భీష్మ ప్రతిజ్ఞ | Rashmika Mandanna To Romance Nithin in Bheeshma | Sakshi
Sakshi News home page

భీష్మ ప్రతిజ్ఞ

Published Mon, Oct 29 2018 12:53 AM | Last Updated on Sat, Aug 3 2019 12:30 PM

Rashmika Mandanna To Romance Nithin in Bheeshma - Sakshi

నితిన్‌

నితిన్‌ స్టిల్‌ బ్యాచిలర్‌. అవును.. ఇంకా పెళ్లి కాలేదు. తను బ్యాచిలరే కదా అనుకుంటున్నారా? అవును. రియల్‌ లైఫ్‌లో బ్యాచిలరే. ఇప్పుడు స్క్రీన్‌ మీద కూడా బ్యాచిలర్‌గానే కనిపించనున్నారు. సినిమా పేరు ‘భీష్మ’. పురాణాల్లో భీష్మాచార్యులు సింగిల్‌. సినిమాకి ఈ టైటిల్‌ పెట్టాలనుకుంటున్నారంటే సినిమాలో పెళ్లి చేసుకోకూడదని భీష్ముడిలా ఏదైనా ప్రతిజ్ఞ చేస్తారా? లేక ఫైనల్‌గా జోడీ కుదురుతుందా?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొంత టైమ్‌ పడుతుంది.

నితిన్‌ హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రష్మికా మండన్నా కథానాయిక. ఈ చిత్రానికి ‘భీష్మ : ది బ్యాచిలర్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబర్‌లో స్టార్ట్‌ కానుంది. వచ్చే ఏడాది మే నెలలోపు షూటింగ్‌ పూర్తి చేసి, ఆగస్ట్‌కు సినిమా రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ నిర్మించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement