గుల్ పనాగ్పై దాడి
వారణాసి: నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో బీజేపీ ఆగడాలు మితిమీరుతున్నాయి. వారణాసిలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ శ్రేణులు ప్రత్యర్ధులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకురాలు, బాలీవుడ్ నటి గుల్ పనాగ్ తో పాటు వీజే రఘురామ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.
బెనారస్ హిందూ యూనివర్సిటీ ఐఐటీ(బీహెచ్‌యూ ఐఐటీ)లో బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని గుల్ పనాగ్, రఘురామ్ ఆరోపించారు. బీహెచ్‌యూ ప్రధాన ద్వారం వద్ద నిన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంద్రా తివారిని బీజేపీ కార్యక్తలు అడ్డుకున్నారు. చండీఘడ్ లోకసభ నియోజకవర్గం నుంచి ఆమ్ అభ్యర్థిగా గుల్ పనాగ్ పోటీ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తరపున వారణాసిలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.