Bhuma Reddy
-
ధీమా రెడ్డి
ఇన్నాళ్లకు కూడా బితుకు బితుకే. సిగ్గుతో చితుకు చితుకే. మూడురోజుల నెలసరి తప్పు కాదు. నేరం కాదు. పాపమూ కాదు. అది ప్రకృతి. దేహ ప్రవృత్తి. దానికి శానిటరీ ప్యాడ్ వాడాలని తెలియదు కొందరికి. తెలిసినా ధైర్యంగా కొనే ధీమా ఉండదు అందరికీ. ఊర్లో ఈ పరిస్థితిని భూమా రెడ్డి గమనించాడు. వారికి ధీమా ఇవ్వడానికి సంకల్పించాడు. ఆడపిల్లల పాలిట అతడో ప్యాడ్ మ్యాన్. ‘అంకుల్.. టెన్ రుపీస్ది ఒక డెయిరీ మిల్క్ ఇవ్వరా?’ అంటూ యాభై రూపాయల నోటు ఇచ్చింది ఓ అమ్మాయి. దుకాణందారు ఆ నోటు తీసుకుంటూండగా అందులోంచి కాగితం మడత కింద పడింది. ‘అంకుల్ ఒక విష్పర్‌ను పేపర్లో చుట్టి క్యారీబ్యాగ్‌లో పెట్టివ్వరా?’ అని రాసుంది అందులో. విష్పర్‌ను ప్యాక్ చేసి ఇచ్చాడు షాప్ యజమాని. అతనికిది కొత్తకాదు. చాలా మంది ఆడపిల్లలు అలాగే స్లిప్ మీద రాసిస్తారు. ధైర్యంగా ‘శానిటరీ పాడ్స్’ కావాలని అడగరు. ‘బిస్కెట్లు, పెన్లు, బిందీల్లా ఇదీ అవసరమే కదా! ఎందుకు గట్టిగా అడగరు. ఎందుకంత సిగ్గు? దీన్నెట్లా పోగొట్టాలి?’ అనే ఆలోచనలో పట్టాడు ఆ షాప్ యజమాని. అతని పేరు చిట్యాల భూమారెడ్డి. దుకాణదారు. జగిత్యాల జిల్లా, సారంగపూర్ మండలం, లచ్చక్కపేట అతని సొంతూరు. ఆ ఊర్లో మహిళల నెలసరి అవసరం పట్ల ఉన్న సిగ్గును, మొహమాటాన్ని దూరం చేయాలి అనుకున్నాడు అతను. అంతే కాదు శానిటరీ పాడ్స్ తయారు చేయడానికి కూడా సంకల్పించాడు. అధ్యయనం... ఆచరణ రెండేళ్ల క్రితం ఈ ఆలోచన వచ్చాక శానిటరీ ప్యాడ్స్‌కు సంబంధించి తన ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాడు. తన ఊళ్లో ఈ ప్యాడ్స్ అడగడానికి మొహమాటపడుతుంటే చుట్టుపక్కల ఊళ్లలో వీటి ఉపయోగం చాలా తక్కువగా ఉందని తెలిసింది అతనికి. నెలసరి సమయంలో శుభ్రత లోపించి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని చిన్న వయసులోనే గర్భసంచి తొలగించే శస్త్రచికిత్సకి గురైన కేసులూ ఎక్కువే అని తేలింది. వీటన్నిటికీ పరిష్కారం బయోడీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ వాడకం మీద చైతన్యం తేవడం, అలాంటి ప్యాడ్స్ తయారు చేసి తక్కువ ధరకు పంపిణీ చేయడమే అనుకున్నాడు. వాటిని తయారు చేయడమెలాగో తెలుసుకోవడానికి పరిశోధన మొదలుపెట్టాడు. ఇంటి నుంచి మొదలు భూమారెడ్డి చేస్తున్న ప్రయత్నం గురించి ఒక మిత్రుడికి తెలిసింది. ‘అలాంటి ప్యాడ్స్ తయారు చేసే యూనిట్ మహబూబ్‌నగర్‌లో ఉన్నట్టుంది కనుక్కో’ అని సూచించాడు. ఆ మాటతో మహబూబ్ నగర్ వెళ్లాడు. అప్పటి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఓ ఇరవై మంది ఫిజికల్లీ చాలెంజ్డ్ మహిళలకు ఆర్థిక ఆసరా కోసం శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే కుటీర పరిశ్రమ పెట్టించారు తన పర్సనల్ ఫండింగ్‌తో. ఆ మహిళలు తయారైతే చేస్తున్నారు కాని వాళ్లకున్న పరిమితుల దృష్ట్యా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నట్టు అర్థమైంది భూమారెడ్డికి. దాంతో ప్యాడ్ల తయారీ, మార్కెటింగ్‌కు తనెలాంటి ప్రణాళిక చేసుకోవాలో అవగతమైంది. ప్యాడ్స్ తయారు చేసే మెషీన్, మెటీరియల్ వంటి వివరాలన్నీ తీసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. మెషీన్ కోసం మధ్యప్రదేశ్ వెళ్లాడు. తాము తయారు చేసిన శానిటరీ ప్యాడ్స్‌తో భీమా రెడ్డి బృందం పరిశుభ్రమైన