుకొని పాండవులు యుద్ధం చేయడం వల్ల భీష్ముడు అస్త్రసన్యాసం చేస్తాడు. భీష్ముడు అస్త్రసన్యాసం చేసిన వెంటనే అర్జునుడు అతని శరీరంపై బాణాల వర్షం కురిపిస్తాడు. ఆ బాణాలే అతని శయ్యగా మారుతాయి. ఎవరైనా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు లేదా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ‘అంపశయ్య పై ఉన్నట్లు ఉన్నాడు’ అంటారు. పెదగంగ ఉదకం గంగానది గురించి పురాణాల్లో ఎన్నో విశిష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. ‘దేవగంగ’, ‘ఆకాశగంగ’ అనే పేర్లతో స్వర్గలోకంలో ప్రవహించేదట. ఆకాశగంగలో రాజహంసలు విహరిస్తాయట. బంగారు తామరలు అందంగా వికసిస్తాయట. స్వర్గానికి వెళ్లిన వారు ఇందులో స్నానం చేస్తారట. ఆకాశంలోని పాలపుంతను కూడా పెద గంగ అంటారు. ఆకాశ గంగ గొప్పదనం, అందం మాట ఎలా ఉన్నా... అది నిజంగానే ఉందా? లేక కల్పనా? అనేది తెలియదు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టిందే ‘పెదగంగ ఉదకం’ పెదగంగ ఉదకం అంటే ఆకాశగంగ. ఇది ఉందో లేదో ఎవరికీ తెలియదు. అంటే గగన కుసుమం లాంటిదన్నమాట! సంపాతి జటాయువులు... చాలా పాత తరం వ్యక్తులు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఇది. సంపాతి మరియు జటాయువులు రామాయణంలో పాత్రలు. సంపాతి, జటాయువులు అన్నదమ్ములు. గద్దలు. సూర్యమండలానికి ఎవరు త్వరగా చేరుకుంటారనే దానిపై ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడతారు. ఈ పోటీలో జటాయువు త్వరగా సూర్యమండలం వైపు దూసుకెళతాడు. ఈ సమయంలో జటాయువు రెక్కలు కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సంపాతి తన రెక్కలు అడ్డుపెడతాడు. రెక్కలు కాలిపోతాయి. జటాయువు సీతమ్మను రక్షించే ప్రయత్నంలో రావణాసురుడితో యుద్ధం చేసి చనిపోయిన విషయం తెలిసిందే. సంపాతి, జటాయువుల త్యాగాల మాట ఎలా ఉన్నా... ‘పాత తరం వ్యక్తులు’, ‘చాలా అనుభవం ఉన్న వాళ్లు’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘ఏదైనా సందేహం ఉంటే వాళ్లను అడుగు. ఎంతో అనుభవం ఉన్నవాళ్లు. సంపాతి జటాయువులు’ అంటారు. శకారుడు! శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం ‘మృచ్ఛకటికం’. పది అంకాలున్న నాటకం ఇది. ‘వసంతసేన’ అనే పాత్ర ఈ నాటకంలోనిదే. ఉజ్జయినిని పరిపాలించే రాజు బావమరిది శకారుడు. శకారుడికి లేని దుష్ట లక్షణం లేదు. శకారుడిలో మూర్ఖత్వం, అజ్ఞానం, దుర్మార్గం మూర్తీభవించి ఉంటాయి. తన అహంకారంతో ప్రజలను పట్టి పీడించేవాడు శకారుడు. దుర్మార్గాలకు పాల్పడేవాళ్లను, బంధువుల అధికారాన్ని అడ్డు పెట్టుకొని అరాచకాలు సృష్టించేవాళ్లను శకారుడితో పోల్చుతారు. -
గాంధారి
