BHUMANA karunakarareddy
-
ఎమ్మెల్యే భూమన నివాసంలో జాతీయ జెండా రంగుల వెలుగులు (ఫొటోలు)
-
కోతలకు అన్న... చేతలకు సున్నా
చంద్రబాబు పాలనపై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన సాక్షి,హైదరాబాద్: సీఎం చంద్రబాబు పాలన కోతలకు అన్న.. చేతలకు సున్నాలా ఉందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. బాబు చెప్పేది అభివృద్ధి మంత్రం, చేసేది అవినీతి తంత్రమని విమర్శించారు. భూమన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనను వ్యతిరేకిస్తే పోలీసులతో తొక్కేయగలననే అహంతో బాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క హామీనైనా నెరవేర్చారా? ‘‘ప్రజల జీవితాలను సంపూర్ణంగా మార్చేస్తానంటూ ఎన్నికల ముందు ఇచ్చిన 600లకు పైగా హామీల్లో ఒక్కటి కూడా బాబు నెరవేర్చలేదు. రుణాలను మాఫీ చేస్తానని ఓట్లు దండుకొని రైతులు, డ్వాక్రా మహిళలను వంచించాడు. ప్రయాణికులు లేకున్నా విమానాలు తిప్పండి అంటూ యజమానులకు రూ.కోట్ల కొద్ది డబ్బులు కుమ్మరిస్తున్నాడు. కానీ, రైతులు కన్నీళ్లు పెట్టుకొని అల్లాడుతుంటే వారికి ఒక్క రూపాయి సహాయం చేసేందుకైనా చంద్రబాబుకు మనస్సు రావడం లేదు. హామీలు నెరవేర్చకుండా పచ్చి అబద్ధాలాడుతున్న చంద్రబాబుని అబద్ధాసురుడు అనవచ్చు. నిరుద్యోగ యువత సంఘాలుగా ఏర్పడి మోసపూరిత పాలనపై పోరాడాల్సిన అవసరం ఏర్పడింది.’’ అని భూమన ధ్వజమెత్తారు. బికినీల పండుగ ఎవరి కోసం బాబూ? ‘‘మహాకవులు, రచయితలకు నిలయమైన విశాఖపట్నంలో బికినీల పండుగ చేయాలనుకోవడం సిగ్గుచేటు. ఎవరి కోసం ఈ బికినీల పండుగ? చంద్రబాబు అనాలో, బికినీ బాబు అనాలో అర్థం కావడం లేదు. పాశ్చాత్య విష సంస్కృతిని ప్రవేశపెట్టడానికే చంద్రబాబు బికినీ ఫెస్టివల్ తలపెట్టారు’’ అని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. -
కోతలకు అన్న... చేతలకు సున్నా
-
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
► ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని చంద్రబాబు ► వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేదు ► వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి, భూమన ధ్వజం తిరుపతి మంగళం: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అన్ని విధాలా అభివృద్ధి చెందుతామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో శనివారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ నాడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సోనియాగాంధీకి పూర్తి సహకారం అందించిన ద్రోహి చంద్రబాబు అన్నారు. సాక్షాత్తు శ్రీవారి సన్నిధిలో రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇచ్చిన హామీలు మరిచారా? అని ప్రశ్నించారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమిలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోవడంతో రైతులు ప్రజలు సాగు, తాగునీరు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు ఎలా పెట్టాలన్న ఆలోచనలో కొంత భాగం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఉంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాలు లాగా రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోసం జగనన్న చేపట్టే ప్రతి ఉద్యమంలో భాగస్వాములవుదామన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు పోకల అశోక్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే ప్రాజెక్టులు పూర్తికావని, పరిశ్రమలు రాక యువతకు ఉద్యోగావకాశాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక ఆయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై చంద్రబాబు తప్పుడు కేసులు బనాయించడం దారుణమన్నారు. తిరుపతి విమానాశ్రయంలో పెట్టిన కేసులు నిలవలేదని, రాజంపేటలో మళ్లీ అక్రమ కేసులు బనాయించడం చంద్రబాబు నీతిమాలిన రాకీయాలకు నిదర్శనమన్నారు. 10వతేదీ ధర్నాను విజయవంతం చేయండి ప్రత్యేక హోదా సాధన కోసం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 10వతేదీన చిత్తూరు కలెక్టరేట్ వద్ద, తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ల వద్ద చేపట్టే ధర్నాతో చంద్రబాబు గుండెల్లో దడ పుట్టాలన్నారు. జిల్లాలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, అనుబంధ సంస్థలు, అభిమానులతో పాటు పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ట్రేడ్ యూనియన్ నాయకులు బీరేంద్రవర్మ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, తిరుపతి నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దుద్దేల బాబు, టి. రాజేంద్ర, పుల్లయ్య, సయ్యద్షఫీఖాదరీ, హరిప్రసాద్‌రెడ్డి, ఎస్కె. ఇమామ్, హనుమంత్‌నాయక్, కట్టా గోపీయాదవ్, ముద్రనారాయణ, చెలికం కుసుమ తదితరులు పాల్గొన్నారు. -