వాతావరణం మధ్య ఇంట్లోని హాలులోనే మెషిన్ ఫిట్ చేయించాడు. మహబూబ్‌నగర్ యూనిట్లో తను, కుమార్తె, భార్య శిక్షణ తీసుకుని అలా దాదాపు పదకొండు నెలల శ్రమ తర్వాత 2019, డిసెంబర్లో కుటీరపరిశ్రమ ప్రారంభించాడు. ప్రస్తుతం అతని యూనిట్లో నలుగురు మహిళలకు ఉపాధి కలిగిస్తున్నాడు. భూమారెడ్డి తయారు చేస్తున్నవి పూర్తి పర్యావరణహితమైనవి. ఆరు ప్యాడ్స్ ఉన్న ప్యాక్ 35 రూపాయలకు అందిస్తున్నాడు. ఒకవేళ మహిళలు ఎవరైనా వీటిని మార్కెట్ చేయాలనుకుంటే కూడా 30 రూపాయలకే అందిస్తున్నారు. ‘ఈ ప్యాడ్స్‌లో అలోవెరా, వుడ్ పల్ప్, నెట్ షీట్‌ను వాడుతున్నాం. అచ్చం ఈ మెటీరియల్‌తో ఇలాగే తయారైన బ్రాండెడ్ పాడ్స్ ఆరింటి ప్యాక్ ధర 70 రూపాయలు’ అని చెప్తున్నాడు భూమారెడ్డి. వ్యాపారం కోసం కాదు... ఉపయోగం కోసమే! ‘దీన్నో వ్యాపారంగా చూడట్లేదు మేము. ఆడవాళ్లకు ఉపయోగపడే పనిలా చూస్తున్నాం. అందుకే మా దగ్గరకు ప్యాడ్స్ కోసం వచ్చే అమ్మాయిలు ధైర్యంగా వీటి గురించి అడిగేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మగవాళ్లకూ అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ పంచాయితీ ఆఫీస్‌లో అవగాహన కార్యక్రమాలు పెట్టడమే కాదు ఇల్లుల్లూ తిరిగీ ప్యాడ్స్ వాడకం మీద, నెలొచ్చినప్పుడు పాటించే శుభ్రత గురిచీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్యాడ్స్ వాడండి అని చెప్తున్నాం కాని మా దగ్గర తయారైన ప్యాడ్సే వాడండి అని చెప్పట్లేదు’ అంటున్నారు భర్త బాధ్యతల్లో సమపాలు తీసుకున్న భూమారెడ్డి భార్య లావణ్య. ‘మహిళ అరోగ్యాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలి. ఈ ఆలోచన ఉన్నవాళ్లందరితో కలిసి పనిచేయడానికి సిద్ధం’ అంటున్నారు ఈ భార్యాభర్త. ఫెయిల్యూర్లోంచి సక్సెస్ భూమారెడ్డి ఓ మధ్యతరగతి రైతు. 2001లో ఎమ్పిటీసీగా, సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత దుబాయ్ వెళ్లి అక్కడ కన్స్ట్రక్షన్ లేబర్‌గా, ఫోర్‌మన్‌గా పనిచేసి నాలుగున్నరేళ్లకు మళ్లీ ఇండియా వచ్చాడు. మళ్లీ సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాడు. కాని రాజకీయాలు తనకు సరిపడవని తెలుసుకొని కేబుల్ టీవీ సెంటర్, కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ పెట్టుకున్నాడు. అప్పుడే ఆడపిల్లల ఇబ్బంది చూసి శానిటరీ ప్యాడ్స్ కుటీర పరిశ్రమవైపు మళ్లాడు. మొదటి నుంచీ సామాజిక స్పృహ, బాధ్యత ఎక్కువగానే ఉన్న భూమారెడ్డికి భార్య సహకారమూ తోడవడంతో దాన్నో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. చిట్యాల భూమారెడ్డి బయో డీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న భీమారెడ్డి, అతని భార్య లావణ్య... – సరస్వతి రమ -
ప్రగతిపథంలో పాడి పరిశ్రమ: భూమారెడ్డి
హైదరాబాద్: పాడి పరిశ్రమాభివృద్ధికి పటిష్టమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(విజయ డెయిరీ) చైర్మెన్ లోక భూమారెడ్డి చెప్పారు. విజయ డెయిరీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లాలాపేటలోని కార్యాలయంలో ఆయనను అధికారులు, ఉద్యోగులు అభినందించారు. ఏడాదికాలంలో పాల ఉత్పత్తిదారుల సంఖ్యను 44,432 నుంచి 67,259 వరకు, పాల సేకరణను 3,10,000 నుంచి 4 లక్షల లీటర్ల వరకు పెంచామని ఆయన చెప్పారు. డెయిరీలో ఖాళీగా ఉన్న 110 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి సాధించామని, ఈ మేరకు టీఎస్పీఎస్సీ చర్యలు తీసుకుంటోందని వివరించారు. కారుణ్య నియామకాల కింద 20 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఢిల్లీ, ముంబైలో విజయ పాల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాన్ని కల్పించామని పేర్కొ న్నారు. సంస్థ టర్నోవర్‌ను రూ.650 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు పెంచాలనే ఉద్దేశంతో పాలను, పాల ఉత్పత్తులను అధికంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. పార్లర్ల సంఖ్యను 150 నుంచి వెయ్యి వరకు పెంచుతున్నట్లు తెలిపారు. హరితహారంలో విజయ పాడి రైతులను భాగస్వామ్యం చేశామన్నారు. -
భూమా నోటీసుపై రభస
ప్రివిలైజ్ కమిటీకి పంపిస్తానన్న స్పీకర్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై రాష్ట్ర శాసనసభ అట్టుడికింది. సోమవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక నాగిరెడ్డి తన నోటీసును స్పీకర్ కోడెల శివప్రసాదరావు దృష్టికి తెచ్చి చర్చించాలని కోరారు. స్పీకర్ స్పందిస్తూ నోటీసు అందిందని, ఇది వ్యక్తిగత సమస్య అయినందున సభలో చర్చించలేమన్నప్పుడు దుమారం రేగింది. చర్చించాల్సిందేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఎమ్మెల్యే గా విధులు నిర్వహిస్తున్నప్పుడే పోలీసులు కేసు పెట్టి రౌడీషీటు తెరిచారని, ఇది సభా హక్కులకు భంగమని వాదించారు. ఎమ్మెల్యేలు రోజా, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు స్పీకర్‌తో వాగ్వాదం చేశారు. దీంతో ఉదయం 10.32 గంటల ప్రాం తంలో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ఈ దశలో స్పీకర్... నిబంధనల ప్రకారం చర్చించలేమని చెప్పారు. ‘‘నిబంధన నిబంధనే. అందరికీ ఒకటే. మీ నోటీసును సభాహక్కుల కమిటీకి పంపిస్తా. ఆ కమిటీలో మీ వాళ్లూ (వైఎస్సార్సీపీ) ఉంటారు కదా. ఆ కమిటీ ఏమి నిర్ణయిస్తుందో చూద్దాం. ఇంతటితో వదిలేయండి. భూమాకి అలా జరగడంపై నేనూ బాధపడుతున్నా. ఆ కుటుంబంతో నాకు సన్నిహిత సం బంధాలున్నాయి. అయినా రూల్ రూలే కదా..’’ అని చెప్పడంతో సభ్యులు శాంతించారు. -
ప్రజాస్వామ్యం.. అపహాస్యం
అధికార పార్టీ నైజం మరోసారి బయటపడింది. ఓ ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలను వినిపించే ప్రయత్నం చేయడమే ఆయన తప్పయింది. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ప్రజలు పట్టం కట్టినా.. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉందనే అండతో టీడీపీ దౌర్జన్యకాండకు తెగబడింది. ఎమ్మెల్యే మాట్లాడితే వినాల్సిన పని లేదన్నారు.. మున్సిపల్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగిసిందని ప్రకటించేశారు.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించబోయిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్లు ఒంటికాలిపై లేచారు. రెచ్చగొట్టి దాడికి పాల్పడ్డారు. పరిస్థితి చేయిదాటి.. పర స్పరం కొట్టుకునే వరకు వెళ్లడంతో ఇరు పార్టీలకు చెందిన నలుగురు కౌన్సిలర్లు గాయపడ్డారు. గొడవకు కారణమైన టీడీపీ నేతలే.. పరిస్థితిని అదుపు చేయబోయిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టుకు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. మరి