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 6 గాంధార రాజు సుబలుడి కూతురు గాంధారి. ధృతరాష్ట్రుడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లిచేయమని భీష్ముడు వర్తమానం పంపినప్పుడు ‘అతను కళ్లులేనివాడు గదా’ అనే శంక పీడించింది సుబలుణ్ని. కానీ పౌరవకులం ఖ్యాతీ సదాచార సంపన్నతా పరాక్రమమూ మొదలైన అనుకూల విషయాలు చాలా అవుపించడం వల్ల, ప్రతికూలమైన గుడ్డితనాన్ని వెనక్కి నెట్టి, పిల్లనిద్దామని నిశ్చయించుకొన్నారు సుబల దంపతులు. ధృతరాష్ట్రుడికి తనను ఇవ్వబోతున్నారని తెలిసిన గాంధారి ‘నేను ఎదురుగా అతన్ని చూస్తే గుడ్డితనం పెద్దదోషంగా అవుపిస్తుంది. అదీగాక, ఇతరులతో పోల్చడాలూ పోల్చుకోడాలూ వచ్చి మనసు చెదురుతుంది’ అని ఆలోచించి, గట్టి నిశ్చయంతో తన రెండు కళ్లనూ చాలా మడతలు పెట్టిన బట్ట పట్టీతో బంధించుకొంది. నిజానికి, ఉన్న కళ్లను కూడా మూసేసుకొని, కావాలని గుడ్డిగా ఉండటం అంత ప్రశస్తమేమీ కాదు. అయితే, ఆవిడ తర్కమూ తప్పేమీ కాదు. ప్రతిక్షణమూ తల్లిదండ్రుల్ని తప్పుపట్టుకొంటూ, జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం కన్నా తానూ గుడ్డిగా ఉండటమే మంచిదని అనుకొంది ఆవిడ. పిల్లను అడిగి సంబంధం ఖరారు చేయాలిగదా అనిపిస్తుంది గానీ రాజకీయ వివాదాల్లో ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. శాంతనుడికి సత్యవతి వల్ల పుట్టిన పిల్లలు త్వరగా చనిపోవడం వల్ల, రాజవంశానికి పెద్ద సమస్యే వచ్చిపడింది. అందుకోసమనే వంద మంది సంతానం కనగలిగే వరాన్ని శివుణ్నించి పొందిన గాంధారిని భీష్ముడూ సత్యవతీ ఎన్నుకొన్నారు. ఒకరోజున వ్యాసుడు చాలా ఆకలితో గాంధారి ఇంటికి వచ్చాడు. ఆవిడ ఆయనకు భోజనం పెట్టి, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది. దానికి సంతోషించి ఆయన వరం కోరుకోమన్నాడు. ‘నా భర్తకు దీటైన నూరుమంది కొడుకులు పుట్టాల’ని ఆవిడ కోరుకొంది. శివుడిచ్చిన వరాన్ని వ్యాసుడి వరం బలపరిచినట్టయింది. ధృతరాష్ట్రుడి వల్ల కలిగిన గర్భాన్ని ఆవిడ నిండా రెండేళ్లు మోసింది. అక్కడ వనంలో ఉన్న తోటికోడలు కుంతికి యుధిష్ఠిరుడు అప్పుడే పుట్టేశాడు. గాంధారికి అసూయ పుట్టింది. భర్తకు తెలియకుండా ఆవిడ తన కడుపును తొందర కొద్దీ పొడుచుకొంది. చాలా గింజలున్న పెద్దపండు లాంటి ఒక గట్టి మాంస పిండం బయటపడింది. ఆవిడ అవాక్కయింది. వందమంది కొడుకుల వరం అబద్ధమేనా అనిపించింది. వందలూ వేలుగా పిల్లలు పుట్టడాలు జంతువుల్లో కద్దు. పేడలో కులకులలాడుతూ పురుగులు ఎక్కణ్నించి వస్తున్నాయో తెలియకుండా పుట్టుకొస్తాయి. పాములూ మొసళ్లూ మొదలైన జంతువులూ ఎక్కువ గుడ్లను పెట్టి పొదుగుతూ ఉంటాయి. సాధారణ పద్ధతిలో మనుషుల్లో ఒక్కొక్కడూ పుట్టుకొని వస్తూ వందమంది పుట్టాలంటే కనీసం వందేళ్లైనా పడుతుంది. ఇంతకుముందు సగరుడనే రాజుకు ఒక భార్య వల్ల అరవై వేల మంది కొడుకులు పుట్టారని చెబుతారు. వందకు ఆరువందలింతల మంది పుట్టడం ఇంకా కష్టమైనదే. అప్పుడూ ఇప్పుడూ కూడా ఆవునేతి కుండల్లో ఆ గర్భాలను పెంచినట్టు చెప్పారు. అందుచేత, ఎక్కువమందిని కనే ప్రక్రియ ఆయా కాలాల్లో వాళ్లకు తెలుసునని అర్థమవుతుంది. ఇప్పటివాళ్లకే ఇంక్యుబేటర్లలో పిల్లల్ని పెంచే విద్య వచ్చుననీ అప్పటివాళ్లకు ఏమీరాదని అనుకోవడం శుద్ధ అవివేకమవుతుంది. నాగరికత ఎన్నిసార్లో చాలా ఉచ్ఛస్థాయిలకు చేరి, పెద్ద పెద్ద దుర్ఘటనల వల్లనో భూకంపాలూ సునామీలూ భారీ ఉల్కాపాతాలూ మొదలైన అతిఘోరమైన విపత్తుల వల్లనో కనుమరుగైపోతూ వచ్చింది. ఇది తెలియని మనం, ఇప్పటికాలంలో తెలిసినది మునపటి కాలంలో తెలియదని పొరబాటుగా అనుకొంటూ ఉంటాం. సుశ్రుతుడు వెంట్రుకను నిలువుగా చీల్చగలిగిన నేర్పుగల సర్జన్‌గా మనం వింటూ ఉంటాం. క్షయ రోగానికి మేక మాంసం తినడమూ మేకల మందలో పడుకోవడమూ విరుగుడన్న సంగతి పూర్వీకులు ఎరుగుదురు. కానీ ఇప్పటికాలంలో ఆ రోగానికి మందులను కనుక్కోడానికి చాలాకాలమే పట్టింది. కణాదుడనే ఒక శాస్త్రజ్ఞుడు తన ‘వైశేషిక సిద్ధాంతం’లో పరమాణువుల గురించి చెప్పాడన్న సంగతి చాలామందికి తెలియనే తెలియదు. ఈ శాస్త్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆ భాష మనకు ‘మెకాలే ఎఫెక్టు’ ద్వారా దూరమైపోయింది. అదీగాక సంస్కృతంలో శాస్త్రాలన్నీ సూత్ర రూపాల్లో ఉంటాయి. సూత్రాలనేవి చిన్న చిన్న వాక్యాలే కానీ చాలా అర్థంతో కూడుకొని ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి విశ్లేషణా వివరణా కావలసివస్తాయి. పెద్ద పెద్ద అంగలేసిందని చెప్పుకొనే ఇప్పటి సైన్సుకు ఇప్పటికీ అర్థంకాని ప్రాకృతికమైన దృగ్విషయాలెన్నో ఉన్నాయి. మన గ్రహం మీదనే జీవం ఉందనీ, అదే చాలా పురోగతిని పొందినదనీ అనుకొంటూ ఉంటాం. ఇతర గ్రహాల మీద జీవం ఉండే అవకాశాన్ని మనం వట్టినే కొట్టిపారేయలేం. ఫ్లైయింగ్ సాసర్లు వస్తున్నాయంటారు; అవేమిటో తెలియదు. వాటిలో వచ్చే ఆగంతకులెవరో ఎంతటి శాస్త్రజ్ఞానం గలవాళ్లో మనకు అంతుపట్టదు. ఈ నేపథ్యంలో మరోచోట జీవం లేదనుకోవడం ఒక విధంగా అహంకారమే. ఎక్కువ ఉష్ణోగ్రతలున్నచోట జీవాలుండవని సాధారణంగా అనుకొంటాం. కానీ కొన్ని రాక్షస తొండలు అగ్నిపర్వతాల నుంచి వెలువడిన లావాల ప్రాంతాల్లో గుడ్లను పెడుతూ ఉంటాయి. ఒక కణం తాలూకు శక్తి ఫలానా సమయంలో ‘ఇంత’ అని మనం స్పష్టంగా చెప్పనేలేం.. వీటన్నింటినీ పోల్చి చూసుకోకపోతే వందమంది పుట్టడమనేది మనకు అసాధారణంగా తోస్తుంది; అబద్ధమనిపిస్తుంది; కట్టుకథ అనిపిస్తుంది. ఇక ఆ గర్భపిండాలను పెంచడమన్నదీ అలాగే అబద్ధమనిపిస్తుంది. వ్యాసుడి పక్కకు చేరి ‘ఆడపిల్ల ఒకత్తె ఉంటే బాగుంటుంది’ అని గాంధారి అంటే దాన్ని కూడా ఆ మాంసపిండం నుంచే తీశాడు. అదే సైంధవుడికి పెళ్లామైన దుస్సల. మన ప్రస్తుత జ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని, ఏదైనా సత్యమూ అసత్యమూ అని చెప్పడం ఎంత అసమంజసమో పైన చెప్పిన వాక్యాలను కుదురుగా చదివితే క్షుణ్ణంగా అర్థమవుతుంది. అంత కష్టపడి కన్న ఆ వందమందీ మొగుడి నిర్వాకంకొద్దీ చనిపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పవలసిన పనిలేదు. తనతోబాటే వచ్చి స్థిరపడిపోయిన తన అన్న శకుని మోసపు జూదంతో పాండవుల్ని దాసులుగా చేసినప్పుడు, ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాల పేరిట ఆ దాస్యాన్ని