ఒట్టి మాటలే
► ప్రత్యేక హోదా ఇవ్వబోమని స్పష్టం చేసిన కేంద్రం ► జిల్లా ప్రజల్లో కట్టలు తెంచుకున్న ఆక్రోశం ► మోదీ, చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టిన జనం ► జిల్లా ప్ర‘గతి’ ఇంతేనని ఆవేదన ఎట్టకేలకు బీజేపీ బండారం బయటపడింది. చంద్రబాబు చెప్పేవి ఒట్టి మాటలేనని తేలింది. ఆయన చేతలు ఓటి కుండలేనని రుజువైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో జిల్లా ప్రజానీకం భగ్గుమంటోంది. అనుభవజ్ఞుడని నమ్మి ఓటేస్తే.. చేతకాని తనంతో నిండా ముంచాడని వాపోతోంది. ఆయనొస్తే బాగుం టుందని భావిస్తే రాష్ట్రాన్ని అథోగతి పాల్జేస్తున్నారని యువత మండిపడుతోంది. ఆయనొస్తే కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తే.. స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ ఆశలు అడియాశలయ్యాయని ఆందోళన చెందుతోంది. - సాక్షి నెట్వర్క్ అనుకున్నదే అయ్యింది.. భయపడిందే నిజమైంది. అవును.. నమ్మించి ముంచడంలో చంద్రబాబునాయుడుని మించిన వారు లేదని మరోసారి నిజమైంది. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి కేంద్రం ముందు తలొంచిన ఏపీ సీఎం అలసత్వాన్ని మోదీ ప్రభుత్వం అక్షరాల క్యాష్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా.. తేల్చేసింది. ఎంత మంది ఎన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చినా తాము తొలగ్గబోమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పార్లమెంట్లో కుండబద్దలు కొట్టారు. దీంతో హోదాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లావాసులు భగ్గుమన్నారు. త మ ప్ర‘గతి’ ఇంతేనని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ దుస్థితి కారణమైన చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టారు. ఇకపై కొత్త పరిశ్రమలు, పెట్టుబడిదారులు జిల్లాకు వచ్చే అవకాశం లేదని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతామని హెచ్చరించారు. బాబు అసమర్థతే.. ఎన్నికల సమయంలో శ్రీవారి సన్నిధిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గుప్పిచ్చిన హామీలు ఏమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చిచెప్పిడంలో చంద్రబాబు అసమర్థత బట్టబయలైంది. ఓటుకు-నోటు కేసులో జైలుకు పంపుతారన్న భయంతో చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేలేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్బాగ్యమే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేని చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి. -భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం బాగు పడుతుంది. ఈ విషయం తెలిసినా సీఎం చంద్ర బాబు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఓటుకు నోటుతోపాటు పలు అవినీతి కుంబకోణాల్లో చంద్రబాబు చిక్కుకు పోవడం వల్ల కేంద్రంపై ఒత్తిడి తేలేకున్నారు. స్వార్థ కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్డారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి సీఎం ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం. రాష్ట్ర విభజన ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అడగలేక విభజించు పాలించు అన్నధోరణిలో బాబు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. టీడీపీ, బీజేపీ దొందూ దొందే. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయి. --డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్యే మదనపల్లె. హోదా కోసం ఆందోళన ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినందున టీడీపీ, బీజేపీతో పొత్తును విరమించుకోవాలి. రాష్ట్రానికి హోదా లేకుంటే ఆశించినంత అభివృద్ధి ఉండదు. చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయకపోవడం వల్ల రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. దీనిపై ప్రతి పక్షమైన వైఎస్సార్ సీపీ ప్రజలతో కలసి ఆందోళనకు దిగుతుంది.-చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే, పీలేరు