నంద్యాలలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా.. లేనట్టా? టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఒకవైపు తెల్లారితే వైఎస్సార్సీపీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం! పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ వచ్చి జిల్లా కమిటీని ప్రకటించడంతో పాటు వివిధ ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతుండటం!! మరోవైపు జిల్లావ్యాప్తంగా లక్షలాది ఫించన్లు, తెల్లరేషన్ కార్డుల తొలగింపుతో ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత! }Oశెలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 854కు చేరుకుంటుండటంతో జిల్లాలో ఏకంగా లక్షా 20 వేల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయే దుస్థితి!! అధికారం అండతో రెచ్చిపోతున్న తెలుగు ‘తమ్ముళ్ల’ దెబ్బకు రోజురోజుకీ క్షీణిస్తున్న పార్టీ ప్రతిష్ట!!! వెరసి ఎలాగైనా జిల్లాలో రోజురోజుకీ బలపడుతున్న వైఎస్సార్‌పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పార్టీకి మొదటి నుంచి అండగా ఉంటున్న భూమా నాగిరెడ్డిని అరెస్టు చేయడం ద్వారా మానసికంగా వైఎస్సార్ శ్రేణులను కుంగదీసేందుకు నంద్యాల పురపాలక సంఘం సమావేశాన్ని అధికార పార్టీ వేదిక చేసుకుంది. ఇందుకోసం మొదటి నుంచీ ప్రణాళిక బద్ధంగా, పక్కాగా స్కెచ్ వేసి పావులు కదిపింది. ఏకంగా ఎమ్మెల్యేపై హత్యాయత్నం, దాడి కేసులను పెట్టి అరెస్టుకు శుక్రవారం అర్ధరాత్రి వరకు అధికార పార్టీ నంద్యాలలో హైడ్రామాను నడిపించింది. స్కెచ్ నడిపారిలా...! నంద్యాల పురపాలక సంఘం సమావేశంలో ఎజెండాలోని అంశాలను చైర్పర్సన్ సులోచన చదివి వినిపించి మమ అనిపించారు. ఇదేసమయంలో ప్రజా సమస్యలపై తన వాణిని వినిపించేందుకు స్థానిక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రయత్నించగానే తమ పథకాన్ని అమలు చేయడం అధికార పార్టీ షురూ చేసింది. ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సిన అవసరం లేదంటూ టీడీపీ సభ్యులు దూకుడు ప్రదర్శించారు. ప్రజా సమస్యలపై తన ప్రసంగాన్ని వినాల్సిందేనని.... గేట్లు వేయాలని టీడీపీ సభ్యులను ఉద్దేశించి సైగ చేశారు. ఇదే సమయంలో ఇరు పార్టీ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇక్కడే అధికార పార్టీ తన కుటిల నీతిని ప్రదర్శించింది. భూమా సైగ చేసినందువల్లే గొడవ జరిగిందంటూ ఏకంగా ఆయనపై హత్యాయత్నం, దాడి కేసు బనాయించింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులను ఉసిగొల్పింది. ఇందులో భాగంగానే ఎస్పీ, నంద్యాలలో ఉన్న అడిషనల్ ఎస్పీ రంగంలోని దిగారు. ఘటన జరిగిన రెండు గంటల్లోగా ఏకంగా ఎస్పీ నంద్యాలకు వెళ్లారంటే అధికారబలాన్ని ఇట్టే అర్థమవుతోంది. ఏకంగా అరెస్టు వారెంట్‌తో ఏదో యుద్ధానికి దిగుతున్నట్టు 300 మంది పోలీసులతో రాత్రి భూమా నాగిరెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో... ఇంట్లోకి ప్రవేశించి అణువణువూ గాలించారు. ఆయన ఇంట్లో లేకపోయినప్పటికీ ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు ఆయన ఇంటి వద్దే శుక్రవారం రాత్రి పొద్దుపోయేదాకా ఉండటాన్ని గమనిస్తే... పోలీసులపై అధికార పార్టీ ఎంత ఒత్తిడి తెస్తుందో అర్థమవుతోంది. లొంగిపోండంటూ ఎస్పీ పిలుపు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి లొంగిపోవాలంటూ ఎస్పీ రవికృష్ణ పిలుపునిచ్చారు. ఆయనపై రెండు కేసులు బనాయించామని నంద్యాలలో రాత్రి ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిపద్ధతి కాదని హితవు పలకడం గమనార్హం. -
రాజధాని ఎంపిక లో కుట్ర
నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుయాయులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకే విజయవాడను రాజధానిగా ఎంపిక చేశారని, ఇందులో కుట్ర దాగి ఉందని వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణంలోని ఆయన నివాసంలో రాయలసీమ పార్టీ అధ్యక్షుడు పాండురంగారెడ్డితో కలిసి భూమా విలేకరులతో మాట్లాడారు. విజయవాడను రాజధాని చేయడాన్ని తాను వ్యతిరేకించడం లేదని, అక్కడున్న నేల స్వభావం, ప్రకృతి వైపరీత్యాలు రాజధాని నిర్మాణానికి ఉపయోగపడే విధంగా లేవ ని అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో విజయవాడకు వరదలు, భూకంపాల ముప్పు పొంచి ఉందని వెల్లడైనట్లు భూమా గుర్తు చేశారు. ఆ ప్రాంత ప్రజలు కూడా ఇష్టం లేదన్నారు. అక్కడున్న స్థలాలు, పొలాలతో వ్యాపారం చేసుకునేందుకు తెలుగుదేశం పన్నిన కుట్రగా అభివర్ణించారు. శాసన సభలో కూడా రాజధాని ఎంపికపై ఎలాంటి చర్చ జరుగకుండానే చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఈ విషయంపై త్వరలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి వాస్తవాలను వివరించే యత్నం చేస్తామన్నారు. అనంతరం విజయవాడపై పరిశోధన చేయాలని రాయలసీమ పార్టీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి అంతర్జాతీయ సముద్ర శాస్త్రవేత్త మారంరెడ్డి మద్దిలేటిరెడ్డిని కోరారు. -
సీఎం వైఖరి సిగ్గు చేటు : లోక భూమారెడ్డి
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినన్న విషయం మరిచి, కేవలం 13 జిల్లాలకే పరిమితమైనట్లుగా వ్యవహరిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరి సిగ్గు చేటని టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి విమర్శించారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న సకల జనభేరి సదస్సుకు పెద్ద ఎత్తున తెలంగాణవాదులు తరలివచ్చి మరోసారి ఉద్యమ సత్తాచాటాలన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంతో జూలై 30న సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రకటించిందని, దీన్ని అడ్డుకునేందుకు సీఎం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం వారం రోజులపాటు నోరుమెదపని సీఎం ఇప్పుడు తెలంగాణ అంశంపై విషం కక్కారన్నారు. జలయుద్ధాలు జరుగుతాయని లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్వయంగా సమైక్య వాదినని చెప్పుకుంటున్నా ఇంకా తెలంగాణ మంత్రులకు సిగ్గు రావడం లేదన్నారు. వెంటనే వారి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణలో తాము బస్సు యాత్ర చేపడుతామని ఎర్రబల్లి దయాకర్‌రావు మాట్లాడడం అవివేకమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర చేపట్టి సీమాంధ్ర ఉద్యమానికి వత్తాసు పలికినా ఈ ప్రాంత టీడీపీ నాయకులకు సిగ్గులేదన్నారు. తెలంగాణపై చిత్త శుద్ధి ఉంటే వెంటనే రాజీనామాలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ నాయకులు బాదం గంగన్న, సయ్యద్సుజాత్అలీ, మహేందర్, ముజాషిద్షా ఉన్నారు.