పోగొట్టి సర్ది చెప్పి పంపించేశాడు. అయితే, రెండోసారి జూదమాడటానికి పాండవుల్ని దారి మధ్యలోంచే పిలిపించాలని దుర్యోధనుడు మంకుపట్టు పట్టినప్పుడు, గాంధారి ధృతరాష్ట్రుడితో ‘నీ మాట విననివాణ్ని విడిచిపెట్టడమే మంచిది. ధర్మపూర్వకంగా గెలవని డబ్బు తరవాత తరాలవాళ్లను నాశనం చేస్తుంది’ అని అంది. కొడుకంటే ఆవిడకు ధృతరాష్ట్రుడికున్నంత మోహం లేదు. యుద్ధమంతా అయిపోయిన తరవాత, దగ్గరికి వచ్చిన పాండవుల్ని శపిద్దామన్నంత బాధా కోపమూ ఆవిణ్ని చుట్టుముట్టాయి. అప్పుడు వ్యాసుడు ఆవిడకు ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చాడు: ‘‘యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజుల్లోనూ ప్రతిరోజూ నీ పెద్దకొడుకు నీ దగ్గరికి వచ్చి, ‘జయించేలాగ దీవించమ’ని అడుగుతూ ఉండేవాడు గదా. నువ్వేమో ఎప్పుడూ ‘యతో ధర్మస్తతో జయః’ అని చెపుతూ వచ్చావే తప్ప ఒక్కసారి గూడా ‘నువ్వు గెలుస్తావు’ అని అనలేదు. నువ్వు ముందరి నుంచీ చాలా ఓర్పు ఉన్నదానివి. అధర్మాన్ని వదిలిపెట్టు. నువ్వన్నట్టే ధర్మమున్న వైపే జయించింది’ అని. అప్పుడు ఆవిడ పాండవుల్ని శపించకుండా ఉన్నా శ్రీకృష్ణుణ్ని మాత్రం శపించింది: ‘జ్ఞాతులైన కౌరవ పాండవులు పరస్పరమూ కొట్టుకొంటూ చచ్చిపోతూ ఉంటే వాళ్లను ఆపకుండా ఉపేక్షించావు గనక, నీ జ్ఞాతుల్ని నువ్వే చంపుతావు. ఈ రోజు నుంచి ముప్ఫై ఆరేళ్ల తరవాత నీవాళ్లందరూ ఒకళ్లతో ఒకళ్లు దెబ్బలాడుకొంటూ చనిపోతారు. నువ్వు కూడా ఒక అనాథుడి మాదిరిగా ఎవరికీ తెలియకుండా కుచ్చితమైన ఉపాయంతో చచ్చిపోతావు’ అని. సంస్కృతంలో శతమూ సహస్రమూ అనే మాటలు వందా వేయీ అనేగాక అనేకమనే అర్థాన్ని కూడా ఇస్తాయి. మనిషిలో అటు దైవీశక్తులూ ఇటు ఆసురీశక్తులూ రెండూ ఉన్నాయి. ఆ మంచీ చెడూ శక్తులు ఎప్పుడూ దెబ్బలాడుకొంటూనే ఉంటాయి. పురాణాల్లో తరచుగా వర్ణిస్తూ ఉండే దేవాసుర యుద్ధమంటే ఇదే. ఆ రెండు శక్తుల్లోనూ మంచివి ఎప్పుడూ తక్కువే. అందుచేతనే ధర్మపరులూ జ్ఞానవంతులూ అయిన పాండవులు ఐదుగురు మాత్రమే. అధర్మం కొమ్ముకాసేవాళ్లూ పాపప్పనులూ అజ్ఞానమూ గొప్ప అనుకొనేవాళ్లూ చాలామందే ఉంటారు. అందుకనే కౌరవులూ వాళ్లవైపు ఉండి యుద్ధం చేసినవాళ్లూ అనేకులు. ‘గాంధారి’ అనే మాటలోని ‘గాం’ అనే మాట కదలికను సూచిస్తుంది. కదలికకు మరోపేరే సృష్టి. అంతా ఒకే వస్తువున్నప్పుడు కదలిక ఎక్కడ ఉంటుంది? అది వేరు పేరైనప్పుడే కదలికలూ స్పందనలూ పుడతాయి. ఆ కదలికను ధరించేది ‘గాంధారి’ - అంటే, సృష్టిని ధరించి పోషించేది ‘గాంధారి’. సృష్టిని ధరించి పోషించేది కోరికల బలం, వాసనల శక్తి, మునపటి కర్మఫల గంధాల శక్తి. ధృతరాష్ట్రుడు ఇంద్రియ సంబంధమైన గుడ్డి మనస్సు; అతని ‘భార్య’ గాంధారి కోరికల శక్తి. మనస్సు ఇంద్రియాల ద్వారానే చూస్తుంది గనక అది పుట్టుగుడ్డిదే; మనను అందర్నీ కోరికల శక్తి, అంటే, మునుపటి వాసనల శక్తి దళసరి పట్టీతో కళ్లకు గంతలు కట్టుకొన్నట్టుగా ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు